'' తస్మాత్ ... జాగ్రత్తా .. !!! మళ్ళీ దొంగలు ..దొంగలు "" . ***************************** . . ఇచ్చే దేంటి ?తీసుకొనే దేంటి ? మీకు తెలియదా ?ఇదో వ్యాపారం చాలా లాభసాటి వ్యాపారం !! ''మూడు పూవులకు ఆరు కాయలు '' ఇంకా అర్ధం కాలేదంటే ,తప్పిని సరిగా చెప్పాల్సిందే మరి . రాజకీయ వ్యాపారం . తీసుకొనేప్పుడు ఇచ్చే ప్పుడు ఎటువంటి లెక్కలు ఉండవ్ !పొరబాటున బయటబడితే తప్పుకోవచ్చు, కాకపొతే శ్రీ కృష్ణ జన్మ స్థానం లో విశ్రాంతి తీసుకొని,కొన్ని లొసుగులు,కొన్ని అవకాశాలు చేజిక్కిన్చుకొని మరలా బయట పడవచ్చు . అంతే కాదు కొంత మంది మొరిగే కుక్కల్లో మధ్య నక్కి దాదాపు cm లేకపోతే, ఏకం గా cm అవ్వొచ్చు . నా మిత్రుడొకడు చెప్పినట్లు mla tkt 40 కోట్లు mp కి 100 కోట్లు ఇస్తే, గెలుపు గుఱ్ఱాల పార్టీ ల లో దూరోచ్చు mp ..mla అవ్వొచ్చట ! .... దేశాన్ని .. రాష్ట్రాలని ,రాత్రి కి రాత్రి దోచుకున్న దగుల్బాజీలు ఇప్పుడు 2014 elections లో పెద్ద ప్రజాదారణ ఉన్న్న నాయకులు . సాధారణంగా కోర్ట్ నుండి ఫైన్ పడినవాడు .. జైలు చేసి వచ్చినవాడు ..ప్రభుత్వ ఉద్యోగి ఐతే తన ఉదోగం కోల్పోతాడు .కాని చట్టాల్లో ఈ రాజకీయ నాయకులకు ఎందుకు ఉండదో నాకు చిన్నప్పటినుండి అర్ధం గాని విషయం . నా మిత్రు డొకడు రైల్వే లో తెలంగాణలో ఓ రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ ఉద్యోగం చేసేప్పుడు లంచం తీసుకోన్నాడని అభియోగం మీద (fibricated )కొన్ని సవంత్స రాలు అనేక రకాలుగా వేధించి వేధించి ఇటీవల వాడిని ఉద్యోగం లోంచి తొలగించారట వాడు నిర్దోషి . రాజకీయరంగం లో రేపులు ,మైనింగ్ దొంగతనాలు, భూ కబ్జాలు,గొలుసు ప్రజా ఆస్తుల దోపిడి,ప్రఛ నంగా హత్యలు చేసిన,చేయించిన వారు పడవల్లాంటి కార్లలో,బోడి స్ప్రే లు కొట్టుకుని,ఇటు సినిమాఫంక్షన్ ల్లో,రిబ్బన్ కటింగుల్లో మెరిసిపోతున్నారు. మరి వీరి సంగతేంటి ?.... . ఒక్క విషయం చెప్పదలిచాను . మరి ఇటువంటి నాయకులు మనజీవితాలను 5.. 10.... వీలుంటే 50 సవత్సరాలు శాసిస్తున్నారు . మొసలి నోట్లో కోతి లా గిలగిల్లాడుతూ మనం కాలగర్భం లో క్రమేపి కరిగి పోవల్సిందేనా ? ఆలోచించండి . ఒక్కడు రాష్ట్రవిభజన చేస్తే అభ్యంతరం లేదు అని ''మొరిగినవాడు ''అభివృద్ధి మేమే చేస్తునాం అని వోట్ల భిక్షకు బయలుదేరాడు,మరొకడు పగటివేషగాడు .. తన రంగుల జీవితం ప్రక్క పెట్టి (cm పిచ్చి లో )వోట్లు ముష్టి లో తలామునకలయె,మరోడు ఎప్పుడు డిల్లీ లో సెంటర్ నాయకులకు మడు గులొత్తి చేతులు తిప్పుతూ మాట్లాడి,విభజన లో అన్యాయాన్ని ఎదుర్కున్నాన్ని, రెండు రాష్ట్రాల ప్రజలను మభ్యపెట్టి, పబ్బం గడుపుకుంటున్నాడు,మారో డు సెంటర్ కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు పట్టకుని,''కాల్ మొక్తా ..!!'' అని ఇప్పుడు వేటగాడి కి బలికాబోతున్న పెద్దపులి లా వెంగళా యి ల మధ్య పెద్ద డైలోగ్స్ చెప్పి తప్పట్లు కొట్టి o చుకుoటున్నాడు. ఇది ఇలావుంటే మరో తెలివిగల మూర్కుడు మల్కాజ్గిరి నియోజకవర్గం లో దిగ్గజాల మధ్య పోటి కి దిగాడు (అన్నట్లు వాపును చూచి బలం అనుకోన్న రకం )ఇక సుత్తి కొడవలి,వరి కంకు అవి చేయాల్సిన పని మాని సైకిల్ దొరుకుతుందా?... కారేక్కాలా ?.. ఫాను క్రింద చల్లగా ఉంటదా ..??చేయి కలుపుకుందామా ??.. తోలు చెప్పులు ఒక్క జతయినా దొరుకుతాయా ..??.. అని చూస్తున్న రోజులు ఇవి . పైగా మేమున్నామని చీపురు కట్ట బయలుదేరింది,ఇదేమో ?ఊడవడం వరకే గాని ఇచ్చిన అవకాశాన్ని మట్టి పాలు చేసికొంది.చీపురు కదండీ ఇక ఎప్పుడూ తనపని తానూ చేసుకు పోతుంది ,కారణం చీపురు ఇంట్లో ఓ మూల దాని స్థా నం . బెడ్ రూమ్ కు ఎప్పుడూ చేరుకోలేదు (రాజాకీయ భావ దరిద్రం )ఎంతయినా ? చీపురు కదా !దాని తెలివితేటలు తెల్లారే వరకే మరి ఇటువంటి సమయం లో మన భవిష్యత్తుకు బంగారం కాక పోయిన కనీసం ముళ్ళు లేని బాట ను వేసుకోవాల్సిన అవుసరం మనకే ఉంది ''ఎవరో !! వస్తారని ... !!'',ఎదురు తెన్నులు మాని, ఒక్క మంచి పని చేయాల్సి ఉంటుంది . అదేమిటి ? మన వోటు ... ఎటువంటి వారికివేయ్యాలో, ఇప్పటి పరిస్తితుల దృష్ట్యా ఒళ్ళు .. కళ్ళు, .చెప్పాలంటే పంచప్రాణాలు దగ్గర బెట్టుకొని '' ''వెయ్యాలి ..... ఇందుకు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ballet బాక్స్ లో వెయ్యాలి . ఈ మార్గాన్ని మరిచిపోతే .... దేశం లో మళ్లీ దొంగలు పడతారు ... మనల్ని నిలువుదోపిడీ చేస్తారు '' తస్మాత్ .. జాగ్రత్తా ... !! '' . . మద్దూరి . రవి .
totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l
- ravi babu.Madduri
- Totally a ground person with equality........
Wednesday, 23 April 2014
Monday, 21 April 2014
'' తిరగబడ్డ నైరాస్యమ్ '' లేక ''ఎదురుతిరిగిన పిల్లి'' ************************************* . అసలు టైటిలు తికమక పడిఉండ వచ్చు . కాని ఇది నిజం,పిల్లిని ఓ గదిలో పెట్టి పలుమారులు విసిగిస్తే (కొత్తనవసరం లేదు ), ఎం జరుగుతుందో ''కృసేడెర్ ఆర్ కాన్స్ రేటర్ '', అనే పుస్తకం లో ఓ ప్రభుత్వ అధికారి తన సర్వీస్ లో ఎదురయ్యిన సమస్యలు ,నియమబద్దత గల అధికారుల జోలికి రాజకీయనాయకులు వస్తే కలగా బోయే పరిణామాలు అలఒకగా వివరించారు . ప్రభుత్వం లో పెద్ద పెద్ద స్థాయి లో ఉన్న వారు సర్వీసు కాలం లో రాజకీయనాయకులకు మడుగులొత్తి,బయటకువచ్చాక, అన్ని భయాలు దూరమయ్యాక, కా మెంట్లు,పుస్తకాలు,శీర్షికలువ్రాస్తుంటారు . ఈ కోవకి వస్తుంది p c ఫ్హరేఖ్ వ్రాసిన ఫై పుస్తకం జలగమ్ . వెంగళ రావ్ హయాంలో ఈ అధికారి ఆర్ధిక శాఖ కార్యదర్శి . తన నిక్కచ్చి తనం వలన, రాయలసీమ కు సంభందించిన ఓ రాజకీయనకుడు phrekh ను బదిలీ చేయమని , CM ను కోరగా ''ఎమ్మినై '' చెప్పారు జలగం. ఇక్కడ ఎమ్మినై అనే మాట గురించి మీకు చెబుతాను . గోలిల ఆటలో ప్రత్యర్ధి వేసిన గోలి ని క్లిష్టం గ కొట్టవలసిన వచినప్పుడు, ఆ గోలి ని కొత్తవలిసిన వాడిని ఇరుకులో పెట్టడానికి చెప్పే మాట అన్నమాట . చిప్స్,చిటోసు,ఐస్ క్రీం లాగిస్తూ ఇంటర్నెట్ లో వేలాడుతూ,టీవీ లకు అతుక్కు పోయి పోట్టలను,శరీరాలను భారీగా పెంచకుని రోగాలకు దగ్గరౌతున్న చాలామంది ఈ నాటి పిల్లలకు ''గోలీలు ''ఆట తెలియక పోవచ్చు. ఈ మాటను(ఎమ్మీనై ) రాజకీయనాయకులకు బాగా నప్పుతుంది . ఎందుకంటే పాలనలో పారదర్సకత లోపిస్తున్నపుడు IAS , Ips ల మీద రాజకీయుల అస్త్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మాటను YSRదళ హయాం లో చాలా విస్తారం గా (ఇ క్కడ మాట అంటే .. మేము చెప్పింది చెయ్ ... ఎదురు ప్రశ్నలు వెయ్యకు అన్నట్లు ) ప్రభుత్వ అధికారులు లను తదుపరి జైలు పాలు చేసారనేది మనందరికీ తెలిసిన విషయమే ..!! . YSR యుగం ఓ స్వర్ణాంధ్ర గా వోట్ల కోసం మనవాకిల్లల్లో,మహాసభల్లో,ఓదార్పుయాత్రల్లో ఊదరగోడుతుంటారు(నీ జేబు కొట్టి నీకు అప్పు ఇచ్చినట్లు ). నిజానికి YSR హయాం ఒక ''YSR -ఎమ్మీనైయుగం "" గా చెప్పాలి . వ్యవస్థలో ప్రక్షాళనం ప్రజల నుండి జరగాలి అని చెప్పే ''ఫారిక్ '', తనవిశ్రాంత సమయం లో సర్వీస్ బయట,బొగ్గు కుంభకోణం గురించీ చాల విశ దమ్ గా వివరించారు . తన సర్వీసు జీవితం లో ఎదురైన అనేక విషయాలు వివరించారు . బొగ్గుమసి ''ఏమ్మినై ''గాళ్ళకు బాగుగానే పులిమారు . అసలు గొప్పవారు,ప్రభుత్వం లో ఉన్నతాధి కారులు చాలామంది భారతదేశానికి చాలా ద్రోహం చేస్తున్నరన్న దే ప్రజల ఆలోచనగా ఉంది . మనమందరూ ఎంతగానో దగాపడుతున్నా మన్నది యదార్ధం !. ఈ burocrats సర్వీసు లో ఉన్నప్పడు పిల్లుల్లా ప్రవర్తించి,బయటకు వచ్చేక ఆత్మకధలు .. విమర్శ నాస్త్రాలు ... గ్యాన సందేశాలు యిస్తూఉంటారు . వీరిని ప్రజలు ప్రశ్నిo చేది ఏమిటంటే ?సర్వీసులో ఎందుకు తిరగబడరు ?.. వాస్తవాలను ప్రజా శ్రేయస్సుకై ఎందుకు? బట్టబయలు చేయరని . సాధారణం గా సర్వేపల్లి ,బాపూజీ లాంటి వారు వ్రాసిన ''ఆత్మకధలు '',మనల్ని ఏంటో ఉత్తేజ పరిచేవిగా,ప్రభావితం చేసివిధం గా ఉంటాయి . కాని రాజకీయనాయకులు,సెలబ్రట్టీస్ వ్రాసిన ''ఆత్మక ధలు'',పుస్తకాలు,సర్వీసులో వారు పడిన ఇబ్బందులు,బాధపెట్టినవారు,వారి సర్వీసు వీరగాధలు, వీలుబట్టి పరోక్ష పద్ధతి న తిట్లపురాణం లాంటివి మాత్రం ఉంటాయి మన్నించాలి మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను,ఆమధ్యలో ఓ సిని నిర్మాత (కాలం చేసాడు లెండి )ఆత్మ కధగురించి ప్రచారం చేసికొన్నాడు . అ స్సలు విషయం ఆత్మకధ లో,పారితోషకాల,కులాలు,వేరే నిర్మాతలను పరోక్షం గా నే తిట్టారట (బహుశా ఆత్మకధ అంటే తీరిగ్గా మనకు నచ్చనివాళ్ళను దుమ్మేత్తట్టడం అనే అభిప్రాయం అయి ఉండొచ్చు ),మొదలైన విషయాలు వ్రాసాడని చదివిన న స్నేహితుడొకడు చెప్పడులెండి. మన పాత రాష్ట్రపతి జైల్సింగ్ తన ఆత్మకధలో ఇందిరా నిర్వాకం గురించి పూసగుచ్చాడు . ఎక్కడ ఆమే పట్ల తన కక్ష ధోరణి ని తన నిస్సాహాయతగా వర్నిన్చుకున్నాడు . ఆత్మకధ వ్రాయడాని ఓ అర్హత ఉండితీరాలి,ఒక్కసారి రాష్ట్రపతి ఐ ఉండీ ఆత్మకధ కు అర్హత ఉండకపోవచ్చు. ఆత్మకధ చదవడం వలన మనం నేర్చుకో గలిగి,మనసందేహాలు నివృతమై, మనజీవితాలను దిద్దుకోగాలిగి న వై ఉండాలి . అంటే అవి తిట్లపురాణం లాగో,స్వీయ కీర్తనల్లాగో,లేక ప్రశ్నాపత్రం లానో ఉండకూడదు. ముమైత్ ఖాన్ కూడా ఆత్మకధ వ్రాసుకోవచ్చు,కాని దాంట్లో తను ఏ విషయం వ్రాయవచ్చో నాకంటే మీకు తెలుసును . ఈమధ్యలో హిందితార ''కరీనా కపూరు '' తనకి ఆత్మకధ వ్రాయాలన్నట్లు అనిపిస్తున్నదని ప్రెస్ ,మీదియాలతో అంది . బహుశా తను మూడో భార్యగా రెండవ భార్య పిల్లలకు తల్లిగా ఒక్క ''సుందర ముదరాష్ట మైన ''జీవితం గురించి వ్రాయవచ్చు . మరి ఇటువంటి బియోగ్రఫీలు జనాల్ని, దిగ్బ్రాంతిలో భయఆందోళనాకు గురి చేయవచ్చు . అంచేత మన IAS (పాత )అధికారి పై పుస్తకం ఈదై తంతు గా చెప్పు కో వచ్చు . ఈ బయోగ్రఫీలు ప్రజలను ఉత్తేజ పరుస్తూ .. వ్యక్తిత్వాన్ని వృద్ధి పరచేవిగా ఉండాలి, కాని వృ ద్ధ పరచేవి గా ఉండకూడదు . లేక పోతే ప్రజలమైన మేమూ ఆత్మకధలు వ్రాయవలసి ఉంటుంది అని మనవి . PC PAREKH పుస్తకం లో ని వస్తవు తను తప్పు చేయని వ్యక్తి గా నిరూపించుకోడానికి అక్షరభాష అని పించు కో వచ్చు . అందుకే ''నేరం నాది కాదు చదివినోడిది '' అన్నట్లు పరేఖ్ వివరణగా ఉంది ..... గమనిక :ఆత్మకధలు వ్రాసి ..ఇతరుల ఆత్మలు ఘోషిO చ కుండా జాగ్రత్త పడండి .. మద్దూరి . రవి .
Sunday, 20 April 2014
మీకు తెలుసా ..??...!! .. కుమారి . మోమ్తా బెనర్జీ ఓ సాధారణమయిన కుటుంబం నుంచి వచ్చిన మహిళా . ఆమె ఇంత గొప్ప రాజకీయ స్థితి లో ఉన్నా ఆమే ధరించే దుస్తులు ఎన్ని జతలో తెలుసా? కేవలం మూడు జతల ఖాదీ చీరలట . గుజ్రాల్ నందా రెండుసార్లు ప్రధాని గా అవకాశం వచ్చినా, తన జీవిత కాలం లో సొంత ఇల్లు లేని రాజకీయ వాది . పండిట్ . లాల్ బహదూర్ శాస్త్రి ఒకప్పటి మన దెస ప్రధాని,ప్రపంచ పటం లో మనకు గొప్ప పేరు తెచ్చిన మహానుభావుడు . తన మరణ సమయానికి తన ఇంట్లో ఉన్న ఖరీదయిన ఆస్తి ''పాత నవ్వారు మంచం ''. ఇటువంటి త్యాగాసీలురు పుట్టిన ఈ భారత భూమి లో వారసత్వ దోపిడీ చాలక ప్రజా ధనాన్ని వేల కోట్ల లో తమ ఆస్తుల్లో మార్చుకున్న ''కుక్కమూతి ''..పశువులను ఏం ?చేయాలి ? ఈ చిరు జతల వ్యాఖ్యలకు ....సొనియా ... జగన్ తో సహా ఏ రాజకీయ నాయకులు అతీతులుకారు మద్దూరి . రవి
** కూటి లోని .. రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీశాడట...!!!... ???.. *** .. అన్నట్లు ఉంది కొందరి రాజకీయ నాయకుల పరిస్థితి .ఇన్దుకు కేసి యారు దూరమేమేకాడు . తెలుగుదేశం లో నల్లిలా మారి చిట్టెలుక తీరుగా ఉంటూ,పెద్ద పం. కొక్కులా కూడ బెట్టుకుని,బ్యాక్ మెఇలింగ్ రాజకీయాలతో తెలంగాణా పోరాటం,హక్కులు అంటూ బయటకొచ్చాడు . 12 సవత్సరాలు విద్యా సంస్థ ల వద్ద ''హఫ్తాలు ''తీసుకుంటూ రోజొక హఫ్తాల కోఫ్టాలు మ్రింగుతూ . మా లీళ్ళు,మా భూములు,మా ఉద్యోగాలు అంటూ కాలం వెలిబుచ్చాడు. ఈ ప్రహసనం లో ''జాగో భాగో ''అనే నినాదాన్ని హైలైట్ చేసుకుని బాగా తినడం మొదలేట్టాడు . మెల్లిగా కొడుకుని,కూతుర్ని రంగం లో కి దింపి వాళ్లకు కూడా మాటల గారడీ నెర్పించాదు. మనకున్న సమాచారం మేరకు దాదాపు 1976 వరకు హైదరాబాద్లో ఒక్క మంచి తెలుగువాడి భోజనం ఉండేడికాదు హైదరాబాద్ కు ఎవ్వడు వచ్చిన సాయంకాలానికి తమ తమ ఊళ్లకు సర్దుకుని వారు . కాని కొన్ని వింత ఆహారం దొరికేది .. బాగా కాచి రోజుల తరబడి వండుతున్న ఇంజను ఆయిల్ వంటి నూని లో వండిన రుచికరమైన ''సమోసాలు''... ''టై బి స్క ట్లు ''.. మాత్రము దొరికేవి . కొచెం స్టేటస్ కలిగిన వారు బాగా ఎండి పోయి ఉన్న కేకులు తినే వారు . కేరళ ... మద్రాస్ ...లాంటి రాష్ట్రాల నుండి వచ్చినవారి హోటళ్ళ లో మాత్రం దోస ... ఇడ్లి ... వడ .... ఉప్మా ..దొరికెవి .వీల్లల్లొ ఉడిపి వాళ్ళు మాత్రం టిఫిన్స్ చాలా రుచి గా చేసి వారు . కాని ప్రతీ బస్తి (పేటలో )మాత్రం ఒక్క ''కల్ -కాంపౌండ్ '' తప్పనిసరిగా ఉండితీరాలి . అది లేక పోతే బస్తీకి పెద్ద అవమానం . ఇక్కడ ఒక్క ప్రాచీన తెలంగాణా సాంప్రదాయం ఉండేది . మగవారు .ఆడవారు ,వీలు బట్టి పిల్లలు సమిష్టిగా మందు,కొట్టి పొగాకు నవులుతూ,ఉమ్ముతూ ఉండే 'శీను ''కడు రంజు గా ఉండేది . ఇది ఇలా ఉంటే .. ఇక్కడి విద్యా లయాల పరిస్థతి బహు దీనం గా ఉండేది . ఈ విద్యా లయాల ధ్రువ పత్రాలు భారత దేశం లో ఎక్కడా గుర్తింపు పొందవి కావు. ఇక్కడ మీకో విషయం తప్పక చెప్పాలి . రాయలసీమ ,ఆంధ్రా ప్రాంతం లో పలుమారులు తప్పిన 10 వ తరగతి ,ఇంటర్మీడియట్ వాళ్ళు ,మైగ్రేషన్ సర్టిఫికేట్ తో ఇక్కడ సెంటర్స్ లో పాస్ ఐ మరలా వాళ్ళ ప్రాంతాల్లో పెద్దచదువులు కోసం ప్రయత్నాలు చేసేవారు . ఇక్కడ పరీక్షల తంతు దాదాపు మొన్న మొన్నటి వరకూ llb ప్రతీ పరీక్షల ముందు ''guss పేపర్ ''వచ్చేది . తదుపరి ఫైనల్స్ లో 65 శాతం ''guss పేపర్ '' లోనివే . ఇక పారిశ్రామికుల ఫ్యాక్టరీలు తంతు గమ్మత్తు గా ఉండిది . ఫ్యాక్టరీలలో ప్రతి ఒక్కడూ ఆకు రౌడి ... ప్రతోడూ మోతబారీ . ప్రతోక్కడూ లీడరీ గిరి . కానీ పోలీస్ అంటే ప్యాంట్ తడుపుకో వాదం పరిపాటి . అదిరించి బెదిరించి తినడం ఒక్క సరదా . ప్రతీ తెలుగోడు ''ఉరుదూ '' మాట్లాడాల్సిఇందే ఆంద్ర వాడు,రాయల్ వాడు వాళ్ళ యాసలలో మాట్లాడు కొని వారు . ఇక్కడి తెలుగు మాటల్లో చాలసాతమ్ అక్కడి వాళ్లకి అర్ధం అ య్యెది కాదు . వాళ్ళ తెలుగు వీళ్ళకి అర్ధం అయ్యేది కాదు . పొరపాటున అప్పు ఇస్తే చివరికి చువించనిది చూవిన్చన వారు ఎక్కువ . ఎక్కువగా హిందీ సినిమాలు చూడడం ఇక్కడ అలవాటు . ఇతర ప్రక్కలనుంచి వచ్చినవారికి హిందీ చూసి చూసి ఉరుదు పట్టుపడేడి . టాక్సీలు తక్కువ,రిక్షాలు ఎక్కువ. సైకిల్ళ్ళు ఎక్కువ. 70 దశకం లో అసలు హైదరాబాద్ రాజధాని గా మాకు వద్దు, ఆంద్ర ను తెలంగాణా నుండి వేరు చేయండి అని మిగతా ఆంద్ర లో ఎన్నో పోరాటాలు చేసి విద్యార్ధులు నేల కుఒరిగారు . అటువంటి పోరాటాన్ని ఇంతవర ఏ రాజకీయ చవట ఒక్కాని 0చ లేదు . కాని ఆంధ్రా వారి పోరాటం ను ఆ రాష్ట్ర రాజకీయ గాడిదలు ఎన్నోసార్లు వాడుకున్నారు . ఆ కాలం లో ఆంద్ర వారి ఫై ఎన్నో దాడులు జరిగాయి . ఇప్పుడు కే సి .యారు ఏదో కొంతమంది హాఫ్ బ్రైన్స్ ను పెట్టుకుని ''కడుపులో పెట్టుకుందాం '', అంటే ప్రజలు నమ్మరు . అధికారం వచ్చేదాకా సోనియా కాళ్ళు-వెళ్ళు పట్టుకుని ఎగబాకి, ఇప్పుడు నాకు తిరుగు లేదు అన్న రీతిలో ఉన్న వాణ్ని ఎవ్వరూ నమ్మరు ,తన సహచర బ జ ప ,t d p తెలంగాణా వాళ్లే నమ్మని పరిస్థితి . ఎన్నో ఫాక్టరీస్ మూతబడటానికి కారణం పైన చెప్పిన మొతబరీ ప్రవర్తన,పనిచెయ్యకూడదూ,ఫైస లు గావాలి (నిజ్జం జెప్పాలే). కూర్చొని ప్రతోడూ కే సి ర్ లెక్క దినాలంటే( ఎట్లా దిన్టార్ బై 0.... ఫండ్స్ రావాల్సింది సెంటర్ నుండి,కే సి ర్ విధానం ఏ పాటి నిధులు ఎవ్వడిస్తారు ??..!! సరికదా నాకుతెలిసిన వరకు ఏ వ్వడూ ఇక్కడ పరిశ్రమలు బెట్టరూ !!...నిధులు ఎ బుద్ధి లేని వాడు ఇవ్వడు .నిధులు రావాలంటే ..సు దీర్గం మైన రాజికీయ ట్రాక్ రికార్డు తో పాటు,స్నేహ పూరిత వాతావరణం ఉండాలి . ఇవ్వి కే సి ర్ వద్ద మచ్చుకి కనిపించవు . అందుకునే తెలంగాణా రాజకీయ మేధావులు,విద్యావేత్తలు మెల్లగా ప్రక్కకు తప్పుకున్నారు (కోదండం .. దండం బెట్టి .. సటక్ సీతారం అయ్యిండు ). ఇటువంటి రాజకీయ దద్దమ్మ ''బంగారు '' తెలంగాణా చేసి ''నవనిర్మాణం '' చేస్తాననడం ఎంతవరకు సబబు . ఒక్క ఉదాహరణ చెబుతాను ...నిన్నటి కి నిన్న చేవెళ్ళ లో చెప్పాడు '' రియల్ ఎస్టేట్ వాళ్ళు రోడ్లు డ్రైన్లు కట్టండి '' అని రియల్ ఎస్టేట్ రంగం అసలే కుదేలయి ఏడుస్తున్నారు ... వాళ్ళ కేమి అవుసరం ....పెద్ద పెద్ద టెక్నో క్రాట్స్ usa లో ఆంధ్ర,రాయలసీమ చేతుల్లో ఉంది ..ఈ మాత్రం తెలియని వాడు రేపు సిలికోన్ valley చేస్తాడట . హఫతాలు తీసుకున్నంత ఈజీ కాదు ఒక్క స్టేట్ తయారు చెయ్యాలంటే . అందుకే ఇప్పుడయినా ఎవ్వరో ఒక్కరి చేతులు పట్టుకుని ఇవి చేతులుకావు అనేస్తీ ఒక్క పనీ పోద్ది అని గమనిస్తే మంచిది .తరువత లెక్కలు వాటి లోని బొక్కలూ చూసుకోవచ్చు బ్రధెర్ (మోకాళ్ళ మీద డేకడం ..కడుపులో తలబెట్టడం ... కాళ్ళను కౌగిలించుకోడం మనం చేసే నిత్య యోగా లోని భాగమే .. కదా కాకా !!...??)పైగా పెద్దల బియ్యమ్.. బత్కమ్మ ... తెలంగాణా తల్లి ... తెలంగాణా ధూంధాం .... తెలంగాణా ఆటా పాటా ఉండనీ ఉంది ... ఎంద్కు ? బుగుల్ పద్తున్నావ్ ???.... మద్దూరి . రవి
Thursday, 17 April 2014
'' చెప్పేదీ ఏమిటో ? చేసేయి సూటిగా '' ఎలక్షన్లు వచ్చేసాయి .... కాని ఈసారి ముఖ చిత్రం గొప్పగా ఉండపోవచ్చు .కాని అనూహ్యం గా ఉండి తీరుతాయి . కాంగ్రెస్ లో పోటీ చేయడాన్కి ఆంధ్ర లో దిక్కు లేని పరిస్థ్తితి ... ఒక గ్రుడ్డివాడు మరో చూపు లేని వానికి దారి చూవిన్చినట్లు . పూర్తి గా చిద్రమయిన కాంగీ ని నడిపించే బాధ్యత ''చిరంజీవి ''కి యీయడం అందరికి హాస్యాస్పదం . పాపం తను ''ముఖ్యమంత్రి '' ఆశావాహుడు,ఎన్టీఆర్ తదుపరి అంతటి క్రేజీ తన మీద జనాలకి ఉందని అపోహ లో ఉన్నట్లు గా ఉంది . తను ఏమి చేయాలను కున్నాడో చెప్పలేని పరిస్తి తి చిరంజీవిది .
Subscribe to:
Posts (Atom)



