totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Tuesday, 28 October 2025

"తెగులు ...మీడియా...."

                           "తెగులు మీడియా"
           భారత దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది,లేక  నెట్టబడుతూ ఉంది.మనందరికీ ఈ మాట వింతగా ఉండొచ్చు... 1.కుక్క మనిషిని కరిస్తే అది విషయం, కానీ 2.మనిషే కుక్కని కోరితే అది వార్త,వింత కూడాను.
    దేశంలో ఇప్పటికే మించిన ఛానళ్లు ఉన్నాయి.ఒకప్పుడు దూరదర్శన్ మాత్రం ఉండేది...పావుగంట పాటు ప్రారంభం కు సంబంధించిన ట్యూన్ చూస్తూ ,అలా స్క్రీన్ చూస్తూ ఉండేవాళ్ళం.కానీ ఇపుడో, మార్చి, మార్చి చానెల్స్ ఏదీ సరిగా చూడం. సెన్సషన్  తప్పించి....ఇదుగో వచ్చిన చిక్కంతా దాంతోనే.....ఒక ఛానెల్ పుంఖాలు, పుంఖాలుగా సీరియల్స్ బడుతుంటే,మరొఛానెల్ సద్దిన్యూస్,విషయాలు తిప్పి, తిప్పి వేస్తూంటారు. అన్నీ వెరసి ఆడియో లాంచింగ్లు చాలా అద్భుతంగా చూవిస్తూ ఉంటారు రోజంతా. మరో ఛానల్ దేశదిమ్మరిగా తిరిగే నాయకుల్ని తదేకంగా చూవిస్తూ ఉంటుంది.
సాధారణంగా ఈ తంతు తెలుగు లో "తెగులు"పట్టిన చానెల్స్ చేస్తాయి.... ఆ మధ్యలో ఒక సీఎం కొన్ని ఛానెల్స్ ను పనికట్టుకుని రద్దుచేశారు.... అప్పటినుండి కొంత ఒళ్ళు దగ్గరేట్టుకుని ఆ పార్టీ, ఆ సీఎంకు స్తోత్రపటనాలు చేస్తూ కాలం వెళ్లదీస్తూ ఉంది....ముఖ్యంగా కొన్ని ఛానెల్లూ వారి ప్రతిభను వివిధ కోణాల్లో ఆవిష్క రించడం పరిపాటి. ఉదాహరణకు చెప్పాలంటే.... వార్తలు...మాత్రం ఇన్ని నిముఉషాల్లో ఇన్ని వార్తలు అంటూ...ఒక సంఘటనను తీసుకుని ఎనిమిది భాగాలుగా లేక ఎనిమిది సేపరేటు వార్త గా చూవించే తెలివితేటలు ఆ ఛానెళ్లకు మాత్రమే ఉంది. భర్త ఇంటిముందు ,భార్య ధర్నా,స్త్రీ సంఘాలు పలకరింపులు లాంటి న్యూస్ మెచ్చుకో దగ్గవే...
ఈరోజుల్లో ఉబుసుపోని పోకిరీలు, సాడి స్టు లు ...తలమాసినోడు,పెట్టిన వీడియోలు, ఒకవేళ వైరల్ అయితే వాటిమీద నిజమా, అబద్దామా..అని తేల్చేయడం ఇప్పుడో పేద్ద సంచలనం...పార్టీల డిబేట్స్ లో వాళ్ళ మధ్యలో పుల్ల పెట్టి ఆ డిబేట్ ను రక్తి కట్టించడం.... ఇహపోతే ఒక స్టేటస్ అంటూ లేని వారిని కెమెరా ముందు కూర్చోబెట్టి సెలెబ్రెటీస్ ను ఇరకాటంలో పెట్టడం ఎంతో కళాత్మకం గా కనిపిస్తుంది యాంకర్ విన్యాసాలు.అసలు కొన్ని మంచి చానెల్స్ గా చెప్పబడే వాటికి కూడా ఈ "తెగులు" ఏనాడో సోకింది.... ఒక ప్రక్క ఉత్తర భారత దేశంలో ఎడతెరిపి లేని ప్రజారాంజక విషయాలు డిబేట్స్ గా పెడుతూంటే, మన "తెలుగు"చానెల్స్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుడు తనాన్ని పెంచి పోషిస్తూన్నాయి... మొగవాళ్ళు ఆడాళ్లలా(కొజ్జా)తయారయి, వేగట వేసే జోకులు,మరి నాగరిక కుటుంబాల్లో ఎవరు చూస్తారో కానీ హై రేటింగులు. వార్త, విశ్లేషణ లో తెలుగు మీడియా కు నడకలు నేర్పిన లెజెండ్ సాక్షాత్తు రామోజీ రావుగారి ఛానెల్లో అటువంటి బూతు కాని బూతుల కార్యక్రమాలు ఉండడం ఎంతో బాధాకరం...
     మధ్య పానం అనేది ఈరోజుల్లో సర్వ సాధారణమైన  విషయం....40 సoత్సరాల వెనుకకు మా చిన్నతనంలో...యుక్త వయస్సుకే బీర్లు తాగేవారు.... దొంగ చాటుగా, సిగరెట్లూ అంతే. ఇప్పటి యువతలో(అందరూ కాదు సుమా!)...ఓ రెండు రౌండ్స్ వేసుకోటం... ఓరిపాటి .కానీ కొంతమంది అమ్మాయిలు ధూమ పానం, విస్కీలు త్రాగడం ఓ గొప్ప నాగరికత.... ఇటువంటి స్త్రీ జాతి సాధించేది భవిషత్తు సూన్యం. రాబోయే తరాల తలవ్రాతలు మనం ఇపుడే రాసేస్తూన్నాం.2018 జనవరి 1 వ,తారీకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ ఎంత ఉదృతం గా ఉంటుందో సదరు కాఖీలు వారం నుండి ఉదర గొట్టేరు. కానీ 31 డిసెంబర్ నుండి,నూతన సంవత్సరo మొదటి తారీకు ఉదయానికి 3000 కేసుల పై చిలుకు బుక్ ఆయాయంటే హైద్రాబాద్ లేక తెలంగాణ రాష్ట్రంలో... , ఓకేషల్ ,డైలీ,పార్టీ, ఇలా అనేక రకాల మిషతో త్రాగే వారు ఉన్నారో అర్ధమవుతుంది..... ఇంత చెప్పినా కరెక్ట్ గా ఇదే రోజు రాత్రి త్రాగి పట్టుబడిన వాళ్ళను ఏమనలో?వాళ్ల కే ఒదిలేద్దాం.
          ముఖ్యంగా బంజారా, జూబిలీ హిల్స్ లో పట్టు బడిన వారి వివరాలు చెప్పే దేర్యం చేయలేదు ,ఎందుకో అందరికీ తెలిసిందే ,ఎంపీ, మినిస్టర్ కు సంబంధించినట్లు వార్త హైలైట్ చేస్తే పర్యవసానం చాలా తీవ్రం గా ఉంటుందేమో ?....!. ధనవంతుల పిల్లలే అన్నట్లు చెప్పారు.వాళ్ళ కార్లు... అత్యంత ఖరీడైనవిగా చెప్పారు .అంత వరకు బానే ఉంది. కానీ ఒక్క వ్యక్తి విషయంలో ఒక ఛానెల్ అత్యుత్సాహం తప్పక చూవించింది. పైగా ఎంత తాగాడు. బ్రతనలైసెర్ లో రీడింగ్ దగ్గరనుంచి చెప్పడం మొదలెట్టారు. చివరికి కాఖీలు రీడింగ్ క్లిప్పింగ్స్ టీవీల్లో చూవించారు, అంత డమేజ్ చేశారు ఆ యాంకర్ ని. అతనే ప్రదీప్, అతను రేప్ చేయలేదు, స్కాం చేయలేదు, హత్య అంతకంటే చేయలేదు. పనిగట్టుకుని అతన్ని ఒక్కడినే ఎంత బద్నాం చేయాలో అంత చేసి వదిలారు. కారణం ! అతను యాంకర్ లలో మంచి పీక్ స్టేజి చేరుకున్న యాంకర్ కావడమే అతను చేసిన నేరం లేక పాపం.... కేవలం రూ.150  పారితోషకం తో రేడియో జాకీగా జీవితాన్ని మొదలెట్టిన, సర్వ సామాన్యుడు... తన ప్రతిభ తో అంకెరింగ్ లో ఉన్నత శిఖరాల్ని అధిగమించి న,32 ఏళ్ల మాచిరాజు. ప్రదీప్..... అతని కరేర్ ను ఎంత డమేజ్ చేయాలో అంత చేసింది ఒక ఛానల్. సింధూ కామన్ వెల్త్ క్రీడల్లో మెడల్ కొట్టినప్పుడు కూడా ఇంత హైలైట్ చేయలేదు. తన పని తాను చేస్తుందనే విషయం.... అందరికీ తెలిసిన విషయం.... కేవలం వార్త లా చూవిoచక,అతన్ని ఒక శోభారాజ్.... మాల్యా... లాలు లా చూవించడంలో.... గొప్ప ప్రతిభను తన కుబ్జ మనస్తత్వం ను చూవిoచిన....ఆ "తెగులు టీవీ"...న్యూస్ ఎడిటర్కి జోహార్లు......చానెల్స్ ఇటువంటి కుహనా ప్రతిభ నుండి బయట పడేంతవరకు మనకు మంచి వార్తలు రావు...

R.P. మద్దూరి.
హైద్రాబాద్