totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Saturday, 31 December 2016

                   '' డామేజిటయిజేషన్ అనబడే డిజిటలైజే షన్   "                                                                                                               అనగనగా ఒక ఊరిలో ఒక కుక్క ...ఒక గాడిద చాకలివాని  ఉండేవి  ....ఒకరాత్రి సదరు రజకశ్రీ పై అలిగిన కుక్కగారు ఒకరాత్రి దొంగలుపడితే ... మొరగలేదు ... పాపం అరిచిన గాడిదగారు ఏమయ్యారో , లేక రజకశ్రీ  ఏమి చేసారో మీకందరికీ తెలిసిన కధే .                                                                                                                                                 గుజరాత్లో విద్య మీద అంత గౌరవం ఉండదు, వ్యాపారం మీద ఉన్నంత .... గుజరాత్ వ్యాపారానికి పెట్టింది పేరు . ... అరకొరగా చదూకున్న వ్యాపార శిఖా మణులే ఎక్కువ . కానీ వారి నాగరికత ఎప్పటికీ సంకరం కానటువంటిది . ... అటువంటి గుజరాత్ మేధావుల ఆశా దీపం '' నరేంద్ర మోడీ ''. అతను ఆ రాష్ట్ర ముఖ్య మంత్రిగా, ఎన్నో సంస్కరణలు చేసారు ... గుజరాత్  ను పాలించిన ముఖ్యమంత్రుల్లో ''మోడి'' ని ... మించిన ద్రష్ట మరోరు లేరని చెప్పుకోవచ్చు . అతనికి దక్కిన అరుదయిన అవకాశం ప్రధాన మంత్రి గా ,అవకాశం . గుజరాత్ లో లా , ఎదో ఒకటి అనూహ్యం గా చేసి .. భారత్ దేశం చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాల్లో లిఖించ బడాలన్న కోరిక అతనికి  తీరని కోరిక గా చెప్పుకొచ్చు . 2014 లో అనూహ్యమైన రీతిలో ప్రధాని కావడం తాను ఊహించిందే ... అప్పటివరకూ  వయోభారాన్ని అధిగమిస్తూ ,ఎన్నో ఆశల పల్లకిలో తేలుతున్న ''అద్వానీ'' కి మిగిలింది ఓ వెక్కిరింపే . మోడీ కి వస్తున్న పేరు ప్రఖ్యాతులు ,తను ప్రధానిగ  జీవిత చరమాంకంలో  కూడా కాలేనని తెలుసుకుని, కనీసం తదుపరి, ఈ దేశానికీ రాష్ట్రపతి గా నయినా కాలేనా అని   నిర్ణయించుకుని సరిపెట్టుకున్నారు అద్వానీ .                                                               ఇహ పొతే ... మొదట విదేశీ పర్యటన, స్వచ్ఛభారత్ లు ఘనంగా ముగించుకుని ... తాను అన్ని చేసినట్లు తనకు తానే సాటి  అన్న చందాన ''ఓవర్ కాంఫిడెన్స్ ''మితిమీరిన స్థాయికి చేరుకున్నారు మోడీ . స్విస్ బ్యాంకు లావాదేవీలు బయల్పరచలేని తన అచేతన స్థితి నుండి ....... ఆ సమయంలో దేశాన్ని దృష్టిమళ్లించే ప్రయత్నమే "నోట్ల రద్దు ''. పూర్వం రిలయన్స్ లో పనిచేసిన వాడిని డైరెక్టుగా  రిజర్వు బ్యాంకు గవర్నర్ గా చేయడం జరిగింది . అతన్ని గవెర్నర్ గా చేశారేగాని, అతను చేయవలిసిన ,ఇవ్వవలసిన సందేశాత్మక కార్యక్రమాలన్నీ  మోడీ డిఫాక్టో గా  చేస్తున్నట్లు మనకందరికీ ఎప్పుడో అర్ధమైనది . చట్ట బద్ధత ఎంతవరకు అన్నది మోడీ కె తెలియాలి ,ఇటువంటి విధానాన్ని ప్రశ్నించవలసిన న్యాయ వ్యవస్థ .. చూసి చూడనట్లు ఉండడం , అనే చర్యకు న్యాయ పరమైన లొసుగులు ప్రజలకు క్షుణ్ణంగా వివరించేవారెవరూ ముందుకు రాలేకపోడం మనం చేసుకున్న పాపం అయివుండొచ్చు బహుశా ... !! అందుచేత  ప్రజలు, భయంతో దిక్కుతోచని స్థితిలో నిర్భాగ్యులుగా  ఉంటూ తమ కష్టార్జితం తమ డైనందిని అవసరాలకు ధనం , కాలం , చాలక అగమ్యగోచనంగా బాధలకు ,మనసుతపానికి గురి కావలసి  వస్తున్నది, అన్నది సత్యదూరం కానేరదు  .                                                                                                                                                                  పొంతనలేని నిబంధనలు , సామాన్యులే కాదు విద్యాధికులకు అంతుచిక్కని నోట్ల మార్పిడి నిబంధనలు . రేపు కొత్తరూలు ఏమొస్తుందో ? అన్న భయం 2016 లో ఈ దేశం లో ని మారుమూల ప్రాంతాల్లో ని సామాన్యుని కూడా వదలిపెట్టని వేధింపు గ మారిపోయింది . పైగా ఆన్లైన్ లావాదేవీలు . అందులోని మర్మాలను సామాన్యునికి వివరించే ప్రక్రియ లేకపోడం ముదావహం , ఒక స్క్రాచ్ కార్డు మొఖంమీద పడేసి మిన్నుకుండే బ్యాంకు అధికారులపై జరగని చర్యలు , పాపం ATM ... బ్యాంకు లైనులో క్రమశిక్షణగా నిలుచున్న ప్రజలపై లాఠీ ఝుళిపించడం పరిపాటి అయ్యింది . ''నో కాష్ '' బోర్డు పెట్టడానికి కారణం బడా చోరులతో చేతులు కలుపుతున్న బ్యాంకింగ్ వ్యవస్థ కాదా ? అన్నది ప్రతీ సామాన్యుని ప్రశ్న .  ఇక్కడ ప్రజలు ఇచ్చిన సహకారం , మోడీ పై చూవించిన సానుభూతి అనన్యం .  కానీ 50 రోజుల గడువుకోరిన మోడీ ఒక్కసారిగా విరుచుకుపడి , చివరాఖరికి ... అభివృద్ధి గుడ్డెద్దు చేల్లో పడిన చందం అటుంచి,  యావత్ బీజేపీ కేడర్లు మోడీతో సహా ''డామేజీ కంట్రోల్ '' ఎలాచేయాలో  అన్న ఆలోచనలో పడిపోయారు . ఇక్కడ తమాషా ఏమిటంటే .. తందాన ,తానా అనే మిత్ర పక్షాలూ, ఆన్లైను బ్యాంకింగ్ ,నగదురహిత గ్రామాలు మావంటే మావి అని చంక కొట్టుకునే జోకర్ రాష్ట్రాలు ఒక్కసారిగా వెరసి  డిజిటలైసెషన్ అన్న కొత్త పాటను అందుకున్నారు .  డిజిటలైజేషన్, కు సంబందించిన ప్రక్రియ చాలా  వేగవంతమైనదని, నగదు రహిత లావాదేవీలకు రాయతీలు ప్రకటించడం జరుగుతున్నది .   నోట్ల రద్దు అనే ప్రక్రియ భారత దెశ  ఆర్ధిక వ్యవస్థపై శరాఘాతం లా తయారయిందనే విషయం మోడీ అర్ధం చేసుకోడానికి 50 రోజులు పట్టిందన్నమాట ... 31. 2. 2016 ... మోడీ దెశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం , గర్భిణీ స్త్రీలకు 6000 రూపాయలు  వారి ఖాతాల్లో జమచేస్తామ్ అనే  భాషణలు , కేవలం వార్షిక బడ్జెట్ ప్రసంగంలా రూపాంతరం దాల్చింది .  అతను గవెర్నర్లా విధించిన బ్యాంకు లావాదేవీల్లో కొద్దిమార్పు సంబంధించి, జనాలకు ఒరిగిందేమీలేదు . ఆన్లైన్ లావాదేవీలు  విస్తృతం కావాలంటే యావత్ భారతదేశం లో చిన్న మారుమూరు పల్లెల్లో కూడా ''ఇంటర్నెట్ '', విస్తృతంగా ఏర్పాట్లు కావాలన్న చిన్న విషయం మోడీ కి తెలియకపోవడం అతని తప్పు కాకపోవచ్చు , కానీ ఎదో వెలగ బెడతాడని మనం ఓట్లేశాం అది మనం చేసిన పెద్ద తప్పు . ఎదసంలో 80 వయసులోనూ రాజకీయాల్లో స్టేటస్ కోరే మేధావులు ... గద్దెలను విడవని మేధావులూ.... కేవలం  తప్పదన్నట్లు ఆగస్టు , జనవరిలో జండావందనం చేసే ఆఫీసర్లు ...   కేవలం సంతకాలు చేయడానికి ... దేవాలయాల్లో ఉచిత ప్రోటోకాల్ దర్శనాలు దొబ్బే గొవెర్నొర్స్  కు ఇచ్చిన ఎక్సటెన్షన్, బ్యాంకింగ్ దిగ్గజం ''రాజన్ '', కు ఇచ్చి ఉంటె , దేశానికీ ఈ దుర్గతి పట్టేది కాదేమో దయచేసి ఆలోచించండి .... చివరికి మోడీ పుణ్యమా అని డెమొనీటిజషన్ కాస్తా పిచ్చివాని చేతిలో రాయిలా ''డామేజ్ టైజేషన్ లా పరివర్తన చెందిన డిజిటలైజేషాన్ లా  తగలడింది ..... ఇందుకు జవాబుగా భారతీయ జనతా పార్టీ రాబోయేకాలంలో  భారీ మూల్యం మోడీజీ వలన  చెల్లించుకోబోతున్నారు . మొదట్లో  ఆకాశానికి ఎత్తుకున్న కొన్ని విదేశి పత్రికలు, ఇప్పుడు పుంఖాలు పుంఖాలుగా నెగటివ్గా  వ్రాయడం, చదివినవారు ఎవరైనా అర్ధం చేసుకోచ్చు .                                                                                                                                అస్తవ్యస్థమైన ప్రసంగాలు ... అర్ధంపర్ధంలేని ఛలోక్తులు .... ప్రశ్నించినవారిని తీవ్రం గా శిక్షిస్తున్న విధానం ... లేనివి ఉన్నట్లు చెప్పడం .. మోడీ తప్పించి అతని ఒంటెద్దు పోకడ తప్పించి భారత రాజకీయ చిత్ర పటంలో అన్నీ పిచ్చిగీతల్లా ఉన్నాయి అంబానీ ,అదానీ ,టాటా , సహారా , విజయ్ మాల్యా ఎపిసోడులు అటుంచి . తమ కుటిల నీతి ని ఒప్పుకొనే దేర్యం   లేక ... విమర్శిస్తున్న ... విపక్షాలను తూర్పారబట్టడం లాంటి విధానాలను ఈ దేశ ప్రజలు ఎప్పటికీ తమ అంతరంగాలలో గురుతుంచుకుని మోడీ భవితవ్యం నిర్ణయించడం ఖాయం  ..... ఈ మధ్యలో జరిగిన ఎన్నికల్లో ఒకటో మూడో  రాష్ట్రాల్లో ఆపసోపాలు  పడి  గెలిచిన బీజేపీ ... ఒక్క రాష్ట్రము తప్పించి మిగతా వాటిలో ప్రభుత్వము ఏర్పాటు చేసేంతవరకూ  నమ్మకం లేని పరిస్థితి .. కబుర్లు చెప్పే వెంకయ్య నాయుడు గారు తన శాయశక్తులా డోలు కొట్టడం ఇక్కడి కొసమెరుపు .. ఒక పరిస్థితిలో  మోడీ అంత  నాయకుడు ఇప్పట్లో లేడు అన్నంత చందాన డబ్బాకొట్టుకున్నారు .కానీ 2019 దాకా బీజేపీ ఉంటుందా అనే నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతోంది ... లేక భయం తో కూడిన ముందుచూపుతో ..ఎన్నికలు  ఐదు సంవత్సరాల టెర్ము కాకుండానే ఎన్నికలకూ వేళ్ళ వచ్చు ... ఒక పరిస్థితిలో .. పెద్ద నాయకుల హటన్   మరణాలు సంభవించే పరిస్థితీ లేకపోలేదు బీజేపీ ... రాష్ట్ర జాతక ...గ్రహ రీత్యా ... కానీ 29 మర్చి నుండీ ఒక ప్రక్క చంద్రబాబు ...ఇంకోప్రక్క కెసిఆర్ ...అటుప్రక్క మోడీలకు ఈ తెలుగు నూతన సంవత్సరం నుండీ గ్రహ రీత్యా చుక్కెదురు కావచ్చు కూడాను .. ఏది ఏ మయినా మోడీ గురించి మ్రోగుతున్న డబ్బా ..ఛానళ్లలో చూపుతున్న హైప్ ...తప్పించి యదార్ధం గ  అతను సామాన్యునికి చేసింది పెద్ద సున్నా .. లేక సూన్యం సుమా ..!!...                                                                  

Saturday, 17 December 2016

@ఎరగనోడు ...కరెంటు స్థంభం@

             "   ఎరగనోడు .... ఎలక్ట్రిక్ స్థంభం ఎక్కితే ..... ??.....! "                                                                                                             ఈ దేశాన్ని దరిద్రం క్రింద పట్టి దశాబ్దాలు బాధించిన   కాంగీ  పీడా విరగడ అయింది  అన్న ఆనందం  అనుభవించక ముందే ... , మాటల మాంత్రికుడు , మతాల తాంత్రికుడు , ప్రస్తుత ప్రధాని తనదయిన,   మ శైలి  లో ఈ దేశాన్ని పీడిస్తూ,రాజకీయ జాతి ఇంతేనేమో అనిపిస్తున్నారు . మొదట చెప్పాలంటే ఈ దేశంలో మొట్టమొదట ముసలి  వారు ... చదువు తగినంతగా లేని మేధావులు  దేశ రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండి తీరాల్సిందే . మోడీ వచ్చినప్పటి నుండి దేశం లో అభివృద్ధి  భాగ్యవంతులకు మాత్రమే కనిపిస్తున్నట్లు ఉంది .... అట్టడుగు వర్గాలకూ ,విద్యా వంతులకు,కాయకష్టం చేసేవారికి ఒరిగింది ఏమీలేదు .పైగా తన కోటరీ నుండి దేశం మీద రుద్దబడిన "గుజరాత్ " తెలివి తేటలు మాత్రం అతన్ని అన్ని మాధ్యమాల్లో శిఖరాగ్రాన్ని చేర్చాయన్న విషియం అందరూ ఆమోదించక తప్పదు . అతను తన గుజరాతీ  వ్యాపార మార్కుసంప్రదాయం లేక స్టాంపును గుద్దాడన్నది మనందరికీ తెలిసిందే . ఎందుకంటే, ఇతని ఫీడ్ బాక్కు వెనుకవున్నకార్పొరేటు గుజరాతీలు .   ఉదాహరణకు కొన్ని విషయాలు చెబుతాను . అతను ప్రధాని పదవి చేపట్టిన వెంటనే దేశానికీ ఇచ్చిన కానుక 1. స్వచ్ఛభారత్ చీపురు 2. ప్రపంచంలో భారత ప్రధానులెవ్వరూ చేయని నిష్పత్తిలో విదేశి పర్యటనలు  2. స్విస్ ధనాన్ని తెస్తానని చెప్పి ఇంతవరకు ఏమీ తేల్చక పోవడం,LK అద్వానీ అకౌంట్ 7000 కోట్లతో ఉండడం చూసి విస్తుపోయి పిచ్చి చూపులు చూడడం  3. దేశంలో జీవిస్తున్న ప్రతీ మనిషి కి బ్యాంకు అకౌంట్ తెరిపించి దాంట్లో ఇన్సూరెన్స్ వంటివి చొప్పించి వారి స్వీయ జీవితంలోకి తొంగిచూసే ప్రయత్నం 4. వంట గ్యాసు సబ్సిడీ ...గొప్పగా ఇచ్చామనిపించుకుని ... పేదలకు సహాయం చేయాలన్న సంకల్పంలా ఫోజుపెట్టి ,ఊడబెరకడం 5. పైజామా కుర్తా నుండి సర్వసాధారణంగా గాంధేయవాదిలా కనిపిస్తూ ,వంగి వంగి మాట్లాడుతూ ,లక్షల రూపాయల విలువ చేసే సూట్లు ఆచ్ఛాదనగా వేసుకుని దేశాలు తిరిగేయడం 6. తన కోటరీలో బీజేపీ దిగ్గజాలనబడే వారికీ బ్యాండ్ తగిలించి ఊదరగొట్టడం 7. మీడియా ,ప్రెస్స్ లో తనను దుయ్యబడుతున్న వారిని వాళ్ళ అకౌంట్లు ఫేసుబుక్కులు ,మెయిల్స్ తన అనుయాయులతో రహస్యంగా ,బాహాటంగా హ్యాక్ చేయడం...వీలైైైతే బొక్కా లో వేసేయడం  7. వెనుక తురుష్కులు భారత జాతి సంపదను దండయాత్రలతో మోసుకుపోయినట్లు  మనదెశ సంపదను ముఖ్యంగా గుజరాతీ తెలివితేటలతో నల్ల ధనం నిర్మూలిస్తున్నాం అనే నెపంతో తో ముందుగానే ఎల్లలు దాటించే (స్వలాభం లేకపోవచ్చుగుజరాతీలు మాత్రమే బాగుపడాలన్నట్లు ) ... ఇలా చెప్పుకుపోతే లెక్కలేనన్ని వంకర్ల ప్రధానిగా చెప్పుకొచ్చు .                                                                                    దేశాలు తిరిగే వ్యామోహం ,రుచికరమైన పదార్ధాల జిహ్వ చాపల్యం ,విశ్వ నాయకుల జాబితాల్లో చేరిపోవాలనే ఉబలాటం,సర్దారువల్లాభాయ్ పటేల్ తరువాత, భగత్ సింగ్ అంతటి నాయకునిలా కనిపించాలనే తన చాకచక్యం, చతురత ... "పూరా మిట్టిమే మిలాదియా " అన్న చందాన తగలడిందన్న  విషయం జీర్ణించుకోలేని విషయాలు రెండు చెప్పుకోవచ్చు                                                                                                                  1.ఢిల్లీలో చిత్తుగా ఓడిపోయి ఒప్పొజిషన్లో కూర్చున్నారు బీజేపీ వాళ్ళు . మోడీ అంత తిరుగులేని నాయకుడైతే ,గియితే ఢిల్లీ ప్రజలు బీజేపీ కి పట్టం కట్టాలికదా. పంజాబ్ ఎలక్షన్ లో అపశృతుల్లో చక్కగా  శృతి చేసుకున్నాడు కేజ్రీవాల్  అందరికీ తెలిసిన విషయమే ! 2. డెమోనిటైజేషన్ ... ఎరక్కపోయి అన్నట్లు ...పూర్వం బిందెలో ఎదో తినడానికి ఉన్నట్లు వెతకబోయిన కుక్క తల దూర్చి ..... తల బయటికి రాక ...కుక్క పీకులాటలా ఉంది అతని పని . ... నోట్లమార్పు అనే విషయం గొప్ప గానే డబ్బాకొట్టుకుంది ప్రభుత్వం . కానీ నోట్ల చేర్పు ,కూర్పు లలో సుందరముదరష్టమైన ...... గిరికీలు కొడుతున్నాడనే విషయం నిర్వివాదాంశం . బీజేపీ వర్గాలు ,చెంచా చానల్సూ ,బడా బ్రోకరుబాబులు మోడీని దేశంలో ,వి దేశీయంలో నెత్తికెత్తుకున్నా .. మధ్యతరగతి ,పైతరగతి ,క్రిందితరగతుల మతులు ,గతులు తప్పి ,రోజు వారీ ఖర్చులకు అడ్డా కూలీల్లా ఏటీఎంలను, బ్యాంకులను ఆశ్రయించడం  ఒక అభ్యసంలా నవంబరు 8 ,2016 నుండి ప్రజలకు గుణపాఠం నేర్పినందుకు సదరు  "మోడీ "  భారత దేశం బీజేపీ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా ... స్థానం సంపాదించుకున్నారు . ఇక్కడ ఒక చిన్న విషయం మనం గురుతుంచుకోవాలి, తప్పదు . ఒక RMP వైద్యుడికి ... సూపెర్స్పెషలిటీ స్పెషలిస్టుకు వ్యత్యాసం కొండంత ఉంటుంది . చెప్పుకోడానికి ఇద్దరూ డాక్టర్లులే  . మొదటివాడు తలనొప్పి మందు గురించి సూక్ష్మం గా చెప్పగలడు , రెండోవాడు స్థూలంగా , సమగ్రంగా ,సాంగోపాంగంగా చెప్పగలడు . అలానే రాజకీయంలో మోడీ స్పెషలిస్టుగా చెప్పబడుతున్న RMP మాత్రమే . అతను థియరీకి ఆమడదూరం ,పైగా తాను నమ్మినదాన్ని ఆచరణలో గుడ్డిగా పెట్టే  ఓ  అపసవ్యదిశను సవ్యదిశగా నమ్మే ఈనాటి మేధావి ..... మరో తమాషా ఏంటంటే పీవీ నరసింహారావు గారు ,మన్మోహన్ సింగ్ లాంటి వారు  చేపట్టిన  , ఆర్ధిక సంస్కరణలు ...  చాలా ఘనమైనవి .పైగా అవ్వి ఎంత రాజకీయ వత్తిడి ఉన్నప్పటికీ ... సిద్ధాంతాల పునాదులనుండి, వెంట్రుక వాసి గూడ తప్పనటువంటివి .                                                                ఇహ పొతే మీకు, మన తెలుగోళ్లు  ఆడే   ఒక దేశవాళీ  ఆటగురించి చెప్పాలి .  "బిళ్ళంగోడు" ఆట లో కొన్ని పర్యాయపదాలు ఉంటాయి . స్ట్రైకర్  దండుతో బిళ్ళను (చిన్న కర్రముక్క ను   లేక గిల్లి ) ని కొట్టేప్పుడు , మిగతావారు క్యాచ్ చేయడానికి వీలు లేకండా ఉండేందుకు ,అడ్డదిడ్డంగా ఈడ్చి కొట్టేముందు ఒక పదం చెబుతాడు ..... మీఅందరికీ తెలిసిందే "గాలివాలు బిళ్ళ సాయ్ " .  అదో అలా  మన మోడీగారు ఎదో గాలివాలుగా ప్రధాన మంత్రి య్యారు  తప్ప , ఇంతవరకు మన మాజీ ప్రధానుల్లో ఎవరీలానూ విద్యా వంతుడు , మేధావి కాదు . బుద్ధిశాలి కాదు . అతనికున్న  పదునైన నాలుక అతని ఆయుధం .   రాజకీయాల్లో కి వచ్చినవారు ఎన్నో కోల్పోతారు ,అలానే అనూహ్యంగా , పరిముతుల్లోలేని వి ఎన్నో  ఈ ప్రపంచంలో సంపాదించుకున్నవారే . అసలు భార్య ,తల్లి ,, బిడ్డల్ని వదులుకొమ్మని మీరెవరైనా చెప్పారా ? నేనైతే అతనికి చెప్పలేదు . వెనుక ఒక మాజీ ప్రధాని చావును సానుభూతిగా చెప్పుకుని ఓట్లు అడుక్కున్నట్లు ...మోడీగారు తన  ఉపన్యాసాల్లో  తన టైగా,వీరగాధలు  ఎందుకు ప్రస్తావిస్తున్నట్లో ?.  ...... నోట్ల మార్పు అనబడే " డెమోనిటైజేషన్ "... తిరిగి తిరిగి తనకే "జోర్  కా జట్కా ధీరేసే  లగా " అన్నట్లు బీజేపీ కే తగిలిం ది ...... భవిష్యత్తులో  2019  ఎన్నికలు ఇప్పటినుండే బీజేపీ కి పీడకలలు  తెప్పిస్తున్నాయి . . ఇప్పటికే ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలు వాయిదా వెయ్యమని  యూపీ భాజపా శ్రేణులు  లబలబ , మొత్తుకుంటున్నాయి . .... భవిష్యత్తు  దేశాభివృద్హి దేవుడెరుగు  , మోడిచేసిన ఈ " మోళీ " తాలూకు  ఆర్ధిక పెనుముప్పు , ఈదేశాన్ని ఎన్నాళ్ళు  దివాళా తీయిస్తుందో . అరుణ్  జైట్లే అంత బుద్ధిశాలురు మన ప్రజలు కాకపోవచ్చు  . బీజేపీ ,ప్రజల  శాపనార్ధాల మూల్యం  భారీగా చెల్లించాల్సి ఉంటుంది ....  '' నేను మీ పెద్దవాడిని .. మీ పనులు ..మీరు నాతో   చేయించుకోండి " లాంటి  మాటలు చెప్పే ఈ మతాల మాంత్రికుడు  మేక తోలుకప్పుకొన్న పులి  మీద పడినట్లు ... నోట్ల మార్పిడి పోలోసి తో జనాల గుండెల్లో తనపై గూడుకట్టుకుని ఉన్న ఆశాసౌధాల్ని   కుప్పకూల్చి ... ఒక గుజరాతీ చాయ్వాలా ఎలా బోను పరచే వేటగాడో చెప్పక చెప్పాడు 'మోడీజీ ".........                                 

Tuesday, 13 December 2016

                               "పరోపకారార్ధం మిదం శరీరం "                                                                                                                నేను చాలా దూరం నుండి ఇక్కడికి బ్రతకడానికి వచ్చాను . ఇక్కడి జీవన విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది . ఒకరికి మరోరి  పలకరింపులు ఉండవ్ !... కనీసం రోజూ చూసే ముఖాలు ,ఒకదానితో మరోటి సంబాషించు కోపోతే మానే కనీసం చిరు నవ్వులో ... ముసినవ్వో అస్సలే ఉండవు . మనం దేశం సరిహద్దుల్లో చైనా వాడిని ,పాకిస్తాన్ వాడినో చూసినట్లు పెడతారు ముఖాలు . పలకరిస్తే ...అభివందనం చేసుకుంటే నాకేంటి ? బాబోయ్ ! ఖర్చు డెబిట్ కార్డు గీకవలసి వస్తుందేమో? అన్నట్లు కటింగ్ ఒకటీ .                                                                                                       మా ఇంటి నుండి వాహనాలు  అవీ తిరిగే రోడ్డు ... దాదాపు సరిగ్గా ఒక్క కిలోమీటరు  దూరం . నేను మొదట్లో ఒకరోజు ఒక పెద్దాయనతో పరిచయస్తునిలా మాట్లాడేవాడిని . అతను భారత దేశపు సీనియర్ సిటిజెను ... అతను గొప్ప గ్యాని లా కనిపించా రు .... ఏకంగా ! "మీ పిల్లలు ఇక్కడి కాలేజీలో చదుతున్నారా అండీ ?"                    '  లేదండీ '...నా జవాబు ...                    .." ఐతే ఇక్కడికి  ఎందుకొచ్చారు ....?   '                  నా బుర్ర తిరిగిపోయింది .... భారత పౌరునిగా ఎక్కడైనా నీతి గా బ్రతకొచ్చు .....డీమోనిటీసషన్ సీజన్లో, కొత్త 2000 రూపాయలు కోట్లల్లో  బినామీ ఖాతాల్లో, బ్యాంకు ఆఫీసర్స్ చలవతో మార్చుకున్నవారు ..... విజయ మాల్యా లా ఎగవేత దారుల్లా ... బడాబాబులు భారత దేశంలో తిరుపతి కొండపై ఇంద్ర భవనం లాంటి గెస్ట్ హవుసులు కట్టుకుని ... ముక్క ,పిక్క , మందు , పొందు తో పవిత్ర స్థలాన్ని బ్రష్టు పట్టించొచ్చు .... కానీ జీవితం లో ప్రతీ ఆర్ధిక సంవత్సరం కు టంచను గా పన్నులు చెల్లిస్తూ దాచుకున్న  డబ్బుతో ఇష్టం వచ్చిన చోటు లో ఇల్లు కొనుక్కుని ఉండగూడదట . ఎంత ? గొప్ప న్యాయం భారత దేశంలో సుమండీ ...!!                                                                             అది మంచి ఎండలకాలం  దాదాపు 40 డిగ్రీల ఉస్టునోగ్రత ఉంటుందనుకొంటాను .... రోడ్డు మీదకు పోవాలంటే వెహికల్ తప్పనిసరి .కానీ వెహికల్ ఉన్నవారు పడవలాంటి కార్లలో శేష ప్రేతంలా ఒకేఒక్కరు రయ్ మంటూ  దూసుకెళతారేగాని ... పాపం నడిచేవారిని ఎవ్వరినీ కనీసం ద్విచక్రాల వాహనాలమీద కూడా కూర్చో బెట్టుకోరు ... ఈ జబ్బు దేశం నలు చెరగులా ఉందనుకోండి !.... కానీ ఘోరం ఏంటంటే ? డాక్టరు గిరీవెలగ బెడుతున్నవారే అందరూ .....ఆ పాటి దయ ...జాలి ... నడిచేవారిపై చూవించరు గాక చూవించరు... ......ప్రతీ రోజూ నడవలేని వాళ్ళు ,మోకాళ్ళ సమస్యలున్న వాళ్ళు ,ముసలివాళ్ళు ,స్కూలు ,కాలేజీ వెళ్లే వాళ్ళు ... అనేక రకాలైన వాళ్ళు వెడుతూ ఉంటారు .... కనీసం వాతావరణం దృషిలో పెట్టుకునైనా ప్రవర్తించరు . ..... ఇటువంటి వారు రేపు రోగిని, వాడి బాధని ఎలా అర్ధం చేసుకుంటారొకదా !....?  దీనికి కారణం .... ? వారిమనసులో పరాయి మనిషిని మనిషిలా చూడక పోవడమే కావచ్చు . వైద్య వృత్తి అంటే ... వైద్యం చేసేవారిని "వైద్యో నారాయణో హరి :" అన్న ప్రాచీన నానుడి ఈ కాలం ఇంకా చెప్పుకోవచ్చా అంటే ? సందేహమే ?... కానీ నా ముస్తిష్కంలో మెదిలే కొంతమంది మహానుభావుల్ని సోదాహరణం గా వివరిస్తాను   .....                                                             అదో చిన్న ఊరు అక్కడ  దాదాపు అయిదు మంది mbbs లు , ఇద్దరు సర్జన్లు ముగ్గురు జినాకాలోజి  లు , నలుగురు  RMP లు , నాటు ,ఆయుర్వేద ,హోమియో లు గుంపులు గా ఉండేవారు . డాక్టర్ చీటీ 2 రూపాయలు ఆ రోజుల్లో .... ఒక సర్జన్ ఉండేవాడు అతను పేషంటు చేతిలో 10 నోటు చూస్తే పులకరించి పోయి మొత్తం పది రూపాయల బిల్లు చేసే వాడు , మారొడు హస్తవాసి మంచిది , ప్రక్క ఊరివారు కనీసం నాల్గు రోజులు ఇన్ పేషంటు గా ఉండి, జబ్బు లేకపోయినా సదరు డాక్టర్ వద్ద బిల్ గొరిగించుకునే వారు . మరో mbbs గారు టక్ మాస్టర్ ,పోష్ గా కనిపిస్తారు ,చాలా చాలా తీయగా మాట్లాడుతారు .బిల్ కొద్దిగా ఆలోచించి వేస్తారు ,కానీ అవకాశం ,ఉంటే ,కడుపునొప్పి ఆపరేషన్ చేసి పంపిస్తారు . కానీ రోగి సంవత్సరం తరువాత గానీ, తెలుసుకోలేడు ఒక "కిడ్నీ ",చివరాఖరికి లేదని .... మరో డాక్టర్ రక్తం ,కళ్ళే , మూత్ర పరీక్షలు చేసి మరీ బిల్ గుంజేవారు ,పరీక్షల అవసరం లేనప్పటికీ . మరో MBBs గారు గంపెడు సంతానం ... బిల్లు వేసేప్పుడు రోగి ఆర్ధిక పరిస్థితి పరిగణలోనికి తీసుకుని ... పెదాబిక్కీ అని ఆలోచించే వారు ..... మరో సర్జన్ ఆపరేషన్ అవసరం లేకపోయినా, సిజేరియన్ అవసరం లేక పోయినా ఆపరేషన్ తప్పకచేసే వారు . ఇటువంటి వారు ఉన్న ధనార్జనారణ్యం లో తులసి మొక్క లా ఉండేవారు . అతను "బర్మా " నుండి వలస వచ్చిన బాపతు . కూలీలు ,రిక్షా వారు ,దరిద్ర నారాయణులకు అతి గా వైద్య సేవ చేసి ,రెండు తిట్లు తిట్టి ,బిల్లు విషయం ప్రస్తావనకు వస్తే  చంద్రుడు కో నూలు పోగులా తీసుకుని ,లేక పొతే అసలు ఏమీ తీసుకొనక, ఖాళీచేతుల నమస్కారాన్ని తీసుకుని పంపేవారు . ఇంకో తమాషా కాండిడేట్ ఉండేవారు ఆమె ఫీజు నామినల్ గా తీసుకుని, కొన్ని మత్తయి సువార్త ,బైబిల్  పుస్తకాలు ఇచ్చి మరీ పంపేవారు . ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే ?వీళ్ళందరూ డాక్టర్లు ... ఒక్కోరు ఒక్కో తంతు . అంటే వెరసి వీరందరిలో ఒక ఖాళీ చేతుల్తో నమస్కారానికి అలవాటుపడ్డ ఆయన్ను తప్పించి  మిగతా మహానుభావులు,ఒక్కో రకమైన రీతిలో వ్యాపారస్తులా చెప్పుకొచ్చు ... సాధారణం గా ఇలాంటి విధానం లో రైటూ ... లెఫ్టూ గా సంపాదించినా వాళ్ళ పిల్లలూ రేపు డాక్టరులే . అదిగో అటువంటి వారి మనసుతత్వమే ... పడవల్లాంటి పెద్ద పెద్దచలువ కార్లలో  తలబిరుసుగా నడిచే దారిలో 60 కిమీ వేగంతో దూసుకెళ్ళటం అన్నమాట ... ఇహ క్యాపిటషన్ మా ఇంటి ప్రక్క మెడికల్ కాలేజీలో mbbs సీటు అక్షరములా ఒక్క కోటి రూపాయలు అనే విషయం, బహిరంగ రహస్యం   ... పాపం అరాకొరగా వచ్చిన అత్తెసరు ర్యాంకుల మేధావులు ఇక్కడా ప్రత్యక్షం అవుతారు . అసలు వాళ్ళని పట్టలేం .. పిచ్చి .. పోలి కటింగులు ,బుడబుక్కల ఫాషన్ లో మునిగి తేలుతుంటారు .... వీళ్ళు హిందువులైన ముస్లీములు లేక హిందువుగా పుట్టిన ఫాషన్ కిరస్తానీలు . వీళ్ళ ముఖం మీద  బొట్టు అనే చుక్క కనీసం ఉండదు . లప్పే డు షాంపూ తో అలికిన జుట్టూ ...                                                                    ఇందులో కొంతమంది సంప్రదాయం గా కనిపిస్తే మరికొందరు ఫాషన్ పెరేడ్ కా అన్నట్లు ఉంటుంది అవతారం ... అంత పవిత్రమైన ప్రొఫెషన్ లో ఉండి డిస్కో థెక్ కు వచ్చినట్లు అవతారం  .... వీళ్ళు దారిలో నడిచే సాధారణమైన మనుషులను చూడగానే సదరు కారు లేక  బైకు ఒక్కసారి వేగం పెంచుతూ ... దేశానికీ వీళ్లేందో అసామాన్యమైన సేవలు చేయబోతున్నట్లు ఫోజూ పెడుతూ వెడతారు  ... నిజం చెప్పాలంటే రేపు వీరి చదువు అయ్యాక కనీసం 5 సంవత్సరాలయినా గ్రామాల్లో ప్రజా సేవ స్వచ్ఛందం గా చేయక ... అడ్డదిడ్డంగా హాస్పిటలు పెట్టి , లేక సూపర్ స్పెషలిటీల్లో చేరి .. కనీస0 సేవా భావం లేక ,కేవలం సంపాదనే పరమావధి గా జీవించేస్తారు ... వీలయినంతవరకు ఇన్కమ్ టాక్స్ వాళ్ళకి కనిపించనంత దూరంలో మూడు పూలు ఆరు కాయలుగా పరిఢ విల్లుతారు ... ఇప్పటికీ నిజమైన త్యాగ శీలురైన వైద్యులు, అపోలో ... కేర్ .... యశోద వంటి ఆసుపత్రుల్లో ఉంటారు కూడా . ఎప్పుడు కూడా గట్టి చదువు కు , దొడ్డిదారి చదువుకూ చాలా తేడా ఉంటుంది . మనం  గవర్నమెంట్ , కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లను "బాదినట్లు " , వార్తలు చూస్తూంటాం .అదిగో వారే వీరు ..                                                 అందుకే మిత్రులారా  మన శరీరాన్ని మనల్ని మోసుకునేందుకే కాక , ప్రక్క వాడిని మోసేందుకూ ఎల్లప్పుడూ సిద్ధపరచాలి అదే నిజమైన వ్యక్తిత్వం కాదా ? ..... అందుకు శాస్త్రాలు ,వేదాలు , ఋక్కులు వల్లే వేయనవసరం లేదు . కొద్దిగా మనసును  "శృతి " చేయడమే మనం చేయవలసింది .  కాల ,మాన పరిస్థితులు , మనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొద్దిగా అర్ధం చేసుకోడమే ఇక్కడ మనం చేయవలసిన అభ్యాసం .......