totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Saturday, 29 November 2014



                             '' కబళించే శిరస్త్రాణం ''                                                                                                               బాగా గురుతున్న ఓ ఆటలో జరుగిన  ఓ సంఘటన గురించి  చెబుతాను ... అది నేను మూడవ తరగతి చదువుతున్న రోజులు . మా స్కూల్ మెయిన్ రోడ్ కు అతికించి నట్లు ఉండేది . ఒకటి నుండి ఐదు  వరకు తరగతులు .మా ఊళ్ళో  గవర్నమెంట్ డాక్టర్ గారి రెండవ కొడుకు నాకు  మంచి నేస్తం . ఆ వయస్సు లోనే తను (చిన్న)చాలా చాలా మంచి మాటలు చెప్పేవాడు . కవలలు తన అక్కయ్యలు ... వాళ్ళు  మా అక్కగారి క్లాసు మేట్స్ . ఆరోజు పిల్లలు అందరం తరగతి మేరా ఆడు  కొంటున్నాం . దాదాపు ఒక్క అరగంట అయ్యిందనుకుంటాను . టీచర్స్ అందరూ ఒక్కసారి బిజీ బిజీ అయ్యారు . గుమి గూడారు . పరుగులు ఉరుకులూ గా ఉంది శీను . మా క్లాసు మేట్స్ మేము మా ఆట లో మునిగిఉన్నమ్ . కడవలతో నీళ్ళు బెంచ్ ను కడుగుతున్నారు . పరికించి దగ్గరకు పోదు నుకదా ! ..... ఒక్కొక్కళ్ళు గా అందరూ వెళ్ళిపోతున్నారు . అ బెంచ్ మీద ఒకటవ తరగతి పిల్లాడిని పడుకోబెట్టి ఉన్నది . బేచ్ మీద రక్తం కడుగుతున్న టీచర్లు . తెలిసింది ఏమిటంటే ? ఆ పిల్లాడు ఆడుతూ తలకు బలమైన గాయం తగిలి చనిపోయాడు .                                                                                                                                               ఆ నాటి సన్నివేశం, ఇప్పటికి నా మనసులో మెదులుతూ ఉంటుంది . కళ్ళముందు కదలాడుతూ ఉంటున్నది . కాని ఇప్పటివరకు ఏ ఆట కూ వేరవలేదు . ఆడుతూ ఉంటాను . కొన్నిసార్లు ఆటల్లో తగిలిందన్న తీవ్ర మయిన గాయాల్ని ఎవరి నుడయినా చూస్తె భయం వేస్తుంది . ముఖ్యం గా టెస్ట్ మ్యచ్ , వన్ డే ఇంటర్నేషనల్ చూస్తె స్లిప్పుల్లో బంతికి ముఖం పెట్టి నించు నుండే వార్ని చూస్తె భయం వేస్తుంది  తప్పక . అలానే ఊర పొట్ట -ఊసకాళ్ళు వేసుకుని,రెబోక్ షూస్ వేసుకుని పోష్ గా షట్ల్ రాకెట్ తో చొంగలు కక్కుతూ కొద్దిసేపు ఆడి, జూస్ తాగే అంకుల్స్ , అంకుల్ లాంటి అబ్బాయిలను చూస్తె  రోజంతా నవ్వు వస్తుంది . యందుకంటే ? వీళ్ళు ఆడె వ్యాయామ0 తక్కువ, ఆట పేరతినేది ఎక్కువ . పైగా నడుమో .. మొకాలో ... భుజమో .... మోచేయ్యో ..... పట్టేసి .. రబ్బరు కాప్స్ వెసుకు ని , షటిల్ లో , టెన్నిస్  లో తగిలిందని చేప్పుకోవడ మూ కద్దు . రోజు రెండు కిలోమేటరులు నడిచి చావోచ్చుగా ? .                                                                                                                                                               ఇటీవలి మెల్బోర్న్ క్రికెట్ 2014 సవత్సరం లో ఓ  చీకటి దృశ్యాన్ని మిగిల్చింది . ఫిలిప్స్ హూస్ ... బౌన్సర్ దుర్మరణం అందరినీ కలచి వేసింది . ఈ విషయాన్నీ ఉటంకిస్తూ ''ఈ దుర్మరణం .. వర్ధమాన క్రికెటర్లల ఫై ఉంటుంది, నా కుమారుడు ఆస్టిన్ ఫై కూడా ఉంటుంది '' అని '' స్టీవ్ వా '' చెప్పాడు . ఇంతవరకు మా ఆస్టిన్ ఏడుస్తూనే ఉన్నాడు,అన్నాడు . మేము ఆడే స్థితి  లో లేము అన్న వర్నేర్ సమాధానానికి,తగనట్లుగా..... ఆడడమే నిజమయిన నివాళి ... విచారం లో ఉన్న క్రికెటర్లు .. అభిమానులూ తమ మైండ్ సెట్ లో నుండి కొద్దిగయినా మరలా ఆటవలన వీలు అవుతుందని మాజీ కెప్టెన్ ఇవాన్ చాపెల్ అన్నాడు .... ''ఫిల్ వాడిన హెల్మెట్ మా పాత మోడల్,క్రొత్త మోడల్ వాడి ఉంటె బహుశా ఇంత ఘోరం అయ్యి ఉండక పోవచ్చు '' అన్నరు .. తను వాడిన హెల్మెట్ల సంస్థ . ఏది ఎ మయినా ఒక నిడు ఘనమయిన ప్రాణం ''హరీ '' మంది . సుదీర్గమయిన భవిష్యత్ ఉన్న ఒక క్రికెట్ ధ్రువతార నింగి కెగసి అంతర్ధాన మయ్యింద న్నది వాస్తవం . బౌన్సర్ ఎలా ఉన్నా ''హెల్మెట్ '' పటిష్టత సూన్యం అన్నది నిర్వివాదాంశం . ఇది ఇలా ఉంటె ! బౌన్సర్ కు ''భారతరత్న '' అవడానికి అతి దగ్గర సంభందమే ఉందనిపిస్తుంది . ఎక్కు వ ఎత్తు కూడా కొన్నిసార్లు ప్రాణం మీదకు వస్తున్నవిషయం .... మేల్బౌర్న్ లో నిరూపించ బడింది .                                                                                              మద్దూరి . రవిబాబు



Monday, 10 November 2014






                                 '' మంత్రులే కంచె మేస్తే ...!!..??..''                            

                                                                పరిస్థితి తీవ్రం గా ఉంటుంది మరి . ఈ మధ్యలో   రాజకీయ నాయకుల్లో  విచిత్ర వేషాలు .. కుహనా రాజకీయులు .. సంసృతి అర్ధ గ్యానులూ .... రక ,రకా లయిన వారు మ 0త్రులుగానూ చేరుతున్నారు .వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ హైందవ సంస్కారం లో పెను మార్పులకు శ్రీకారమా ? అన్న భావన కలగక మానదు . ముఖ్యం గా సంస్కార సాంప్రదాయవాదులు ముక్కు మీద వేలేసుకోనక తప్పదంటున్నారు .                                                                                                మొన్న ఆ మధ్యలో  కేరళ రాష్ట్రం లో ఒక గాయకుడు ''జీన్ '' ప్యాంటు ఎ సంసృతి ?అన్న ప్రశ్నకు ..... దాదాపు అభ్యుదయవాదు ల్లా ఆడవారు విరుచుకుపడడం మనం చూసాం . ఆ గాయకుడు మరో మతానికి సంబంధించి నప్పటికీ హైందవ గురువును మెప్పించి సo గీత విద్య ను అభ్యసించిన ''తాత్వికుడు '' . కనీసం అతని విద్యకు ... అనుభవానికి ... వయస్సుకూ కొద్దిపాటి గౌరవం కూడా ఇవ్వక .. నా నావిధాల కామెంట్ చేసారు ఈ లోకం లో . మన హైందవ సంస్కృతి ... కట్టుబాట్లు .... ఎటు పోయాయి ? . కర్పోరిటిజo ... అంటే మన సహజ నాగరికత ను నిందించడమే నా ? ఇప్పటి పుంతలు తొక్కుతున్న నూతన విద్యావిధానం ... చీ రా     కుర్తా ... ఫై జామా ...  కుర్తి .... జాకెట్ ..... పమిటా వంటి వాటి నుంచి జీన్ ప్యాంటు ... టి-షర్టు    మధ్య తేడా ! ఒక అమెరికా ....ఒక  భారత నారి మధ్య లో ఉన్నంత తేడా ఉంది . అమెరికన్ ఫాషన్ డ్రెస్ లో స్త్రీ అంగాలు ప్రస్పుటం గా బజార్లలో వినో దాన్ని ... విపరీతార్ధాల్ని పంచుతాయి . కాని భారతీయ నాగరికత లో దుస్తులు స్త్రీ శరీరాన్ని సౌష్టవాన్ని మరుగుపరచి,  ధరించినవారికి నిండుదనాన్ని ... గౌరవాన్ని, తెస్తాయి అన్న విషయం లో, ఎటువంటి సందేహం లేదు .   కార్పోరెట్లో  నూ సాంప్రదాయ బద్ధం గా కట్టూ బొట్టూ ధరించేవారు లేరా ? .                                                                          మహాత్మా అన్నట్లు ''అర్ధరాత్రి '' స్వతంత్రం వచినప్పుడే స్త్రీ  జీ వితానికి ముక్తి ... విముక్తి . అప్పుడు ఈ భూమి ఫై ఎటువంటి ''నిర్భయ '' చట్టాలు అవసరం లేదు . పాశ్చాత్య దేశాల్లో తుపాకులు ''గుట్కా '' పొట్లం లా  జేబులో వుంటుంది . కావలిసిన అమ్మాయితో ఇష్టం వచినట్లు కలియ తిరిగే నాగరికత వాళ్ళది .ఈ డేటింగ్  సంస్కృతి  ఎక్కడిది ? భారత దేశం లో స్త్రీ కి జాగ్రత్త ఎంత అవసరమో ... పురుషుడికీ అంటే అవసరం . కానీ చట్టాల్లో పెనుమార్పులు అవసరం . అలానే ఎవ్వరి కి చట్టాలు చుట్టాలు కాకూడదు . మొన్న ఒక కాబినెట్ హోదా గల మంత్రిగారు ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటనప్పుడు ''జీన్ వేస్తె ? తప్పేంటి ..!! రేపులు చేయబడ్డ వారెవరూ, జీన్స్ వేసినవారు కాదు '' అన్నట్లు   ...  దాదాపు అన్ని వార్తా పత్రికల్లో మనం చూసాం . అదే మీటింగులో ఉన్న మరెవరూ .. ఆ స్టేట్మెంట్ కు, అభ్యంతరం చెప్పలేదు సరికదా ... గొప్పగా తప్పట్లు కొట్టారు .... అంటే జీన్స్ వేసుకున్నా, రేపు లు కావు ... లేక    అందరూ జీన్స్ వేస్కోండి ! అన్నది మంత్రి గారి భాష్యమా ?... బహుశా ! ఆ మంత్రి గతం లో విదేశాల్లో చదువుకున్న తాలూకు పండిత్యమా,   లేక లేక మంత్రి పదవి చందామ ? జనం అర్ధం చేస్కో క ముక్కుమీద వేలేసుకున్నారు.సదరు  మంత్రి  గారు దూకుడు మీద ఉన్నట్లున్నారు . మరి మంత్రులు, నాల్గు మంచి మాటలు చెప్పాల్సింది పోయి .... జనా న్న్ని రెచ్చగొ డుతూ ... తాము చాలా ఉన్నత భావాలు గల వారి లా ఫోజులు పెట్టడం కాదా ? . లేక యువతలో మయిలేజీ  కోసామా . ...??  .. సదరు మంత్రి తమ కాబినెట్ లో ఉన్న సుష్మా స్వరాజ్ గారి ని చూడలేదా ?? .. సుష్మా స్వరాజ్  ను చూస్తే ఫక్తు ''హైందవ '' నారి కళ ఉట్టిపడుతూ ... రవివర్మ చిత్రం లా ఉంటారు . సదరు మినిస్టర్ గారు, ''హిందూత్వ '' అని కేకలు పెట్టే ''భారతీయ జనతా పార్టీ'' లో ఉన్నారన్న సంగతి .. ఇటువంటి స్టేట్మెంట్స్ బహిరంగ సభల్లో ఇస్తే ... పార్టీ కి నష్టం అని మరిచిపోయినట్లున్నారు . ఇటీవల ఒక నట సామ్రాట్ మనువడి క్రొత్త సినిమా  ప్రమోషన్ స్టేజి ఫంక్షన్  లో ఒక యాంకర్....  వేసు కొచ్చిన దుస్తులు చూస్తే.... మనకి అర్ధమవుతుంది సినిమాలు ... స్టేజి పెర్ఫార్మెన్స్లు ఎంత విచ్చల విడి తనాన్ని యువతకు నూరిపోస్తున్నాయో ...!!...??  ఏకంగా అక్కడి ప్రేక్షకులు ... అదీనూ ఆడవాళ్ళు ఎంత ఆనదోత్సాహాలు పొందుతున్నారో !!!! .....                                                  అందుకే,ఈ భావాలున్న మంత్రులూ ! మీ పైత్యం మీవరకూ, ఫారన్ పోవాలనుకుంటున్న మీ పిల్లలవరకే పరిమితం చేస్కొండి     అని ప్రజల మనవి     ..........................                                 '' విదేశాల్లో  చదివిన సరోజినీ దేవినాయుడు ... శ్రీమతి ఇందిరా గాంధి ... నేటి బృందా కారత్ .... వంటి వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్ ..... ఇచ్చివుంటే .?   ఈ దేశం ఇప్పటికి .. సర్వనాశ నం ... అయ్యివుండేది .... సోనియా ! ప్రియాంక వాద్రా  లను మీరు చూడలేదా ..వారి కట్టు ఇప్పటికీ  ఆదర్సమే ...!!!  ""                                                                   రవిబాబు . మద్దూరి ......

Tuesday, 4 November 2014

                                  రైతు రక్తకన్నీరు                                                                                                                     అందరికీ కన్నీరు తుడిచే రైతు రక్తకన్నీరు పర్యన్తమయ్యే పరిశ్థితి ... అన్నపూర్ణ రాష్ట్రం లో దాపురించేట్లు గా ఇటు చానెల్స్ అటు ... ప్రింటిజ0  ... ఏకరువు పెడుతున్నాయన్నది యదార్ధం . ఆంధ్రరాష్ట్రం లో ఉన్నవారందరికీ తెలుసు , గతం లో తెలుగుదేశం స్వగతం లో నేరుగా, ''వ్యవసాయం '' తో వోరిగేది ఏంటి ? అన్న స్టేటు మెంటు . అది ఎవరన్నారన్నదీ, తెలుగు ప్రజలకు తెలుసు . ఆమాటను తూచా తప్పక, ఇప్పటి అదే ప్రభుత్వం అక్షరాలా ఆచరణలో పెట్టబోతున్నారా ? అన్నది అక్షర సత్యం . కొ0తమంది కుహనాలు కూర్చొని,ఢిల్లీ నుండి కొంతమంది కొజ్జా మంత్రులు,కొంతమంది కొజ్జా ఎంపీల సలహామేర రాత్రికి రాత్రి చేసిన' వి' భజన,లో అప్పటి కాంగ్రెస్ ''100000 కోట్లు '' ప్యాకాజే నేరుగా ఇస్తామని బల్లగుద్ది చెప్పింది .వారికి ఎందుకు వోట్ వెయ్యలేదు వీళ్ళకు ఎందుకు వేసారు ? ... అటువంటిది ఇప్పటి గవర్నమెంట్ వారు లక్షల ఎకరాలు అసలు సమీకరించడం అందరికీ అంతుచిక్కని విషయం . మాఫీ చేస్తామన్న రుణాలు,ద్వాక్రాల రుణాలు ఇప్పటికీ ప్రస్నార్ధమే . రాయలసీమ ఒక రాళ్ళసీమ . రాష్ట్ర రాజధాని ఎటూ పనికిరారాదని , రాయలసీమ లో చేపట్టలేదు . పంటపొలాలను ఆక్రమించి, కొస్తాలో అసలు కోతలన్నవి లేకుండా ఉండేందుకు వెరసి నారాయణ .. సుజాన చౌదరి కంకణం కట్టుకు న్నట్లు గా ఉన్నదని ఇటు రైతులు .. సామాన్య ప్రజలూ తల్లడిల్లు  తున్నారు . దిక్కుతోచని,దిక్కులేని పక్షుల్లా అలమటిస్తూ సహాయానికి , సలహాకు నోచుకోక దుర్భర పరిస్తుల్లో , తుళ్ళూరు యెర్రబాలెం .. ఇంకొన్ని గ్రామాల ప్రజలు తింటున్న తిండి మాని రేయీ -పగలు భిన్నమయిన చర్చలతో సతమతమవుతున్నారు . నారాయణ , సుజానా చౌదరి లో ఎవ్వరూ రైతులు కారు .వ్యవసాయమ్ అంతకంటే చేయరు . ఇటువంటి వాళ్ళు కార్పో తెలివితేటలూ చూవించడం హాస్యాస్పదనీయం . నారాయణ విద్యాసమస్తల్లో ఫీజు అనే ప్రక్రియ యెంత ఘోరం గా ఉంటు0దో అందరికీ తెలిసిన విషయమే . అసలు విషయానికి వస్తే .. కోస్తాలో ఎక్కడ త్రవ్వినా 6 అడుగుల లో నీళ్ళు పడుతాయి,సారవంత మయిన భూమి కూడాను . ఇటువంటి భూముల్ని ''కాంక్రీట్ అడవులు '' గా మార్చే ప్రయత్నం తప్పక జరుగుతుందనే ! చెప్పాలి . ఇందుకు కొన్ని దుస్టామ్ తాల్ని చెప్పు కోవాలి 1)గతం లో తమిళనాడు రాజధాని కోసం ''మద్రాస్ '' ను ఎంచ్కున్నప్పటి ప్రజా భూముల తాలూకు బకాయిలు ఇప్పటికీ ''ఉష్ కాకి ''... 2)బెజావాడ నుండి మూడు రింగు రోడ్లు చాలు 10 రోడ్లు కావాలా ?ఇప్పటి కనదుర్గ వారధి లా మరో రెండుంటే చాలు .. పారిస్ లా అవసరం లేదు .... అసలు పారిస్ ల చేస్తామనే డబ్బా మోట తప్పించి,ఎవరూ కోరుకోడం లేదు . 3)రెండు పంటలూ .. మూడు పంటలు పండే సారవంతం అయిన భూమి ఉంది ... వీల్లిచ్చే ఎకరాకు 25000 ప్రతీ సంవత్సరం .. పశువు పచ్చి మేత రాదు ... మరి ఒకటి రెండు ఎకరాలున్న బక్క రైతు ఇంట్లో పొట్టలు ఎలా గడవాలి ?... కార్పోరిటిజం లో దోచుకున్న తేలిక రైతు బ్రతువు తెరువు ఎప్పటికీ కాదు . నిన్నటిదాకా పిల్లల దగ్గర,జలగల్లా ఫీజులు గుంజిన వాళ్ళను కమిటీ ... అధ్యయనం ... అని విదేశాలకు ఇతర రాష్ట్రాలకూ పంపి తే,ఫ లితాలు,ఇలానే ఏడుస్తాయి . 4)మరో పని చంద్రబాబు చేయవచ్చు గుంటూర్ పరిసర గ్రామాల్లో మొట్ట మొదట ఎంపీల , రియల్టర్ల,పెద్ద కామందుల,భూములను గుర్తించి,వాటిని ఈ ''పోలింగ్ '' లో నమోదు చెయ్యాలి . 5)ప్రస్తుత ఆలోచనా విధానాన్ని అమలు చేస్తే .. గీస్తే ... ఆంధ్ర ప్రదేశ్ లో ధాన్యం లేక ఆహార సమస్య భవిష్యత్తు లో రావచ్చు . ఛత్తీస్ ఘడ్ లో కొద్ది భూమి తోనే రాజధాని ఎర్పరుచుకోన్నార్ అనే విషయం మరవకూడదు . 6)కాలే కడుపుకు పట్టెడన్నం కావాలి,ఇన్ని విమానాశ్రయాలకు ఎవరికోసం ?7) దారిద్రరేఖ కు ఎగువన వున్న వారికి దిగువనవున్న వారిని చేర్చాలి ... ఎగువన ఉన్న వాడి ని దిగువకు చేర్చడం కాదు అధ్యనాలలో పొన్దుపరచవలసినది . 8)అటు కే సి ఆర్ ఫై సవాలుకు ప్రతిసవాలు చేస్తూ ఇక్కడి ప్రజల సమకాలిన ద్రుష్టి ని అగౌరవ పరుస్తూ వాళ్ళను దరిద్రులుగా తీర్చి దిద్ది ... ఉన్నవాడి కి మరింత చేర్చి ''అన్నమో రామచంద్ర '' అనే చందానికి గురిచేయడ మే ఈ సంస్కరణల .. ఉద్దేశ్యమా అని అన్ని వర్గాల ప్రజలు ప్రిస్నిస్తున్నారు . ఇందుకేనా? డిపాజిట్ పోయే స్థితి నుండి డిపాజిట్ లు పోగొట్టేట్లు తెలుగుదేశానికి ''వోట్లు '' వేసింద నే ప్రశ్న ? ఎప్పుడో ఉద్భన్న మయింది అందరిలో . 9) రైతులు ల పట్ల చంద్రబాబు చెయ్యకూడని నేరాన్ని మరోసారి ''మళ్ళి -మళ్ళి '' చంద్రబాబు చేయబోతున్నా  రనేది నిర్వివాదాంశం !!!!  10) అసలు రియాల్టర్ అనే వాడికి ప్రభుత్వం తరుఫున చిన్నకారు ,సన్నకారు ఎందుకు ? భూములివ్వాలి ..!! దయా భిక్షగా, వారి ఫై ఆధార పడి , వాళ్ళిచ్చే ముష్టి రైతులకు ఏపాటిది ??...!! 11)చంద్ర బాబు ను 10 సవత్సరాలు పదవీచ్యుతుని చేసిన విషయం తొందర గా మరిచిపోయారు వారి అనుయాయులు .   అందుచేత చంద్రబాబు .... వారి అనుయాయులూ మరోసారి చేతులు కా ల్చుకొ నక, ఆనక పట్టుకోడానికి ఆంధ్ర లో చివరికి కార్పొరేట్  గద్దల, వల్ల ఆకులు కూడా ఉండవు . ఎందుకంటె రైతులు కార్చిన స్థానం లో కన్నీళ్లు లేవు ....'' రక్తమే'' ఉంది గనుక....  !!!                                                               రవిబాబు . మద్దూరి