


'' కబళించే శిరస్త్రాణం '' బాగా గురుతున్న ఓ ఆటలో జరుగిన ఓ సంఘటన గురించి చెబుతాను ... అది నేను మూడవ తరగతి చదువుతున్న రోజులు . మా స్కూల్ మెయిన్ రోడ్ కు అతికించి నట్లు ఉండేది . ఒకటి నుండి ఐదు వరకు తరగతులు .మా ఊళ్ళో గవర్నమెంట్ డాక్టర్ గారి రెండవ కొడుకు నాకు మంచి నేస్తం . ఆ వయస్సు లోనే తను (చిన్న)చాలా చాలా మంచి మాటలు చెప్పేవాడు . కవలలు తన అక్కయ్యలు ... వాళ్ళు మా అక్కగారి క్లాసు మేట్స్ . ఆరోజు పిల్లలు అందరం తరగతి మేరా ఆడు కొంటున్నాం . దాదాపు ఒక్క అరగంట అయ్యిందనుకుంటాను . టీచర్స్ అందరూ ఒక్కసారి బిజీ బిజీ అయ్యారు . గుమి గూడారు . పరుగులు ఉరుకులూ గా ఉంది శీను . మా క్లాసు మేట్స్ మేము మా ఆట లో మునిగిఉన్నమ్ . కడవలతో నీళ్ళు బెంచ్ ను కడుగుతున్నారు . పరికించి దగ్గరకు పోదు నుకదా ! ..... ఒక్కొక్కళ్ళు గా అందరూ వెళ్ళిపోతున్నారు . అ బెంచ్ మీద ఒకటవ తరగతి పిల్లాడిని పడుకోబెట్టి ఉన్నది . బేచ్ మీద రక్తం కడుగుతున్న టీచర్లు . తెలిసింది ఏమిటంటే ? ఆ పిల్లాడు ఆడుతూ తలకు బలమైన గాయం తగిలి చనిపోయాడు . ఆ నాటి సన్నివేశం, ఇప్పటికి నా మనసులో మెదులుతూ ఉంటుంది . కళ్ళముందు కదలాడుతూ ఉంటున్నది . కాని ఇప్పటివరకు ఏ ఆట కూ వేరవలేదు . ఆడుతూ ఉంటాను . కొన్నిసార్లు ఆటల్లో తగిలిందన్న తీవ్ర మయిన గాయాల్ని ఎవరి నుడయినా చూస్తె భయం వేస్తుంది . ముఖ్యం గా టెస్ట్ మ్యచ్ , వన్ డే ఇంటర్నేషనల్ చూస్తె స్లిప్పుల్లో బంతికి ముఖం పెట్టి నించు నుండే వార్ని చూస్తె భయం వేస్తుంది తప్పక . అలానే ఊర పొట్ట -ఊసకాళ్ళు వేసుకుని,రెబోక్ షూస్ వేసుకుని పోష్ గా షట్ల్ రాకెట్ తో చొంగలు కక్కుతూ కొద్దిసేపు ఆడి, జూస్ తాగే అంకుల్స్ , అంకుల్ లాంటి అబ్బాయిలను చూస్తె రోజంతా నవ్వు వస్తుంది . యందుకంటే ? వీళ్ళు ఆడె వ్యాయామ0 తక్కువ, ఆట పేరతినేది ఎక్కువ . పైగా నడుమో .. మొకాలో ... భుజమో .... మోచేయ్యో ..... పట్టేసి .. రబ్బరు కాప్స్ వెసుకు ని , షటిల్ లో , టెన్నిస్ లో తగిలిందని చేప్పుకోవడ మూ కద్దు . రోజు రెండు కిలోమేటరులు నడిచి చావోచ్చుగా ? . ఇటీవలి మెల్బోర్న్ క్రికెట్ 2014 సవత్సరం లో ఓ చీకటి దృశ్యాన్ని మిగిల్చింది . ఫిలిప్స్ హూస్ ... బౌన్సర్ దుర్మరణం అందరినీ కలచి వేసింది . ఈ విషయాన్నీ ఉటంకిస్తూ ''ఈ దుర్మరణం .. వర్ధమాన క్రికెటర్లల ఫై ఉంటుంది, నా కుమారుడు ఆస్టిన్ ఫై కూడా ఉంటుంది '' అని '' స్టీవ్ వా '' చెప్పాడు . ఇంతవరకు మా ఆస్టిన్ ఏడుస్తూనే ఉన్నాడు,అన్నాడు . మేము ఆడే స్థితి లో లేము అన్న వర్నేర్ సమాధానానికి,తగనట్లుగా..... ఆడడమే నిజమయిన నివాళి ... విచారం లో ఉన్న క్రికెటర్లు .. అభిమానులూ తమ మైండ్ సెట్ లో నుండి కొద్దిగయినా మరలా ఆటవలన వీలు అవుతుందని మాజీ కెప్టెన్ ఇవాన్ చాపెల్ అన్నాడు .... ''ఫిల్ వాడిన హెల్మెట్ మా పాత మోడల్,క్రొత్త మోడల్ వాడి ఉంటె బహుశా ఇంత ఘోరం అయ్యి ఉండక పోవచ్చు '' అన్నరు .. తను వాడిన హెల్మెట్ల సంస్థ . ఏది ఎ మయినా ఒక నిడు ఘనమయిన ప్రాణం ''హరీ '' మంది . సుదీర్గమయిన భవిష్యత్ ఉన్న ఒక క్రికెట్ ధ్రువతార నింగి కెగసి అంతర్ధాన మయ్యింద న్నది వాస్తవం . బౌన్సర్ ఎలా ఉన్నా ''హెల్మెట్ '' పటిష్టత సూన్యం అన్నది నిర్వివాదాంశం . ఇది ఇలా ఉంటె ! బౌన్సర్ కు ''భారతరత్న '' అవడానికి అతి దగ్గర సంభందమే ఉందనిపిస్తుంది . ఎక్కు వ ఎత్తు కూడా కొన్నిసార్లు ప్రాణం మీదకు వస్తున్నవిషయం .... మేల్బౌర్న్ లో నిరూపించ బడింది . మద్దూరి . రవిబాబు


No comments:
Post a Comment