totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Saturday, 30 January 2016

                                   ......." కాంపస్ లో వీరతాడు...!!...??''..... 
ఈ టైటిల్ చదివిన వారెవరు ఐనా .. ఏంటిది ?  పసుపుతాడు....  మొలతాడు  .... లా అనుకొనడం పెద్ద వింత ఏమి కాదు సుమా ! అదో చాలా పాతబడిన గొప్ప తెలుగు సినిమా ! తెలుగు సినీ చరిత్రలోనే ఓ కళాఖండం గా చెప్పుకొచ్చు కూడా . మహాభారతం లోని భీమని కుమారుడు పాత్రలో మెప్పించిన ''ఘటోత్కచు'' ని డైలౌగే ఈ వీరతాడు . అతని దగ్గర సహాయకులు గా ఉండే ఇద్దరు వ్యక్తులు మాట్లాడిన ''ముష్టి''(నోరు తిరుగక )భాషకు సదరు ఘటోత్కచుడు ''వీరతాడు '' అనబడే , చాంతాడు గొప్పగా తన గురువు ద్వారా మేడలో  వేయిస్తాడు అన్నమాట !.... ఒక్క పనికిమాలిన భాష ప్రయోగం ద్వార ... వెరసి, తలమాసిన ... రాజు  గారు పనికి మాలిన పనిగా చేయించే పనే ''వీరతాడు కాన్సెప్ట్''
                         మరి మనం కూడా అదే పంధా అనుసరిస్తున్నాం మన విశ్వవిద్యాలయాల్లో అందుకు ఉదాహరణగా ఈ మధ్య లో జరుగుతున్న కొన్ని సంఘటనలు చెప్పుకోచ్చు . ప్రతీ చిన్న విషయాన్నీ బూతద్దం లో చూపెడితే, చీమ తల కూడా ఓ భూతం లా  కనిపిస్తుంది . హెచ్ .సి . యు  లో జరిగిన సంఘటన తప్పక క్షమించరాని విషయమే మరి. కానీ,.. కావు ..కావ్...  అంటూ రాజకీయ నాయకులు విద్యార్ధుల్ని  కా కా పట్టడం,రాజకీయవిలువలు నైతికంగా,దిగాజారినట్లు మరోమారు రుజువు చేసాయి . ఒకో రాజకీయ నాయకుడు ఒకో రంగు అద్దాడు . 
                  మానవత్వం అనే పదార్ధానికి .. రంగూ ... రుచి ...వాసన,  అనబడేవి ఉండవు . అన్యాయం ఎవరికీ జరిగినా అది అన్యాయమే .కులము .. మతం .. జాతి బట్టి న్యాయం ఎప్పుడూ నిర్ణయించ బడవు . ఉదాహరణకు అలా గాని జరిగితే ? అది ''ఆటవిక '' న్యాయం అవుతుంది . అటువంటి పరిస్థితుల్లో పనిగట్టుకొని ఒక మనిషిని ఆకాశానికి ఎత్తేయడమే ''వీరతాడు '' గా , ఇక్కడ మనం చెప్పుకోచ్చు . ఒక సామాజిక వర్గానికి చెందాడని   కొందరు చెబితేమరోరు .. మరోవిధం గా చెప్పుకొచ్చిన విషయాలు మనం చానళ్లలో విన్నాం .. చూసాం !!...ఈ దేశం ఒక్క సమాజిక వర్గానికి సంబందించినది ఎప్పటికీ కాదు. ఎన్నో మతాలూ, కులాలు,భాషలూ ,వెరసిన సమ్మేళనమే కాని అసలు సామాజిక వర్గం కు సంబందించిన వాళ్ళు రాలేదుగాని. వీరతాళ్ళు తీసుకుని ఉగ్రనారసింహం లా గల్లి నుండి డిల్లీ వరకు ఉపన్యాసాలు దంచినవారే . పాపం ఆ చిరంజీవి కాస్టు సర్టిఫికేట్ తో సహా షూట్  అయ్యాయి చానెళ్ళలో . ఒక మనిషికి అన్యాయం జరిగితే సాటి మనుషులుగా మనమందరం సమైక్యం గా గర్హించాలి .కాని జాతి, కులం ,మతం ప్రాతిపదికన పోరాటాలు జరుపుతూ పొతే ?..! యావత్ భారత జాతి నిర్వీర్యం అయి దేశ సమగ్రతకు, సగటు వ్యక్తిత్వానికి ముప్పు ఎంతో దూరంలో లేదు . దాని తాలూకు గొడ్డలిపెట్టే  ... ఇప్పటి  భారత్ దేశం లో బోర్డర్లో జరుగుతున్నఅస్తవ్యస్త'' నిఘా '' ... నీతిమాలిన క్రియలే, ఒక తార్కాణం 
                  అసలు కేజ్రివాల్ హైదరాబాద్ కు ఎందుకొచ్చినట్లో? కనీసం తనకయినా తెలిస్తే సంతోషమే . ఆ చర్య బట్టే తెలుస్తుంది .. డిల్లి ముఖ్య మంత్రి ఏంత విరామం గా ఉన్నారో ... అన్న విషయం ... పైగా అటు బి జే పి ఫై అక్కసు ..ఇటు కేంద్ర  మానవవనరుల మంత్రి ఫై తనకున్న ''కిచ్ కిచ్ .."లు తీర్చుకునే ప్రయత్నమే కేజ్రివాల్,రాహుల్  ఆగమనం , గా గమనించాలి . ఇటు తెరాస.. అటు టి. దేశం అప్పట్లో ఇటు ఒక్క స్టేట్మెంట్ ఈయలేదు . కాని తెరాస ఏం.పి ., ఒకరు సమయానికి దివంగత రీసెర్చ్ స్కాలర్ కు అన్యాయం జరిగినట్లు చెప్పారు . అంతవరకూ బావుంది . మిగతా నాయకులు అందరూ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో కి జొరబడడమే బహుశా నిబంధనలకు విరుద్దం గా చెప్పుకోచ్చు .... ఈ విషయం ఇంట దూరం అస్సలు వచ్చేదే కాదు ,మొదట్లోనే సి ఎమ్  గారు చక్కదిద్దినట్లయితే . పైగా  జనం గుండెలకు హత్తుకుపోయేలా మాట్లాడగలిగిన నైపుణ్యం ఒక్క కెసిఆర్ కె సొంతం .. వీళ్ళ పుణ్యమా అని,మసకబారుతున్న కాంగ్రెస్ చిత్రపటం తాలూకు రంగులు మరోమారు దేశవ్యాప్తం గా మెరుపులు  పుంజుకుంది . ఒక్క విధంగా చెప్పాలంటే ''రోహిత్ ''కు ఉన్న స్వతంత్ర భావాలు దృష్ట్యా ,తన ఆత్మబలిదానం ఇంత ''రగడ'' అవుతుందనే విషయం తను పరిగణలోకి తీసుకుని ఉంటే ఈరోజు ఇంత భారీగా ఈ విషయం రూపాంతరం చెందేది కాదేమో ?..!! అటువంటి పరిస్థితుల్లో అతని ఆత్మ ఎంత  క్షోభిస్తుందో ? కదా !!. ఇహ బి జె  పి, అనవసరమైన విషయం లో రాజకీయ కోణం చొప్పించి భంగపాటుకు గురికావడం ముదావాహం ''దారినపోయే కంప ''ఉదాహరణ .. అంచేత  కాంగ్రెస్స్ బోలెడంత మైలేజ్ పొందింది  . కాంగ్రెస్స్ వాళ్ళు రోహిత్ ను గాంధీ  దక్షిణ ఆఫ్రికా విషయం తో పోలిక ససేమిరా బావోలేదు . అస్సలు గాంధీ విషయం దక్షిణ ఆఫ్రికా లో ఏమిటి ? అన్న విషయం  మన ''అరుంధతీ రాయ్ ''ని అడిగితెనో, తన రీసెర్చ్ లోనో పేర్కొన్న విషయాలను సమగ్రం గా తెలుసుకుంటే బావుంటుంది . ఐతే పాపం తిలా పాపం తలా పిడికెడు  చందాన, వైస్ చాన్స్ల్లోర్ పరిస్థితి ''బెగానిషాదిమే ''..... ఛాన్సలర్ దివానా ??..!! అన్నట్లు ... మొదలయి తదుపరి .... ''జోర్ కా జట్కా దీరేసే లగా ''లా ... ముగిసింది .       ....  సో ... విద్యార్దులారా !! .... ఆచార్యుల్లారా !! .. దయచేసి ... రాజకీయనాయకుల ఊతంతో '' క్యాంపస్ ల్లో   వీరతాడు వేయడం ... ఆకాశానికి  మోసేయడం మానండి ''. ఎందుకంటె ? ప్రతీ మనిషి మంచి చెడుల సమ్మేళనం, తెరముందు ,తెరవెనుక అనే విషయాలు మనం మరచి పోగూడదు . కులం మతం .. జాతి ... వర్ణం అన్నవి ప్రాతిపదికలు గా కాంపస్  లు  ఉండడం నిజం గా మన దౌర్భాగ్యం అని చెప్పక తప్పదు. ఇటువంటి వక్ర భాష్యం ను తిప్పికొట్టి మనమందరం సమైక్యం గా పోరాడుదాం . కులం మతం ఎక్కడ అవసరమో అక్కడ మాత్రం ఉపయోగిద్దాం .... దయ చేసి కాంపస్ ల్లో ఉపయోగించకండి  అని మనవి .... 
  రవిబాబు. మద్దూరి