totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Tuesday, 12 September 2017

         "జుట్టేట్టుకొని బైటికీడ్చినా చూరెట్టుకు వ్రేలాడి.."
మన భారత్ దేశంలో ఉన్నన్ని సౌకర్యాలు... లొసుగులు... దొడ్డిదార్లూ... రాజకీయ పోలు వల్ట్ జంపులూ... మరేదేశంలో ఉండవేమో...?...!!.
       మేసినంత మేయొచ్చు.... దాచుకున్నంత దాచుకో వచ్చు. ఏకంగా.. చచ్చినోడుకూడా ఆస్తిలో దస్టా వే జు లో కేవలం భాగస్తుడే. ఆసియన్ గేమ్స్ పేర పంది కొక్కులా కోట్లు మేసినోడు ఒకడు, పశువుల గడ్డి మేసినోడు మరోడు. వేల కోట్లు అత్యంత విలసవన్తం గా శృంగార రస పిపాలుకోసం కేవలం ఓ సవత్సర కెలండ ర్ కోసం నారీ మణుల పలువలకు విలువలు లేని ఛాయా చిత్రాలను కోట్లలో అత్యంత మాధ్యమాల సన్నాయిలతో చిత్రీకరించి,ఋణ చెల్లింపు కు పంగనామలు పెట్టి రాజ్య మార్గంలో ఇష్టమొచ్చి న దేశానికి వలస పరిపోయియిన వాడొకడు,, ఒక్క పూట తిండి తింటూ, దాదాపు పశువుల ఆహార శైలికి దగ్గర్లో జీవిస్తూ, బ్రతుకు బండిని తన వారికోసం త్యాగం చేస్తూ, అసువులు బాసే... వీర జవానులు పహారా కాస్తూ వెచ్చని రక్తం చిందిస్తే....ఇక్కడ మనం ఇక్కడ సు తి మెత్తనైన కీబోర్డులను ఇంటర్నెట్లో బాదుతూ ఊరికే అలిసిపోతున్నాం .పైగా పెద్ద మేలుచేసినోళ్ళ కటింగ్ పెట్టి వెచ్చగా ఇంట్లో నిదురోతున్నాం.మనం చేసేవి ఐదు పనులు... తిండి, విశ్రాంతి,సంసారం, సంపద, సరదాలు. ఇలాంటే కొంతమంది మిత్రులకు కోపం రావడం సర్వ సహజం. సభ్యసమాజంలో ఏం జరుగుతుందో మనకు
అనవసరం.... మన సమస్య అయితే తొంగి చూస్తాం... చురుకు తగిలితే మనమూ ఓ రాయి విసురుతాం... ఇటువంటి మనసు తత్వానికి యాంత్రికంగా కొన్ని దశాబ్దాల నుంచీ బానిసలమై పోయాం... దేశం సర్వనాసనమైన మనకి అఖ్ఖర్లేదు.
      సరే ఇదే అదనుగా రాజకీయ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి... నా చిన్నతనంలో... ఆస్తులను దేవలయాలకూ, దానధర్మలకూ సేవాసంస్థలకు దాన మిచ్చి జనవాహిని లో కను మరుగు అయిన మహాను బావుల గురించి విన్నాను. రాజకీయంలో వచ్చి ఆస్తులను ప్రజాసేవకు హారతికర్పూరంలా సమర్పించుకున్న దాయనిధులను నేను చూసాను, విన్నాను.
 ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశం సంక్లిష్టమైన పరిస్తితుల్లోకి నెట్టబడుతూ ఉంది.... దానికి కారణం... ఒకరు రాజకీయ నాయకుడు, రెండవవారు వారి అడుగులకు మడుగులొత్తే ips... ias లు. ఇహ అడవి పందుల్లా మెసే ప్రభుత్వ అధికారులు... వాళ్ళు ఉద్యోగంలో చేరినప్పటినుండీ సంపాదనే.... ప్రజాసేవ కాదు... ప్రజా రక్త చూషణ(క్షమించాల...ఇక్కడ అధికారులు అందరూ కాదు.... సుమా కొందరు) వాళ్లకు కావలిసిన స్థానాల్లో సవత్సరాలు గడిపేసుకుంటూ, పై నుండే పందికొక్కులకు క్రిందనుండే మేపుతూ... పిల్లజమీందారుల్లా బ్రతికేస్తూ ఉన్నారు. దొరికినోడు దొంగ లేకపోతే అందరూ దొరలే సుమా!.
 నాకు తెలిసిన ఒక రిజిస్ట్రారు.. గారు. తను అనుకున్న ఖాళీలో పదోన్నతి కి రాజకీయ నాయకులకు ఇచ్చుకుంది కేవలం 2 కోట్లు(చినిగిన కోట్లు కాదు.. రూపాయనోట్లు)..ఒక ప్రక్క విజిలెన్స్, మరో ప్రక్క అంటి కఱుప్షన్ ....ఉంటాయి పాపం వాళ్ళు నెలసరి జీతాలు తీసుకుంటారు.... కొంతమంది దిక్కుమాలిన అధికారులను పట్టుకుంటూ ఉంటారు. తప్పక కులం, రాజకీయ పార్టీ, పాత కక్ష, ఫైనల్గా అవినీతి తిమింగళంలా రూపాంతరం చెంది నవాడి ని పట్టుకున్నప్పుడే దొరుకుతాడు  .అటువంటో డు దొరికినప్పుడు ప్రెస్ లో జరిగే హడావిడి, తదుపరి చివరఖారీ వరకూ కేస్ అప్ డేట్స్ మనకు అందవు....వాళ్ళ కేసు ఎలా అయ్యింది చివరి వరకూ.
        ఈ రాజకీయనాయకులు చేసే మరో రొచ్చు పని ఏమిటంటే.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క రూపాయి కరు వు భత్యం ఈయడానికి తమ సొంత ఖాతాల్లో ధనాన్ని ఇస్తున్నట్లు చస్తూ ఇస్తారు.... ఎదో రాష్ట్రం వాడిని సం బంధం లేని రాష్ట్రానికి గవర్నర్ చేసేయడం.... గవర్నర్... అధికారాలు అలావుంచితే... అతను... స్వయంగా ప్రజలకు చేసే నాలుగు గొప్ప పనులకు మనం ఋణ పడి ఉంటాం.1.రిపబ్లిక్ దినంకు 2.ఆగస్టు15 కు, జాతీయ జెండా ఎగురవేయడం 3. ఫంక్షన్స్ కు మొదటి సీట్లో కనపడడం....4.చెదురు మదురు దైవ దర్శనల్లో లయన్ షేర్ లా దూరి పోడం....ఇటువంటి వారిపై ప్రభుత్వాలను బాధ్యులుగా చేస్తూ ప్రజా వెజ్యాలు వేసే మొగోళ్ళు మనకు లేకపోడం ముదావాహం."అందుకే గవోర్నెర్ గిరి అంటే మోగొడ్రా బుజ్జీ"

 బ్రిటిష్ జమానాలో  గవెర్నార్ లు చాలా విస్తృతంగా ప్రజా జీవనవిధానంలో ముడిపడి ఉండేవారు.... ఇప్పట్లో గవర్నర్ పోస్టు ఒక విహార యాత్ర చేసే ...లేక హనీ మూన్ జీవితంగా చెప్పుకొచ్చు. గవర్నర్ ప్రజలకు డైరెక్టక్ గా చేసే సేవ బండి సున్నా..అసలు రిటైర్ అయినోడు... చేసేదేమిటో ప్రభుత్వాలకే తెలియాలి(ఎం ఫరవాలేదు సర్! టీ అమ్మినోళ్లు ప్రధానులై పోచ్చు... కారు డ్రైవర్ గా పని చూసినోడు ప్రతిభ గల రైల్వే మినిస్టర్ !..... mbbs 7 సవత్సరాలు చదివినోడు ఒక రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి...!...?...)
కానీ వేలు ముద్దరోడు, మెట్రిక్ ఫైలు గాళ్ళు కూడా గవర్నర్ అయ్యే పరిస్థితి ఒక్క భారత దేశంలోనే ఉంది..... నా జీవితంలో ఒక గవెర్నార్ గారు ప్రతిభ ఏంటో ?నేను అర్ధం చేసు కోలేక పోయానుగాని...."అటు నీవే... ఇటునూవే" అన్న చందంగా ఒక్క... రాష్ట్రం గా ఉన్నప్పుడు ఏ దేవాలయం ఏ ఫంక్షనూ వదలక సతీ సమేతంగా ....దసరా పండుగలా 5 సవత్సరాలు గడిపేశారు.... ఇంతకంటే పోటు గాడు మరోడ్డులేడు అన్నట్లు ... రాష్ట్ర విభజన తరువాత పై బాధలన్నీ రెట్టింపు అయ్యాయి.... తెలుగు రాష్ట్ర ప్రజలు దద్దమ్మ లా? అన్న చందాన 10 సవత్సరాల తరువత కూడా మరోరు దిక్కులేదన్నట్లు అతన్నే పురమయిస్తూఉన్నారు... ఉద్యోగ విరమణ చేసినవాడికి ఒక్క ఘంట జీతం ఇచ్చే రూల్స్ ససేమిరా ఉండవు కానీ పళ్ళు ఊడి  నేలమీద పాకుతూ రాజ్య సభకు, విదాన సభలకు రావచ్చు.... ఎందుకంటే రాజకీయనాయకులు అడ్డంగా మేసి, ఎంత వయసు మళ్లీ తే అంత ఎవ్వనస్తుల్లా పరిగని o చు తారు.  కానీఉద్యోగులు పదవీ విరమణ తదుపరి ఒక్క నిముషం కూడా పని చేయ డానికి అనర్హులు. తెలుగు రాష్ట్రాలంటే ,ఉత్తరాది వాళ్ళకి ఎంత చులకనో  ఇట్టే తెలిసిపోతుంది.ఇటీవల ఒక దక్షిణ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు.... వాళ్ళ రాష్ట్రం లోని రాజకీయ సంక్షోభతో ....కేంద్రం"కోతికొమ్మచ్చి" ఆడుతున్న వైనాన్ని దుయ్యబట్టారు. అట్లనే ఆ రాష్ట్ర గవర్నర్ గారి ....గణితo లో ప్రతిభ ను మరీ ముతకగా పొగిడేశారు.... ప్రతీ కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు పనిచేసే గవర్నర్ లు ఎప్పుడూ వారికి స్టేటస్ భిక్ష ప్రసాదించిన కేంద్రానికి "తందాన తానా",కొట్టాల్సిఉంటుంది. వీళ్లకు  బంగాళాను, భద్రత, వాహనాలు, విహారాలు, గెస్టులూ, ఇఫ్తార్ విందులూ, వాళ్ళు పాల్గొనే  వినోదాలు  మొదలైన వాటికి  ఖర్చు ప్రజాధనమే..... ప్రజాలపైన అంతు  చి క్కని  పన్నులు ఎప్పటికప్పుడు... పెంచుతూ.... దేశాన్ని ఉద్దరిస్తున్నాం అని కుక్కసోది అనేక మాధ్యమాల్లో బాకా రూపంలో ఊదుతారు.. ప్రాణాంతకమైన వ్యాధుల కు పనికి వచ్చే మందులు, వైద్య సామగ్రి పేదోడికి అందుబాటులో ఉండవు "సిగ్గు సిగ్గు"... మనం రాజకీయనాయకుల దృష్టిలో.   .....5 సంవత్సరాలకు ఒక్క సారి పనికొచ్చే ఓటు బ్యాంకులం. ప్రజలు ఇలాంటి విషయాల్లో చైతన్యం కానంతవరకూ... భారత జాతి ఇక్కట్లు పడుతూనే ఉండడాలి.          ...."ప్రజలారా మేలుకోండి".......


మద్దూరి. రవిబాబు







Saturday, 25 March 2017

                               " అర్ధరాత్రి ... ఆత్మబంధువు "                                                                                                                 రాత్రి మొదలయింది .. ఓ ప్రక్క ఆకలి ... మోరోప్రక్క     " డకోటా " అనబడే మా  కారు  గారి పై  జరిగిన ఘోర  " కలి ".. రెండు నెల్ల  సుదీర్ఘ బ్రేక్ డౌన్  అనంతరం ... మరలా రోడ్డుపై రంగప్రవేశం ... చేసింది దాదాపు 120 కేమీ ... ప్రయాణం చేయాలి .. నేను చెప్పను మేకా నిక్ కు అర్ నాయనా ఫుల్ కాన్ఫిడెన్స్ ...నీ వర్త్ మీద నమ్మకముంటే ప్రయాణం చేయి ... బండి మధ్యలోనే ఆగేట్లైతే "బలిచక్రవర్తి " లా నన్ను మార్చకూ అని .... పాపం ఆ అతను  ఓ ఛాలెంజిలా తీసుకుని "లేదు సర్ ! మిమ్మల్ని ... మీ ఇంటివరకు సురక్ష్యంగా వదిలేంతవరకు నేను విశ్రమించను ' అంటూ సమాధానం ఇచ్చాడు . సంతోషం అతనికి అతని కార్యసూరత ఫై అంత  నమ్మకం ఉంటే  నేను "ధన్యు డనయితిని రామా "..అనుకుంటూ ... రెండు అన్నం పొట్లాలు ... సరిపోయేంత మినరల్ నీళ్లు తీసుకుని దాదాపు 9 గంటలకు బయలుదేరాం .... పర్చూరు వరకూ నోన్స్టాప్ గా 40 కి మీ వేగంతో ప్రయాణిస్తూన్నాం ... పర్చూరు దాటాక చిన్న స్పీడ్ బ్రేక్ మీదనుండి కొంచెం వేగం తో దాటినందుకు ఇంజిన్ ఆగిపోయింది ... రాత్రి 11 గంటలు టైము ... అదో చిన్నఊరులా ఉంది ... ఊరంతా నిశ్శబ్దం ... రోడ్డు మాత్రం చాలా క్లీనుగా ఉంది . రోడ్డుకు ఇరుప్రక్కలా ఇల్లు . పల్లటూరు అవడంవల్ల నిశ్శబ్దంతో రాత్రి ...చల్లని గాలితో ప్రశాంతంగా ఉంది ... మావాడు అటుతోసి .. ఇటుతోసి చూసాడు ...ఫలితం సూన్యం ... "సర్ ! బోంచేద్దాం "..... 'ఓకే " అన్నాను ... కారును నెట్టుకుని ఓ ప్రక్క అడ్డంలేకండా పెట్టుకుని ... సదుపాయం గా ఉండే చోటు చూసుకుని ఫుడ్ లాగించేద్దాం అనుకుని ...వెతుకుతున్నాం .  ఇంతలో ఒక అరుగు ... అరుగుపై మన అన్న (ఎన్టీఆర్ ) విగ్రహం కనిపించాయి పైగా అక్కడ జీరో కాండిల్  వెలుగుతోంది .... బావుంది అనుకుంటూ ... పోయి పోయి టీడీపీ ఆఫీస్ వరండా గా మేము తెలుసుకోగలిగాం . ఇబ్బందిలేదు .చేతులు కడుగుకొని భోజనాలు లాగించేసాం ... పర్చూరు వైపు వెడితే  అక్కడ PT  కిళ్లీ  ఎప్పుడైనా తీసుకోడం ఆనవాయితి .. ఒకటి తీసుకుని నాకోసం దాచుకున్నది హాయిగా వేసుకుని బండి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఎన్నుకునేంతలో మావాడు స్టార్ట్ చేయడం కూర్చోడం బయలుదేరడం చక...చకా  జరిగి పోయాయి  ... తమాషా ఏంటంటే ? ఆ ఊరు పేరు "అడుసుమల్లి " అని చీకట్లో మరోసారి బండి ఆగినాక గాని తెలియలేదు ... విశేషమేమిటంటే ... అక్కడ మాకు తెలిసినవాళ్ళు ఉండే ఊరన్నమాట ... రాత్రి 2 అయినా ఫరవాలేదు .   ... కానీ ఆసమయంలో ... మాఆవతారలతో .. మావాళ్లను నిద్ర  లేపి విషయం చెప్పేంతలో ... వాళ్ళు కంగారు పడవచ్చును .పైగా ఆవూరు వాళ్ళు కూడా ఈరాత్రి రసాభాస ఎంతోచెప్మా ..? అన్నట్లు కటౌట్ పెడితే  మా ఇద్దరి పరిస్థితి "జనక్ ...జనక్ .... పాయల్ బాజే .." అవ్వోచ్చునేమో  అన్న భయంతో ... పొలిమేరలు దాటాము . తీరికగా ఇద్దరం బండి నెట్టుకుంటూ ప్రక్క గ్రామం చేరుకున్నాం .. అంతలో ఆఊళ్లో వెలుతురున్న దగ్గరకు బండి పెట్టుకుంటూంటే  అది చెక్ పోస్ట్ అని  అక్కడ  అడ్డం పెట్టగూడదని తెలిసింది .... ఇంకొంచెం నెట్టుకుని  వెడితే ...ఆ ఊరు సెంటర్ పాయింట్ చేరాం  ... ఆ ఊరుపేరు "పెదనందిపాడు ".... అనితెలిసింది టైము 2 గంటలు ... వెలుతురైతే ఉందికాని నరమానవుడు లేడు . కానీ 10 నిముషాలకు ఓ లారీ లోడు ఇసుకనో ... రాళో  తీసుకుని వెడుతూఉన్నాయ్ . మాకేమన్నా మినీలారీ దొరుకుతుందేమో ?....! మా డెడ్ వెహికల్ ను మోకుతో కట్టి గుంటూరు వైపుకు తీసుకువెడడం .అక్కడ మంచి మెకానిక్ తగలొచ్చు అనుంటూ ఉన్నాం ... ఇంతలో మావాడు "సర్ నేను పడుకుంటాను " అంటూ వెనుక సీట్లో వాలిపోయాడు ... గురకలు తీస్తూ ఉన్నాడు కూడా . ఎలా  బడితే అలా నాకు నిద్ర రాదు పైగా నైట్ డ్యూటీ ల అనుభవం కూడా ... అంచేత వాడిని కారునూ , సమానులూ కాపలా కాస్తూ సెల్ లో ఆడియో వింటూ ఉన్నాను .  ఇలా 3  గంటలయింది టైము .... దూరం నుండి ఒక వ్యక్తి కొంచెం ఊగుతూ  మా కార్ కేసి వస్తూన్నాడు .... ఇంతరాత్రిలో వీడెవడబ్బా !... పైగా కుర్రాడు .. బలంగానే ఉన్నాడు ... గుబురు క్రాపు ... నల్లని ఛాయా బహుశా కొంత వెలుతురు  తక్కువ ఉండడం వలన అనుకుంటా .                                                                             కొంచెం గా కుంటుతూ నడుస్తూ ...మా చారుకేసి రాసాగాడు ... రెడీగా ఉన్న నేను బండి డోర్లు పెట్టి ఓ ప్రక్క డ్రైవర్ కం మెకానిక్ ను తట్టి కారు దిగాను .   సంభాషణ "ఏమయిందన్నా ?.." ఏ  ఊరు మీది ? ... ఇబ్బందేమిటి ...అయిష్టం  గానే సమాధానం ఇచ్చాను ..." ..  కార్ బ్రేక్ డౌన్ .. హైద్రాబాదు "..... "గుంటూరు వెళ్ళాలి ".... "సరే సర్ ! ఎదో ఒక బండి దొరికిపోద్ది కట్టుకుని వెళ్లొచ్చు"     అతని వాలకం కొంచెం అనుమానం గా ఉంది ... అక్కడ అప్పుడే ఓ టీ దుకాణం అతను తెరిచి డికాషన్ కలుపుతున్నారు " డ్రైవరూ !.. పద అక్కడ టీ త్రాగి ... నువోసిగిరెట్టు కాల్చుకుందూగాని "... మావాడి నిదుర మొహం చంద్రబింబంలా తుంగిసలాడింది .... "సరే సర్ "... టీ త్రాగి ...దిక్కులు చూస్తూన్నాను .. "సర్ ! సిగిరెట్ ఒక పెట్టి కొనుక్కుంటాను సర్ ".... "అలాగే ఇంద !.... " మావాడు అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు ,,, ఏమిటో....? కొద్దిగా అనీజీ గా మొహం పెట్టాడు ... సో ప్రెషర్ ఆన్ అయినట్లుంది ... "అదేనండీ    ! దీర్ఘ శంఖ ".....  ఇంతలో ఆ అబ్బాయి పేరు భాగ్యరాజ్ అని వయసు 20 సంవత్సరాలని తెలుసుకున్నాం .... మావాడు ఇంతలో ఖాళీ మినరల్ బాటిల్తో . నీళ్లు తీసుకుని దూరం వెళ్లి  .. పని  చేసుకున్నాడు .. పైగా విజయ గర్వం తో వచ్చేసాడు ... అందుకు సఙ్గ్య అతని ముఖాన ... తొణికసలాడుతున్న చిరునవ్వే  కారణం  ఇంతలో మాటల్లో  టీ దుకాణం అతను "మిమ్మల్ని క్షేమంగా మీరు వెళ్లాల్సిన చోటుకు మా హీరో గాడు పామోయిస్తూదులేండీ ! .... ఈవూరిలో ఇతని మాట ఇననోడు  లేదు సర్ ' ..... తను మాట ముగేంచేంతలో మన భాగ్యరాజ్   డ్రైవర్ ను "అన్న పద... పద ....  ఆ స్ట్రీట్లో ఆటో డ్రైవర్స్ ఇల్లు ఉన్నాయ్ ... ! ఒక రౌండ్ ఎద్దాం " మావాడుకూడా సిగిరెట్ ఇనుమడింపచేసిన ఉత్సాహం తో ఒక్కసారే గంపెడు పాలపీకలను త్రాగిన లేగదూడ లా పరిగెత్తి వెళ్ళాడు .. దాదాపు 4 స్త్రీట్స్ .. 6 మంది డ్రైవర్లను నిదురలేపి అడి గాడట ... ఎవ్వరూ నిద్ర పాడుచేస్కోడానికి ఇష్టపడలేదు ..... బాగా అతన్ని దగ్గర గా గమనించిన నేను అతను ... వికలాంగుడు కాదనీ , దాదాపు అతని రెండు మోకాళ్ళు  ఒక మోస్తరు x  ఆకారంలో కొద్దిగా లోపలకు వెళ్లి ఉండడడం గమనించాను .... అంగశాస్త్రంలో ఆ విధం గా ఉంటె మనిషి చాలా పాపులర్ అవుతారనీనీ , ... స్త్రీ సుఖం కొంచెం ఎక్కువ ఉంటుందనీనీ ... ఎక్కడో చదివినట్లు జ్ఞాపకం ..                                                                                ఎవరినైనా కొద్దిగా అథారిటీగా నే దబాయిస్తున్నాడు ... మమ్ములను తప్పించి ... మాకోసం ... ఒకరిద్దరైతే అతనితో భయం ...భయం గానే మాట్లాడడం మేమిద్దరం గమనించాం ... నేను "భాగ్యరాజ్ ! మీదేవూరు ?.... ఇంతరాత్రిలో నీకు ఇక్కడేపని .... నిన్ను మేము ఇబ్బంది పెడుతూన్నట్లున్నాము తమ్ముడు ...?....!!...." " అలాంటిదేమీలేదన్నా !... ఇదిగో ఇంతకుముందే మీరు వచ్చేముందు పేపర్ వేసే మినీ లారీ    వెళ్ళిపోయింది ...లేకుంటే మిమ్మలి పంపిద్దును ... కారు దానికి కట్టి "            ...... " ఇదిగో ఆ అరుగులు మీదే మా ఫాస్టుఫుడ్ సెంటర్ మా అన్న లిద్దరూ రన్ చేస్తారు నేను చదువు ఆపేసాను రోజూ రాత్రి 4 గం సెంటర్లో ఉండి  పాలూ పేపర్లూ తీసుకుని దుకాణం దగ్గర 8 గం   వరకూ ఉండి  ఇంటికెళతాను ... అతని ప్రణాళిక ఏంటో అర్ధం కాకండా ఉంది ... మాఇద్దరికీ ..  అక్కడనుండి గుంటూరుకు సుమారు 30 కిమీ ఉండొచ్చు ... మమ్మల్ని ఎం తకు బాదుతాడో ... వీడేంత నొక్కుతాడో ...కదా ..! "అరే భాయ్ మెకానిక్ ... బలే ఇరికిచ్చావ్ భాయ్ .. నేను గార్రైజ్ లోనే బండి ఉంచు, ఉదయం చూదాం అంటే ... కాదు సర్ బండిని బొమ్మలా చేశాను అంటావా ?"   "ఇప్పుడు చూడు ... మన పరిస్థితి ఎలా ఉండ బోతోందో మరి " పాపం అతనైనా ఏంచేస్తాడు 50.... 50.... ఛాన్సెస్ డెస్టినేషన్ రీచింగ్ ..... ఇంతలో ... టైం 6 గం    అయ్యింది ... మన భాగ్య రాజుగారు ... ఒక మినీ వాన్ ను పట్టాడు .. కొంచెం  రీసన్బుల్గా ఉంది రేట్ rs. 800 /-... బ్రతుకు జీవుడా అనుకుంటూ  ఉండగా  కారుకు మోకుతో కట్టేసాడు ... తానే స్వయంగా మాడ్రివర్ సమక్షంలో రేటు మాట్లాడాడు కూడా కారెక్కి బయలుదేరు తున్నాం "వెళ్ళిరండి ... ఉంటాను " అని చెప్పాడు .... "భాగ్యరాజ్ ! నీవుకూడా రావొచ్చుగా "... "సరిసర్ నేను వాపసు వచ్చి మరలా కోటప్పకొండ తిరుణాలకీ వెళ్ళాలి  మా జనసేన వాళ్ళు అంతా బళ్ళు ఏసుకుని వెడుతున్నాం సర్  " లీడింగ్ వాన్ లో డ్రైవెర్తో మాట్లాడుకుంటూ బయలుదేరాడు ... మొత్తానికి 8. 45 కు షెడ్డు చేరుకున్నాం ... డ్రైవేర్లూ , భాగ్యరాజ్ గబగబా మోకుతాడు విప్పేరు .... నేను కొంచెం దూరంలో ఉండటంవల్ల డ్రైవర్ నావద్దకు బండి రివర్స్ చేసుకొచ్చాడు డబ్బులకోసం . ... తిప్పితిప్పి కొడితే గిడితే నావద్ద ఉంది అక్షరాలా 800 రూపాయలు ... డ్రైవర్ చేతిలో పెడితే ....నాతో కారు త్రోయించిన డ్రైవేరుకూ కారులోనే 200/- దారిఖర్చులు ఇచ్చివున్నాను  ... భాగ్యరాజ్ కు ఇవ్వడానికి నావద్ద ఏమీలేవు ... ఎంత అడుగుతాడో  వాళ్ళ డ్రైవర్ కు 800 ఇచ్చాక ... నేను మనీ తేవలిసిన ఇల్లు 1 కిమీ ఉంది ...... ఇంతలో                 "సార్ ! నా డబ్బులు ..."... "ఆ ఇదుగోఅమ్మ ! 800 ..చేతిలో పెట్టాను "   " సరేసారు ! ఇంకా 700/- ఎవరిస్తారు ? "   " ఇంకేమి ? డబ్బులయ్యా ?"....... "బావున్నారే ? 1500/- కి మాట్లాడుకోనీ ...... "..... మా వాడిని అడిగా ?"ఏందీ భాయ్ ... ఇతను మరోలా మాట్లాడుతున్నాడు "...". అదే సార్  ! నాకూ అర్ధం కాట్లేదు "..... మాకు కొద్దీ దూరంలో నిల్చుని .. తిరుగు ప్రయాణానికి సన్నద్ధమవుతున్న భాగ్యరాజ్ నుద్దేశించి  ... క0గా రెత్తిన  స్వరంతో "భాగ్యరాజ్.....  భాగ్యరాజ్ .... ఇతనేంటి నూవు ... మా డ్రైవేరూ మాట్లాడారుకదా ? ఎంతకీ ....? ఇతనేంటి ?"...... "అవునుసారు .... మాట్లాడింది 800/- రూపాయలే ... ఏందయ్యా ? .... 800 రూపాయలే "... ఆ డ్రైవర్ పెద్ద పెద్దగా అరవడం మొదలెట్టాడు .... "నిన్ను నా వెహికిల్లో రానీయను వస్తే 100 రూపాయలైయ్యాలి " అతను భాగ్యరాజ్ ను నోరు తెరిచి ఒక్క మాట అనలేదు సరికదా మారుమాట్లాడలేదు . అలా వాడు మొత్తుకుంటూ వెళుతుంటే ... వీళ్ళిద్దరూ నిశ్శబ్దంగా నన్ను చూస్తూ చేతులు ఊపసాగారు ..... వెళ్లిపోయారు .                                      ఎటూ గుంటూరు వెళ్ళాలి ... ఒకానొక టైములో మా డ్రైవరు బండి రోడ్డుపక్క పెట్టి ''వెళ్ళిపోదాం ... మీరు గుంటూరు వెళ్లి మెకానిక్ తీసుకుని రండి ... నేను అటునుంచి అటు వెళ్ళిపోతాను "అన్నాడు . అటువంటిసమయంలో అర్ధరాత్రి నుండి మాతోటె ఉండి ,మాకోసం రాత్రిలో డ్రైవరు కోసం వెతికి ...వెతికి చివరకు డ్రైవేర్ను పట్టుకుని ,మా రిక్వెస్ట్ మీద మాతో వచ్చి , పేచీకోరు డ్రైవరు తో షరీకు కాకుండా నీతిగా మా ప్రక్క నిలిచి , ఏమీ ఆశించక,మొదటనుండి మాతో నవ్వుతూ ...మాకోసం శ్రమించిన ... భాగ్యరాజ్ కు అంత నైతికత ... ఆ చిన్న గ్రామంలో ఉంటూ ,సరయిన చదువులేకపోయినా , కించిత్తు స్వార్ధం ,అబద్దం ,లేని భాగ్యరాజ్ ఫై "పీకే "... తాలూకు ఇన్ఫ్లుయెన్స్ పడిందనటానికీ , ఈ రోజుల్లో కుర్రకారును మనం కొంచెం అప్పుడప్పుడు తప్పుగా అర్ధం చేసుకుంటున్నామేమో ? అనిపించింది నావరకు .అంచేత నా మనసులో ... న వక్ర భావ పరంపరకు క్షమించమని దైవాన్ని  కోరుకుంటూ ... క్షమాపణలు తెలియచేసుకున్నాను .... భాగ్యరాజ్ ను మరలా కలిసే ప్రయత్నంలో "హలొ ...హలొ ...ఎవరండీ ... ?".. "చెప్పండీ ! ఎవరు కావాలి ... మీరెవరు ..?" " అమ్మా 1 నేను ఫలానా ... భాగ్యరాజ్ ఉన్నడా ?.... (భాగ్యరాజ్ ఇచ్చిన నెంబర్ గనుక ).... " ఏ భాగ్యరాజ్ ? నువెవరు ?  ఏ నెంబర్ ?"....... సో ...! భాగ్యరాజ్ ను ఊరెళ్ళే పట్టుకోవాలి ? ... నుమ్బెర్తో లాభం లేదని డిసైడ్ అయ్యా........ మరి భాగ్యరాజ్ న పాలిట "అర్ధరాత్రి ఆత్మబంధువు ....." కాదా ?....!! ....... దయచేసి అంతవరకు ...... భాగ్యరాజ్ కనిపిస్తే తెలియచేయండి ఒక్క మిస్ కాల్ తో                                                                                                                                                సశేషం                                                                                               రవిబాబు .మ