" అర్ధరాత్రి ... ఆత్మబంధువు " రాత్రి మొదలయింది .. ఓ ప్రక్క ఆకలి ... మోరోప్రక్క " డకోటా " అనబడే మా కారు గారి పై జరిగిన ఘోర " కలి ".. రెండు నెల్ల సుదీర్ఘ బ్రేక్ డౌన్ అనంతరం ... మరలా రోడ్డుపై రంగప్రవేశం ... చేసింది దాదాపు 120 కేమీ ... ప్రయాణం చేయాలి .. నేను చెప్పను మేకా నిక్ కు అర్ నాయనా ఫుల్ కాన్ఫిడెన్స్ ...నీ వర్త్ మీద నమ్మకముంటే ప్రయాణం చేయి ... బండి మధ్యలోనే ఆగేట్లైతే "బలిచక్రవర్తి " లా నన్ను మార్చకూ అని .... పాపం ఆ అతను ఓ ఛాలెంజిలా తీసుకుని "లేదు సర్ ! మిమ్మల్ని ... మీ ఇంటివరకు సురక్ష్యంగా వదిలేంతవరకు నేను విశ్రమించను ' అంటూ సమాధానం ఇచ్చాడు . సంతోషం అతనికి అతని కార్యసూరత ఫై అంత నమ్మకం ఉంటే నేను "ధన్యు డనయితిని రామా "..అనుకుంటూ ... రెండు అన్నం పొట్లాలు ... సరిపోయేంత మినరల్ నీళ్లు తీసుకుని దాదాపు 9 గంటలకు బయలుదేరాం .... పర్చూరు వరకూ నోన్స్టాప్ గా 40 కి మీ వేగంతో ప్రయాణిస్తూన్నాం ... పర్చూరు దాటాక చిన్న స్పీడ్ బ్రేక్ మీదనుండి కొంచెం వేగం తో దాటినందుకు ఇంజిన్ ఆగిపోయింది ... రాత్రి 11 గంటలు టైము ... అదో చిన్నఊరులా ఉంది ... ఊరంతా నిశ్శబ్దం ... రోడ్డు మాత్రం చాలా క్లీనుగా ఉంది . రోడ్డుకు ఇరుప్రక్కలా ఇల్లు . పల్లటూరు అవడంవల్ల నిశ్శబ్దంతో రాత్రి ...చల్లని గాలితో ప్రశాంతంగా ఉంది ... మావాడు అటుతోసి .. ఇటుతోసి చూసాడు ...ఫలితం సూన్యం ... "సర్ ! బోంచేద్దాం "..... 'ఓకే " అన్నాను ... కారును నెట్టుకుని ఓ ప్రక్క అడ్డంలేకండా పెట్టుకుని ... సదుపాయం గా ఉండే చోటు చూసుకుని ఫుడ్ లాగించేద్దాం అనుకుని ...వెతుకుతున్నాం . ఇంతలో ఒక అరుగు ... అరుగుపై మన అన్న (ఎన్టీఆర్ ) విగ్రహం కనిపించాయి పైగా అక్కడ జీరో కాండిల్ వెలుగుతోంది .... బావుంది అనుకుంటూ ... పోయి పోయి టీడీపీ ఆఫీస్ వరండా గా మేము తెలుసుకోగలిగాం . ఇబ్బందిలేదు .చేతులు కడుగుకొని భోజనాలు లాగించేసాం ... పర్చూరు వైపు వెడితే అక్కడ PT కిళ్లీ ఎప్పుడైనా తీసుకోడం ఆనవాయితి .. ఒకటి తీసుకుని నాకోసం దాచుకున్నది హాయిగా వేసుకుని బండి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఎన్నుకునేంతలో మావాడు స్టార్ట్ చేయడం కూర్చోడం బయలుదేరడం చక...చకా జరిగి పోయాయి ... తమాషా ఏంటంటే ? ఆ ఊరు పేరు "అడుసుమల్లి " అని చీకట్లో మరోసారి బండి ఆగినాక గాని తెలియలేదు ... విశేషమేమిటంటే ... అక్కడ మాకు తెలిసినవాళ్ళు ఉండే ఊరన్నమాట ... రాత్రి 2 అయినా ఫరవాలేదు . ... కానీ ఆసమయంలో ... మాఆవతారలతో .. మావాళ్లను నిద్ర లేపి విషయం చెప్పేంతలో ... వాళ్ళు కంగారు పడవచ్చును .పైగా ఆవూరు వాళ్ళు కూడా ఈరాత్రి రసాభాస ఎంతోచెప్మా ..? అన్నట్లు కటౌట్ పెడితే మా ఇద్దరి పరిస్థితి "జనక్ ...జనక్ .... పాయల్ బాజే .." అవ్వోచ్చునేమో అన్న భయంతో ... పొలిమేరలు దాటాము . తీరికగా ఇద్దరం బండి నెట్టుకుంటూ ప్రక్క గ్రామం చేరుకున్నాం .. అంతలో ఆఊళ్లో వెలుతురున్న దగ్గరకు బండి పెట్టుకుంటూంటే అది చెక్ పోస్ట్ అని అక్కడ అడ్డం పెట్టగూడదని తెలిసింది .... ఇంకొంచెం నెట్టుకుని వెడితే ...ఆ ఊరు సెంటర్ పాయింట్ చేరాం ... ఆ ఊరుపేరు "పెదనందిపాడు ".... అనితెలిసింది టైము 2 గంటలు ... వెలుతురైతే ఉందికాని నరమానవుడు లేడు . కానీ 10 నిముషాలకు ఓ లారీ లోడు ఇసుకనో ... రాళో తీసుకుని వెడుతూఉన్నాయ్ . మాకేమన్నా మినీలారీ దొరుకుతుందేమో ?....! మా డెడ్ వెహికల్ ను మోకుతో కట్టి గుంటూరు వైపుకు తీసుకువెడడం .అక్కడ మంచి మెకానిక్ తగలొచ్చు అనుంటూ ఉన్నాం ... ఇంతలో మావాడు "సర్ నేను పడుకుంటాను " అంటూ వెనుక సీట్లో వాలిపోయాడు ... గురకలు తీస్తూ ఉన్నాడు కూడా . ఎలా బడితే అలా నాకు నిద్ర రాదు పైగా నైట్ డ్యూటీ ల అనుభవం కూడా ... అంచేత వాడిని కారునూ , సమానులూ కాపలా కాస్తూ సెల్ లో ఆడియో వింటూ ఉన్నాను . ఇలా 3 గంటలయింది టైము .... దూరం నుండి ఒక వ్యక్తి కొంచెం ఊగుతూ మా కార్ కేసి వస్తూన్నాడు .... ఇంతరాత్రిలో వీడెవడబ్బా !... పైగా కుర్రాడు .. బలంగానే ఉన్నాడు ... గుబురు క్రాపు ... నల్లని ఛాయా బహుశా కొంత వెలుతురు తక్కువ ఉండడం వలన అనుకుంటా . కొంచెం గా కుంటుతూ నడుస్తూ ...మా చారుకేసి రాసాగాడు ... రెడీగా ఉన్న నేను బండి డోర్లు పెట్టి ఓ ప్రక్క డ్రైవర్ కం మెకానిక్ ను తట్టి కారు దిగాను . సంభాషణ "ఏమయిందన్నా ?.." ఏ ఊరు మీది ? ... ఇబ్బందేమిటి ...అయిష్టం గానే సమాధానం ఇచ్చాను ..." .. కార్ బ్రేక్ డౌన్ .. హైద్రాబాదు "..... "గుంటూరు వెళ్ళాలి ".... "సరే సర్ ! ఎదో ఒక బండి దొరికిపోద్ది కట్టుకుని వెళ్లొచ్చు" అతని వాలకం కొంచెం అనుమానం గా ఉంది ... అక్కడ అప్పుడే ఓ టీ దుకాణం అతను తెరిచి డికాషన్ కలుపుతున్నారు " డ్రైవరూ !.. పద అక్కడ టీ త్రాగి ... నువోసిగిరెట్టు కాల్చుకుందూగాని "... మావాడి నిదుర మొహం చంద్రబింబంలా తుంగిసలాడింది .... "సరే సర్ "... టీ త్రాగి ...దిక్కులు చూస్తూన్నాను .. "సర్ ! సిగిరెట్ ఒక పెట్టి కొనుక్కుంటాను సర్ ".... "అలాగే ఇంద !.... " మావాడు అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు ,,, ఏమిటో....? కొద్దిగా అనీజీ గా మొహం పెట్టాడు ... సో ప్రెషర్ ఆన్ అయినట్లుంది ... "అదేనండీ ! దీర్ఘ శంఖ "..... ఇంతలో ఆ అబ్బాయి పేరు భాగ్యరాజ్ అని వయసు 20 సంవత్సరాలని తెలుసుకున్నాం .... మావాడు ఇంతలో ఖాళీ మినరల్ బాటిల్తో . నీళ్లు తీసుకుని దూరం వెళ్లి .. పని చేసుకున్నాడు .. పైగా విజయ గర్వం తో వచ్చేసాడు ... అందుకు సఙ్గ్య అతని ముఖాన ... తొణికసలాడుతున్న చిరునవ్వే కారణం ఇంతలో మాటల్లో టీ దుకాణం అతను "మిమ్మల్ని క్షేమంగా మీరు వెళ్లాల్సిన చోటుకు మా హీరో గాడు పామోయిస్తూదులేండీ ! .... ఈవూరిలో ఇతని మాట ఇననోడు లేదు సర్ ' ..... తను మాట ముగేంచేంతలో మన భాగ్యరాజ్ డ్రైవర్ ను "అన్న పద... పద .... ఆ స్ట్రీట్లో ఆటో డ్రైవర్స్ ఇల్లు ఉన్నాయ్ ... ! ఒక రౌండ్ ఎద్దాం " మావాడుకూడా సిగిరెట్ ఇనుమడింపచేసిన ఉత్సాహం తో ఒక్కసారే గంపెడు పాలపీకలను త్రాగిన లేగదూడ లా పరిగెత్తి వెళ్ళాడు .. దాదాపు 4 స్త్రీట్స్ .. 6 మంది డ్రైవర్లను నిదురలేపి అడి గాడట ... ఎవ్వరూ నిద్ర పాడుచేస్కోడానికి ఇష్టపడలేదు ..... బాగా అతన్ని దగ్గర గా గమనించిన నేను అతను ... వికలాంగుడు కాదనీ , దాదాపు అతని రెండు మోకాళ్ళు ఒక మోస్తరు x ఆకారంలో కొద్దిగా లోపలకు వెళ్లి ఉండడడం గమనించాను .... అంగశాస్త్రంలో ఆ విధం గా ఉంటె మనిషి చాలా పాపులర్ అవుతారనీనీ , ... స్త్రీ సుఖం కొంచెం ఎక్కువ ఉంటుందనీనీ ... ఎక్కడో చదివినట్లు జ్ఞాపకం .. ఎవరినైనా కొద్దిగా అథారిటీగా నే దబాయిస్తున్నాడు ... మమ్ములను తప్పించి ... మాకోసం ... ఒకరిద్దరైతే అతనితో భయం ...భయం గానే మాట్లాడడం మేమిద్దరం గమనించాం ... నేను "భాగ్యరాజ్ ! మీదేవూరు ?.... ఇంతరాత్రిలో నీకు ఇక్కడేపని .... నిన్ను మేము ఇబ్బంది పెడుతూన్నట్లున్నాము తమ్ముడు ...?....!!...." " అలాంటిదేమీలేదన్నా !... ఇదిగో ఇంతకుముందే మీరు వచ్చేముందు పేపర్ వేసే మినీ లారీ వెళ్ళిపోయింది ...లేకుంటే మిమ్మలి పంపిద్దును ... కారు దానికి కట్టి " ...... " ఇదిగో ఆ అరుగులు మీదే మా ఫాస్టుఫుడ్ సెంటర్ మా అన్న లిద్దరూ రన్ చేస్తారు నేను చదువు ఆపేసాను రోజూ రాత్రి 4 గం సెంటర్లో ఉండి పాలూ పేపర్లూ తీసుకుని దుకాణం దగ్గర 8 గం వరకూ ఉండి ఇంటికెళతాను ... అతని ప్రణాళిక ఏంటో అర్ధం కాకండా ఉంది ... మాఇద్దరికీ .. అక్కడనుండి గుంటూరుకు సుమారు 30 కిమీ ఉండొచ్చు ... మమ్మల్ని ఎం తకు బాదుతాడో ... వీడేంత నొక్కుతాడో ...కదా ..! "అరే భాయ్ మెకానిక్ ... బలే ఇరికిచ్చావ్ భాయ్ .. నేను గార్రైజ్ లోనే బండి ఉంచు, ఉదయం చూదాం అంటే ... కాదు సర్ బండిని బొమ్మలా చేశాను అంటావా ?" "ఇప్పుడు చూడు ... మన పరిస్థితి ఎలా ఉండ బోతోందో మరి " పాపం అతనైనా ఏంచేస్తాడు 50.... 50.... ఛాన్సెస్ డెస్టినేషన్ రీచింగ్ ..... ఇంతలో ... టైం 6 గం అయ్యింది ... మన భాగ్య రాజుగారు ... ఒక మినీ వాన్ ను పట్టాడు .. కొంచెం రీసన్బుల్గా ఉంది రేట్ rs. 800 /-... బ్రతుకు జీవుడా అనుకుంటూ ఉండగా కారుకు మోకుతో కట్టేసాడు ... తానే స్వయంగా మాడ్రివర్ సమక్షంలో రేటు మాట్లాడాడు కూడా కారెక్కి బయలుదేరు తున్నాం "వెళ్ళిరండి ... ఉంటాను " అని చెప్పాడు .... "భాగ్యరాజ్ ! నీవుకూడా రావొచ్చుగా "... "సరిసర్ నేను వాపసు వచ్చి మరలా కోటప్పకొండ తిరుణాలకీ వెళ్ళాలి మా జనసేన వాళ్ళు అంతా బళ్ళు ఏసుకుని వెడుతున్నాం సర్ " లీడింగ్ వాన్ లో డ్రైవెర్తో మాట్లాడుకుంటూ బయలుదేరాడు ... మొత్తానికి 8. 45 కు షెడ్డు చేరుకున్నాం ... డ్రైవేర్లూ , భాగ్యరాజ్ గబగబా మోకుతాడు విప్పేరు .... నేను కొంచెం దూరంలో ఉండటంవల్ల డ్రైవర్ నావద్దకు బండి రివర్స్ చేసుకొచ్చాడు డబ్బులకోసం . ... తిప్పితిప్పి కొడితే గిడితే నావద్ద ఉంది అక్షరాలా 800 రూపాయలు ... డ్రైవర్ చేతిలో పెడితే ....నాతో కారు త్రోయించిన డ్రైవేరుకూ కారులోనే 200/- దారిఖర్చులు ఇచ్చివున్నాను ... భాగ్యరాజ్ కు ఇవ్వడానికి నావద్ద ఏమీలేవు ... ఎంత అడుగుతాడో వాళ్ళ డ్రైవర్ కు 800 ఇచ్చాక ... నేను మనీ తేవలిసిన ఇల్లు 1 కిమీ ఉంది ...... ఇంతలో "సార్ ! నా డబ్బులు ..."... "ఆ ఇదుగోఅమ్మ ! 800 ..చేతిలో పెట్టాను " " సరేసారు ! ఇంకా 700/- ఎవరిస్తారు ? " " ఇంకేమి ? డబ్బులయ్యా ?"....... "బావున్నారే ? 1500/- కి మాట్లాడుకోనీ ...... "..... మా వాడిని అడిగా ?"ఏందీ భాయ్ ... ఇతను మరోలా మాట్లాడుతున్నాడు "...". అదే సార్ ! నాకూ అర్ధం కాట్లేదు "..... మాకు కొద్దీ దూరంలో నిల్చుని .. తిరుగు ప్రయాణానికి సన్నద్ధమవుతున్న భాగ్యరాజ్ నుద్దేశించి ... క0గా రెత్తిన స్వరంతో "భాగ్యరాజ్..... భాగ్యరాజ్ .... ఇతనేంటి నూవు ... మా డ్రైవేరూ మాట్లాడారుకదా ? ఎంతకీ ....? ఇతనేంటి ?"...... "అవునుసారు .... మాట్లాడింది 800/- రూపాయలే ... ఏందయ్యా ? .... 800 రూపాయలే "... ఆ డ్రైవర్ పెద్ద పెద్దగా అరవడం మొదలెట్టాడు .... "నిన్ను నా వెహికిల్లో రానీయను వస్తే 100 రూపాయలైయ్యాలి " అతను భాగ్యరాజ్ ను నోరు తెరిచి ఒక్క మాట అనలేదు సరికదా మారుమాట్లాడలేదు . అలా వాడు మొత్తుకుంటూ వెళుతుంటే ... వీళ్ళిద్దరూ నిశ్శబ్దంగా నన్ను చూస్తూ చేతులు ఊపసాగారు ..... వెళ్లిపోయారు . ఎటూ గుంటూరు వెళ్ళాలి ... ఒకానొక టైములో మా డ్రైవరు బండి రోడ్డుపక్క పెట్టి ''వెళ్ళిపోదాం ... మీరు గుంటూరు వెళ్లి మెకానిక్ తీసుకుని రండి ... నేను అటునుంచి అటు వెళ్ళిపోతాను "అన్నాడు . అటువంటిసమయంలో అర్ధరాత్రి నుండి మాతోటె ఉండి ,మాకోసం రాత్రిలో డ్రైవరు కోసం వెతికి ...వెతికి చివరకు డ్రైవేర్ను పట్టుకుని ,మా రిక్వెస్ట్ మీద మాతో వచ్చి , పేచీకోరు డ్రైవరు తో షరీకు కాకుండా నీతిగా మా ప్రక్క నిలిచి , ఏమీ ఆశించక,మొదటనుండి మాతో నవ్వుతూ ...మాకోసం శ్రమించిన ... భాగ్యరాజ్ కు అంత నైతికత ... ఆ చిన్న గ్రామంలో ఉంటూ ,సరయిన చదువులేకపోయినా , కించిత్తు స్వార్ధం ,అబద్దం ,లేని భాగ్యరాజ్ ఫై "పీకే "... తాలూకు ఇన్ఫ్లుయెన్స్ పడిందనటానికీ , ఈ రోజుల్లో కుర్రకారును మనం కొంచెం అప్పుడప్పుడు తప్పుగా అర్ధం చేసుకుంటున్నామేమో ? అనిపించింది నావరకు .అంచేత నా మనసులో ... న వక్ర భావ పరంపరకు క్షమించమని దైవాన్ని కోరుకుంటూ ... క్షమాపణలు తెలియచేసుకున్నాను .... భాగ్యరాజ్ ను మరలా కలిసే ప్రయత్నంలో "హలొ ...హలొ ...ఎవరండీ ... ?".. "చెప్పండీ ! ఎవరు కావాలి ... మీరెవరు ..?" " అమ్మా 1 నేను ఫలానా ... భాగ్యరాజ్ ఉన్నడా ?.... (భాగ్యరాజ్ ఇచ్చిన నెంబర్ గనుక ).... " ఏ భాగ్యరాజ్ ? నువెవరు ? ఏ నెంబర్ ?"....... సో ...! భాగ్యరాజ్ ను ఊరెళ్ళే పట్టుకోవాలి ? ... నుమ్బెర్తో లాభం లేదని డిసైడ్ అయ్యా........ మరి భాగ్యరాజ్ న పాలిట "అర్ధరాత్రి ఆత్మబంధువు ....." కాదా ?....!! ....... దయచేసి అంతవరకు ...... భాగ్యరాజ్ కనిపిస్తే తెలియచేయండి ఒక్క మిస్ కాల్ తో సశేషం రవిబాబు .మ
No comments:
Post a Comment