''కొబ్బరి బొండాలు '' (మరచిపో లేని మనోగతం..1... ) అది మాంచి రోహిణీ కార్తి, రోజులు తొంభయ్యో దశకం అనుకుంటాను మా రైల్వే లో సికందరాబాద్ డివిజన్ లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న రోజుల్లో . సికింద్రాబాద్ స్టేషన్ మాస్టర్ కార్యాలయం కు తనిఖీ నిమిత్తం వెళ్లాను . పనిముగించకుని భోజనం డబ్బా తెరిచి భోజనం చేస్తూ పరిసరాలను (వెనుక గది ) పరికిస్తూ నా పని చేసుకుంటూ . నా దృష్టి అక్కడవున్న ఓ పెద్ద గోనె సంచి పార్సిలు ఫై పడింది .భొజనమ్ ముగించాక, తాఫీగా డ్యూటీ మాస్టర్ (అయ్యోమయం )గార్ని అడిగాను . ''ఆ బాగ్ ఏంటి ?'' '' ఏమోనండి ! ఎవరిదో ? తెలియడము లేదు . గోదావరి నుండఎక్ష్ప్రెస్స్ నుండి గత 15 రోజుల క్రితం దింపాము . కొబ్బరిబొండాలు కుట్టి ఉన్న బాగ్ . దానిమీద ఉన్న అడ్రస్ సికింద్రాబాద్ ... మిగాతవివరాలు తెలియ రాలేదు ..ఫై గా అక్షరాలు క్లియర్ గా లేదు'' . .. ఆ రోజుల్లో రైల్వే స్టేషన్ లలో తీవ్రవాదుల నిమిత్తం,ప్రేలుడు సామాన్ల గురించి విపరీతం గా తనిఖీలు జరిగేవి . ఆ దృక్కోణం లో ని ది నా ఆలోచన .పి గా స్టేషన్ సూపరింటెండెంట్ నిమ్మ కు నీరెత్తినట్లు ఉండడం కొచెం బాధ కల్గించినా !.. తప్పని పరిస్థితుల్లో ఆ బాగ్ చూ సి అడ్రస్, సుధీర్గ విచారణ తరువాత ''జి . యెమ్ '' సెక్రటరీ గారిదని తెలుసుకున్నాను . సదరు అధికారి ని సంప్రదించి ... తన కార్ డ్రైవర్ ద్వారా వారి ఇంటికి పంపడం జరిగింది . అందరం గాలి పీల్చుకున్నాము . ఇంతటి తో కధ సుఖాంతం అయితే బావుండు . అంతం కాదు ఆరంభం అని తెలుసుకున్నాను . ఏమయిందో ? తెలుసా ..!!..?? నేను లైన్ మీద తనిఖీల నిమిత్తం గత 3 రోజుల నుండి చాలా బిజీ గా ఉన్నాను . తరువాత తెలిసింది దాదాపు 2 సిబ్బంది రోజు సికింద్రాబాద్ లో నా గురించి వాకబు చేస్తున్నారని . విషయం అర్ధం చేసుకున్న నేను, సదరు ఆఫీసరు గారి ని ఫోను ద్వారా సంప్రదించి అవాక్కయి నాను . '' ఏమయ్యా ?... న కొబ్బరి బొండాల బస్తాను ఏం ? చేసావు ..!! ఎక్కడ / పడేసావు ?.. దాని విలువెంతో ? తెలుసా ''... ఒక్క ప్రక్క ఒళ్ళు మండుతున్నా పెద్ద ఆఫీసర్ .. అసలే ''దుర్వాసనుడు ''... నోరు తెరిస్తే మొదట ఎంప్లాయ్ ని బెదిరించే విధానం ''బదిలీ ''. ఫై గా ఎవ్వరి మీదయినా కక్ష గడితే ఒక్క వారం లో ఓ ఫైల్ తయారు చేస్తాడు (తన అనుయాయులే చెప్పినా మాటలు సుమండీ !! ) వాడ దెబ్బ తగిలిన కాకిలా అయఎంది నా పరిస్థితి . '' ఆ బాగ్ ట్రేస్ చేయక పోతే వెంటనే నాకు కనిపించు '' అన్నాడు ఫై గా . ఏం చెయ్యాలో పాలుపోలేదు . డ్రైవర్ ను సంప్రదించగా సదరు అధికారి బంగ్లా లో లేరని వారి ఇంట్లోనే పెట్టానని చెప్పాడు,బంగ్లా ప్యూను కూడా లేరని . సమస్య జటిలం అయిందని అర్ధం చేసుకున్నాను . ఇంతలో డ్రైవర్ ను గట్టిగా అడిగే వరకు, ఏవ్వరూ లేకపోవడం వలన అధికారి కార్ గారాజ్ లో పెట్టానని సెలవిచ్చాడు . తెలుసుకున్న అధికారి, నిందించినందుకు కయినా కృతజ్ఞత చెప్పలేదు .. దొరికాయనీ చెప్పలేదు . రైల్వే లో ఇటువంటి ''ఫాకా '' కేసులు కో కొల్లలు . రైల్వే పని కంటే అధికార్ల స్వీయ సేవ చేయాల్సి ఉంటుంది (అధికార్లు అందరూ కాదు సుమా .. !! ) మద్దూరి . రవి బాబు .

No comments:
Post a Comment