totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Friday, 21 August 2015

                               "బి జే పి భారతీయం "                                                                                          మన భారత దేశానికి ఎన్నో అరిస్టాలు ., అటుంచి మన జాతిని పట్టి పీడిస్తున్న జాజాడ్యాల్లో  ముఖ్యమైన,అతి తొందరయిన చికిత్సావిదానాన్ని కనిపెట్టాల్సిన అవుసరం ఉన్నది,"రాజకీయ జాడ్యం'. మేము అతినీతిమంతులo, మమ్మల్ని మించిన పోటుగాళ్ళు లేరు,సామ్ప్రదాయమున్న ఎకైక పార్టీ, అని డబ్బా కొట్టుకు వచ్చిన పార్టీ బిజేపి  . రెండుసార్లు ,అధికారమిచ్చినా  తమను తాము నిరూపించుకోజాలని ఏకైక  పార్టీ . పార్టీలోని  మంత్రుల మాటలు  ఎ విషయం లోనూ నిబద్దత కరువు. జన ఘోష ఏమిటి ? అన్న చిన్న విషయాన్ని ఏమాత్రమూ పసిగట్టలేని పార్టీ . ప్రభుత్వ ఉద్యోగులకు వీళ్ళు చేసిన పెద్ద ద్రోహం "వృత్తి  పన్ను " సడలింపు  .వాళ్ళని అర్ధించి రాబట్టుకున్న ఓట్లు తాలూకు వాగ్దానం "పన్ను పరిధి పెంపు ",  ఆనక తీసుకున్నది  తప్పుడునిర్ణయం .                                                ఇహ పోతే ధరల నియంత్రణ, అసలు, జనానికి అతి ముఖ్యం అయి న వి, కూరగాయలు ...ఈ ప్రభుత్వం భయంకరంగా విఫలమైనది (ఉల్లి ధర చర్చించదలచలేదు, వీళ్ళు కంట్రోలు చేయలేరుగానుక )పెట్రోలు ధర ఎప్పెడూ ప్రపంచ మార్కెట్టులో ముడిచమురు ధరల బట్టి నిర్ణయించ బడుతుంది పదివేలమంది మోడీలు ఒళ్ళంతా ఆముదం రాసుకుని బోర్లా ఉన్నా  పెట్రో ధర నియంత్రణకూ,వీరి స్టేట్మెంట్లకూ పొంతన ఎట్టిపరిస్తిల్లోనో సామ్యము ఉండదూ . మోడీ వచ్చాడూ పెట్రో ధర  తగ్గించాడని కూసే కూతలు "చంద్ర బాబు వస్తే జాబు వస్తుంది  " అన్నంత సత్యం,అంటే ? నేతిబీరకాయ లో నుండి నెయ్యి ని తీసినంత . మోడీ గారికి మొదటనుండీ కార్పో ల పక్షపాతి అని గొప్ప పేరే ఉంది, బహుశా  చంద్రబాబు మెతక వయి ఖరికి కారణం కూడా,ఇది ఒక్క నిస్సందేహం అయిన కారణం కావచ్చు . అసలు జనానికి అంతుచిక్కని ప్రశ్నల్లో ఒక్క ప్రశ్న ? వీళ్ళ మినిస్ట్రీలో సన్యాసులు ఎందుకున్నారో ? సర్వత్సంగ పరిత్యాగులకు రాజకీయాలు ఎందుకో ? . మోడీ ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించాక తను మంచి అనుకున్న పనులు చేసినవి చెప్పాలంటే ?: 1. కార్పో వ్యవస్తను పదిలపరుచుకుంటూ బలపరచడం 2. ఎడతెరిపిలేని విదేశీ ప్రయాణాలు 3. చక్కని సేల్ఫీలు 4. జనానికి చీపుళ్ళు,చాట లు ,దృష్టి మరల్చేందుకు యోగాలు . 5. బ్యాంకు ఖాతాల ఇన్సురెన్స్ 6. మానవతా దృక్పదం అనే భాష్యoతో , వంట గాసు సబ్సిడీ కి జనాల జేబులకు చిల్లు పెట్టడం . 7. అభియోగాలతో పేరుతెచ్చుకున్న మంత్రులకు ఒత్తాసు 8. కోట్ల రూపాయల జాతిదానం వాయిదాలతో నాశనం . 9. సరిహద్దుల్లో ఉన్న ప్రతిష్టను స్నేహ కోణం లో శీతకన్ను వేయడం                                                                                      ఇన్ని అవలక్షణాలు ఉన్న ఈ అస్తవక్ర పార్టీ ని నెత్తిన పెట్టుకున్షరాష్ట్రాలకు జోహార్ !!  ఇందుకు కారణం లేకపోలేదు . మనదేశ రాష్ట్ర ప్రజల మనో భావాలను పరిగిణ లో తీసుకుంటే,కుల,మత ,భాష ,ధన,నేర ప్రకియలు బట్టి ఎన్నిక విధానం జరుగుతుందన్న విషయం నూరు  శాతం కరెక్టు .మేధావులూ  విజ్ఞానులూ ,విద్యావేత్తల సంగతి చెపప్పా లంటే ఉత్తరాన కేజ్రివాలు ,దక్షిణాదిన జే పి . వీరు ఇద్దరూ , మొదట ఒక స్వచ్చంద పోరాటమంటూ ఊకదంపుడు గా ఉపన్యాసాలిచ్చి తదుపరి రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందిన మేదావులన్నమాట !.. కాపోతే కేజ్రివాల్ పరిపక్వత లేని గొప్ప రాజకీయ నాయకుడు, మన జే పి గారు తెలివి మెండుగా ఉన్న ఉభయ బ్రస్టు త్వ0 చెందిన "గొప్ప వక్త " మాత్రమే !...... మనం నిశితం గా గమనిస్తే, రెండో సారి జరిగిన డిల్లీ ఎన్నికల్లో ,క్యారెక్టర్ గురించి,నిబద్దత ,క్రమశిక్షణ గురించి తెరుపులేని ఉపన్యాసాలు దంచే ,బి జే పీ  డిల్లీ నాయకులకు,కేజ్రీవాల్ ముచ్చెమటలు పట్టించాడ న్నది ఖాయం . ఇటువంటి తప్పుడు రాజకీయం చేసే గొప్ప నాయకులు దేశం లో ఉన్నంత కాలం ,బహుశా మన భారత ప్రజల తలరాతలు ఎవ్వరూ మార్చలేరన్నది నిర్ద్వందం                                                                                                 రవిబాబు . మద్దూరి