'' డామేజిటయిజేషన్ అనబడే డిజిటలైజే షన్ " అనగనగా ఒక ఊరిలో ఒక కుక్క ...ఒక గాడిద చాకలివాని ఉండేవి ....ఒకరాత్రి సదరు రజకశ్రీ పై అలిగిన కుక్కగారు ఒకరాత్రి దొంగలుపడితే ... మొరగలేదు ... పాపం అరిచిన గాడిదగారు ఏమయ్యారో , లేక రజకశ్రీ ఏమి చేసారో మీకందరికీ తెలిసిన కధే . గుజరాత్లో విద్య మీద అంత గౌరవం ఉండదు, వ్యాపారం మీద ఉన్నంత .... గుజరాత్ వ్యాపారానికి పెట్టింది పేరు . ... అరకొరగా చదూకున్న వ్యాపార శిఖా మణులే ఎక్కువ . కానీ వారి నాగరికత ఎప్పటికీ సంకరం కానటువంటిది . ... అటువంటి గుజరాత్ మేధావుల ఆశా దీపం '' నరేంద్ర మోడీ ''. అతను ఆ రాష్ట్ర ముఖ్య మంత్రిగా, ఎన్నో సంస్కరణలు చేసారు ... గుజరాత్ ను పాలించిన ముఖ్యమంత్రుల్లో ''మోడి'' ని ... మించిన ద్రష్ట మరోరు లేరని చెప్పుకోవచ్చు . అతనికి దక్కిన అరుదయిన అవకాశం ప్రధాన మంత్రి గా ,అవకాశం . గుజరాత్ లో లా , ఎదో ఒకటి అనూహ్యం గా చేసి .. భారత్ దేశం చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాల్లో లిఖించ బడాలన్న కోరిక అతనికి తీరని కోరిక గా చెప్పుకొచ్చు . 2014 లో అనూహ్యమైన రీతిలో ప్రధాని కావడం తాను ఊహించిందే ... అప్పటివరకూ వయోభారాన్ని అధిగమిస్తూ ,ఎన్నో ఆశల పల్లకిలో తేలుతున్న ''అద్వానీ'' కి మిగిలింది ఓ వెక్కిరింపే . మోడీ కి వస్తున్న పేరు ప్రఖ్యాతులు ,తను ప్రధానిగ జీవిత చరమాంకంలో కూడా కాలేనని తెలుసుకుని, కనీసం తదుపరి, ఈ దేశానికీ రాష్ట్రపతి గా నయినా కాలేనా అని నిర్ణయించుకుని సరిపెట్టుకున్నారు అద్వానీ . ఇహ పొతే ... మొదట విదేశీ పర్యటన, స్వచ్ఛభారత్ లు ఘనంగా ముగించుకుని ... తాను అన్ని చేసినట్లు తనకు తానే సాటి అన్న చందాన ''ఓవర్ కాంఫిడెన్స్ ''మితిమీరిన స్థాయికి చేరుకున్నారు మోడీ . స్విస్ బ్యాంకు లావాదేవీలు బయల్పరచలేని తన అచేతన స్థితి నుండి ....... ఆ సమయంలో దేశాన్ని దృష్టిమళ్లించే ప్రయత్నమే "నోట్ల రద్దు ''. పూర్వం రిలయన్స్ లో పనిచేసిన వాడిని డైరెక్టుగా రిజర్వు బ్యాంకు గవర్నర్ గా చేయడం జరిగింది . అతన్ని గవెర్నర్ గా చేశారేగాని, అతను చేయవలిసిన ,ఇవ్వవలసిన సందేశాత్మక కార్యక్రమాలన్నీ మోడీ డిఫాక్టో గా చేస్తున్నట్లు మనకందరికీ ఎప్పుడో అర్ధమైనది . చట్ట బద్ధత ఎంతవరకు అన్నది మోడీ కె తెలియాలి ,ఇటువంటి విధానాన్ని ప్రశ్నించవలసిన న్యాయ వ్యవస్థ .. చూసి చూడనట్లు ఉండడం , అనే చర్యకు న్యాయ పరమైన లొసుగులు ప్రజలకు క్షుణ్ణంగా వివరించేవారెవరూ ముందుకు రాలేకపోడం మనం చేసుకున్న పాపం అయివుండొచ్చు బహుశా ... !! అందుచేత ప్రజలు, భయంతో దిక్కుతోచని స్థితిలో నిర్భాగ్యులుగా ఉంటూ తమ కష్టార్జితం తమ డైనందిని అవసరాలకు ధనం , కాలం , చాలక అగమ్యగోచనంగా బాధలకు ,మనసుతపానికి గురి కావలసి వస్తున్నది, అన్నది సత్యదూరం కానేరదు . పొంతనలేని నిబంధనలు , సామాన్యులే కాదు విద్యాధికులకు అంతుచిక్కని నోట్ల మార్పిడి నిబంధనలు . రేపు కొత్తరూలు ఏమొస్తుందో ? అన్న భయం 2016 లో ఈ దేశం లో ని మారుమూల ప్రాంతాల్లో ని సామాన్యుని కూడా వదలిపెట్టని వేధింపు గ మారిపోయింది . పైగా ఆన్లైన్ లావాదేవీలు . అందులోని మర్మాలను సామాన్యునికి వివరించే ప్రక్రియ లేకపోడం ముదావహం , ఒక స్క్రాచ్ కార్డు మొఖంమీద పడేసి మిన్నుకుండే బ్యాంకు అధికారులపై జరగని చర్యలు , పాపం ATM ... బ్యాంకు లైనులో క్రమశిక్షణగా నిలుచున్న ప్రజలపై లాఠీ ఝుళిపించడం పరిపాటి అయ్యింది . ''నో కాష్ '' బోర్డు పెట్టడానికి కారణం బడా చోరులతో చేతులు కలుపుతున్న బ్యాంకింగ్ వ్యవస్థ కాదా ? అన్నది ప్రతీ సామాన్యుని ప్రశ్న . ఇక్కడ ప్రజలు ఇచ్చిన సహకారం , మోడీ పై చూవించిన సానుభూతి అనన్యం . కానీ 50 రోజుల గడువుకోరిన మోడీ ఒక్కసారిగా విరుచుకుపడి , చివరాఖరికి ... అభివృద్ధి గుడ్డెద్దు చేల్లో పడిన చందం అటుంచి, యావత్ బీజేపీ కేడర్లు మోడీతో సహా ''డామేజీ కంట్రోల్ '' ఎలాచేయాలో అన్న ఆలోచనలో పడిపోయారు . ఇక్కడ తమాషా ఏమిటంటే .. తందాన ,తానా అనే మిత్ర పక్షాలూ, ఆన్లైను బ్యాంకింగ్ ,నగదురహిత గ్రామాలు మావంటే మావి అని చంక కొట్టుకునే జోకర్ రాష్ట్రాలు ఒక్కసారిగా వెరసి డిజిటలైసెషన్ అన్న కొత్త పాటను అందుకున్నారు . డిజిటలైజేషన్, కు సంబందించిన ప్రక్రియ చాలా వేగవంతమైనదని, నగదు రహిత లావాదేవీలకు రాయతీలు ప్రకటించడం జరుగుతున్నది . నోట్ల రద్దు అనే ప్రక్రియ భారత దెశ ఆర్ధిక వ్యవస్థపై శరాఘాతం లా తయారయిందనే విషయం మోడీ అర్ధం చేసుకోడానికి 50 రోజులు పట్టిందన్నమాట ... 31. 2. 2016 ... మోడీ దెశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం , గర్భిణీ స్త్రీలకు 6000 రూపాయలు వారి ఖాతాల్లో జమచేస్తామ్ అనే భాషణలు , కేవలం వార్షిక బడ్జెట్ ప్రసంగంలా రూపాంతరం దాల్చింది . అతను గవెర్నర్లా విధించిన బ్యాంకు లావాదేవీల్లో కొద్దిమార్పు సంబంధించి, జనాలకు ఒరిగిందేమీలేదు . ఆన్లైన్ లావాదేవీలు విస్తృతం కావాలంటే యావత్ భారతదేశం లో చిన్న మారుమూరు పల్లెల్లో కూడా ''ఇంటర్నెట్ '', విస్తృతంగా ఏర్పాట్లు కావాలన్న చిన్న విషయం మోడీ కి తెలియకపోవడం అతని తప్పు కాకపోవచ్చు , కానీ ఎదో వెలగ బెడతాడని మనం ఓట్లేశాం అది మనం చేసిన పెద్ద తప్పు . ఎదసంలో 80 వయసులోనూ రాజకీయాల్లో స్టేటస్ కోరే మేధావులు ... గద్దెలను విడవని మేధావులూ.... కేవలం తప్పదన్నట్లు ఆగస్టు , జనవరిలో జండావందనం చేసే ఆఫీసర్లు ... కేవలం సంతకాలు చేయడానికి ... దేవాలయాల్లో ఉచిత ప్రోటోకాల్ దర్శనాలు దొబ్బే గొవెర్నొర్స్ కు ఇచ్చిన ఎక్సటెన్షన్, బ్యాంకింగ్ దిగ్గజం ''రాజన్ '', కు ఇచ్చి ఉంటె , దేశానికీ ఈ దుర్గతి పట్టేది కాదేమో దయచేసి ఆలోచించండి .... చివరికి మోడీ పుణ్యమా అని డెమొనీటిజషన్ కాస్తా పిచ్చివాని చేతిలో రాయిలా ''డామేజ్ టైజేషన్ లా పరివర్తన చెందిన డిజిటలైజేషాన్ లా తగలడింది ..... ఇందుకు జవాబుగా భారతీయ జనతా పార్టీ రాబోయేకాలంలో భారీ మూల్యం మోడీజీ వలన చెల్లించుకోబోతున్నారు . మొదట్లో ఆకాశానికి ఎత్తుకున్న కొన్ని విదేశి పత్రికలు, ఇప్పుడు పుంఖాలు పుంఖాలుగా నెగటివ్గా వ్రాయడం, చదివినవారు ఎవరైనా అర్ధం చేసుకోచ్చు . అస్తవ్యస్థమైన ప్రసంగాలు ... అర్ధంపర్ధంలేని ఛలోక్తులు .... ప్రశ్నించినవారిని తీవ్రం గా శిక్షిస్తున్న విధానం ... లేనివి ఉన్నట్లు చెప్పడం .. మోడీ తప్పించి అతని ఒంటెద్దు పోకడ తప్పించి భారత రాజకీయ చిత్ర పటంలో అన్నీ పిచ్చిగీతల్లా ఉన్నాయి అంబానీ ,అదానీ ,టాటా , సహారా , విజయ్ మాల్యా ఎపిసోడులు అటుంచి . తమ కుటిల నీతి ని ఒప్పుకొనే దేర్యం లేక ... విమర్శిస్తున్న ... విపక్షాలను తూర్పారబట్టడం లాంటి విధానాలను ఈ దేశ ప్రజలు ఎప్పటికీ తమ అంతరంగాలలో గురుతుంచుకుని మోడీ భవితవ్యం నిర్ణయించడం ఖాయం ..... ఈ మధ్యలో జరిగిన ఎన్నికల్లో ఒకటో మూడో రాష్ట్రాల్లో ఆపసోపాలు పడి గెలిచిన బీజేపీ ... ఒక్క రాష్ట్రము తప్పించి మిగతా వాటిలో ప్రభుత్వము ఏర్పాటు చేసేంతవరకూ నమ్మకం లేని పరిస్థితి .. కబుర్లు చెప్పే వెంకయ్య నాయుడు గారు తన శాయశక్తులా డోలు కొట్టడం ఇక్కడి కొసమెరుపు .. ఒక పరిస్థితిలో మోడీ అంత నాయకుడు ఇప్పట్లో లేడు అన్నంత చందాన డబ్బాకొట్టుకున్నారు .కానీ 2019 దాకా బీజేపీ ఉంటుందా అనే నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతోంది ... లేక భయం తో కూడిన ముందుచూపుతో ..ఎన్నికలు ఐదు సంవత్సరాల టెర్ము కాకుండానే ఎన్నికలకూ వేళ్ళ వచ్చు ... ఒక పరిస్థితిలో .. పెద్ద నాయకుల హటన్ మరణాలు సంభవించే పరిస్థితీ లేకపోలేదు బీజేపీ ... రాష్ట్ర జాతక ...గ్రహ రీత్యా ... కానీ 29 మర్చి నుండీ ఒక ప్రక్క చంద్రబాబు ...ఇంకోప్రక్క కెసిఆర్ ...అటుప్రక్క మోడీలకు ఈ తెలుగు నూతన సంవత్సరం నుండీ గ్రహ రీత్యా చుక్కెదురు కావచ్చు కూడాను .. ఏది ఏ మయినా మోడీ గురించి మ్రోగుతున్న డబ్బా ..ఛానళ్లలో చూపుతున్న హైప్ ...తప్పించి యదార్ధం గ అతను సామాన్యునికి చేసింది పెద్ద సున్నా .. లేక సూన్యం సుమా ..!!...
totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l
- ravi babu.Madduri
- Totally a ground person with equality........
Saturday, 31 December 2016
Saturday, 17 December 2016
@ఎరగనోడు ...కరెంటు స్థంభం@
" ఎరగనోడు .... ఎలక్ట్రిక్ స్థంభం ఎక్కితే ..... ??.....! " ఈ దేశాన్ని దరిద్రం క్రింద పట్టి దశాబ్దాలు బాధించిన కాంగీ పీడా విరగడ అయింది అన్న ఆనందం అనుభవించక ముందే ... , మాటల మాంత్రికుడు , మతాల తాంత్రికుడు , ప్రస్తుత ప్రధాని తనదయిన, మ శైలి లో ఈ దేశాన్ని పీడిస్తూ,రాజకీయ జాతి ఇంతేనేమో అనిపిస్తున్నారు . మొదట చెప్పాలంటే ఈ దేశంలో మొట్టమొదట ముసలి వారు ... చదువు తగినంతగా లేని మేధావులు దేశ రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండి తీరాల్సిందే . మోడీ వచ్చినప్పటి నుండి దేశం లో అభివృద్ధి భాగ్యవంతులకు మాత్రమే కనిపిస్తున్నట్లు ఉంది .... అట్టడుగు వర్గాలకూ ,విద్యా వంతులకు,కాయకష్టం చేసేవారికి ఒరిగింది ఏమీలేదు .పైగా తన కోటరీ నుండి దేశం మీద రుద్దబడిన "గుజరాత్ " తెలివి తేటలు మాత్రం అతన్ని అన్ని మాధ్యమాల్లో శిఖరాగ్రాన్ని చేర్చాయన్న విషియం అందరూ ఆమోదించక తప్పదు . అతను తన గుజరాతీ వ్యాపార మార్కుసంప్రదాయం లేక స్టాంపును గుద్దాడన్నది మనందరికీ తెలిసిందే . ఎందుకంటే, ఇతని ఫీడ్ బాక్కు వెనుకవున్నకార్పొరేటు గుజరాతీలు . ఉదాహరణకు కొన్ని విషయాలు చెబుతాను . అతను ప్రధాని పదవి చేపట్టిన వెంటనే దేశానికీ ఇచ్చిన కానుక 1. స్వచ్ఛభారత్ చీపురు 2. ప్రపంచంలో భారత ప్రధానులెవ్వరూ చేయని నిష్పత్తిలో విదేశి పర్యటనలు 2. స్విస్ ధనాన్ని తెస్తానని చెప్పి ఇంతవరకు ఏమీ తేల్చక పోవడం,LK అద్వానీ అకౌంట్ 7000 కోట్లతో ఉండడం చూసి విస్తుపోయి పిచ్చి చూపులు చూడడం 3. దేశంలో జీవిస్తున్న ప్రతీ మనిషి కి బ్యాంకు అకౌంట్ తెరిపించి దాంట్లో ఇన్సూరెన్స్ వంటివి చొప్పించి వారి స్వీయ జీవితంలోకి తొంగిచూసే ప్రయత్నం 4. వంట గ్యాసు సబ్సిడీ ...గొప్పగా ఇచ్చామనిపించుకుని ... పేదలకు సహాయం చేయాలన్న సంకల్పంలా ఫోజుపెట్టి ,ఊడబెరకడం 5. పైజామా కుర్తా నుండి సర్వసాధారణంగా గాంధేయవాదిలా కనిపిస్తూ ,వంగి వంగి మాట్లాడుతూ ,లక్షల రూపాయల విలువ చేసే సూట్లు ఆచ్ఛాదనగా వేసుకుని దేశాలు తిరిగేయడం 6. తన కోటరీలో బీజేపీ దిగ్గజాలనబడే వారికీ బ్యాండ్ తగిలించి ఊదరగొట్టడం 7. మీడియా ,ప్రెస్స్ లో తనను దుయ్యబడుతున్న వారిని వాళ్ళ అకౌంట్లు ఫేసుబుక్కులు ,మెయిల్స్ తన అనుయాయులతో రహస్యంగా ,బాహాటంగా హ్యాక్ చేయడం...వీలైైైతే బొక్కా లో వేసేయడం 7. వెనుక తురుష్కులు భారత జాతి సంపదను దండయాత్రలతో మోసుకుపోయినట్లు మనదెశ సంపదను ముఖ్యంగా గుజరాతీ తెలివితేటలతో నల్ల ధనం నిర్మూలిస్తున్నాం అనే నెపంతో తో ముందుగానే ఎల్లలు దాటించే (స్వలాభం లేకపోవచ్చుగుజరాతీలు మాత్రమే బాగుపడాలన్నట్లు ) ... ఇలా చెప్పుకుపోతే లెక్కలేనన్ని వంకర్ల ప్రధానిగా చెప్పుకొచ్చు . దేశాలు తిరిగే వ్యామోహం ,రుచికరమైన పదార్ధాల జిహ్వ చాపల్యం ,విశ్వ నాయకుల జాబితాల్లో చేరిపోవాలనే ఉబలాటం,సర్దారువల్లాభాయ్ పటేల్ తరువాత, భగత్ సింగ్ అంతటి నాయకునిలా కనిపించాలనే తన చాకచక్యం, చతురత ... "పూరా మిట్టిమే మిలాదియా " అన్న చందాన తగలడిందన్న విషయం జీర్ణించుకోలేని విషయాలు రెండు చెప్పుకోవచ్చు 1.ఢిల్లీలో చిత్తుగా ఓడిపోయి ఒప్పొజిషన్లో కూర్చున్నారు బీజేపీ వాళ్ళు . మోడీ అంత తిరుగులేని నాయకుడైతే ,గియితే ఢిల్లీ ప్రజలు బీజేపీ కి పట్టం కట్టాలికదా. పంజాబ్ ఎలక్షన్ లో అపశృతుల్లో చక్కగా శృతి చేసుకున్నాడు కేజ్రీవాల్ అందరికీ తెలిసిన విషయమే ! 2. డెమోనిటైజేషన్ ... ఎరక్కపోయి అన్నట్లు ...పూర్వం బిందెలో ఎదో తినడానికి ఉన్నట్లు వెతకబోయిన కుక్క తల దూర్చి ..... తల బయటికి రాక ...కుక్క పీకులాటలా ఉంది అతని పని . ... నోట్లమార్పు అనే విషయం గొప్ప గానే డబ్బాకొట్టుకుంది ప్రభుత్వం . కానీ నోట్ల చేర్పు ,కూర్పు లలో సుందరముదరష్టమైన ...... గిరికీలు కొడుతున్నాడనే విషయం నిర్వివాదాంశం . బీజేపీ వర్గాలు ,చెంచా చానల్సూ ,బడా బ్రోకరుబాబులు మోడీని దేశంలో ,వి దేశీయంలో నెత్తికెత్తుకున్నా .. మధ్యతరగతి ,పైతరగతి ,క్రిందితరగతుల మతులు ,గతులు తప్పి ,రోజు వారీ ఖర్చులకు అడ్డా కూలీల్లా ఏటీఎంలను, బ్యాంకులను ఆశ్రయించడం ఒక అభ్యసంలా నవంబరు 8 ,2016 నుండి ప్రజలకు గుణపాఠం నేర్పినందుకు సదరు "మోడీ " భారత దేశం బీజేపీ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా ... స్థానం సంపాదించుకున్నారు . ఇక్కడ ఒక చిన్న విషయం మనం గురుతుంచుకోవాలి, తప్పదు . ఒక RMP వైద్యుడికి ... సూపెర్స్పెషలిటీ స్పెషలిస్టుకు వ్యత్యాసం కొండంత ఉంటుంది . చెప్పుకోడానికి ఇద్దరూ డాక్టర్లులే . మొదటివాడు తలనొప్పి మందు గురించి సూక్ష్మం గా చెప్పగలడు , రెండోవాడు స్థూలంగా , సమగ్రంగా ,సాంగోపాంగంగా చెప్పగలడు . అలానే రాజకీయంలో మోడీ స్పెషలిస్టుగా చెప్పబడుతున్న RMP మాత్రమే . అతను థియరీకి ఆమడదూరం ,పైగా తాను నమ్మినదాన్ని ఆచరణలో గుడ్డిగా పెట్టే ఓ అపసవ్యదిశను సవ్యదిశగా నమ్మే ఈనాటి మేధావి ..... మరో తమాషా ఏంటంటే పీవీ నరసింహారావు గారు ,మన్మోహన్ సింగ్ లాంటి వారు చేపట్టిన , ఆర్ధిక సంస్కరణలు ... చాలా ఘనమైనవి .పైగా అవ్వి ఎంత రాజకీయ వత్తిడి ఉన్నప్పటికీ ... సిద్ధాంతాల పునాదులనుండి, వెంట్రుక వాసి గూడ తప్పనటువంటివి . ఇహ పొతే మీకు, మన తెలుగోళ్లు ఆడే ఒక దేశవాళీ ఆటగురించి చెప్పాలి . "బిళ్ళంగోడు" ఆట లో కొన్ని పర్యాయపదాలు ఉంటాయి . స్ట్రైకర్ దండుతో బిళ్ళను (చిన్న కర్రముక్క ను లేక గిల్లి ) ని కొట్టేప్పుడు , మిగతావారు క్యాచ్ చేయడానికి వీలు లేకండా ఉండేందుకు ,అడ్డదిడ్డంగా ఈడ్చి కొట్టేముందు ఒక పదం చెబుతాడు ..... మీఅందరికీ తెలిసిందే "గాలివాలు బిళ్ళ సాయ్ " . అదో అలా మన మోడీగారు ఎదో గాలివాలుగా ప్రధాన మంత్రి య్యారు తప్ప , ఇంతవరకు మన మాజీ ప్రధానుల్లో ఎవరీలానూ విద్యా వంతుడు , మేధావి కాదు . బుద్ధిశాలి కాదు . అతనికున్న పదునైన నాలుక అతని ఆయుధం . రాజకీయాల్లో కి వచ్చినవారు ఎన్నో కోల్పోతారు ,అలానే అనూహ్యంగా , పరిముతుల్లోలేని వి ఎన్నో ఈ ప్రపంచంలో సంపాదించుకున్నవారే . అసలు భార్య ,తల్లి ,, బిడ్డల్ని వదులుకొమ్మని మీరెవరైనా చెప్పారా ? నేనైతే అతనికి చెప్పలేదు . వెనుక ఒక మాజీ ప్రధాని చావును సానుభూతిగా చెప్పుకుని ఓట్లు అడుక్కున్నట్లు ...మోడీగారు తన ఉపన్యాసాల్లో తన టైగా,వీరగాధలు ఎందుకు ప్రస్తావిస్తున్నట్లో ?. ...... నోట్ల మార్పు అనబడే " డెమోనిటైజేషన్ "... తిరిగి తిరిగి తనకే "జోర్ కా జట్కా ధీరేసే లగా " అన్నట్లు బీజేపీ కే తగిలిం ది ...... భవిష్యత్తులో 2019 ఎన్నికలు ఇప్పటినుండే బీజేపీ కి పీడకలలు తెప్పిస్తున్నాయి . . ఇప్పటికే ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలు వాయిదా వెయ్యమని యూపీ భాజపా శ్రేణులు లబలబ , మొత్తుకుంటున్నాయి . .... భవిష్యత్తు దేశాభివృద్హి దేవుడెరుగు , మోడిచేసిన ఈ " మోళీ " తాలూకు ఆర్ధిక పెనుముప్పు , ఈదేశాన్ని ఎన్నాళ్ళు దివాళా తీయిస్తుందో . అరుణ్ జైట్లే అంత బుద్ధిశాలురు మన ప్రజలు కాకపోవచ్చు . బీజేపీ ,ప్రజల శాపనార్ధాల మూల్యం భారీగా చెల్లించాల్సి ఉంటుంది .... '' నేను మీ పెద్దవాడిని .. మీ పనులు ..మీరు నాతో చేయించుకోండి " లాంటి మాటలు చెప్పే ఈ మతాల మాంత్రికుడు మేక తోలుకప్పుకొన్న పులి మీద పడినట్లు ... నోట్ల మార్పిడి పోలోసి తో జనాల గుండెల్లో తనపై గూడుకట్టుకుని ఉన్న ఆశాసౌధాల్ని కుప్పకూల్చి ... ఒక గుజరాతీ చాయ్వాలా ఎలా బోను పరచే వేటగాడో చెప్పక చెప్పాడు 'మోడీజీ ".........
Tuesday, 13 December 2016
"పరోపకారార్ధం మిదం శరీరం " నేను చాలా దూరం నుండి ఇక్కడికి బ్రతకడానికి వచ్చాను . ఇక్కడి జీవన విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది . ఒకరికి మరోరి పలకరింపులు ఉండవ్ !... కనీసం రోజూ చూసే ముఖాలు ,ఒకదానితో మరోటి సంబాషించు కోపోతే మానే కనీసం చిరు నవ్వులో ... ముసినవ్వో అస్సలే ఉండవు . మనం దేశం సరిహద్దుల్లో చైనా వాడిని ,పాకిస్తాన్ వాడినో చూసినట్లు పెడతారు ముఖాలు . పలకరిస్తే ...అభివందనం చేసుకుంటే నాకేంటి ? బాబోయ్ ! ఖర్చు డెబిట్ కార్డు గీకవలసి వస్తుందేమో? అన్నట్లు కటింగ్ ఒకటీ . మా ఇంటి నుండి వాహనాలు అవీ తిరిగే రోడ్డు ... దాదాపు సరిగ్గా ఒక్క కిలోమీటరు దూరం . నేను మొదట్లో ఒకరోజు ఒక పెద్దాయనతో పరిచయస్తునిలా మాట్లాడేవాడిని . అతను భారత దేశపు సీనియర్ సిటిజెను ... అతను గొప్ప గ్యాని లా కనిపించా రు .... ఏకంగా ! "మీ పిల్లలు ఇక్కడి కాలేజీలో చదుతున్నారా అండీ ?" ' లేదండీ '...నా జవాబు ... .." ఐతే ఇక్కడికి ఎందుకొచ్చారు ....? ' నా బుర్ర తిరిగిపోయింది .... భారత పౌరునిగా ఎక్కడైనా నీతి గా బ్రతకొచ్చు .....డీమోనిటీసషన్ సీజన్లో, కొత్త 2000 రూపాయలు కోట్లల్లో బినామీ ఖాతాల్లో, బ్యాంకు ఆఫీసర్స్ చలవతో మార్చుకున్నవారు ..... విజయ మాల్యా లా ఎగవేత దారుల్లా ... బడాబాబులు భారత దేశంలో తిరుపతి కొండపై ఇంద్ర భవనం లాంటి గెస్ట్ హవుసులు కట్టుకుని ... ముక్క ,పిక్క , మందు , పొందు తో పవిత్ర స్థలాన్ని బ్రష్టు పట్టించొచ్చు .... కానీ జీవితం లో ప్రతీ ఆర్ధిక సంవత్సరం కు టంచను గా పన్నులు చెల్లిస్తూ దాచుకున్న డబ్బుతో ఇష్టం వచ్చిన చోటు లో ఇల్లు కొనుక్కుని ఉండగూడదట . ఎంత ? గొప్ప న్యాయం భారత దేశంలో సుమండీ ...!! అది మంచి ఎండలకాలం దాదాపు 40 డిగ్రీల ఉస్టునోగ్రత ఉంటుందనుకొంటాను .... రోడ్డు మీదకు పోవాలంటే వెహికల్ తప్పనిసరి .కానీ వెహికల్ ఉన్నవారు పడవలాంటి కార్లలో శేష ప్రేతంలా ఒకేఒక్కరు రయ్ మంటూ దూసుకెళతారేగాని ... పాపం నడిచేవారిని ఎవ్వరినీ కనీసం ద్విచక్రాల వాహనాలమీద కూడా కూర్చో బెట్టుకోరు ... ఈ జబ్బు దేశం నలు చెరగులా ఉందనుకోండి !.... కానీ ఘోరం ఏంటంటే ? డాక్టరు గిరీవెలగ బెడుతున్నవారే అందరూ .....ఆ పాటి దయ ...జాలి ... నడిచేవారిపై చూవించరు గాక చూవించరు... ......ప్రతీ రోజూ నడవలేని వాళ్ళు ,మోకాళ్ళ సమస్యలున్న వాళ్ళు ,ముసలివాళ్ళు ,స్కూలు ,కాలేజీ వెళ్లే వాళ్ళు ... అనేక రకాలైన వాళ్ళు వెడుతూ ఉంటారు .... కనీసం వాతావరణం దృషిలో పెట్టుకునైనా ప్రవర్తించరు . ..... ఇటువంటి వారు రేపు రోగిని, వాడి బాధని ఎలా అర్ధం చేసుకుంటారొకదా !....? దీనికి కారణం .... ? వారిమనసులో పరాయి మనిషిని మనిషిలా చూడక పోవడమే కావచ్చు . వైద్య వృత్తి అంటే ... వైద్యం చేసేవారిని "వైద్యో నారాయణో హరి :" అన్న ప్రాచీన నానుడి ఈ కాలం ఇంకా చెప్పుకోవచ్చా అంటే ? సందేహమే ?... కానీ నా ముస్తిష్కంలో మెదిలే కొంతమంది మహానుభావుల్ని సోదాహరణం గా వివరిస్తాను ..... అదో చిన్న ఊరు అక్కడ దాదాపు అయిదు మంది mbbs లు , ఇద్దరు సర్జన్లు ముగ్గురు జినాకాలోజి లు , నలుగురు RMP లు , నాటు ,ఆయుర్వేద ,హోమియో లు గుంపులు గా ఉండేవారు . డాక్టర్ చీటీ 2 రూపాయలు ఆ రోజుల్లో .... ఒక సర్జన్ ఉండేవాడు అతను పేషంటు చేతిలో 10 నోటు చూస్తే పులకరించి పోయి మొత్తం పది రూపాయల బిల్లు చేసే వాడు , మారొడు హస్తవాసి మంచిది , ప్రక్క ఊరివారు కనీసం నాల్గు రోజులు ఇన్ పేషంటు గా ఉండి, జబ్బు లేకపోయినా సదరు డాక్టర్ వద్ద బిల్ గొరిగించుకునే వారు . మరో mbbs గారు టక్ మాస్టర్ ,పోష్ గా కనిపిస్తారు ,చాలా చాలా తీయగా మాట్లాడుతారు .బిల్ కొద్దిగా ఆలోచించి వేస్తారు ,కానీ అవకాశం ,ఉంటే ,కడుపునొప్పి ఆపరేషన్ చేసి పంపిస్తారు . కానీ రోగి సంవత్సరం తరువాత గానీ, తెలుసుకోలేడు ఒక "కిడ్నీ ",చివరాఖరికి లేదని .... మరో డాక్టర్ రక్తం ,కళ్ళే , మూత్ర పరీక్షలు చేసి మరీ బిల్ గుంజేవారు ,పరీక్షల అవసరం లేనప్పటికీ . మరో MBBs గారు గంపెడు సంతానం ... బిల్లు వేసేప్పుడు రోగి ఆర్ధిక పరిస్థితి పరిగణలోనికి తీసుకుని ... పెదాబిక్కీ అని ఆలోచించే వారు ..... మరో సర్జన్ ఆపరేషన్ అవసరం లేకపోయినా, సిజేరియన్ అవసరం లేక పోయినా ఆపరేషన్ తప్పకచేసే వారు . ఇటువంటి వారు ఉన్న ధనార్జనారణ్యం లో తులసి మొక్క లా ఉండేవారు . అతను "బర్మా " నుండి వలస వచ్చిన బాపతు . కూలీలు ,రిక్షా వారు ,దరిద్ర నారాయణులకు అతి గా వైద్య సేవ చేసి ,రెండు తిట్లు తిట్టి ,బిల్లు విషయం ప్రస్తావనకు వస్తే చంద్రుడు కో నూలు పోగులా తీసుకుని ,లేక పొతే అసలు ఏమీ తీసుకొనక, ఖాళీచేతుల నమస్కారాన్ని తీసుకుని పంపేవారు . ఇంకో తమాషా కాండిడేట్ ఉండేవారు ఆమె ఫీజు నామినల్ గా తీసుకుని, కొన్ని మత్తయి సువార్త ,బైబిల్ పుస్తకాలు ఇచ్చి మరీ పంపేవారు . ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే ?వీళ్ళందరూ డాక్టర్లు ... ఒక్కోరు ఒక్కో తంతు . అంటే వెరసి వీరందరిలో ఒక ఖాళీ చేతుల్తో నమస్కారానికి అలవాటుపడ్డ ఆయన్ను తప్పించి మిగతా మహానుభావులు,ఒక్కో రకమైన రీతిలో వ్యాపారస్తులా చెప్పుకొచ్చు ... సాధారణం గా ఇలాంటి విధానం లో రైటూ ... లెఫ్టూ గా సంపాదించినా వాళ్ళ పిల్లలూ రేపు డాక్టరులే . అదిగో అటువంటి వారి మనసుతత్వమే ... పడవల్లాంటి పెద్ద పెద్దచలువ కార్లలో తలబిరుసుగా నడిచే దారిలో 60 కిమీ వేగంతో దూసుకెళ్ళటం అన్నమాట ... ఇహ క్యాపిటషన్ మా ఇంటి ప్రక్క మెడికల్ కాలేజీలో mbbs సీటు అక్షరములా ఒక్క కోటి రూపాయలు అనే విషయం, బహిరంగ రహస్యం ... పాపం అరాకొరగా వచ్చిన అత్తెసరు ర్యాంకుల మేధావులు ఇక్కడా ప్రత్యక్షం అవుతారు . అసలు వాళ్ళని పట్టలేం .. పిచ్చి .. పోలి కటింగులు ,బుడబుక్కల ఫాషన్ లో మునిగి తేలుతుంటారు .... వీళ్ళు హిందువులైన ముస్లీములు లేక హిందువుగా పుట్టిన ఫాషన్ కిరస్తానీలు . వీళ్ళ ముఖం మీద బొట్టు అనే చుక్క కనీసం ఉండదు . లప్పే డు షాంపూ తో అలికిన జుట్టూ ... ఇందులో కొంతమంది సంప్రదాయం గా కనిపిస్తే మరికొందరు ఫాషన్ పెరేడ్ కా అన్నట్లు ఉంటుంది అవతారం ... అంత పవిత్రమైన ప్రొఫెషన్ లో ఉండి డిస్కో థెక్ కు వచ్చినట్లు అవతారం .... వీళ్ళు దారిలో నడిచే సాధారణమైన మనుషులను చూడగానే సదరు కారు లేక బైకు ఒక్కసారి వేగం పెంచుతూ ... దేశానికీ వీళ్లేందో అసామాన్యమైన సేవలు చేయబోతున్నట్లు ఫోజూ పెడుతూ వెడతారు ... నిజం చెప్పాలంటే రేపు వీరి చదువు అయ్యాక కనీసం 5 సంవత్సరాలయినా గ్రామాల్లో ప్రజా సేవ స్వచ్ఛందం గా చేయక ... అడ్డదిడ్డంగా హాస్పిటలు పెట్టి , లేక సూపర్ స్పెషలిటీల్లో చేరి .. కనీస0 సేవా భావం లేక ,కేవలం సంపాదనే పరమావధి గా జీవించేస్తారు ... వీలయినంతవరకు ఇన్కమ్ టాక్స్ వాళ్ళకి కనిపించనంత దూరంలో మూడు పూలు ఆరు కాయలుగా పరిఢ విల్లుతారు ... ఇప్పటికీ నిజమైన త్యాగ శీలురైన వైద్యులు, అపోలో ... కేర్ .... యశోద వంటి ఆసుపత్రుల్లో ఉంటారు కూడా . ఎప్పుడు కూడా గట్టి చదువు కు , దొడ్డిదారి చదువుకూ చాలా తేడా ఉంటుంది . మనం గవర్నమెంట్ , కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లను "బాదినట్లు " , వార్తలు చూస్తూంటాం .అదిగో వారే వీరు .. అందుకే మిత్రులారా మన శరీరాన్ని మనల్ని మోసుకునేందుకే కాక , ప్రక్క వాడిని మోసేందుకూ ఎల్లప్పుడూ సిద్ధపరచాలి అదే నిజమైన వ్యక్తిత్వం కాదా ? ..... అందుకు శాస్త్రాలు ,వేదాలు , ఋక్కులు వల్లే వేయనవసరం లేదు . కొద్దిగా మనసును "శృతి " చేయడమే మనం చేయవలసింది . కాల ,మాన పరిస్థితులు , మనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొద్దిగా అర్ధం చేసుకోడమే ఇక్కడ మనం చేయవలసిన అభ్యాసం .......
Sunday, 16 October 2016
Tuesday, 20 September 2016
"గణపతిబప్పా .. మోరయా ..! కాస్త ..ముందా ?..!! మందా ? ఐన వేళ " ప్రపంచానికి తెలిసిన ఆహ్లాదకరమైన హిందూవుల పండుగలలో అతిముఖ్యమైన పండుగ . ఎంతపెద్దవాడైన అశ్రద్ధ చేయని పండుగ .. శ్రద్దా ..శుచి ..శుభ్రత .. దీక్షగా చేసే అతి ముఖ్యం అయిన రోజు . సంవత్సరమంతా పిల్లలు ఎదురుచూసే పండుగ .... కొంతమంది తమ వ్యాపారం ..వ్యవసాయం ... కర్మాగారం ... లో ఎటువంటి పొరబాట్లు ..నష్టాలు రాకుండా విఘ్నేశ్వరుడిని ముక్కే రోజు కూడా ఇదే . దేశం లో నాలుగు చెరగులా ..విగ్రహాలు చేసేవాళ్ళకి ...వేషాలు కట్టేవారికి ... పండ్లు పూలూ ..తినుబండారాలు ...ఒకటేమిటి ...అన్నీ రంగలవాళ్ళకి సంవత్సరానికి దాదాపు ఆదాయాన్ని సంపాదించిపెట్టే ఒక శుభప్రదమైన పండుగరోజు . ఇంకో విధం గా చెప్పాలంటే ఏ రోజుకు ఆ రోజుకు కాస్తఅంత మందుబాబులు తడుకోకుండా 'మందు' పుష్కలం గా దొరికే భలే మంచి రోజు . మైకుల హోరు ...పూజల జోరు ... ఎంత అయినా చాలా గొప్పగా ఉంటుంది . దాదాపు పండుగకు రెండు వారాల ముందునుంచే చందా బాబులు .. పెద్ద బొట్లు ,చేతికి రంగు దారాలు తో .. నమస్కారాలు పెట్టుకుంటూ ఇంటిముందు తయారు (వీళ్ళు చందాలు అడిగి మరీ విగ్రహం పెట్టపోతే వినాయకుడు "గిల గిలా ",కొట్టుకుంటాడు అన్నట్లు ).. నమ్రతగా అడిగే వాళ్ళు ,డిమాండ్ చేసేవాళ్ళు ,ఇచ్చింది పట్టుకుపోయేవాళ్లు ... ఇవ్వి క్యాటగిరీలు ..... ఇహ దాదాగిరి తో పట్టుకు పోయేవాళ్లు అతికొద్దిమంది ..... ప్రతిరోజూ పూజలూ .. ప్రసాదాలు రూలు లా గడిచి పోతాయి ... చివరిరోజు వినాయకుడిని నిమజ్జనం చేసేంతవరకూ బావుంటుంది హుషారుగా ఉంటుంది . ఇంటికివచ్చేక ..స్నానాలు ... అవ్వి అయిపోయాక లెక్కలు ... బాకీలు ... బకాయిలు ... మిగులు ... జేబులోంచి పెట్టాలా ... వచ్చేసంవత్సరం వరకూ మిగులు ధనం దాచుకోడం ... లడ్డూ ది ఓ సెపరేట్ అధ్యాయం . డిస్కషన్స్ ... మెచ్చుకోళ్ళు ... విన్నపాలు .. కొద్దిలో తప్పింది అంటే .. కాదు కాదు ఫలానా వాడు ఏకం గా పెంచేసాడు .. లేపోతే నేనే తీసుకుందును ... ఇలా తర్జన భర్జనలు జరుగుతూ ఉంటాయి . ఈ ప్రహసనం నా చిన్నప్పటి నుండీ చూస్తున్నాను ...వింటున్నాను . ఇటీవలే నిమమజ్జనం రోజుకు నేను మా బంధూవుల ఇంట్లో ఉండం జరిగింది . ... నిమజ్జనం రాత్రి మా బంధువుల అబ్బాయిని అపార్ట్మెంట్ గణేష్ కమిటీ వాళ్ళు రాత్రి ... 8 గంటలకు తప్పనిసరిగా మీటింగ్ కి రావాలని పిలుపు .... ఇంటర్నెట్ లో బిజీ గా ఉన్న నేను ... కూడా ఇన్విటేషన్ పిలుపు విన్నాను . మావోడు రాత్రి 8 గంటలకు చేతులూపుకుంటూ వెళ్ళాడు కూడా . నేను దాదాపు 9 గంటల ప్రాంతం లో వాళ్ళ ఆవిడ గారిని అడిగాను "ఎమ్మా ? మీ ఆయను గారు మీటింగులో పాయింట్ స్పీకరా "...." లేదండి !!... ఈ రోజు నిమజ్జనం చేసి వచ్చారుకదా .... దే ఆర్ రిలాక్సింగ్ "..... "సరేనమ్మా ఎవడింట్లో వారు రిలాక్స్ అవ్వోచ్చుకదా "....." అందరూ .... ఒకే చోటు రిలాక్స్ అవడమేంటీ ... నాకు అర్ధం కాట్లేదు "...... "భలేటోరండీ మీరు .. ఆ రిలాక్సింగ్ కాదండీ బాబూ ... మందు పార్టీ అట " నేను ఏమివిన్నానో అర్ధం కాలేక, చేసుకోలేక ... గొంతులో వెలగ పండు లా ఉంది నా పరిస్థితి ..... నా మనసులో తలపులతో సుళ్ళు తిరగడం మాత్రం గురుతు... టైం చూస్తే 10. 50... ఈ మధ్యలో మనోడు ఎప్పుడొచ్చాడో ... నిదురపోతున్నాడని గమనించాను (తాను కోకే.. త్రాగి ఉండొచ్చు అది వేరే విషయం )..... పోయి పోయి వినాయకచవితి నిమజ్జనం చేసినరోజు ఈ ఇంగిలీషు (ఎంగిలీషు ) .... దొరల సిస్టం ఏంటో ? కదా .. మరీ విచ్చలవిడి తనం కపోతేనూ ... ఈ మద్య లో హైదరాబాద్ విడిచిపెట్టి ఒక బయటి వ్యక్తిలా ..... దూరమునుండి చూస్తూ చుట్టం చూపులా వెడుతూంటే..... కంప్లీట్ టేక్ ఎంత మారిపోయిందో కదా . నిజంగా నేను జీవితంలో ప్రపంచాన్ని ఎంత ? ఆలస్యం గా తెలుసుకుంటున్నానో కదా ? నిజంగా చెప్పాలంటే .. నేను చూసిన, విన్న, వినాయక నిమజ్జనాలు హైదరాబాద్ లో ఎంతో ఆహ్లాదకరంగా సాగినవే .. తలకు కాషాయ రిబ్బనులు కట్టుకోడం .. దారిలో నిమజ్జనపు విగ్రహం కూడా వెడుతూ కావలిసిన వరకు ఇష్టమొచ్చిన ప్రసాదాలు అందుకుంటూ ... కేరింతలు "గణపతి బప్పా మొరు యా .. మంగళ మూర్తి ఆగలేసాల్ యా " ... మరెన్నో విగ్రహాల్ని చూస్తూ తన్మయత్వం చెందుతూ .. నేను హిందూ గా పుట్టడం పూర్వజన్మ సుకృతమే అనుకోడం ... అరుచుకోడం ... అప్పుడప్పుడు కొన్ని కోతి చేష్టలు చేసుకుంటూ నిమజ్జన వాటికకు చేరుకొని ...నిమజ్జనా నంతరం బిక్కమొఖాలేసుకుని ఇంటికి చేరుకొని .. కనీసం ఏదయినా తినే అవకాశం చూసుకోకండా గుర్రుపెట్టి నిదురోటం .... పుంఖాలు పుంఖాలు క్రింద గురుతొచ్చి కళ్ళ వెంట నీరు జాలువారటం ఇప్పటికీ మరిచిపోలేదు . మరో జుగుప్స క్రియ .. వినాయకుణ్ణి ... పాపం తనని తన లానే ఉండనీయక అతని రూపురేఖలను సినిమా హీరోల్లా రూపాంతరం చేయడం భక్తి ఎలా ? అవుతుంది ... ఆమంటపం లోని సింహదాతల కుల గజ్జి .... హీరో తాలూకు ఆరాధన ...హీరోపై భక్తి లా పరిఢవిల్లుతుందే తప్ప ..... వినాయకరూపం నుంచి వారికీ వచ్చేది సున్నా . సూక్ష్మం గా చెప్పాలంటే వారి హీరోతాలూకు అభిమానం ... పిచ్చ వెర్రి .... లాంటి భావాలకు ప్రతీకగా ఉన్న రూపానికి, నిత్య నైవేద్యం ,ధూప దీపాలు , పూజలు, తప్ప వినాయకునికి చేసింది ఏమీ లేదు కాబట్టి . పైగా శాప గ్రస్తులవడం ఖాయం .... ఎందుకంటే ....అష్టోత్తరాలు .. సహస్ర నామాలు ,అర్చనలు భాష వరకు వినాయకునివే ..... విగ్రహారాధన జరుగుతుంది "బాహుబలిరూపాయ విగ్నేశ్వరః " కనుక . నావరకు నాకు : మనం నాగరికం లో ఎంతో ముందున్నామనుకుంటున్నాం .. అది నిజమయిన "అవాస్తం "..... హిందువుల పండగలు అన్నీ చరిత్ర ఆధారాలూ .. ఆలంబనలే కదా ..!... ఎందుకంటే ఈ భూమి పుట్టినప్పటినుండీ అన్నీ యుగాలకు వాటి ప్రాశస్త్యం బట్టి .. చోటుచేసుకున్నవే .. కల్పితాలు కానేకావు ... అటువంటప్పుడు వాటి విధానాల్ని మార్చే హక్కు( ఉదా : షిరిడీ సాయి సేవా విధానం లో అంటూ...ముట్టూ ... ఉపవాసం .. డ్రెస్ కోడు ... బొట్టు విధానం ... షిరిడీలో ఆయన తిరిగిన ప్రాంతాల్లో ఆశ్రమాలు కట్టి .. శిష్యులుగా ప్రకటించుకున్నట్లు .... ఫీజు విధానాలు... సమగ్రం గా ఆయన జీవితవిధానం తెలుసుకోక ... ఎగబడి మరీ ఆయన వొళ్ళో వాడిలా మాట్లాడడం లాంటివి ) ఈ భూమ్మీద పుట్టినోళ్ల కెవరికీ లేదు ... సభ్య ప్రపంచంలో ఇంకా ఎన్ని ఇటువంటి ఘోర ప్రక్షిప్తాలు చూడాలికదా ? అనుకుంటే మనసు కలతకు గురికాకమానదు . దయచేసి అలోచించి చూడండీ . మానవులు ఇలా వారి ఇష్టారాజ్యం గా ఉంటారనేమో ఆ పై వాడు కనిపించక వినిపించక ... కేవలం మనో నేత్రంలోనే నిబిడీకృతమైనట్లు అనిపిస్తుంది నాకు ... ఇటువంటి పోకడలే బహుశా .. సంఘం లో ఏమి ఆశించక .. ప్రజా కళ్యాణం కోరి నాలుగు మంచి మాటలు చెప్పడానికి వస్తున్న గ్యానులకు .... తాటిఆకులు కడుతున్నారు ... కదా ?....!!.. (ఈ మాట నేను పూజ్యులు .శ్రీ శ్రీ శ్రీ .చాగంటివారిని ఉద్దేశించి అన్నవే .... ఎందుకంటే ఆ మహానుభావుణ్ణి చేసిన నిందారోపణలు ఇప్పటికీ నా గుండెను తొలుస్తున్నాయ్ )....... ఈ విధం గా మనం గణేష్ చవితి జరుపుకో పోయిన ఇంట్లో చేసుకోడం ... అవకాశం లేపోతే మందిరం లో ఆయన పూజలో పాలుపంచుకుని నాలుగు అక్షింతలు నెత్తినెట్టుకుంటే .. ఆయన ఏమీ ? మనల్ని అనకపోచ్చు ...... కలియుగంలో .... కలకలం అంటే బహుశా వినాయక నవరాత్రులు అనే మిషతో "మందు " పార్టీనే అనిపిస్తుంది ....... దయచేసి ఆలోచించండి ...... విఘ్నేశ్వరుని నవరాత్రుల నిమజ్జనం .... సందర్భంగా మందుకొట్టే ... మహానుభావులకు నా ఈ వ్యాసం నమ్రతతో అంకితమిస్తూన్నాను నా కోరిక : స్వామీ విఘ్నేశ్వరా నా కంఠంలో ప్రాణమున్నంతవరకూ మీ నిమజ్జనాలు సందర్భంగా మరెప్పుడు ఇటువంటి "ఉభయ బ్రష్టుత్వపు వార్తలు " వినకండా నన్ను కాపాడమని తమకు మనవి చేసుకుంటూ న్నాను . గమనిక : పై ఫోటోలు లో ఉన్నవారు ఎవ్వరూ ఈ వ్యాసం లో క్యారెక్టర్ లు కారు . కేవలం బ్లాగ్ కోసం సమీకరించడం జరిగినదని మనవి రవిబాబు . మద్దూరి
Sunday, 7 August 2016
" దొంగతనం నేర్పిన పాఠం " ************************ అది నేను 8.వ. తరగతి చదువుకుంటున్న రోజులు నాకు బాగా జ్ఞాపకం కూడా . మా ట్యూషన్ మాస్టారు పేరిసెట్ల.వేంకటెశ్వర్లు( పాపం) ఆ రోజుల్లో ముగ్గురు పిల్లలు భార్య, ఆయన సంసారం . అతను అప్పుడు ప్రైవేటుగా బి.ఏ రెండవసంవత్సరం చదువుకుంటున్నారు . వాళ్ళవృత్తి మగ్గం నేయడం . భార్యాభర్తలు ఇద్దరూ ఓ ప్రక్క బట్టలు నేస్తూ, మాష్టారు,తాను మాకు పాటలు చెప్పే వారు . ఇంగ్లీష్ గ్రామర్ నా తరగతి రీత్యా అవుసరం .తాను గ్రామర్ చాలా సున్నితం గ అర్ధం అయ్యేలా చెప్పేవారు . నాకు నా సహ విద్యార్థి కి గ్రామర్ పుస్తకం కావలిసివచ్చింది . మాష్టారు చెప్పే ఇంగ్లీషు గ్రామర్ అర్ధం సంపూర్ణం కావాలంటే ... హోంవర్క్ చేయాల్సి ఉంటుంది . అలాచేయాలంటే మాస్టారు చెప్పింది అర్ధం కావాలంటే తెలుగు లో ఇంగ్లీషు గ్రామర్ నేర్చుకోటానికి అద్భుతమైన ఆయుధం "j .v . రమణయ్య " గ్రామర్ అచ్చుపుస్తకం ఎంతగానో దోహద పడుతుంది . అప్పట్లో దాని ఖరీదు మూడు రూపాయల యాబై పైసలు మాత్రమే మాస్టారు గారి ట్యూషన్ ఫీజు ఐదు రూపాయలు (మీరు అర్ధం చేసుకోవచ్చు పుస్తకం ఖరీదు ఎంత భారమో సామాన్యులకు ).మాష్టారు ఒక్క మాంచి ఉపాయం చెప్పారు .నేను నా మిత్రుడు సుబ్బారావు చెరీ సగం వేల పెట్టుకొమ్మని, వారం లో వాడు 3 రోజులు మా ఇల్లు దూరం కనుక 4 రోజులు నావద్ద ఉండేట్లు . ఒప్పందం కూడా కుదిర్చారు సదరు మాస్టారు . నాకు పుస్తకాలూ చదివినా చదవకపోయినా అట్టలు వేసి సంవత్సరం మొదట్లో ఉన్నట్లు, చివరివరకు ఉంటేనే అదో " తుత్తి" అన్నమాట . అంటే పుస్తకానికి సోల్ ఓనర్ హక్కులు మనకే ఉండాలి . ఏంచేయాలో పాలు పోడం లేదు . నిద్రలో మెలకువలో అదే విషయం మేధోమధనం జరుగుతూంది ... ఎలా ? ఎం ? చేయాలి . అప్పట్లో మానాన్నగారు కొన్ని ప్రతి ష్టంభనల వల్ల , ఉద్యోగ విరామం లో ఉన్నారు . మా అమ్మ జీతమే మా జీవితం . అప్పటికి సగం రేటు గురించిన ఒప్పందం కూడా ,అమ్మకి చెప్పాను . సరే లే నాన్న , డబ్బులు చూసి ఇస్తాను అన్నారు ఆవిడ . దాదాపు ఆ నెల్లో ఐదు,ఆరు సార్లు తనకు మళ్ళీ చెప్పడం జరిగింది . ఒక సమయం లో ఐతే తాను కసిరారు కూడాను . పుస్తకం కొనడం కంటే పుస్తకం మొత్తం నాదిగా ఉండడమే నేను బలం గా కోరుకుంటున్నది . సుబ్బారావు గాడితో షేరు చేసుకోడం సుతారం ఇష్టం లేదు . ఇలాంటి సమయం లో మా ఇంటి దగ్గర్లో ఉన్న ఓ చిన్న పిల్లడు రోజులానే కనిపించాడు .సాధారణం గా ఆ పిల్లాడి దగ్గర రూపాయి , అర్ధ రూపాయి డబ్బులు ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి . కానీ ఆ రోజు ఆ పిల్లాడి చేతిలో 5 రూపాయలనోటు కనిపించింది . నాకు ఎన్నడూ లేని ఆలోచన సుడులు తిరగడం మొదలయ్యింది . ఆ 5 రూపాయలు మనం తీసుకుంటే అన్న ఒక్క ఐడియా నా జీవితం లో గొప్ప పాఠాన్ని నేర్పింది . మరీ చిన్న పిల్లాడవడం చేత వాడికి మాటలు సరిగా వచ్చేవి కావి . వాడి పేరు వాడు చెప్పలేనంత పసివాడు . ఈక్రమం లో నేను, గ్రామర్ పుస్తకం ఓనర్ అయ్యే పధకానికి వాడు" రాజారామ్మోహనరాయ్ "లా కనిపించాడు నాకు . ఎంత యాంగిల్ మార్చి చూస్తున్నప్పటికీ రాజారామ్మోహనరాయ్ లానే ఉన్నాడు నా పాలిట . వాడిని ఉన్నఫళంగా ఎత్తుకుని గాలిలో గిరా గిరా తిప్పి, 5 రూపాయలు నోటు నొక్కేసాను . వాడిని క్రింద ఒదిలి , విజయ గర్వమ్ తో ఓ ANR పాట పాడుకుంటూ నేరుగా" శ్రీ రామ బుక్ డిపో" కు వెళ్ళిపోయాను. అటునుండి అటు స్కూల్ కూ వెళ్ళాను . క్లాసులో టీచర్స్ పీరియడ్ ప్రకారం పాటలు చెబుతన్నా నా ద్రుష్టి నా క్రొత్త పుస్తకం పైనే ఉంది . రేపు ఎంత తొందరగా వస్తుందా? ట్యూషన్ మాస్టారు కి నా క్రొత్త పుస్తకం చూపిస్తానా అన్నదే నా ఆలోచన . పైగా పగటి కలలు (కళ్ళు తెరుచుకుని ). రీసెస్ బిల్లులో 15 నిముషాలు ఎదో ఒక ఆట ఆడుకోడం ఆనవాయితీ . మధ్యతరగతి కంటే పైన ఉండే పిల్లలు , కలిగినోళ్ల పిల్లలు రీ సెస్ బెల్ లో చిరుతిళ్ళు కొనుక్కునేవారు . మా ఇంట్లో ఒక్క పైసా అడిగినా తొక్కి నార తీస్తారు మా అమ్మ . చిరుతిళ్ళు ఒక "వైపు చూసినా "పుంపుహార్ " ఇపోతాం అన్నమాట . అంచేత చిరుతిళ్ళు వైపే చూసే వాడినికాదు . 3.50 పైసలు, ఆపుస్తకం పోను , 1.50 పైసలు జేబులో గలగలా మంటూ సందడి చేస్తూ నన్ను ఐస్ క్రీమ్ తినమని నోరు ఒకటే జిల . ఎప్పుడూ నావనుకున్నవి అంత మొత్తం నా జీవితంలో అప్పటివరకూ లేవు . నా చూపులు ,మాటలూ , యాంగిల్సూ ,కట్టింగ్సూ "వీర పులి " లా మారిపోయ. వెంటనే క్లాస్ మీట్ " హరినారాయణ "ను జత చేసుకుని ఐస్ క్రీం , బిస్క్యూట్స్ తినేసాం . ఇహ జేబులో ఉంది 75 పైసలు . 4 పీరియడ్స్ అయ్యాయి . లాంగ్ బెల్ కొట్టారు . ఎంతో కాన్ఫిడెన్స్ తో ,ఇంటికిచేరుకుంటూ (అమ్మకు నా పుస్తకం గురించి ఇబ్బందిలేదనే సంతోషం తో )..... ఇంటి ఛాయలల్లో నడుస్తూండగా , అమ్మ ! ఎదురు చూస్తున్నట్లు గమనించాను .అంతే ! నా బ్రహ్మానందం సర్వనాశనం అవుతున్నట్లు అనిపిస్తూంది , పైగా ఎడం కన్ను చాలా వేగంగా కొట్టుకోడం మొదలయింది . నాలుక మీద పాట ఎటోవెళ్లిపోయింది , గొంతులో తడి ఆరిపొతోం ది . గుండె అతివేగం గా కొట్టుకుంటూంది . అడుగులో అడుగులేసుకుంటూ ఇంటిమెట్లు ఎక్కాను . అంతే ! ఒక్క రెక్కపుచ్చుకుని మా అమ్మ లాగి ఇంట్లొకివేసుకుని పారిపోకుండా తలుపు గడియ పెట్టింది . నా రెండు చేతులూ వెనుకకు విరిచి చాంతాడు తో గట్టిగా కట్టేసింది . ఇప్పటి మన సంగీత విద్వాంసుడు"శివమణి " , ఆరోజుల్లోనే మా అమ్మను పూనినట్లు గా నన్ను చితకబాదింది దాదాపు 15 నిముషాలు . నేను చెప్పడానికి చాన్సు లేదు . మరోప్రక్క మద్దెలదరువు , ఎలా చచ్చేట్టు . ఎవరైనా రక్షిస్తారోఅన్నా ... ఇంట్లో ఎవ్వరూ లేరు . పైగా మర్దనా జరిగేటప్పుడు ఇంట్లో వాళ్ళు కలగచేసుకుంటే వాళ్ళకీ శిక్షలో "తాయిలం" తప్పనిసరి . నాకేకలు విన్న వెనుక ఇండ్లల్లో ఆంటీ మా తలుపు తీయమని తలుపుకొడుతూఉంది . అప్పటివరకూ నా తుప్పు రేపుతున్న మా అమ్మ "చావు ...చావు వెధవ " " నువ్వు ఛస్తే పీడా విరగడ అవుతుంది ".... అంటూ కొడుతూనేవుంది ....... ఒకప్రక్క వాత లు యెర్రని పొంగులుగా తేలి మంట , నొప్పి .నా ఏడుపు ఎక్కువవుతూనే ఉంది . మా అమ్మ ఒక్కసారిగా తన చేతిలోని బెత్తం తాడూ ఒక ప్రక్క పడేసి తన రెండూ చేతుల్తో నన్ను గట్టిగా తన గుండెలకు హత్తుకుంటూ , తానూ ఎక్కిళ్లుపెడుతూ ఏడ్వడం .... నేను చూస్తూ , మా అమ్మను గట్టిగా పట్టుకుని "అమ్మ ...అమ్మా... ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయను ".... " నువ్వేడవకు .... ఏడవకే " అంటూ పరస్పరం ఏడిచాము . మనం ఒక తప్పు పనిచేస్తే అది తల్లితండ్రులకు ఎంత ? అవమానాన్ని ... బాధ ... మనోవేదన ను మిగులుస్తుందో ..... వేరేచెప్పక ఆరోజు తెలుసుకున్నాను . మా అమ్మ తాను ఎందుకు ఏడిచిందో జాగ్రత్తగా ఆలోచిస్తే మీరూ అర్ధం చేసుకున్నారు సుమా !
" దొంగతనం నేర్పిన పాఠం " ************************ అది నేను 8.వ. తరగతి చదువుకుంటున్న రోజులు నాకు బాగా జ్ఞాపకం కూడా . మా ట్యూషన్ మాస్టారు పేరిసెట్ల.వేంకటెశ్వర్లు( పాపం) ఆ రోజుల్లో ముగ్గురు పిల్లలు భార్య, ఆయన సంసారం . అతను అప్పుడు ప్రైవేటుగా బి.ఏ రెండవసంవత్సరం చదువుకుంటున్నారు . వాళ్ళవృత్తి మగ్గం నేయడం . భార్యాభర్తలు ఇద్దరూ ఓ ప్రక్క బట్టలు నేస్తూ, మాష్టారు,తాను మాకు పాటలు చెప్పే వారు . ఇంగ్లీష్ గ్రామర్ నా తరగతి రీత్యా అవుసరం .తాను గ్రామర్ చాలా సున్నితం గ అర్ధం అయ్యేలా చెప్పేవారు . నాకు నా సహ విద్యార్థి కి గ్రామర్ పుస్తకం కావలిసివచ్చింది . మాష్టారు చెప్పే ఇంగ్లీషు గ్రామర్ అర్ధం సంపూర్ణం కావాలంటే ... హోంవర్క్ చేయాల్సి ఉంటుంది . అలాచేయాలంటే మాస్టారు చెప్పింది అర్ధం కావాలంటే తెలుగు లో ఇంగ్లీషు గ్రామర్ నేర్చుకోటానికి అద్భుతమైన ఆయుధం "j .v . రమణయ్య " గ్రామర్ అచ్చుపుస్తకం ఎంతగానో దోహద పడుతుంది . అప్పట్లో దాని ఖరీదు మూడు రూపాయల యాబై పైసలు మాత్రమే మాస్టారు గారి ట్యూషన్ ఫీజు ఐదు రూపాయలు (మీరు అర్ధం చేసుకోవచ్చు పుస్తకం ఖరీదు ఎంత భారమో సామాన్యులకు ).మాష్టారు ఒక్క మాంచి ఉపాయం చెప్పారు .నేను నా మిత్రుడు సుబ్బారావు చెరీ సగం వేల పెట్టుకొమ్మని, వారం లో వాడు 3 రోజులు మా ఇల్లు దూరం కనుక 4 రోజులు నావద్ద ఉండేట్లు . ఒప్పందం కూడా కుదిర్చారు సదరు మాస్టారు . నాకు పుస్తకాలూ చదివినా చదవకపోయినా అట్టలు వేసి సంవత్సరం మొదట్లో ఉన్నట్లు, చివరివరకు ఉంటేనే అదో " తుత్తి" అన్నమాట . అంటే పుస్తకానికి సోల్ ఓనర్ హక్కులు మనకే ఉండాలి . ఏంచేయాలో పాలు పోడం లేదు . నిద్రలో మెలకువలో అదే విషయం మేధోమధనం జరుగుతూంది ... ఎలా ? ఎం ? చేయాలి . అప్పట్లో మానాన్నగారు కొన్ని ప్రతి ష్టంభనల వల్ల , ఉద్యోగ విరామం లో ఉన్నారు . మా అమ్మ జీతమే మా జీవితం . అప్పటికి సగం రేటు గురించిన ఒప్పందం కూడా ,అమ్మకి చెప్పాను . సరే లే నాన్న , డబ్బులు చూసి ఇస్తాను అన్నారు ఆవిడ . దాదాపు ఆ నెల్లో ఐదు,ఆరు సార్లు తనకు మళ్ళీ చెప్పడం జరిగింది . ఒక సమయం లో ఐతే తాను కసిరారు కూడాను . పుస్తకం కొనడం కంటే పుస్తకం మొత్తం నాదిగా ఉండడమే నేను బలం గా కోరుకుంటున్నది . సుబ్బారావు గాడితో షేరు చేసుకోడం సుతారం ఇష్టం లేదు . ఇలాంటి సమయం లో మా ఇంటి దగ్గర్లో ఉన్న ఓ చిన్న పిల్లడు రోజులానే కనిపించాడు .సాధారణం గా ఆ పిల్లాడి దగ్గర రూపాయి , అర్ధ రూపాయి డబ్బులు ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి . కానీ ఆ రోజు ఆ పిల్లాడి చేతిలో 5 రూపాయలనోటు కనిపించింది . నాకు ఎన్నడూ లేని ఆలోచన సుడులు తిరగడం మొదలయ్యింది . ఆ 5 రూపాయలు మనం తీసుకుంటే అన్న ఒక్క ఐడియా నా జీవితం లో గొప్ప పాఠాన్ని నేర్పింది . మరీ చిన్న పిల్లాడవడం చేత వాడికి మాటలు సరిగా వచ్చేవి కావి . వాడి పేరు వాడు చెప్పలేనంత పసివాడు . ఈక్రమం లో నేను, గ్రామర్ పుస్తకం ఓనర్ అయ్యే పధకానికి వాడు" రాజారామ్మోహనరాయ్ "లా కనిపించాడు నాకు . ఎంత యాంగిల్ మార్చి చూస్తున్నప్పటికీ రాజారామ్మోహనరాయ్ లానే ఉన్నాడు నా పాలిట . వాడిని ఉన్నఫళంగా ఎత్తుకుని గాలిలో గిరా గిరా తిప్పి, 5 రూపాయలు నోటు నొక్కేసాను . వాడిని క్రింద ఒదిలి , విజయ గర్వమ్ తో ఓ ANR పాట పాడుకుంటూ నేరుగా" శ్రీ రామ బుక్ డిపో" కు వెళ్ళిపోయాను. అటునుండి అటు స్కూల్ కూ వెళ్ళాను . క్లాసులో టీచర్స్ పీరియడ్ ప్రకారం పాటలు చెబుతన్నా నా ద్రుష్టి నా క్రొత్త పుస్తకం పైనే ఉంది . రేపు ఎంత తొందరగా వస్తుందా? ట్యూషన్ మాస్టారు కి నా క్రొత్త పుస్తకం చూపిస్తానా అన్నదే నా ఆలోచన . పైగా పగటి కలలు (కళ్ళు తెరుచుకుని ). రీసెస్ బిల్లులో 15 నిముషాలు ఎదో ఒక ఆట ఆడుకోడం ఆనవాయితీ . మధ్యతరగతి కంటే పైన ఉండే పిల్లలు , కలిగినోళ్ల పిల్లలు రీ సెస్ బెల్ లో చిరుతిళ్ళు కొనుక్కునేవారు . మా ఇంట్లో ఒక్క పైసా అడిగినా తొక్కి నార తీస్తారు మా అమ్మ . చిరుతిళ్ళు ఒక "వైపు చూసినా "పుంపుహార్ " ఇపోతాం అన్నమాట . అంచేత చిరుతిళ్ళు వైపే చూసే వాడినికాదు . 3.50 పైసలు, ఆపుస్తకం పోను , 1.50 పైసలు జేబులో గలగలా మంటూ సందడి చేస్తూ నన్ను ఐస్ క్రీమ్ తినమని నోరు ఒకటే జిల . ఎప్పుడూ నావనుకున్నవి అంత మొత్తం నా జీవితంలో అప్పటివరకూ లేవు . నా చూపులు ,మాటలూ , యాంగిల్సూ ,కట్టింగ్సూ "వీర పులి " లా మారిపోయ. వెంటనే క్లాస్ మీట్ " హరినారాయణ "ను జత చేసుకుని ఐస్ క్రీం , బిస్క్యూట్స్ తినేసాం . ఇహ జేబులో ఉంది 75 పైసలు . 4 పీరియడ్స్ అయ్యాయి . లాంగ్ బెల్ కొట్టారు . ఎంతో కాన్ఫిడెన్స్ తో ,ఇంటికిచేరుకుంటూ (అమ్మకు నా పుస్తకం గురించి ఇబ్బందిలేదనే సంతోషం తో )..... ఇంటి ఛాయలల్లో నడుస్తూండగా , అమ్మ ! ఎదురు చూస్తున్నట్లు గమనించాను .అంతే ! నా బ్రహ్మానందం సర్వనాశనం అవుతున్నట్లు అనిపిస్తూంది , పైగా ఎడం కన్ను చాలా వేగంగా కొట్టుకోడం మొదలయింది . నాలుక మీద పాట ఎటోవెళ్లిపోయింది , గొంతులో తడి ఆరిపొతోం ది . గుండె అతివేగం గా కొట్టుకుంటూంది . అడుగులో అడుగులేసుకుంటూ ఇంటిమెట్లు ఎక్కాను . అంతే ! ఒక్క రెక్కపుచ్చుకుని మా అమ్మ లాగి ఇంట్లొకివేసుకుని పారిపోకుండా తలుపు గడియ పెట్టింది . నా రెండు చేతులూ వెనుకకు విరిచి చాంతాడు తో గట్టిగా కట్టేసింది . ఇప్పటి మన సంగీత విద్వాంసుడు"శివమణి " , ఆరోజుల్లోనే మా అమ్మను పూనినట్లు గా నన్ను చితకబాదింది దాదాపు 15 నిముషాలు . నేను చెప్పడానికి చాన్సు లేదు . మరోప్రక్క మద్దెలదరువు , ఎలా చచ్చేట్టు . ఎవరైనా రక్షిస్తారోఅన్నా ... ఇంట్లో ఎవ్వరూ లేరు . పైగా మర్దనా జరిగేటప్పుడు ఇంట్లో వాళ్ళు కలగచేసుకుంటే వాళ్ళకీ శిక్షలో "తాయిలం" తప్పనిసరి . నాకేకలు విన్న వెనుక ఇండ్లల్లో ఆంటీ మా తలుపు తీయమని తలుపుకొడుతూఉంది . అప్పటివరకూ నా తుప్పు రేపుతున్న మా అమ్మ "చావు ...చావు వెధవ " " నువ్వు ఛస్తే పీడా విరగడ అవుతుంది ".... అంటూ కొడుతూనేవుంది ....... ఒకప్రక్క వాత లు యెర్రని పొంగులుగా తేలి మంట , నొప్పి .నా ఏడుపు ఎక్కువవుతూనే ఉంది . మా అమ్మ ఒక్కసారిగా తన చేతిలోని బెత్తం తాడూ ఒక ప్రక్క పడేసి తన రెండూ చేతుల్తో నన్ను గట్టిగా తన గుండెలకు హత్తుకుంటూ , తానూ ఎక్కిళ్లుపెడుతూ ఏడ్వడం .... నేను చూస్తూ , మా అమ్మను గట్టిగా పట్టుకుని "అమ్మ ...అమ్మా... ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయను ".... " నువ్వేడవకు .... ఏడవకే " అంటూ పరస్పరం ఏడిచాము . మనం ఒక తప్పు పనిచేస్తే అది తల్లితండ్రులకు ఎంత ? అవమానాన్ని ... బాధ ... మనోవేదన ను మిగులుస్తుందో ..... వేరేచెప్పక ఆరోజు తెలుసుకున్నాను . మా అమ్మ తాను ఎందుకు ఏడిచిందో జాగ్రత్తగా ఆలోచిస్తే మీరూ అర్ధం చేసుకున్నారు సుమా !
Saturday, 16 April 2016
మనిషి జీవితం విలువ ఓ "వెండి కంచం" ********************** *********** అది మాకు అతి దగ్గర బంధువుల ఇల్లు . చుట్టూ మొక్కల ఫెన్సింగు . కుక్క అరుపులు ... పనివారి విరుపులు . ఉద్యోగ రీత్యా అందిపుచుకున్న అహంకార మెరుపులు ..... కాలు ఫెన్సింగ్ ముందు పెట్టినప్పటి నుండి, వెనుదిరిగే వరకు తూచా తప్పక వినవలసిన వారి కుక్క సోది . అది మాంచి శీతాకాలం ... ఇలానే ఓ రోజు మాటల సందడి లో "శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ", సంభాషణలో చోటు చేసుకుంది . .. వచ్చే ఆదివారం అందరం ఇంట్లో ఉంటాం .వ్రతమ్ జరుపుకుంటే బావుంటుందనే ఆలోచన కలిగిన ఆ ఇంటిల్లాలు ప్రస్తావించారు, అందుకు వారి శ్రీవారూ ఒప్పేసుకున్నారు . సాధారణం గా మిడిల్ క్లాసు,అంతకంటే కొద్దిగా ఫై వాళ్ళు ఘనం గా చేయాలనుకుంటే ఇంటి చుట్టుపట్ల వారిని ముఖుల్ని పిలిచి చేసుకొంటే ఓ 10 నుండి 15 వేల రూపాయలు కవోచ్చునేమో . సదరు ఇంటి ఇల్లాలు దాదాపు 70 వేలు ఫై చిలుకు చేసిందంటే మీరు అర్ధం చేసుకొచ్చు . ఇందుకు బ్రాంహడ్ని మాట్లాడమని ఓ గుంత నక్క అయిన గంగి గోవు కు చెప్పారు ..... ఆవును పోలిన నక్క 7 మంది బ్రాహ్మల్ని పురమాయించింది . ఇది ఇలా ఉంటె నాకు ఆ ఇంటి ఇల్లాలు గారు పెట్టిన డ్యూటీ ఫలానా అని లేకపోయినా ! మరో గదిలో పెట్టిన పూజ వెండి సామాన్లు ఓ కన్ను పెట్టివుంచమని . పూజ మొదలయింది, సదరు బ్రామ్హలు, నవగ్రహపూజా, హోమం వంటివి ఎవరి కోరికమీద చేయాల్సి వచ్చిందో, కనీసం వారికి తెలి యక పోడం ముదావాహం . శ్రీ సత్యనారాయణ వారి పూజ అయ్యి, కధలు మొదలయినవి . వదరుబోతుగా ఉన్న కర్రపెత్తనం బ్రామ్హడు, సాక్షాత్తు కధలు చెప్పేప్పుడు గోడకి జారిగిలపడి,ఒక మోచేతిని భూమికి ఆన్చి చేతిలో చిన్న అగ్గిపుల్లలాంటివి విరుస్తూ మధ్య మధ్యలో రెండు కాళ్ళు గాల్లో ఊపుతూ కధలు చెపుతూంటే వైదిక0 గా పూజాపునస్కారా లకు అలవాటు పడినవారికి ఎంతగా ఒళ్ళు మండుతుందో అనుభావేస్తే గాని తెలియదు సుమా !...... ఈ తంతు గమనిస్తున్న నాకు మనసులో కీడు సంకితున్నది ఎందుకో ?... కారణం లేకపోలేదు ... వ్రతం చేసుకోండి అని ఉచితసలహా ఇచ్చింది నేను గనుక . ప్రతీసారి వెండి వస్తువులున్న గదిలోకి మా బంధువు గారే వెళ్లి కావలసిన , సామాను తెస్తూ పెడుతూ ఉంది . అంచేత ,నా పర్యవేక్షణ సన్నగిల్లింది.ఇంటి ఎజమానే కదా .. మాటికి వెళ్లి ఎం తెచ్చావ్ ఏమి పెట్టావ్ ? అంటూ అడిగితే ! వాళ్లకి ఎంతో చిరాకు రావచ్చు . నన్ను హరిచంద్ర నాటకం లో నక్షత్రకుని కంటే ఎక్కువ ... జీడి గింజ కంటే తక్కువగా అనుకునే ప్రమాదం ఉంది . అంచేత నేను ఆ సామానుల ఫై శీతకన్ను పెట్టాను . బయట ఆమె ఆఫీసు వాళ్ళు, స్నేహితులు ఆమె బదువులు, టౌన్షిప్ లోని వాళ్ళు షామియాన, క్రింద పూజ సమాప్తానికి ఎదురు చూస్తున్నారు . తదుపరి బుఫ్ఫే... ప్రారంభం . పూజ అయిపొయింది బ్రామ్హలు ... మూటాముల్లె సర్డుతూన్నారు . సంభావనలు ముట్ట చెప్పాక ఫలాయనమ్ చిత్తగించారు . మరోప్రక్క ఇంటికొచ్చిన పెద్దలు, ఇతరులు బుఫ్ఫే కి ఉపక్రమించారు . ఇంతలో ..."బావగారూ " పిలుపు .... జనంలో మరో బావేమో ?... !! . "బావగారూ "...... మ్... నన్నే " మిమ్మల్నే " " అమ్మ ఏంటి ? " .... ఒక వెండి ప్లేట్ కనిపించడం లేదండి " ....... " వెతుకు .. అక్కడే ఉంటుంది "ఆమె గారి భర్త సలహా .... " ఎవరు వెళ్ళారు " ఎవరూ వేల్లలేదే ?'" నేను ...... "అదికాదండీ ... ఎవరెవరు ? వెళ్ళారు సామాన్ల గదిలోకి ", "మీకు చెప్పాను చూడండని ".... " అదేనమ్మా.... నీవొక్కదానివే వెళ్లావు కదా ? " ఆమెకు కోపం వచ్చినట్లుంది "ఏమండోయ్ నాకు కోపం వస్తే బావుండదు " . " మీకు చెప్పాను కాపలా ఉండండని .. మీరేమో ఏంటో ? చెబుతున్నారు''. ...... "లేదమ్మా నీతప్పించి మరెవ్వరు వెళ్ళ లేదు కదా ?.. " అన్నాను . ఆమె రెట్టించి రూములన్నీ వెతుకుతుంది . నా సంచి తప్పించి . ఎందుకినా మంచిదని ఆ పని నేనే చేసాను . "హమ్మ " నా బాగ్ లో లేదు . ఊపిరి పీల్చుకున్నాను . ఆమె " ఏమో ? నాకు తెలియదు ... మీరే .... రెస్పొన్సిబుల్ ".... నా గుండెలు వేగం గా కొట్టుకోడం మొదలయింది .. సరికదా అని దాని రేట్ బట్టి మనీ కట్టడానికి మనస్సులో రెడీ .. కాని అది వెండి వస్తువు . దాదాపు 250 గ్రాముల కంచం .. 2013 లో వెండి కిలో రేట్ మీకు తెలియంది కాదు . ... మనస్సులో "దేవుడా ...దెవుదా దేవుడా " జపం స్టార్ట్ . ఇంతలో " ఎయ్ అడివి !(వాళ్ళా యన ముద్దు పిలుపు )హోమగుండం దగ్గర ఉంది ...ఇన్దా " తెచ్చి ఇచ్చాడు . నాకు సంతోషం కలగలేదు . కాని మనస్సులో దుఖం పొర్లు కొచ్చేసింది . మెల్లగా మనసు నెమ్మదించింది . కళ్ళు చెమ్మగిల్లాయి . ఎందుకంటే ?... అప్పటివరకు నా పెత్తనం , పెద్దతనం ... సలహాల పర్వం ... అనుభవం ఒక్క వెండి కంచం ముందు చేతులు కట్టుకోవాల్సి వచ్చిన0దుకు. మామూలుగానే పెళ్లిళ్లకు ,విందులకు .కులాసాగా వెళ్ళడం ఇష్టం ఉండదు ... ఒకవేళ వెళ్ళవలసి వస్తే వెళ్లి వచ్చాక ఇంటి భోజనం చేయడం ,నాకు అలవాటు ,. .. కారణం వేరే చోటు మెక్కడం నాకు చాల ఇబ్బంది . భోజనాలకెళ్ళి బ్రేవ్ మంటూ త్రేన్పు తుంటారు , నేను భోజనాలకు వెళ్లి నానా యాతనకు గురిఅయి ఇంటి ముఖం పడుతుంటాను .. నా జీవితం విలువ కనీసం ఒక్క వేదికంచం కి సరితూగ లేక పోయినదని ఇప్పటికీ గురుత్ చేసికొంటూ ఉంటాను ..... భోజనాల ఉభయ బ్రస్టు ...ఉప్పర సన్యాసం మరో సారి చెబుతాను .... మద్దూరి . రవిబాబు
Tuesday, 12 April 2016
చేసిన తప్పుకు "దండం " తో సరి ************************ అదో చిన్న టౌన్ నేను టీన్స్ లో ఉండగా అన్నమాట . నాకున్న మంఛి మిత్రుల్లో, ఓ మరీ మంచి మిత్రుడు ఉండీవాడు. వాడికి నేను పెట్టిన మారు పేరు "రఘు'. సాధారణంగా వాళ్ళు భాగ్యవంతులు .వాడి దగ్గర ఎప్పుడూ డబ్బులు పుష్కలంగా ఉండేవి . నాకు కుషామత్ (జల్సా) చేయడం వాడికి ఓ సరదా . ఇద్దరం బాగానే చదివేవాళ్ళం . టూష న్ కూడా ఓకే చోటు ఇళ్ళు ఎదురెదురు .వాళ్లకి పెద్ద గార్డెన్ప్ర,ప్రహరీ ఉండేవి. మా ఇల్లు సర్వసాధారణంగా,సామాన్యం గా ఉండేది . మేమిద్దరం అల్లరి మాత్రం అతి చెత్తగా చేసే వాళ్ళం . ఉదాహరణకు :1. ప్రైవేటు క్లాసు రాత్రుల్లో ఉన్నప్పుడు,అందరికంటే ముందు ,ఇంటికి పోయేప్పుడు క్లాసు మేట్స్ చెప్పులు ఎడమ లేక కుడి చెప్పు దాచేయడం ... వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాకో సరదా. 2. ఒకరి పుస్తకాలూ వేరే వారి సంచిలో పెట్టడం ... ఇలా చాల చాల అల్లరి కనిపించకుండా వినిపించకుండా చేయగల సిద్దహస్తులం .. రఘు, వెనుకుండి నాతొ చేయించే వాడు . వాడు ఏమి చెబితే అదిచేయడం నా వంతు . మేమిద్దరం పైకి చూడ్డానికి,నోట్లో వెలుబెడితే ఏమి? చేయాలో కూడా తెలియని అమాయకుల్లా కటింగ్ ఇచ్చేవాళ్ళం . ఒకరోజు చెప్పులు దాయటం పెద్ద సమస్యగా మారడం,రాలుగాయి, ని పట్టుకోలేక పోడం సమస్యగా మారడం వల్ల, మా టూషన్ మాస్టారు (చెప్పులు వద్ద ఒక మనిషి +లైట్ తో కాపలా పెట్టారనుకోండి ....!! )... కొంచెం కటి నంగానే తిట్టాడు (పరోక్షం గా) .సరే చెప్పేదేముంది రఘు కనుసైగ ..... అర్ధమయింది విషయం . మాస్టారు గార్కి ముహూర్తం పెట్టాలి . విశ్రాంతి సమయం లో ప్లాన్ చేసి రెడీ అయ్యాం . ప్రైవేటు క్లాసు అయిన తరువాత ,అందరికంటే ముందు బయటకు వచ్చేది మేమిద్దరమే . ఆరోజు ప్లాన్ ప్రకారం మాస్టర్ గారి సైకిల్ రెండు టైరు గాలి తీసి వాల్ పిన్ తో సహా ప్రక్క బావిలో పడేసాము . పాపం మాస్టారు రాత్రి ఇంటికి పోవాల్సిన ప్పుడు, పడిన ఇబ్బంది వర్ణనాతీతం . ఆ టైం లో చిలిపి ఆనందం పొంది ఉండవచ్చు . మేమిద్దరం చేసినపనులు ఎంత ఘోరంఅయినవో ఇప్పటికీ మమ్మల్ని మేము క్షమించుకోలేనివి . మంచి తల్లితండ్రులు, తెలివైన తోబుట్టువులు ఉన్నప్పటికీ,తెలుసుకోవాలన్న ఆలోచన స్వీయ స్పందన లేకపోడం , సంఘం లో ..... తోటివారి పట్ల ఎలా మెలగాలో క్షుణ్ణంగా తెలియకపోడం , అంతా మాకూ తెలుసు , మేమే పండితులం, మాకు ఎదురే0టి? లాంటి కుహనా ఆలోచనలు బహుశా, కారణం అయిఉండొచ్చు !... ఇప్పటికీ మా మాస్టర్ గారికి క్షమాపణలు చెప్పుకుంటూన్నాం . ఇప్పటి మాధ్యమాలు అప్పుడు లేవు ..... అన్నీ విషయాలు విడమరిచి చెప్పడానికి ,తెలుసుకోడానికి . బాధాకరమైన విషయం ఏంటంటే ? .... చీకట్లో చేతికి దొరికిన కాలి జోడులో ఒకటి ప్రక్కనే ఉన్న కారు చీకటి మైదానం లోకి ,బలం కొద్ది విసిరేవాళ్ళం . పాపం అవి ఎవరి జోడో వాళ్ళు దేవుడో అంటూ రాత్రంతా క్లాసు రూం లో వెతుక్కొని ,కుక్కలు ఎత్తుకు పోయాయి అని నిర్ధారణ జరిగాక ,మరో క్రొత్త జత కొనుక్కునేవారు . క్రొత్త జతవారిని ఒదిలేవారం . ఆ పిచ్చి పనులు జ్ఞాపకం వచచ్చినప్పుడు, కొద్దిగా నవ్వొచ్చినా, వెంటనే వాటి తాలూకు శాపనార్ధాలు, తిట్లు , మంగళహారతులు ... మనస్సుకు ఏంతో వేదన కల్గిస్తూంటాయి . మిత్రులందరూ క్షమిస్తారని ఎప్పుడూ అనుకుంటూ... శలవు ... రవిబాబు . మద్దూరి
Sunday, 27 March 2016
" నిన్ను నీవు నమ్ముకో"
++++++++++++++++ మొదటి లాట్ సామానులన్నీ లారీ లో పంపాను . దాదాపు మూడు రోజులు నిర్విరామం గా నా పరిధిలో శ్రమించగా దాదాపు 14 ప్యాక్ లు తయారయ్యాయి . వార్ ఫుట్ లో హైదరాబాద్ ఒదిలి విజయవాడ వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది . ట్రాన్స్ప్పోర్టోళ్ళ పుణ్యమా అని క్షేమంగా చేరాయని మెసేజ్ కూడా వచ్చింది .జీవించడా నికి క్రొత్త ప్రదేశం .పెద్దగా పరిచయస్తులు లేరు .శ్రేయోభిలాషులు అసలే లేరు . కొత్త ఇల్లు అ నుండి అం అః వరకు తాయారు చేసుకోవాలి మరి. నాకున్న ఒక్కటే బలం సాయి . రెండో బలం ఆస్వామి ప్రసాదించిన వారు . రెండో లాటు ఫానులూ,డ్రం సెట్ సిలికాన్ టాప్స్ .... ఇంకా చిల్లర మల్లర సామానులు . మొదట అవి తీసుకుపోడానికి వీలు పడక "విశాల్ " ఇంట్లో పెట్టా !...... ఆ సామాను తీసుకెళ్ళే సమయం వచ్చింది . అలానే కారూనూ . పెద్ద పండితుడిని కాదు గాని . పసుమర్తి రవి ని అడిగాను .పాపమ్ అతను తన సహజ ధోరణిలో నసుగుతడే గాని తేల్చడు . ఇంట్లో సలహాలు చాలా సావకాశం గా ఉంటాయి . మన స్పీడు కొద్దిగ తట్టుకోలేరు కూడా . 2 నెలలు ఏదేదో అక్కౌంట్ లో తింటూ కూర్చో వాల్సి వచ్చినదానికి ఆ అంతరంగం ఎంతగానో నొచ్చుకుని సరయిన నిద్ర కరువయ్ యెద బరువయి షేక్ . చిన మస్తాన్ పరిస్థితి గా ఉండేది . నిజం గా చెబుతున్నాను ఆరోజు మార్చ్ 5.వ తేది . ఆ రోజు తదుపరి ఒక్క గంట కూడా నిస్సహాయం గా ఉండకూడదూ అనే సకల్పం పట్టుదల పెరిగింది నాలో . నాకు లెర్నింగ్ లైసెన్స్ కూడా కనీసం లేదు . నా జీవితం లో ఎప్పుడూ హైవే ఫై య చోదనం లేదు . ఎన్నోసార్లు వేరే వాళ్ళ డ్రైవింగ్ లో ప్రయాణించి ఉండొచ్చు . "సాయి రేపు ఉదయం నేను కారు లో రెండో లాటు సామానులు తీసుకుని విజయవాడ చెక్కేయాలి ... షిరిడి లో నువ్వు ఏకాదశ సూత్రాలు చెప్పావు కదా !...??... ఎవరైన ఎపుడయినా సహాయము సలహా అడిగి నంతనే నేను ఎప్పుడూ అప్రమత్తుడనే.. అన్నావ్ ...కదా ..? ఆ బెసులో రేపు నన్ను డ్రైవింగ్ చేయించు క్షేమం గా గమ్యం చేర్చు ". .... అనుకుంటూ కలతలో నిదురోయాను .... కొద్ది సేపటికే అలారం ట్రింగు !.... ట్రింగు .... సమయం (మార్చ్ 6) 4.30 తెల్లవారు ఝాము . స్నానం చేసుకుని బాబాకు మరో మారు గురుతు చేసి 5. 05 గంటలకు స్టీరింగ్ పట్టుకుంటే ఒక చోటు బిస్కత్తులు తినడానికి ఆపాను +పెట్రోల్ కొట్టిన్చుకున్డానికి ఆగాను . అంటే 10. 55 నిముషాలకు గొల్లపూడి చేరుకున్నాను . కృష్ణ బారేజు డివెర్షాన్ వల్ల నా చోటుకు 11. 30 కి చేరాను .ఇక డ్రైవింగ్ గురుంచి : నా సామాను నేను తప్ప కారులో మానవ మాత్రులు ఎవ్వరూ లేరు . నేను స్పీడు 70 కి తగ్గలేదు ... 110 kmph కు మించి పోలేదు . ..... దారిపొడుగునా నాకు నేనే జీవితం లో తోడూ నీడా ... ఎంతమంది చుట్టూ ఉన్నా కూడా ...!! ... అన్న విషయం ... జీవితం ఇక మీద జీవితం ఎలా ? ఉండబోతుందో నన్న ఆలోచనలతో "రాదే రాధే " భజన్ వింటూ ... కొన్ని తపోరి పాటలూ వింటూ .... హైదరాబాద్ లోని ఆవేశాలు .. కావేసాలకు నన్ను గురిచేసిన మనుషులు ..... నన్ను ఎంతగానో ప్రేమించిన వాళ్ళు ... 25 సవత్సరాల క్రితం హైదరాబాద్ కు ఇలానే మల్కాజ్గిరి ప్లాట్ఫారం ఫై ఇలానే 8 సామానులతో ... దిగినప్పుడు .... మరిన్ కొన్ని సామానులు దించు కో లేని పరిస్థి గమనించి రైలు బండి నాకోసం ఆపి సహకరించిన సదరు డ్రైవర్ ను, నా జీవితం లో ఎప్పుడూ మరిచిపోను . అలానే నాకు మాట సాయం, చేదోడూ వాదోడుగా ఉండేవాళ్ళు బహుకొద్ది. ఉద్యోగానికి రాజీనామా చేయకముందు ఎంతో మంది. చేసాక సంప్రదిo ప్లుపులు ఉండవుకదా..?...!. హైదరాబాద్లో చుట్టాలు ఉన్నప్పటికీ వాళ్ళ ఇళ్లకు వెళ్ళకుండానే పెంచింది అమ్మ, నాన్న సరేసరి వాళ్లంటేనే బుసలు కొడతారు... కొత్తప్రదేశం భయంలేదు శ్రీబాబానే చూసుకొంటారు భయం నాకేంటి ? సద్గురువుకు పగ్గాలు అప్పచెప్పాక చింతకు తావులేదని సాయి మాస్టర్ ేేపుడూ చెబుతుంటారు. బహుశా నా అవసరం ఎవ్వరికీ లేకపొచ్చు, కానీ జీవించినంత కాలం మన నుంచి కుటుంబంలో డబ్బు అవసరం ఉంటుందికదా...?నేను బ్యాంకు దగ్గర ఎప్పుడూ చూస్తూ ఉండే వాడిని. వయసు అయిపోయిన పెన్షనేర్స్ ఎప్పుడూ ఒక అటెండెన్ట్ట్ ను తెచ్చుకుంటారు... పెన్షనర్లు బట్టలు చిరిగి, వెలిసిపోయి, పాత బడిన కళ్ళజోళ్ళు,కుట్టిన కళ్ళజోళ్ళూ,వంగిన ఆహార్యం, భయం భయoగా .. చూపులూ ఉన్న వాళ్ళు ఒ ప్రక్క కూర్చుంటే... అటెండెన్ వారి సహాయకులు హడావిడి ఎక్కుగా చూస్తాం... మనకు తెలిసినోళ్లు, మనం తెలిసినోళ్లు, నమస్కారాలూ, ఆలింగనాలూ హైద్రాబాద్ లో చాలా ఎక్కువ.... కానీ హైద్రాబాద్ ఇరన్ చాయ్ కు ,స్నేహానికి పెట్టింది పేరు. నాకు స్నేహితులు, పరిచయస్తులూ విపరీతం.. పైగా వారందరినీ వదిలేసి కొత్త చోటకు... బ్రతకడానికి వెళ్ల డం బాధాకరం.... కానీ నా జీవితంలో ఇది బహుశా పెద్ద మలుపు.హైద్రాబాద్ లో నన్ను రిసీవ్ చేసుకునే జీవి ఒక్కళ్ళూ లేని రోజున, ఒక విధంగా చెప్పాలంటే, దిక్కులేని రోజున నాకు, ఆశ్రయం కల్పించిన సహా సీనియర్ ఉద్యోగి "రమేశ్వర రావు బావగారు" వారి సహాయం,జీవించినంత కాలం ఎప్పుడూ గురుతున్చుకుంటాను .. నాకు మిగిలిన తియ్యటిజ్ఞాపకాల్లో పదిలపరుచుకుంటాను .. నాకు మంచి జ్ఞాపకాలను మిగిల్చిన శ్రేయోభిలాషులు చరస్మరనీయులు. నామనుషులుగా ఉండి కూడా, నా ఆశ్రయం పొంది కూడా, నాకు నమ్మకద్రోహం చేసి ..... దానివలన కలిగిన వేదనలూ, సంవేదనలకూ ...... కలతకు గురి చేసి , ప్రపంచం లో ఎలా ? బ్రతకాలో పరోక్షంగా నేర్పించిన మహానుభావులు క్షేమం గా ఉండాలని ఇప్పటికీ కోరుకుంటున్నాను . ....... అనుకుంటూ ఎలా ? నా డ్రైవింగ్ సాగిందో కద????.... !! మీరూ డ్రైవింగ్ చెయ్యండి .... బాబా గారిని అడిగి మరీ చెయ్యండి ... బైబిలు ల్లో జీసస్ అంటారు "తట్టుడి తెరవబడును.... అడుగుడీ ఇవ్వబడును"....అంటే వెరసి.... అద్రతతో.... చేతులు జోడించి చేసే ప్రతీ సవ్య మనవీ ...ఆ పరమాత్ముడు ఆలకిస్తా డని....అర్ధం.
Saturday, 30 January 2016
......." కాంపస్ లో వీరతాడు...!!...??''.....
ఈ టైటిల్ చదివిన వారెవరు ఐనా .. ఏంటిది ? పసుపుతాడు.... మొలతాడు .... లా అనుకొనడం పెద్ద వింత ఏమి కాదు సుమా ! అదో చాలా పాతబడిన గొప్ప తెలుగు సినిమా ! తెలుగు సినీ చరిత్రలోనే ఓ కళాఖండం గా చెప్పుకొచ్చు కూడా . మహాభారతం లోని భీమని కుమారుడు పాత్రలో మెప్పించిన ''ఘటోత్కచు'' ని డైలౌగే ఈ వీరతాడు . అతని దగ్గర సహాయకులు గా ఉండే ఇద్దరు వ్యక్తులు మాట్లాడిన ''ముష్టి''(నోరు తిరుగక )భాషకు సదరు ఘటోత్కచుడు ''వీరతాడు '' అనబడే , చాంతాడు గొప్పగా తన గురువు ద్వారా మేడలో వేయిస్తాడు అన్నమాట !.... ఒక్క పనికిమాలిన భాష ప్రయోగం ద్వార ... వెరసి, తలమాసిన ... రాజు గారు పనికి మాలిన పనిగా చేయించే పనే ''వీరతాడు కాన్సెప్ట్''
మరి మనం కూడా అదే పంధా అనుసరిస్తున్నాం మన విశ్వవిద్యాలయాల్లో అందుకు ఉదాహరణగా ఈ మధ్య లో జరుగుతున్న కొన్ని సంఘటనలు చెప్పుకోచ్చు . ప్రతీ చిన్న విషయాన్నీ బూతద్దం లో చూపెడితే, చీమ తల కూడా ఓ భూతం లా కనిపిస్తుంది . హెచ్ .సి . యు లో జరిగిన సంఘటన తప్పక క్షమించరాని విషయమే మరి. కానీ,.. కావు ..కావ్... అంటూ రాజకీయ నాయకులు విద్యార్ధుల్ని కా కా పట్టడం,రాజకీయవిలువలు నైతికంగా,దిగాజారినట్లు మరోమారు రుజువు చేసాయి . ఒకో రాజకీయ నాయకుడు ఒకో రంగు అద్దాడు .
మానవత్వం అనే పదార్ధానికి .. రంగూ ... రుచి ...వాసన, అనబడేవి ఉండవు . అన్యాయం ఎవరికీ జరిగినా అది అన్యాయమే .కులము .. మతం .. జాతి బట్టి న్యాయం ఎప్పుడూ నిర్ణయించ బడవు . ఉదాహరణకు అలా గాని జరిగితే ? అది ''ఆటవిక '' న్యాయం అవుతుంది . అటువంటి పరిస్థితుల్లో పనిగట్టుకొని ఒక మనిషిని ఆకాశానికి ఎత్తేయడమే ''వీరతాడు '' గా , ఇక్కడ మనం చెప్పుకోచ్చు . ఒక సామాజిక వర్గానికి చెందాడని కొందరు చెబితేమరోరు .. మరోవిధం గా చెప్పుకొచ్చిన విషయాలు మనం చానళ్లలో విన్నాం .. చూసాం !!...ఈ దేశం ఒక్క సమాజిక వర్గానికి సంబందించినది ఎప్పటికీ కాదు. ఎన్నో మతాలూ, కులాలు,భాషలూ ,వెరసిన సమ్మేళనమే కాని అసలు సామాజిక వర్గం కు సంబందించిన వాళ్ళు రాలేదుగాని. వీరతాళ్ళు తీసుకుని ఉగ్రనారసింహం లా గల్లి నుండి డిల్లీ వరకు ఉపన్యాసాలు దంచినవారే . పాపం ఆ చిరంజీవి కాస్టు సర్టిఫికేట్ తో సహా షూట్ అయ్యాయి చానెళ్ళలో . ఒక మనిషికి అన్యాయం జరిగితే సాటి మనుషులుగా మనమందరం సమైక్యం గా గర్హించాలి .కాని జాతి, కులం ,మతం ప్రాతిపదికన పోరాటాలు జరుపుతూ పొతే ?..! యావత్ భారత జాతి నిర్వీర్యం అయి దేశ సమగ్రతకు, సగటు వ్యక్తిత్వానికి ముప్పు ఎంతో దూరంలో లేదు . దాని తాలూకు గొడ్డలిపెట్టే ... ఇప్పటి భారత్ దేశం లో బోర్డర్లో జరుగుతున్నఅస్తవ్యస్త'' నిఘా '' ... నీతిమాలిన క్రియలే, ఒక తార్కాణం
అసలు కేజ్రివాల్ హైదరాబాద్ కు ఎందుకొచ్చినట్లో? కనీసం తనకయినా తెలిస్తే సంతోషమే . ఆ చర్య బట్టే తెలుస్తుంది .. డిల్లి ముఖ్య మంత్రి ఏంత విరామం గా ఉన్నారో ... అన్న విషయం ... పైగా అటు బి జే పి ఫై అక్కసు ..ఇటు కేంద్ర మానవవనరుల మంత్రి ఫై తనకున్న ''కిచ్ కిచ్ .."లు తీర్చుకునే ప్రయత్నమే కేజ్రివాల్,రాహుల్ ఆగమనం , గా గమనించాలి . ఇటు తెరాస.. అటు టి. దేశం అప్పట్లో ఇటు ఒక్క స్టేట్మెంట్ ఈయలేదు . కాని తెరాస ఏం.పి ., ఒకరు సమయానికి దివంగత రీసెర్చ్ స్కాలర్ కు అన్యాయం జరిగినట్లు చెప్పారు . అంతవరకూ బావుంది . మిగతా నాయకులు అందరూ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో కి జొరబడడమే బహుశా నిబంధనలకు విరుద్దం గా చెప్పుకోచ్చు .... ఈ విషయం ఇంట దూరం అస్సలు వచ్చేదే కాదు ,మొదట్లోనే సి ఎమ్ గారు చక్కదిద్దినట్లయితే . పైగా జనం గుండెలకు హత్తుకుపోయేలా మాట్లాడగలిగిన నైపుణ్యం ఒక్క కెసిఆర్ కె సొంతం .. వీళ్ళ పుణ్యమా అని,మసకబారుతున్న కాంగ్రెస్ చిత్రపటం తాలూకు రంగులు మరోమారు దేశవ్యాప్తం గా మెరుపులు పుంజుకుంది . ఒక్క విధంగా చెప్పాలంటే ''రోహిత్ ''కు ఉన్న స్వతంత్ర భావాలు దృష్ట్యా ,తన ఆత్మబలిదానం ఇంత ''రగడ'' అవుతుందనే విషయం తను పరిగణలోకి తీసుకుని ఉంటే ఈరోజు ఇంత భారీగా ఈ విషయం రూపాంతరం చెందేది కాదేమో ?..!! అటువంటి పరిస్థితుల్లో అతని ఆత్మ ఎంత క్షోభిస్తుందో ? కదా !!. ఇహ బి జె పి, అనవసరమైన విషయం లో రాజకీయ కోణం చొప్పించి భంగపాటుకు గురికావడం ముదావాహం ''దారినపోయే కంప ''ఉదాహరణ .. అంచేత కాంగ్రెస్స్ బోలెడంత మైలేజ్ పొందింది . కాంగ్రెస్స్ వాళ్ళు రోహిత్ ను గాంధీ దక్షిణ ఆఫ్రికా విషయం తో పోలిక ససేమిరా బావోలేదు . అస్సలు గాంధీ విషయం దక్షిణ ఆఫ్రికా లో ఏమిటి ? అన్న విషయం మన ''అరుంధతీ రాయ్ ''ని అడిగితెనో, తన రీసెర్చ్ లోనో పేర్కొన్న విషయాలను సమగ్రం గా తెలుసుకుంటే బావుంటుంది . ఐతే పాపం తిలా పాపం తలా పిడికెడు చందాన, వైస్ చాన్స్ల్లోర్ పరిస్థితి ''బెగానిషాదిమే ''..... ఛాన్సలర్ దివానా ??..!! అన్నట్లు ... మొదలయి తదుపరి .... ''జోర్ కా జట్కా దీరేసే లగా ''లా ... ముగిసింది . .... సో ... విద్యార్దులారా !! .... ఆచార్యుల్లారా !! .. దయచేసి ... రాజకీయనాయకుల ఊతంతో '' క్యాంపస్ ల్లో వీరతాడు వేయడం ... ఆకాశానికి మోసేయడం మానండి ''. ఎందుకంటె ? ప్రతీ మనిషి మంచి చెడుల సమ్మేళనం, తెరముందు ,తెరవెనుక అనే విషయాలు మనం మరచి పోగూడదు . కులం మతం .. జాతి ... వర్ణం అన్నవి ప్రాతిపదికలు గా కాంపస్ లు ఉండడం నిజం గా మన దౌర్భాగ్యం అని చెప్పక తప్పదు. ఇటువంటి వక్ర భాష్యం ను తిప్పికొట్టి మనమందరం సమైక్యం గా పోరాడుదాం . కులం మతం ఎక్కడ అవసరమో అక్కడ మాత్రం ఉపయోగిద్దాం .... దయ చేసి కాంపస్ ల్లో ఉపయోగించకండి అని మనవి ....
రవిబాబు. మద్దూరి
Subscribe to:
Posts (Atom)




