'' యదార్ధ దృష్టి -పదార్ధ సృష్టి . '' యదార్ధ దృ ష్టి నుండి పదార్ధ సృష్టికి'' అలవాటుపడ్డ మనకు ... ఉండీ ఉండీ ఏదో గురుతుకు రావడం సహజం . '' కలియుగము లో సాక్షాత్తు ఆ నిర్గుణు డయిన పరమాత్ముడు సగుణ రూపం ధరించి దుష్ట శిక్షణ-భక్త రక్షణ కు స్వయాన ఈ భూమి మీద అవతరిస్తాడని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి...'' అన్నది ఆర్యోక్తి . ఈ భరత భూమిలో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు . మన లాంటి సామాన్యులు , ఎంత ఘోషించినా అది అరణ్య రోదనే . కాని మహానుభావుల, ఇప్పటిమాట రేపటికి చరిత్ర . షిరిడీ సాయి చరిత్ర నిశితం గా పరిశీలన చేస్తే, మనకు ఎన్నో ఆణిముత్యాలు దొరుకుతాయి . మనజీవితాలను సంస్కరించుకుని ముందుకు సాగటానికి ఎంతో ఆస్కారం కనిపిస్తున్నది . ఇక్కడ ''ద్వాదశ భావాలు '' మీముందు ఉంచుతున్నాం 1) షిరిడీ సాయి తాను దేవుడనని ఎన్నడూ చెప్పలేదు . దేవుని సేవకుడ నని,బానిసనని మాత్రం చెప్పారు . 2)తనను సేవించమని,పూజలుచెయ్యమని,హారతులుతయారు చేసి పాడమని,ముట్టు.. కట్టు .. బొట్టు ... ప్రత్యేక మయిన వేషదారణను విధించలేదు . 3) తిండి విషయం : ఫలానా తినండి(లేక )తినకండి అని షరతులు విధించలేదు . 4) తను షిరిడీ ప్ర వేసించి.. మహా సమాధి చెందే వరకూ భౌతికముగా రైల్,బస్సు,కారు,వంటి..సహాయము తో గాని నడచి గాని షిరిడీ వదలి వెళ్లలేదు. 5)అత్యంత గొప్ప విషయము,ఏ మతమును,కులమును,జీవన విధానము ను కలలో నయినా ద్వేషించ లేదు , విమర్శనా చేయలేదు . మీ మీ ఆచారాలను,మత విధానాలను తూచా తప్పక పాటించడానికి షిరిడీ కూడా సహాయపడుతుంది అని ఒక్కాణిo చారు . 6)మత మార్పిడి అన్నదానికి ''బాబా '' బద్ధ వ్యతిరేకి . 7)బాబా ఒక ''అవధూత '',అనగా మనుష రూపేణ,వారి తపోనిష్ట వలన,ఘాడ మయిన బ్రమ్హచర్యము వలన,తీవ్ర తపస్సువలన,సాక్షాత్తు పంచభూతములు (గాలి ..నీరు .. నిప్పు .. భూమి ..ఆకాశాలు )తమను తాము,అవధూతల ఆదేశాలకు బానిసలు గా అర్పింప బడి ఉంటాయి . 8)బాబా కు చదువు అన్నది లేదు . భాష మాత్రం ''మరాటీ ''. కాని చు ట్టూ చేరిన వైదిక పండితులు,ఖోరాను -నిస్టగరిస్టులు, బైబిల్-మహాగ్రంధం లోని సంక్లిస్ట మయిన,మీమాంసలకు అతిచక్కని,సర్వ జన ఆకళింపు గా భాష్యం చెప్పిన సందర్భాలు.. కొన్ని సందర్భాలలో ఈ గ్రంధాలలో ఉన్న శ్లోకాలు,ఘట్టాలు పొల్లు పోకుండా చెప్పిన విషయాలు కోకొల్లలుగా గ్రంధస్తం, బాబా సమాధి అనంతరం కాబడ్డాయి . 9)గుడులూ,గోపురాలు కట్టడమే భక్తీ అన్న భావన ను, సంస్కరిచిన, ఆయన చరిత్ర లో మనం చూస్తాం(కట్టడానికి తను వ్యతిరేకి కాదు సుమా !! ). చందాలు,దర్శ నం ఫీజులు,ప్రసాదం ఫీజులు, కానుకలు,మాన్యాలు,పేద -గొప్ప ధనవంతులు-అధికారులు అన్న వ్యత్యాసం ఆయనకు తెలియని విషయాలు . 10) ఆశ్రమాలు,ఆశ్రమ ఆస్తులు,ఆశ్రమ నిధు లు అనేవి ఏమిటో తెలియని ఒక సాధారణ బిచ్చగాడు .తను సమాధి చెందే రోజు వరకూ ఐదు ఇళ్ళలో మిగలగా ఇచ్చిన అనవసర వ్యర్ధాలే, ఆయనకు మధుర పదార్ధాలు . ఆప్ప టి అమాయక జనం అతిబలవంతము మీద కప్పిన పట్టు శాలవాలు ఉన్నా, మురికి పట్టి నూనె జిగట తో ఓ మోస్తరి కంపుగా ఉన్న ''కఫినీ '' ఎన్నడూ ఒ ద లలేదు, మార్చనూ లేదు .అలంకారానికి ఇప్పటి musium లో ఉన్న అచ్చాదనలు అతనికి, భక్తులు సమర్పించినవి. వాటిని అలంకరించ దలచిన అప్పటి సహచరులు , భక్తులు ఎన్నో సార్లు బాబా ను గట్టిగా పట్టుకుని,తన్నులు తింటూ, శ్రీ బాబా చే తిట్లు తింటూ బలవతo గా అలంకరించినవి . ఎన్నోసార్లు బాబా గిరాటు వేసినవి . 11)ప్రపంచమే తన ఇల్లు,ప్రజలే బంధు వులు గ చెప్పే బాబా తల్లి -తండ్రి కులం -మతం ,ఊరు -పేరు తెలిసినవారు ఇప్పటి వరకూ ఎవ్వరూ లేరు . 12)సమాధిముందు నుండీ , అనంతరం ,ఇప్పటివరకూ తనను నమ్ముకుని జీవిస్తున్న వారికి ఏదో విధం గా సహాయకారిగా,సేవకునిగా , అనుభవము అవుతున్నారు షిరిడీ సాయి . కాని ''కాశీ - పీటాధి పతులు శ్రీ . శ్రీ .శ్రీ .స్వరూపానంద తన భక్తుల కలలో కూడా కనిపించిన దాఖలాలు లేవు !! ''. ఫై గా షిర్డీ బాబా ఫై చేసిన వాఖ్యాల వలన తను వెలుగులోనికి రావడం ముదావాహం గమనిక : సాయి భక్తులారా ! మహాత్ములను,భగ వత్ స్వరూపులను,తప్పుపట్టడం మన ఉద్దేశ్యం కాదు . కోట్లాది ప్రజల నమ్మకాల ఫై బురదచాల్లె ప్రయత్నం మాత్రం ''కలియుగ అవలక్షణం అని మాత్రం చెప్పగలను . బహుశా గత 20 వసంతాలనుండి శ్రీ షిర్డీ బాబా కు పెరుగుతున్న ఆదరణ,భక్తీ ఇందుకు కారణం కావచ్చు . కారణం కాశీ కి వెళ్ళే కోట్లాది భక్తుల్లో లక్షలాది భక్తులు షిరిడీ ని ఆశ్రఇంచిన వారే !!!! ఇన్ని మాటలెందుకు ..??..!! ఆనాటి,కుష్టువ్యాది గల భాగోజీ,గొప్ప సంసృత భాషాఘనాపా టీ ఉపాసనీ శాస్త్రి,కోటీశ్వరుడయిన బూటీ-సాటే లు అందరూ సమానులే . అంతే కాదు బాబా పాదప్రక్షాలనా తీర్ధ దాసులని మనం మారవ కూడదు ..!!!.
totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l
- ravi babu.Madduri
- Totally a ground person with equality........
Thursday, 26 June 2014
Saturday, 14 June 2014
The intellectuals of ''BHARAT'' ratnas today: మొట్టి కాయ no 3''దయచేస...
The intellectuals of ''BHARAT'' ratnas today: మొట్టి కాయ no 3''దయచేస...: మొట్టి కాయ no 3 ''దయచేసి మంత్రులు వ్యాపారాలు చెయ్యకండి అని మనవి ..... మీ మీ ఆస్తుల వివరాలు ఇవ్వండి ...
The intellectuals of ''BHARAT'' ratnas today: ''కొబ్బరి బొండాలు '' (మరచిపో లేని మ...
The intellectuals of ''BHARAT'' ratnas today:
''కొబ్బరి బొండాలు '' (మరచిపో లేని మ...: ''కొబ్బరి బొండాలు '' (మరచిపో లేని మనోగతం..1... ) ...
''కొబ్బరి బొండాలు '' (మరచిపో లేని మ...: ''కొబ్బరి బొండాలు '' (మరచిపో లేని మనోగతం..1... ) ...
''కొబ్బరి బొండాలు '' (మరచిపో లేని మనోగతం..1... ) అది మాంచి రోహిణీ కార్తి, రోజులు తొంభయ్యో దశకం అనుకుంటాను మా రైల్వే లో సికందరాబాద్ డివిజన్ లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న రోజుల్లో . సికింద్రాబాద్ స్టేషన్ మాస్టర్ కార్యాలయం కు తనిఖీ నిమిత్తం వెళ్లాను . పనిముగించకుని భోజనం డబ్బా తెరిచి భోజనం చేస్తూ పరిసరాలను (వెనుక గది ) పరికిస్తూ నా పని చేసుకుంటూ . నా దృష్టి అక్కడవున్న ఓ పెద్ద గోనె సంచి పార్సిలు ఫై పడింది .భొజనమ్ ముగించాక, తాఫీగా డ్యూటీ మాస్టర్ (అయ్యోమయం )గార్ని అడిగాను . ''ఆ బాగ్ ఏంటి ?'' '' ఏమోనండి ! ఎవరిదో ? తెలియడము లేదు . గోదావరి నుండఎక్ష్ప్రెస్స్ నుండి గత 15 రోజుల క్రితం దింపాము . కొబ్బరిబొండాలు కుట్టి ఉన్న బాగ్ . దానిమీద ఉన్న అడ్రస్ సికింద్రాబాద్ ... మిగాతవివరాలు తెలియ రాలేదు ..ఫై గా అక్షరాలు క్లియర్ గా లేదు'' . .. ఆ రోజుల్లో రైల్వే స్టేషన్ లలో తీవ్రవాదుల నిమిత్తం,ప్రేలుడు సామాన్ల గురించి విపరీతం గా తనిఖీలు జరిగేవి . ఆ దృక్కోణం లో ని ది నా ఆలోచన .పి గా స్టేషన్ సూపరింటెండెంట్ నిమ్మ కు నీరెత్తినట్లు ఉండడం కొచెం బాధ కల్గించినా !.. తప్పని పరిస్థితుల్లో ఆ బాగ్ చూ సి అడ్రస్, సుధీర్గ విచారణ తరువాత ''జి . యెమ్ '' సెక్రటరీ గారిదని తెలుసుకున్నాను . సదరు అధికారి ని సంప్రదించి ... తన కార్ డ్రైవర్ ద్వారా వారి ఇంటికి పంపడం జరిగింది . అందరం గాలి పీల్చుకున్నాము . ఇంతటి తో కధ సుఖాంతం అయితే బావుండు . అంతం కాదు ఆరంభం అని తెలుసుకున్నాను . ఏమయిందో ? తెలుసా ..!!..?? నేను లైన్ మీద తనిఖీల నిమిత్తం గత 3 రోజుల నుండి చాలా బిజీ గా ఉన్నాను . తరువాత తెలిసింది దాదాపు 2 సిబ్బంది రోజు సికింద్రాబాద్ లో నా గురించి వాకబు చేస్తున్నారని . విషయం అర్ధం చేసుకున్న నేను, సదరు ఆఫీసరు గారి ని ఫోను ద్వారా సంప్రదించి అవాక్కయి నాను . '' ఏమయ్యా ?... న కొబ్బరి బొండాల బస్తాను ఏం ? చేసావు ..!! ఎక్కడ / పడేసావు ?.. దాని విలువెంతో ? తెలుసా ''... ఒక్క ప్రక్క ఒళ్ళు మండుతున్నా పెద్ద ఆఫీసర్ .. అసలే ''దుర్వాసనుడు ''... నోరు తెరిస్తే మొదట ఎంప్లాయ్ ని బెదిరించే విధానం ''బదిలీ ''. ఫై గా ఎవ్వరి మీదయినా కక్ష గడితే ఒక్క వారం లో ఓ ఫైల్ తయారు చేస్తాడు (తన అనుయాయులే చెప్పినా మాటలు సుమండీ !! ) వాడ దెబ్బ తగిలిన కాకిలా అయఎంది నా పరిస్థితి . '' ఆ బాగ్ ట్రేస్ చేయక పోతే వెంటనే నాకు కనిపించు '' అన్నాడు ఫై గా . ఏం చెయ్యాలో పాలుపోలేదు . డ్రైవర్ ను సంప్రదించగా సదరు అధికారి బంగ్లా లో లేరని వారి ఇంట్లోనే పెట్టానని చెప్పాడు,బంగ్లా ప్యూను కూడా లేరని . సమస్య జటిలం అయిందని అర్ధం చేసుకున్నాను . ఇంతలో డ్రైవర్ ను గట్టిగా అడిగే వరకు, ఏవ్వరూ లేకపోవడం వలన అధికారి కార్ గారాజ్ లో పెట్టానని సెలవిచ్చాడు . తెలుసుకున్న అధికారి, నిందించినందుకు కయినా కృతజ్ఞత చెప్పలేదు .. దొరికాయనీ చెప్పలేదు . రైల్వే లో ఇటువంటి ''ఫాకా '' కేసులు కో కొల్లలు . రైల్వే పని కంటే అధికార్ల స్వీయ సేవ చేయాల్సి ఉంటుంది (అధికార్లు అందరూ కాదు సుమా .. !! ) మద్దూరి . రవి బాబు .
Monday, 9 June 2014
The intellectuals of ''BHARAT'' ratnas today: మొదటి మొట్టికాయ ...
The intellectuals of ''BHARAT'' ratnas today: మొదటి మొట్టికాయ ...: మొదటి మొట్టికాయ మినిస్టర్లు దయచేసి మీ సహాయకు...
Saturday, 7 June 2014
''..... హత విధీ : '' బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఓ స్నేహితుడిని చూద్దాం అని వెళ్ళా . ఒకటో నెంబర్ ప్లాట్ఫారం లోని ఆఫీసులో మిత్రుడ్ని కలవ బొయెన్తలొ ,చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ గారు పరుగెత్తుతూ వచ్చి ''అన్నా '' , మీ స్నేహితుడట చూపులేదు .పెరు రాఘవేంద్ర రావు అట vip లౌంజ్ లో ఉన్నాడు ''. నాకు చూపులేని వాళ్ళంటే (బెగ్గర్స్ కాదు సుమా )గతం కర్ణాటక లోని ఓ అనుభవం వల్ల భయం . పైగా చూపు లేని రాఘవేంద్ర రావు ఎవరూ లేరు . కాని అందగాడయిన రాగాహవేద్ర రావు మాత్రం తెలుసు . అంచేత ఇ క్కడ రవి అని దాదాపు 5 మంది ఉన్నారు వాళ్ళను కనుక్కోండి అని చెప్పాను . అతను వాకబు చేసి మరీ చెప్పాడు ,''అన్నా మీ పేరు చెబుతున్నాడు '' అని అందు కని లాంజ్ లో చూద్దును కదా !!.... నాకు పరిచయమున్న రాఘవేంద్ర రావు ను గుడ్డివాడిగా చూసి నిర్ఘాంత పోవడం నా వంతయింది . అంతలోనే సమ్భాళి0చు కుని, ''ఏంటీ ఈ పరిస్తితి '' అని అడిగాను . పొరబాటున నేను కన్నీళ్లు కారిస్తే,అతను గిల .. గిల తన్నుకునట్లు నాకు అనిపించింది . తను పొర్లుకొస్తున్న బాధ తో చెప్పడం మొదలెట్టాడు .పైగా చెప్పలేకపోతున్నాడు . తన సోదరి తనతో ఉండటం వల్ల, తను చెప్పింది ... కదా ! అతను ఆటో లో హైదరాబాద్ లో వెళుతుండగా మలుపు లో ఓ లారీ గుద్దిందనీ, తదుపరి క్రమేణా చూపు పూర్తి గా పోయిన్దనీను . నిజం గా జీవితం లో ఇటుంటి సన్నివేసం నా స్నేహితునికి తారస పడు తుందని .. కలలో నయినా ఊహించ లేదు . ఆ షాక్ నుండి రెండ్రోజులు తేరుకోలేదు .. మూడోరోజు ''బాల భాస్కర్ '' ప్లాట్ఫారం మీద తిరుపతి రైలు వద్ద కలిసినప్పడు గాని నేను మామూలు స్థితి లో కి రాలేదు . అంతవరకూ రాఘవేంద్ర రావు, పాత రూపం నుండి కొత్త రూపం నా కనుల ముందు కదలాడింది ...నిజ0 గా విధి యెంత బలీయ మయినదో కదా ...!!...??...ఈ విషయం బాలభాస్కర్ కు చెప్పుకుని నేను ట్రాన్ నుండి బయట పడ్డాను... అంచేత బాలభాస్కర్ ఫోటో ఇక్కడ పెట్టాను . నా వద్ద రాఘవేంద్ర రావు ఫోటో లేదు .
Subscribe to:
Posts (Atom)






