totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l
- ravi babu.Madduri
- Totally a ground person with equality........
Saturday, 29 November 2014
Monday, 10 November 2014
'' మంత్రులే కంచె మేస్తే ...!!..??..''
పరిస్థితి తీవ్రం గా ఉంటుంది మరి . ఈ మధ్యలో రాజకీయ నాయకుల్లో విచిత్ర వేషాలు .. కుహనా రాజకీయులు .. సంసృతి అర్ధ గ్యానులూ .... రక ,రకా లయిన వారు మ 0త్రులుగానూ చేరుతున్నారు .వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ హైందవ సంస్కారం లో పెను మార్పులకు శ్రీకారమా ? అన్న భావన కలగక మానదు . ముఖ్యం గా సంస్కార సాంప్రదాయవాదులు ముక్కు మీద వేలేసుకోనక తప్పదంటున్నారు . మొన్న ఆ మధ్యలో కేరళ రాష్ట్రం లో ఒక గాయకుడు ''జీన్ '' ప్యాంటు ఎ సంసృతి ?అన్న ప్రశ్నకు ..... దాదాపు అభ్యుదయవాదు ల్లా ఆడవారు విరుచుకుపడడం మనం చూసాం . ఆ గాయకుడు మరో మతానికి సంబంధించి నప్పటికీ హైందవ గురువును మెప్పించి సo గీత విద్య ను అభ్యసించిన ''తాత్వికుడు '' . కనీసం అతని విద్యకు ... అనుభవానికి ... వయస్సుకూ కొద్దిపాటి గౌరవం కూడా ఇవ్వక .. నా నావిధాల కామెంట్ చేసారు ఈ లోకం లో . మన హైందవ సంస్కృతి ... కట్టుబాట్లు .... ఎటు పోయాయి ? . కర్పోరిటిజo ... అంటే మన సహజ నాగరికత ను నిందించడమే నా ? ఇప్పటి పుంతలు తొక్కుతున్న నూతన విద్యావిధానం ... చీ రా కుర్తా ... ఫై జామా ... కుర్తి .... జాకెట్ ..... పమిటా వంటి వాటి నుంచి జీన్ ప్యాంటు ... టి-షర్టు మధ్య తేడా ! ఒక అమెరికా ....ఒక భారత నారి మధ్య లో ఉన్నంత తేడా ఉంది . అమెరికన్ ఫాషన్ డ్రెస్ లో స్త్రీ అంగాలు ప్రస్పుటం గా బజార్లలో వినో దాన్ని ... విపరీతార్ధాల్ని పంచుతాయి . కాని భారతీయ నాగరికత లో దుస్తులు స్త్రీ శరీరాన్ని సౌష్టవాన్ని మరుగుపరచి, ధరించినవారికి నిండుదనాన్ని ... గౌరవాన్ని, తెస్తాయి అన్న విషయం లో, ఎటువంటి సందేహం లేదు . కార్పోరెట్లో నూ సాంప్రదాయ బద్ధం గా కట్టూ బొట్టూ ధరించేవారు లేరా ? . మహాత్మా అన్నట్లు ''అర్ధరాత్రి '' స్వతంత్రం వచినప్పుడే స్త్రీ జీ వితానికి ముక్తి ... విముక్తి . అప్పుడు ఈ భూమి ఫై ఎటువంటి ''నిర్భయ '' చట్టాలు అవసరం లేదు . పాశ్చాత్య దేశాల్లో తుపాకులు ''గుట్కా '' పొట్లం లా జేబులో వుంటుంది . కావలిసిన అమ్మాయితో ఇష్టం వచినట్లు కలియ తిరిగే నాగరికత వాళ్ళది .ఈ డేటింగ్ సంస్కృతి ఎక్కడిది ? భారత దేశం లో స్త్రీ కి జాగ్రత్త ఎంత అవసరమో ... పురుషుడికీ అంటే అవసరం . కానీ చట్టాల్లో పెనుమార్పులు అవసరం . అలానే ఎవ్వరి కి చట్టాలు చుట్టాలు కాకూడదు . మొన్న ఒక కాబినెట్ హోదా గల మంత్రిగారు ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటనప్పుడు ''జీన్ వేస్తె ? తప్పేంటి ..!! రేపులు చేయబడ్డ వారెవరూ, జీన్స్ వేసినవారు కాదు '' అన్నట్లు ... దాదాపు అన్ని వార్తా పత్రికల్లో మనం చూసాం . అదే మీటింగులో ఉన్న మరెవరూ .. ఆ స్టేట్మెంట్ కు, అభ్యంతరం చెప్పలేదు సరికదా ... గొప్పగా తప్పట్లు కొట్టారు .... అంటే జీన్స్ వేసుకున్నా, రేపు లు కావు ... లేక అందరూ జీన్స్ వేస్కోండి ! అన్నది మంత్రి గారి భాష్యమా ?... బహుశా ! ఆ మంత్రి గతం లో విదేశాల్లో చదువుకున్న తాలూకు పండిత్యమా, లేక లేక మంత్రి పదవి చందామ ? జనం అర్ధం చేస్కో క ముక్కుమీద వేలేసుకున్నారు.సదరు మంత్రి గారు దూకుడు మీద ఉన్నట్లున్నారు . మరి మంత్రులు, నాల్గు మంచి మాటలు చెప్పాల్సింది పోయి .... జనా న్న్ని రెచ్చగొ డుతూ ... తాము చాలా ఉన్నత భావాలు గల వారి లా ఫోజులు పెట్టడం కాదా ? . లేక యువతలో మయిలేజీ కోసామా . ...?? .. సదరు మంత్రి తమ కాబినెట్ లో ఉన్న సుష్మా స్వరాజ్ గారి ని చూడలేదా ?? .. సుష్మా స్వరాజ్ ను చూస్తే ఫక్తు ''హైందవ '' నారి కళ ఉట్టిపడుతూ ... రవివర్మ చిత్రం లా ఉంటారు . సదరు మినిస్టర్ గారు, ''హిందూత్వ '' అని కేకలు పెట్టే ''భారతీయ జనతా పార్టీ'' లో ఉన్నారన్న సంగతి .. ఇటువంటి స్టేట్మెంట్స్ బహిరంగ సభల్లో ఇస్తే ... పార్టీ కి నష్టం అని మరిచిపోయినట్లున్నారు . ఇటీవల ఒక నట సామ్రాట్ మనువడి క్రొత్త సినిమా ప్రమోషన్ స్టేజి ఫంక్షన్ లో ఒక యాంకర్.... వేసు కొచ్చిన దుస్తులు చూస్తే.... మనకి అర్ధమవుతుంది సినిమాలు ... స్టేజి పెర్ఫార్మెన్స్లు ఎంత విచ్చల విడి తనాన్ని యువతకు నూరిపోస్తున్నాయో ...!!...?? ఏకంగా అక్కడి ప్రేక్షకులు ... అదీనూ ఆడవాళ్ళు ఎంత ఆనదోత్సాహాలు పొందుతున్నారో !!!! ..... అందుకే,ఈ భావాలున్న మంత్రులూ ! మీ పైత్యం మీవరకూ, ఫారన్ పోవాలనుకుంటున్న మీ పిల్లలవరకే పరిమితం చేస్కొండి అని ప్రజల మనవి .......................... '' విదేశాల్లో చదివిన సరోజినీ దేవినాయుడు ... శ్రీమతి ఇందిరా గాంధి ... నేటి బృందా కారత్ .... వంటి వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్ ..... ఇచ్చివుంటే .? ఈ దేశం ఇప్పటికి .. సర్వనాశ నం ... అయ్యివుండేది .... సోనియా ! ప్రియాంక వాద్రా లను మీరు చూడలేదా ..వారి కట్టు ఇప్పటికీ ఆదర్సమే ...!!! "" రవిబాబు . మద్దూరి ......
Tuesday, 4 November 2014
రైతు రక్తకన్నీరు అందరికీ కన్నీరు తుడిచే రైతు రక్తకన్నీరు పర్యన్తమయ్యే పరిశ్థితి ... అన్నపూర్ణ రాష్ట్రం లో దాపురించేట్లు గా ఇటు చానెల్స్ అటు ... ప్రింటిజ0 ... ఏకరువు పెడుతున్నాయన్నది యదార్ధం . ఆంధ్రరాష్ట్రం లో ఉన్నవారందరికీ తెలుసు , గతం లో తెలుగుదేశం స్వగతం లో నేరుగా, ''వ్యవసాయం '' తో వోరిగేది ఏంటి ? అన్న స్టేటు మెంటు . అది ఎవరన్నారన్నదీ, తెలుగు ప్రజలకు తెలుసు . ఆమాటను తూచా తప్పక, ఇప్పటి అదే ప్రభుత్వం అక్షరాలా ఆచరణలో పెట్టబోతున్నారా ? అన్నది అక్షర సత్యం . కొ0తమంది కుహనాలు కూర్చొని,ఢిల్లీ నుండి కొంతమంది కొజ్జా మంత్రులు,కొంతమంది కొజ్జా ఎంపీల సలహామేర రాత్రికి రాత్రి చేసిన' వి' భజన,లో అప్పటి కాంగ్రెస్ ''100000 కోట్లు '' ప్యాకాజే నేరుగా ఇస్తామని బల్లగుద్ది చెప్పింది .వారికి ఎందుకు వోట్ వెయ్యలేదు వీళ్ళకు ఎందుకు వేసారు ? ... అటువంటిది ఇప్పటి గవర్నమెంట్ వారు లక్షల ఎకరాలు అసలు సమీకరించడం అందరికీ అంతుచిక్కని విషయం . మాఫీ చేస్తామన్న రుణాలు,ద్వాక్రాల రుణాలు ఇప్పటికీ ప్రస్నార్ధమే . రాయలసీమ ఒక రాళ్ళసీమ . రాష్ట్ర రాజధాని ఎటూ పనికిరారాదని , రాయలసీమ లో చేపట్టలేదు . పంటపొలాలను ఆక్రమించి, కొస్తాలో అసలు కోతలన్నవి లేకుండా ఉండేందుకు వెరసి నారాయణ .. సుజాన చౌదరి కంకణం కట్టుకు న్నట్లు గా ఉన్నదని ఇటు రైతులు .. సామాన్య ప్రజలూ తల్లడిల్లు తున్నారు . దిక్కుతోచని,దిక్కులేని పక్షుల్లా అలమటిస్తూ సహాయానికి , సలహాకు నోచుకోక దుర్భర పరిస్తుల్లో , తుళ్ళూరు యెర్రబాలెం .. ఇంకొన్ని గ్రామాల ప్రజలు తింటున్న తిండి మాని రేయీ -పగలు భిన్నమయిన చర్చలతో సతమతమవుతున్నారు . నారాయణ , సుజానా చౌదరి లో ఎవ్వరూ రైతులు కారు .వ్యవసాయమ్ అంతకంటే చేయరు . ఇటువంటి వాళ్ళు కార్పో తెలివితేటలూ చూవించడం హాస్యాస్పదనీయం . నారాయణ విద్యాసమస్తల్లో ఫీజు అనే ప్రక్రియ యెంత ఘోరం గా ఉంటు0దో అందరికీ తెలిసిన విషయమే . అసలు విషయానికి వస్తే .. కోస్తాలో ఎక్కడ త్రవ్వినా 6 అడుగుల లో నీళ్ళు పడుతాయి,సారవంత మయిన భూమి కూడాను . ఇటువంటి భూముల్ని ''కాంక్రీట్ అడవులు '' గా మార్చే ప్రయత్నం తప్పక జరుగుతుందనే ! చెప్పాలి . ఇందుకు కొన్ని దుస్టామ్ తాల్ని చెప్పు కోవాలి 1)గతం లో తమిళనాడు రాజధాని కోసం ''మద్రాస్ '' ను ఎంచ్కున్నప్పటి ప్రజా భూముల తాలూకు బకాయిలు ఇప్పటికీ ''ఉష్ కాకి ''... 2)బెజావాడ నుండి మూడు రింగు రోడ్లు చాలు 10 రోడ్లు కావాలా ?ఇప్పటి కనదుర్గ వారధి లా మరో రెండుంటే చాలు .. పారిస్ లా అవసరం లేదు .... అసలు పారిస్ ల చేస్తామనే డబ్బా మోట తప్పించి,ఎవరూ కోరుకోడం లేదు . 3)రెండు పంటలూ .. మూడు పంటలు పండే సారవంతం అయిన భూమి ఉంది ... వీల్లిచ్చే ఎకరాకు 25000 ప్రతీ సంవత్సరం .. పశువు పచ్చి మేత రాదు ... మరి ఒకటి రెండు ఎకరాలున్న బక్క రైతు ఇంట్లో పొట్టలు ఎలా గడవాలి ?... కార్పోరిటిజం లో దోచుకున్న తేలిక రైతు బ్రతువు తెరువు ఎప్పటికీ కాదు . నిన్నటిదాకా పిల్లల దగ్గర,జలగల్లా ఫీజులు గుంజిన వాళ్ళను కమిటీ ... అధ్యయనం ... అని విదేశాలకు ఇతర రాష్ట్రాలకూ పంపి తే,ఫ లితాలు,ఇలానే ఏడుస్తాయి . 4)మరో పని చంద్రబాబు చేయవచ్చు గుంటూర్ పరిసర గ్రామాల్లో మొట్ట మొదట ఎంపీల , రియల్టర్ల,పెద్ద కామందుల,భూములను గుర్తించి,వాటిని ఈ ''పోలింగ్ '' లో నమోదు చెయ్యాలి . 5)ప్రస్తుత ఆలోచనా విధానాన్ని అమలు చేస్తే .. గీస్తే ... ఆంధ్ర ప్రదేశ్ లో ధాన్యం లేక ఆహార సమస్య భవిష్యత్తు లో రావచ్చు . ఛత్తీస్ ఘడ్ లో కొద్ది భూమి తోనే రాజధాని ఎర్పరుచుకోన్నార్ అనే విషయం మరవకూడదు . 6)కాలే కడుపుకు పట్టెడన్నం కావాలి,ఇన్ని విమానాశ్రయాలకు ఎవరికోసం ?7) దారిద్రరేఖ కు ఎగువన వున్న వారికి దిగువనవున్న వారిని చేర్చాలి ... ఎగువన ఉన్న వాడి ని దిగువకు చేర్చడం కాదు అధ్యనాలలో పొన్దుపరచవలసినది . 8)అటు కే సి ఆర్ ఫై సవాలుకు ప్రతిసవాలు చేస్తూ ఇక్కడి ప్రజల సమకాలిన ద్రుష్టి ని అగౌరవ పరుస్తూ వాళ్ళను దరిద్రులుగా తీర్చి దిద్ది ... ఉన్నవాడి కి మరింత చేర్చి ''అన్నమో రామచంద్ర '' అనే చందానికి గురిచేయడ మే ఈ సంస్కరణల .. ఉద్దేశ్యమా అని అన్ని వర్గాల ప్రజలు ప్రిస్నిస్తున్నారు . ఇందుకేనా? డిపాజిట్ పోయే స్థితి నుండి డిపాజిట్ లు పోగొట్టేట్లు తెలుగుదేశానికి ''వోట్లు '' వేసింద నే ప్రశ్న ? ఎప్పుడో ఉద్భన్న మయింది అందరిలో . 9) రైతులు ల పట్ల చంద్రబాబు చెయ్యకూడని నేరాన్ని మరోసారి ''మళ్ళి -మళ్ళి '' చంద్రబాబు చేయబోతున్నా రనేది నిర్వివాదాంశం !!!! 10) అసలు రియాల్టర్ అనే వాడికి ప్రభుత్వం తరుఫున చిన్నకారు ,సన్నకారు ఎందుకు ? భూములివ్వాలి ..!! దయా భిక్షగా, వారి ఫై ఆధార పడి , వాళ్ళిచ్చే ముష్టి రైతులకు ఏపాటిది ??...!! 11)చంద్ర బాబు ను 10 సవత్సరాలు పదవీచ్యుతుని చేసిన విషయం తొందర గా మరిచిపోయారు వారి అనుయాయులు . అందుచేత చంద్రబాబు .... వారి అనుయాయులూ మరోసారి చేతులు కా ల్చుకొ నక, ఆనక పట్టుకోడానికి ఆంధ్ర లో చివరికి కార్పొరేట్ గద్దల, వల్ల ఆకులు కూడా ఉండవు . ఎందుకంటె రైతులు కార్చిన స్థానం లో కన్నీళ్లు లేవు ....'' రక్తమే'' ఉంది గనుక.... !!! రవిబాబు . మద్దూరి
Friday, 24 October 2014
''మోడీ భారతీయం
...... !!'' ఉదయాన్నే లేచి కళ్ళు నులుముకుంటూ టీవీ పెట్టాను . ఒక్క సారిగా తత్తరపాటు కు గురి అయ్యాను . టీవీ లో ఒక అనూహ్యమైన న్యూస్ వస్తుంది . అదో ఛానల్ గోడమీద పిల్లివాటం దాని వాటం . ఈ మధ్యలో టీవీ చానెళ్ళ ఫై ముఖ్య మంత్రులు విరుచుకుపడడం పరిపాటి . ఆ భయం లో బెంబేలు ఎత్తిన సదరుచానేల్ కొన్ని ఊకదంపుడు కదంబ కార్యాక్రమాలు పెడుతున్నది . ఉదాహరణకు తప్పిపోయిన వాళ్ళను వెతకడం ... తల్లిబిడ్డలను కలపడం వంటివి . ఆ కోవకు చెందినదే నేను చూసిన ప్రోగ్రాం . కొంతమంది పదవులు ఊడినవారు .. పదవుల్లో ఉన్నవారు .. కూసింత ''లెన్సు '' ముందు కళా పోషణ చేసేవారు ... భూకబ్జా ఆద్యాత్మిక పండితులు ... ఇటు రాజకీయం లోను.. అటు ఇతర విషయాల్లో ఉభయ బ్రస్టుత్వం ... ఉప్పర సన్యాసం పొందినవాళ్ళు ను .... అందరూ . పొడవాటి చీపుళ్ళు పట్టి ఊడుస్తున్నారు . ప్రోగ్రాం పేరు ''స్వచ్ఛ భారత్ ''. అంతవరకూ బాగున్నది . కానీ ఊడుస్తున్న విధం చూస్తె చాలా గమ్మత్తుగా ఉంది . అందరూ సుబ్బరం గా మిల మిల లాడే బట్టలతో తళతళ లాడుతూ . ఊడ్చిన చోటు ఊడుస్తూ ... చాల ఆహ్లాదకరం గా కనిపించారు . '' స్వచ్చ భారత్ '' అనబడు కార్యాక్రమమం ఛానల్ షూట్ చేసి అ సమయం వరకే పరిమితం . తదుపరి జనగణమణ . ఎందుకంటే ఇక్కడ .. ఊడ్వడానికి ఏమి ఉండదు గనుక ... మహాత్మా గాంధీ చెప్పింది ఎవ్వడి బెడ్ రూమ్ వాడు ఊడుచు కొడం కాదు .. ఎవ్వడి టాయిలెట్ వాడు ఊడ్చ్కుని వీలుంటే ఊడవలేని .. వాడికి సహాయపడమని . తమాషా ఏంటంటే ? దాదాపు 50 మంది ఉన్నానాయకుల జూబిలీ హిల్స్ మొత్తం ఊడ్చ గలిఉ0డాలి . కాని నీడ పట్టున మంచి సిమెంట్ రోడ్ ను ఊడ్చారు . వాళ్ళని ఉడవనీయక , ఆ ఛానల్ p 2... రెచ్చిపోయి మరి ఛానల్ వైభవం చెప్పించడం కనబడింది, ఎందుకంటే ఆ చానెల్ స్పోన్సుర్ చేసి o దిగనుక .ఈ విధం గా దేశం లో ప్రతీ వాడు ఒక్క సంఘీక .. సామాజిక విషయాన్ని , తమ పరిధిలో తీసుకుని ,తమ స్వలాభానికి వాడుకుంటే ఈ దేశం గతి ఏంటి ? నిజం గా చిత్తశు ద్ది ఉంటె వీళ్ళంతా యాకుత్పురా ... దబిల్పుర ...ఉసుఫ్ఫ్ గూడా .... చాదర్ఘాట్ వెరసి పాతబస్తీ కి వెడితే .... అసలు అక్కడి ప్రజలు యెంత దుర్భరం ఐన మురికి వాతావరణం లో ఈ మహానగరం లో ఉన్నారో బోధపడుతుంది . జూబ్లి హిల్స్ ... బo జారాహిల్ల్స్ ... రాజభవన్ ముందు .... మహేంద్ర హిల్ల్స్ లో కాదు సుమా ! ఈ వన్నీ ధనికులకు ఉండే ప్రాంతాలు ... ఈ దేశo .. ఒకడి చెత్త వేరే వాడి స్థలం లో వెయ్యడ మనే కార్యక్రమము చెయ్యక పోవడం అనేదే పెద్ద ''స్వచ్చభారత్ '' '' కు '' నాందీ ... అదే అన్నారు గాంధీ ... మదర్ దేరేసా .... భారత దేశం మొత్తాన్ని ఈ విధం గా పరిశుబ్రం చేయడం ... గంగ ను పరిశుబ్రం చేయడమనే మహా ప్రణాలికలు వలన ఉన్న 5 సవత్సరాల మోడీ పుణ్యకాలం ఇలా గడిచిపోతుంది . ఇక పొతే దేశ సరిహద్దు భద్రతా ప్రణా ళిక ... ఆర్ధిక పరిపుస్టత ... వ్యాపార ... వాణి జ్య... ఎగుమతులు .... దిగుమతులూ .... విద్యారంగం .... పరిశ్రమలూ ... ప్రశ్నార్ధకం ? గా మిగిలే ప్రమాదం పొంచివుంది .... ఈ విధం గా '' స్వచ్ఛ భారతో లేక ... శ్రేమే వజయెతె '' లాంటి ఉబుసుపోని రంగాలకంటే ...... దేశ అవసరాలు ...ఉద్యొగితా .. ఫై మోడీ ద్రుష్టి సారించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు .ఉదాహరణకు ఐ టి రంగం లో కనిపించే ఆశుబ్రత వికృతం గా నాల్కలు చాచి '' స్వచ్చ భారత్ '' ను సవాల్ చేస్తుంది . కనిపించిన వాడికి చీపురు ఇవ్వడం వలన ఆ రంగం లో జీవనాధారం గా ఉన్నవారు కొంత అభద్రత కు , సోమరితనానికి ఉపక్రమించే ప్ర మాదం ఉంది ...ఇ లాంటివి, కొన్ని శ్రీ బాపూజి గారు చెప్పినవి స్వీయ బాధ్యతల లోనివి .ప్రస్తుత ప్రపంచ గమనం లో , జనాకర్షణ తప్పించి ఒరి గేదేమిలేదు .నాకు అపుడపుడూ ఐ టి వాళ్ళు బజార్లు శుబ్రం చేయడం చూసి ... నాలో నేను నవ్వుకుంటాను . కొంతమంది జీన్ పాంట్లు షర్ట్లు మురికి పట్టి క్రింద దేకుతూ .... సుందరముదరస్టం గా తగలడుతూ ఉంటాయి . ఎవరి ఇల్లు వారు శుబ్రం గా ఉంచుకొంటు ప్రక్కవాడి కి సహాయ పడడం బాపు ఉద్దేశ్యం . అంతే గాని చానెళ్ళ కెమెరాల ముందు రాజకీయ నాయకులు జాగింగ్ డ్రెస్ .... కద్దరు బట్టలు కట్టుకుని,నడుమువ0చాల్సిన అవసరం లేని పెద్ద పెద్ద చీపుళ్ళు తో ఫోజులు .. భాషణలు కాదు . బాపు చెప్పిన వన్నీ తూచా తప్పక ఏ రాజకీయ నాయకుడు చేసాడు ఈ భారత దేశం లో ఇంతవరకు . అలా చేస్తే .... చేయాలనీ మనసు ఉంటె .. ఈ రోజు స్విస్ ఖజానా లో నల్లధనం , ప్రజలు అడగాల్సిన గత్యంతరం లేదు కదా ?? .... !!! మోడీ అన్నాడు కదా !అనే భావం తప్పించి ... మరి ఈ నాయకులకు స్వీయ స్వచ్ఛత, ఇంతవరకు గురుతుకురాకపోడం ముదావాహం . భారతదేశం లో ఇటువంటివి .. ఎప్పుడూ ఓ ''తంతు ''లా జరగడంపరిపాటి . నిజం గా మనమందరం మోడీ కి ఋణ పడి ఉన్నాం . ఎందుకోతెలుసా .. ??? ... !!! స్వఛ భారత్ .. ''మోడీస్వచ్ఛ భారతం '' కానందుకు . రవి బాబు . మద్దూరి Sunday, 19 October 2014
''మా దిక్కు నీవెరా !!! సింహాద్రి అప్పన్నా !!! ''
'''''' . ఆ రోజులు ఎన్నో సార్లు గురుతుకోచ్చేవి .. నేను రెండో తరగతి ... అమ్మ మీద అలక తో నాన్న నన్నూ .. బుజ్జిని తీసుకుని అప్పట్లో నానమ్మ దగ్గరకు తీసుకు పోయారు . బుజ్జి పాలు త్రాగే పిల్ల . నానమ్మను చూస్తె అప్పటి కన్నాంబ గురుతు రావలసిందే . పొడవాటి ముక్కు,నిమ్మ పండు రంగు,పెద్దకళ్ళు . నుదుట జిల్లెళ్ల మూడి అమ్మ లా పెద్ద కుంకుమ బొట్టు,నాన్నఎత్తు . ఆమెని చూస్తె మరోరు గురుతుకు రారు . ఉప్పాడ బీచ్ కు దగ్గరలో నానమ్మ నివాసం . చుట్టూ దట్టమైన అడవి చీకటి పడితే నక్కల ఊళలు . యెర్రని చండ్ర నిప్పుల్లాంటి కళ్ళు రాత్రిలో మెరిసేవి . చుట్టూ చీకటి . కరంటు ఆ రోజుల్లో ఎన్నో ఊళ్లకు లేవు . రాత్రి బయటకు పోలేని భయం . నేను చెల్లి బుజ్జి నానమ్మ దగ్గర వెచ్చగా ... కధలు చెబుతూంటే ఊ కొట్టేవాళ్ళం . నాకు అమ్మ గురుతుకు వచ్చినా,బుజ్జి కి మరెవ్వరూ గురుతుకు వచ్చీవారు కాదు . దగ్గరలో చేతికి అందినట్లు గా ఉండే సముద్రం . సముద్ర హోరు రాత్రి సంగీతం మాకు . ఉదయం లేవడం ఏంటో ఉత్సాహం . నాన్న ఆ ఊర్లో మనుషులకు వైద్యం చేసేవారు . ఒక్క విషయం చెబుతాను, నాన్న ఇంజక్షన్ చేస్తే ... తెలిసేది కాదు . హస్తవాసి అటువంటిది . చుట్టూ పట్ల ఉన్న చిన్న పల్లెలు సహితం నాన్న వద్దకు వైద్యం కోసం వచ్చేవారు . నా జీవితం లో విశాఖ నగరం .. బోయపాలెం ... చేపల ఉప్పాడ చూడడం .. అడవి లో ప్రయాణించడం అదే మొదలు . నాయనమ్మ ను కలవాలంటే విశాఖ దిగి .. బోయపాలెం చేరి అక్కడనుండి 6 మైళ్ళు కాలి నడకన చేరాలి . ఎడ్ల బండ్లు లో కూడా ప్రయాణం చేయొచ్చు . కాని అన్ని వేళల్లో బండ్లు కట్టారు కదా !.. ఆ ప్రాంతాల్లో మనుషులు కొద్దిగా కూల్ గానే మాట్లాడతారు .. సహాయం చేసే నయజుం . గుంటూరు ...ప్రకాశం లా సెల్ఫిష్ మాత్రం కారు . ఎక్కువ పేదలే .. నాగరికత కొంచెం మొరటు .. మనసు మెత్తన . తీరం అంతా ఎప్పుడూ ప్రశాంత మే . వారాని కి ఒక్క రోజు సంత, అదీనూ బోయపాలెం లో . నేను మొదటచూసిన సంత (ఇప్పటి రైతు బజారు )కూడా కావడం విశేషం . ఒక్క చిన్న గమ్మత్తు విషయం చెబుతాను . నాన్న ఉన్న రంగుకు నప్పే కెంపు రంగు చొక్కా అమ్మ గతం లో కొన్నారు . అదంటే తనకు ఇష్టం ... ఊరు వస్తున్నా సందర్భం లో చాకలి కి వేసారు . అదుగో ఆచోక్కా లో సదరు చాకలి సంతలో ప్రత్యక్షం అయ్యారు . మొహుం వచేట్లు నాన్న దగ్గర దొబ్బులు తిన్నారనుకోండి ! .... ఆ సంతలో దొరకని వస్తువంటూ లేదు . 6 మైళ్ళ అడవిలో ప్రయాణం మరిచిపోలేనిది, అదీనూ బండి కట్టనప్పుడు . ఆ ఊర్లో నాతొ తిరిగే స్నేహితుడు ''పామోడు '' ఉండేవాడు వాడి బాబు ''అప్పడు '' . తను నన్ను చెల్లెలు బుజ్జిని కావడి బుట్టలతో చెరో పక్క కూర్చుండ బెట్టి కావడి బద్ద భుజన్నేసుకుని తీసుకు పోయాడు . తను మమ్మల్ని ఎక్కడా దించిన గురుతు లేదే ... !!!! దట్టమైన అడవి లో జింకలూ ... వెతకుక్కలో పక్షులు ... ఎన్నో వింతలూ ప్రత్యక్షం గా చూసాం . ఫ్రెష్ కూరగాయలు .. మంచి గాలి ... చిక్కని పాలు .. తియ్యటి నీళ్ళు ... మంచి పండ్లూ .. దొరికేవి . పైగా సౌమ్య మయిన ప్రశాంతత ... ఒక్క విధం గా రేట్లు చాలా తక్కువ . కల్తి లేని సరుకులు దొరికేవి . భూతలం లో ఉన్న స్వర్గం లా అనిపిచేది '' విశాఖ '' నగరమే కాక చుట్టూ ప్రాంతాలన్నీ . నాన్న గారికి వైద్యం నిమిత్తం కావాల్సిన మందులు .. భీముని పట్నం (భీమిలి ) వరకూ సముద్రతీరం లో సైకిల్ ఫై వెళ్లి తెచ్చీవారు . మోసం అన్నది ఆ ఊర్లల్లో జరిగేవి కావు . ఆరోజులు తీపి గ్యపకాల్లా మిగిలాయి న జీవితం లో . తదుపరి నాయనమ్మ కాలం చేయడం తాత గారేప్పుడో పోయారు . ముఖ్యం గా నాయనమ్మ లాలించే తీరు అనన్యం .. ఎక్కడ చూసినా ఆకుపచ్చదనం తో నిండి ఉండేది .విశాఖ లో దిగితే నే ఓ చల్లదనం .. ఓ ఆత్మీయత ... ఓ ఆత్మానందం . .. మరి ''హుద్హుద్ '' పుణ్యాన అంతా నాశనం ఐ పోయింది ... ఒకప్రక్క ఇన్సాట్ చిత్రాలతో .. ఎప్పెటికప్పుడు దాని గమనాన్ని చెబుతున్నది వాతావరణం శాఖ . ఆంధ్ర రాష్ట్ర సర్కార్ ! ఈ తుఫాన్ ను ఎదుర్కున్నాం అని కారు కోతలు కోస్తూ .. డబ్బా కొట్టుకుంటుంది . జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడo తో బాధ్యత ఐ నట్లు అనుకొంది . ఇంతవరకు విజయనగరం తో సహా చీకట్లో మ్రగ్గుతున్నవి . 4 రోజులు ముందు నుంచి భవిష్య స్థితి తెలుసుకున్న ప్రభుత్వం, ప్రణాళికలు అరాకొ రగా అమర్చింది . రహదార్ల లో ముందుగానే ప్రోక్లైనర్ లను పెట్టడం మరిచింది .. నీటి చప్టాల వద్ద బొల్దెర్లను పెట్టలేదు . రక్షిత త్రాగునీరు టాంకర్ల ద్వారా తరలించి బఫర్ స్టాక్ చేయలేకపోయింది . గాలి వేగం సుమారు 150 km అని ముందు నుంచే చెబుతున్న విషయం మనదరికి తెలుసు . రొట్టెలు బిస్కట్లు .. మందులూ ముందుగానే సమీకరించి పెట్టలేదు ... పైగా మోడీ అందించిన సహాయం ను పెద్ద 70 mm లో ఇటు చంద్ర బాబు అటు వెంకయ్య ''ముత్యాలముగ్గు '' లో ని జోకర్లలా''మద్దెల '' అవిశ్రాంతం గా వాయించారు . అంచనా కట్టలేని నష్టమట . కేంద్రం ఆదు కుంటూo దట . ఎప్పటికి .. ఎవర్ని ..? ... ఐ టి రంగానికి సుమారు 3000 కోట్లు భారీ నష్టం . ఈ తుఫాన్ దెబ్బకు ఐ టి వాళ్ళు విశాఖ లో మరో ''పయలిన్ '', చవి చూడ్డానికి , హుదుద్ రుచి చూ డ్డాంకి , సిద్ధం గా లేరు . ఖాయం గా మరో స్తలం వెతుక్కుంటూ ఉండొచ్చు . సింగపూర్ చేస్తాం లాంటి సోది మాటలూ .. డబ్బాలు కొట్టడం తెలుగు దేశం మానాలి . తుఫాన్ కరాళ నృత్యం ... మిగిల్చి ఆనవాలు ఫై, చిల్లర ఏరుకునే పశు వులకు తగినగుణ పాఠం చెప్పాలి.విశాఖ రైల్వే ను విజయవాడ దివిజన్ లో విలీనం చేసే ప్రతిపాదన, కొన్ని దశాబ్దాల అవిశ్రాంత పోరాటం . అటువంటి ప్రయత్నం లో ఉత్తీర్ణులు కాలేని రాజకీయ రాబందులు ఏకం గా విశాఖను , పారిస్ లానో .. సింగపూర్ లానో చేయడం ఎంతవరకు సాధ్యం . ... ??? .. !!! ఈ మాటలు నీటి మీద రాతలేనా .. ??? !!! .. ఒక్క చంద్ర బాబు హరిచంద్రుడు గా మారితే కలిగే లాభం ఏంటి ...??? !!! ... Tuesday, 30 September 2014
The intellectuals of ''BHARAT'' ratnas today: '' అన్నా ! ...
The intellectuals of ''BHARAT'' ratnas today:
'' అన్నా ! ...: '' అన్నా ! ఓ .....చిన్నా ....!!'' ...
'' అన్నా ! ...: '' అన్నా ! ఓ .....చిన్నా ....!!'' ...
Monday, 29 September 2014
''పురచ్చి తలైవి '' ఆమె ఒక తిరుగుబాటు నాయకురాలట ! అదీ ఆమె బిరుదట ! ఎవరీ పురచ్చి తలైవి ఏమిటా కధ ?........ తమిళనాడును తన అడుగులకు మడుగులొ త్తేలా మార్చిన మహానుభావురాలు . ఒకప్పటి వెండి తెరమీద తన, ముగ్ధ అందచందాలను ఆరబోసి,తన నటనా కౌశలం తో ఇటు తెలుగు ... అటు మళ యాళం ... తమిళం సినిమాల లో ద్రువతారామణి జయలలిత . తన సౌందర్య లావణ్య0 తో ఎందరో హీరో బావల గుండెల్లో మన్మధ బాణాలు విసిరిన మన్మధి . అదే జోరులో యెమ్ . జి . ఆర్ . కు తదుపరి సాన్నిహితి, జయలలిత . అఖిల భారత ద్రావిడ మున్నేట్ర గజకం లో తదుపరి తరానికి ''అమ్మ ''. తమిళ సంసృతి చాలా పురాతన మైనది . తమిళ సంఘ సంస్కర్త ''భారతీయార్ '', తనదయిన శైలి లో తమిళ భాషను ,సంసృతి ని ఎంతగానో విశ్లేషణ చేసారు . అదే విధం గా ''తిరుక్కురళ్ '', తమిళ భాష గురించి చెబుతూ ''కల్ తొండ్రి మంతోండ్రి ... కలోర్ ముతముత్తుకోడి '' అంటాడు . అంటే ''రాయి .. రప్ప పుట్టక ముందునుండి '' తమిళ్ ఉందట ... !! ?? (అప్పుడు తమిళ్ ఉందని ఎవ్వడు చూసాడో గాని ). ఇటువంటి ''పిచ్చి '', దేశం లో ఒక్క తమిళ్ వాళ్ళ కే చెల్లుతుంది . ఆ మధ్యలో తమిళం ప్రాచీన భాషగా గుర్తింపు ఇవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేసారు .. చేస్తున్నారు . అప్పట్లో UPA ప్రభుత్వం కాబినెట్ లో సోనియా కు దగ్గరలో ఉన్నవారందరి లో ఎక్కువ శాతం మళయాళీలు అవడం వలన ఈ విషయాన్ని కేంద్రం లో పడ నీయలేదు . ఎందుకంటే? పుల్లలు పెట్టే నైపుణ్యం భారత దేశంలో దక్షిణా ది లో కేరళ .. తమిళనాడు లకు ఉన్న నైపుణ్యం ,ఏకంగా తెల్లవాడికీ లేదు . వాళ్ళ భాష మాట్లాడే వారన్నా .. వాళ్ళ వాళ్ళన్నా చచ్చేO త అభిమానం తమిళ వాళ్లకి . మేము ''అరవం .. అరవం ... '' అంటూ అరుస్తారట !!.... అలా తమిళనాడు గురుంచి, అబ్బో ! మహా ఇది పడిపోయే వాళ్ళల్లో అగ్రగణ్యుడు అప్పటి ముఖ్య మంత్రి యెం జి ఆర్ .ప్రాణాలు ఇచ్చే , శతకోటి శిష్యులలో బ్యాక్ డోర్ శి ష్యురాలు ''జయలలిత'' . ఆమె అంటే అతని కి ప్రాణం . ఆమెకి ఆయన మరో ప్రాణం, అప్పట్లో ముఖ్య మంత్రి సదరు కోమా లో ఉన్నాడన్న వార్తల్లో నిజాలు తెలుసుకోని తమిళ జనం తమిళనాడు లో చేసిన అరాచకం ఇప్పటికి మరువలేము . తమిళులు ఎవరినయినా మనసుపడి తే అతిగా ఉంటుంది . సరే ఆతను కాలం చేసాక ... తదుపరి వారసురాలిగా ''జయ'' ముఖ్యమంత్రి అవతారమెత్తింది . ఒక్క టర్మ్ ఆమె తన అందచందాలు .. ఆడంబరాలు ... చూసుకోడానికి వెచ్చించింది . ఈమధ్యలో కళ్ళజోడు కరుణానిధి ముఖ్యమంత్రిగా డి . ఏం . కే పార్టీ నుండి, గట్టి పోటీ ఇచ్చి మరెన్నో సార్లు తను ముఖ్యమంత్రి అయ్యాడు . వీదిద్దరి మధ్య వైరం తమిళనాడు లోని ఇరువర్గాల ప్రజల మధ్య వైరం గా చెప్పుకోవచ్చు . అంటే అంతగా కృషి చేసారన్న మాట ... ఇటు జయ అటు కళ్ళజోడు కరుణానిధి . తమిళ్ వాడెప్పుడూ తనతగువులో న్యాయం చెప్పే వాడిని అసలు సిసలైన ''బకరా '' చేయడం లో స్పెసలిస్ట్ లు సుమా !! . ఈ విధం గా పరస్పర వైరం అటుంచితే . జయలలిత రవ్వల గాజులు .. వజ్రాలు పొదిగిన చీరలు ... తూకాలకొద్దీ బంగారునగలు .... రవ్వలు పొదిగిన కాలి జోళ్ళు .... ఇంకా ఎన్నెన్నో అపరూపమయిన వస్తువులను సమీకరించడం పరిపాటి . సహజం గా హీరోయిన్ ల లో చాలామంది ఈ వస్తువుల సమీకరణ లో పడి .. జీవితాలను దుర్భరం చేసుకుంటారు, ఈ ప్రయత్నం లో ''శీలం '' అనే పదానికి క్రమం గా అర్ధం ఎప్పుడూ మారుతూ ఉంటుంది . అలా కాకుండా రాజకీయాల్లో సంపాదన ఉండదు గనుక జయలలితకు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉందన్న అభియోగం ఫై గత 18 సంవత్సరాలుగా కేసులు ఇబ్బిడి ముబ్బిడిగా ఎదుర్కొంటూ, తన స్వరూపాన్ని అవినీతి పరమయిన ఆర్జనలో, పెద్ద అనకొండ లా ఆమె మారిందన్న అభియోగం వాస్తవం (ఆమె మీదికేసులు బట్టి ) . ఈ క్రమం లో మన హైదరాబాద్ లో మారేడ్పల్లి లో ఆమె బంగళాలో ఆదాయ పన్ను శాఖ జరిపిన మెరుపుదాడిలో 1992 లో కోట్లవిలువ గల ఆభరణాలు వెలికితీశారు . ఇలా ఆమె దగ్గర ఒలుమోత్తం గా 66 కోట్లు విలువ సామాగ్రి ఉందన్నది, హానరబుల్ కోర్టులో నిరుపించబడింది . అందుకు 4 సంత్సరాల జైలు,100 కోట్ల జరిమానా పడింది . ఇదివార్త . రేపు కేసు లో రైల్వే మంత్రి కొడుక్కి బెయిలు దొరికింది . చైన్ స్నాచెర్ కు బైలు దొరకకపోవచ్చు . న్యాయవాదుల వాదన అలావుంటుంది . జయ,తిన్న దానికి మన ''అడగాలనుకున్నా '' అన్న తిన్నడానికి పొంతనలేదు . సత్యం రామలింగరాజు మింగినదా నికి ... బైలు దొరికింది .... బొగ్గు మసి పూసుకున్న దొంగలకు వడ్డణ జరగాల్సి ఉంది . తమిళనాడు పొలిసు వ్యవస్థ గడచినరోజుల్లో జయలలిత ఫై జరిపిన ... ఆదాయ పన్ను అధికార్లు జరిపిన విచారణలు 18 సవత్సరాలు సాగిందంటే !... ఆశ్చర్యం గా లేదా ?? ముక్కు సూతిగాపోయే న్యాయవాదులూ .. న్యాయ మూర్తుల అవసరం మనభారత దేశానికి ఏంతో ఉందన్న మాట యదార్ధ సత్యం ..... రవిబాబు . మద్దూరి
Thursday, 18 September 2014
'' తోసెయ్ ''
ఏంది ? తోసేది .....ఎక్కడ తోసేది ?..... దేంట్లో ? తోసేది ?..... . ఇది రైల్వే లో ఒక ఘనుడి చిన్న కధ .... అనగనగా ఒక పెద్ద స్టేషన్ ''సికింద్రాబాద్ '' లా, ఉదాహరణ కి ఒక పెద్ద స్టేషన్ . దాంట్లో పెద్ద స్టేషన్ మాస్టర్ . సవత్సరం చెప్పను గాని ,విషయం చెబుతాను . నిత్యం రద్దీగా ఉండే స్టేషన్ . దాదాపు ఆ రోజుల్లో 24 గంటల్లో 60 ఫై చిలుకు రైల్ బండ్లు పోయేవి . రైల్ బండ్లను కడిగే, గుంత లైనులు 2 మాత్రమే !. అక్కడ టె ర్మినేషన్ 6 బండ్లు . మిగతావి మీదుగా వెళ్లేవి .60 లో సరకు రావాణావి ఉన్నాయనుకొండి !. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ? సాధారణం గా పెద్ద స్టేషన్ లలో బాగా వర్క్ అనుభవజ్ఞులను నియమిస్తూంటారు ... నియమించాలి కూడా !..... అలా కాకుండా (మనం సముద్ర తీర ప్రాంతాల్లో నిత్యం అనేక రకాల చేపలను .. చిన్నవి పెద్దవీ చూస్తూంటాం అలా షికారు కెళ్ళినప్పుడు ... అలా కాకుండా టౌన్ లోనో ... తీర గ్రామాల్లో ఒక్కసారిగా జనం గుమికూడి చర్చించు కున్తుంటారు ... దూరానికి విషయం తెలియని మనం దగ్గరికి వెళ్లి నపుడు గాని తెలియదు .... ఆరోజు తీరం లో పెద్ద '' తిమింగలం చచ్చి తీరానికి వచ్చిపడిందని '' . వీలుంటే మనం వెళ్లి మరీ చూస్తాం .... ఆవిధంగా )కొన్ని సార్లు '' జీహుజూర్ '' గాళ్ళు, విచిత్ర వేషధారులు ''చెప్పండయ్యా '' గాళ్ళు, గ్యాస్ సిలిండర్ గాళ్ళు ... ఇట్లా వారికివ చ్చిన ... అధికారులకు నచ్చిన పనిమంతులు గజిటెడ్ గాళ్ళు స్టేషన్ కు పెద్ద గా వ్యవహరిస్తూంటారు . చూడండి వీళ్ళ తోనే చిక్కంతా . వీళ్ళకి పని రాదు ... చెయ్యరూ . కాని క్రింది తరగతి చెమట ఫై ఆధార పడే ''ఆధార్ '' గాళ్ళు . ఇటువంటి మహానుభావుడు ఒకాయన .... తెల్లని పాంటూ... తెల్ల చొక్కా .. మేడలో ఓ టై తో ప్రత్యక్షం . క్రింద ఊడిపోయిన లేసు .. సగం తినేసిన బెల్టు .. కోతి కొరికిన క్రాపు .. గతం లో కొట్టిన రంగు తాలూకు యెర్రని వెలిసిన తలరంగు ...... అబ్బో !!! చూడడానికి చాలా చాలా '' సుందరముదరస్టం '' గా ఉంటారనుకోండి !... వాళ్ళ సంభాషణ ఫోన్ టాక్ ఇలా ఉంటుంది . మాస్టర్ :వాట్ ? హౌ ?.. వై ?.... ఫోన్ : సార్ర్ .. ఆంధ్ర ప్రదేశ్ బ్యాక్ చే ద్దనికి లైను లేదు .మా :యెనక బళ్ళు ఆగుతాయి ఫో : ప్రక్క స్టేషన్ లో రేగులట్ చెయ్యండి నాకు .. షంటింగ్ ఉంది సార్ ! మా : నాకు తెలియదు .. అందులోDRM ( మా భాషలో 'దరిద్రమయిన రా మిటీరియల్గాడు' ) ఫో : షంటింగ్ కుప్ప సార్ ... మా: ఏమో ? నాకు తెలియదు షన్టి 0గ్ ఆగినా ! ట్రైన్ ఆలస్యం ఐనా ! బండి ఆగినా ! ట్రాన్స్ఫర్ ఫో : సార్ ఎలా చచ్చేట్లు ? ఇక్కడ లైన్ తయారు చేయాలి సర్ ........ మా : ఎలానో లోపలకు తోసేయి .... నిన్న కూడా ఐ వార్న్డ్ యు ..... ఫో : సార్ ! ఉన్నయ్యి 2 పిట్లు .. మిస్లేనిఎస్ ప్రక్కబెట్టాలి కదా సర్ ... మా : ఏంటయ్యా ? తెలియకుండానే 4 సవత్సరాలు పనిచేస్తున్నానా ? ఒక్క బండి తోసేదానికి ..... ఫో : పిట్ చెకింగ్ కు రావాల్సిన ఆం. ప్ర ఎక్ష్ప్రెస్స్ పిట్లోకి రావాలికదా సర్ ... ముందు పని చెయ్యనీండి సర్ మా : ఎక్కువగా మాట్లాడుతున్నావ్ .. ముందు చేస్తావో వెనుక చేస్తావో నాకు అనవసరం ..... మొదట నీవు లోపల తోసేయ్ ! (వీళ్ళు ఇలా మాట్లాడుకునే లోపు సిగ్నల్ నుండి ప్రయాణికులు ముటా ముల్లె ... గొడ్డూ-గోదా .. పిల్లా జల్ల ల తో దిగి అటు మెట్టుగడ్డ .. రిజిమేంట్ బజారు వైపు బస్సుల కోసం పరుగులు ) .. ఇంతలో సదరు ''డ్రం '', గారు ................ ఇలా (బండి లో నుండి ) డ్రం : హూ డట్ ఇడియట్ ఇన్ కేబిన్ సస్పెండ్ హిం .. నీతి : పని ఎగ దొబ్బెవాడు ... నిముషానికి కమాండ్స్ మార్చే వాడూ ... శంటింగ్ వాడు భద్రం గా ఉంటారు .. కమాండ్ కోసం ఎదురుచూసేవాడు ''క్యాబిన్ '' లోసస్పెండ్ అయ్యి తీరుతాడు .................... ఇదండీ ట్రాఫిక్ జీవితం .. !!
ఏంది ? తోసేది .....ఎక్కడ తోసేది ?..... దేంట్లో ? తోసేది ?..... . ఇది రైల్వే లో ఒక ఘనుడి చిన్న కధ .... అనగనగా ఒక పెద్ద స్టేషన్ ''సికింద్రాబాద్ '' లా, ఉదాహరణ కి ఒక పెద్ద స్టేషన్ . దాంట్లో పెద్ద స్టేషన్ మాస్టర్ . సవత్సరం చెప్పను గాని ,విషయం చెబుతాను . నిత్యం రద్దీగా ఉండే స్టేషన్ . దాదాపు ఆ రోజుల్లో 24 గంటల్లో 60 ఫై చిలుకు రైల్ బండ్లు పోయేవి . రైల్ బండ్లను కడిగే, గుంత లైనులు 2 మాత్రమే !. అక్కడ టె ర్మినేషన్ 6 బండ్లు . మిగతావి మీదుగా వెళ్లేవి .60 లో సరకు రావాణావి ఉన్నాయనుకొండి !. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ? సాధారణం గా పెద్ద స్టేషన్ లలో బాగా వర్క్ అనుభవజ్ఞులను నియమిస్తూంటారు ... నియమించాలి కూడా !..... అలా కాకుండా (మనం సముద్ర తీర ప్రాంతాల్లో నిత్యం అనేక రకాల చేపలను .. చిన్నవి పెద్దవీ చూస్తూంటాం అలా షికారు కెళ్ళినప్పుడు ... అలా కాకుండా టౌన్ లోనో ... తీర గ్రామాల్లో ఒక్కసారిగా జనం గుమికూడి చర్చించు కున్తుంటారు ... దూరానికి విషయం తెలియని మనం దగ్గరికి వెళ్లి నపుడు గాని తెలియదు .... ఆరోజు తీరం లో పెద్ద '' తిమింగలం చచ్చి తీరానికి వచ్చిపడిందని '' . వీలుంటే మనం వెళ్లి మరీ చూస్తాం .... ఆవిధంగా )కొన్ని సార్లు '' జీహుజూర్ '' గాళ్ళు, విచిత్ర వేషధారులు ''చెప్పండయ్యా '' గాళ్ళు, గ్యాస్ సిలిండర్ గాళ్ళు ... ఇట్లా వారికివ చ్చిన ... అధికారులకు నచ్చిన పనిమంతులు గజిటెడ్ గాళ్ళు స్టేషన్ కు పెద్ద గా వ్యవహరిస్తూంటారు . చూడండి వీళ్ళ తోనే చిక్కంతా . వీళ్ళకి పని రాదు ... చెయ్యరూ . కాని క్రింది తరగతి చెమట ఫై ఆధార పడే ''ఆధార్ '' గాళ్ళు . ఇటువంటి మహానుభావుడు ఒకాయన .... తెల్లని పాంటూ... తెల్ల చొక్కా .. మేడలో ఓ టై తో ప్రత్యక్షం . క్రింద ఊడిపోయిన లేసు .. సగం తినేసిన బెల్టు .. కోతి కొరికిన క్రాపు .. గతం లో కొట్టిన రంగు తాలూకు యెర్రని వెలిసిన తలరంగు ...... అబ్బో !!! చూడడానికి చాలా చాలా '' సుందరముదరస్టం '' గా ఉంటారనుకోండి !... వాళ్ళ సంభాషణ ఫోన్ టాక్ ఇలా ఉంటుంది . మాస్టర్ :వాట్ ? హౌ ?.. వై ?.... ఫోన్ : సార్ర్ .. ఆంధ్ర ప్రదేశ్ బ్యాక్ చే ద్దనికి లైను లేదు .మా :యెనక బళ్ళు ఆగుతాయి ఫో : ప్రక్క స్టేషన్ లో రేగులట్ చెయ్యండి నాకు .. షంటింగ్ ఉంది సార్ ! మా : నాకు తెలియదు .. అందులోDRM ( మా భాషలో 'దరిద్రమయిన రా మిటీరియల్గాడు' ) ఫో : షంటింగ్ కుప్ప సార్ ... మా: ఏమో ? నాకు తెలియదు షన్టి 0గ్ ఆగినా ! ట్రైన్ ఆలస్యం ఐనా ! బండి ఆగినా ! ట్రాన్స్ఫర్ ఫో : సార్ ఎలా చచ్చేట్లు ? ఇక్కడ లైన్ తయారు చేయాలి సర్ ........ మా : ఎలానో లోపలకు తోసేయి .... నిన్న కూడా ఐ వార్న్డ్ యు ..... ఫో : సార్ ! ఉన్నయ్యి 2 పిట్లు .. మిస్లేనిఎస్ ప్రక్కబెట్టాలి కదా సర్ ... మా : ఏంటయ్యా ? తెలియకుండానే 4 సవత్సరాలు పనిచేస్తున్నానా ? ఒక్క బండి తోసేదానికి ..... ఫో : పిట్ చెకింగ్ కు రావాల్సిన ఆం. ప్ర ఎక్ష్ప్రెస్స్ పిట్లోకి రావాలికదా సర్ ... ముందు పని చెయ్యనీండి సర్ మా : ఎక్కువగా మాట్లాడుతున్నావ్ .. ముందు చేస్తావో వెనుక చేస్తావో నాకు అనవసరం ..... మొదట నీవు లోపల తోసేయ్ ! (వీళ్ళు ఇలా మాట్లాడుకునే లోపు సిగ్నల్ నుండి ప్రయాణికులు ముటా ముల్లె ... గొడ్డూ-గోదా .. పిల్లా జల్ల ల తో దిగి అటు మెట్టుగడ్డ .. రిజిమేంట్ బజారు వైపు బస్సుల కోసం పరుగులు ) .. ఇంతలో సదరు ''డ్రం '', గారు ................ ఇలా (బండి లో నుండి ) డ్రం : హూ డట్ ఇడియట్ ఇన్ కేబిన్ సస్పెండ్ హిం .. నీతి : పని ఎగ దొబ్బెవాడు ... నిముషానికి కమాండ్స్ మార్చే వాడూ ... శంటింగ్ వాడు భద్రం గా ఉంటారు .. కమాండ్ కోసం ఎదురుచూసేవాడు ''క్యాబిన్ '' లోసస్పెండ్ అయ్యి తీరుతాడు .................... ఇదండీ ట్రాఫిక్ జీవితం .. !!
Sunday, 31 August 2014
'' అన్నా ! ఓ .....చిన్నా ....!!'' . ప్రపంచీకరణ చీడ పట్టింది భారత దేశానికి ఇంకెక్కడి గ్రామం అంతా స్మార్టు నగరమే స్మార్ట్ ఫోన్లూ ,బి డబ్లూ ఎమ్ కార్లు ,మెట్రో రైళ్ళు ,స్మార్ట్ కార్డులు ,ఐ టి హబ్బులు ఇంకెక్కడిది భారత నాగరీకం ,పొంచిఉంది ఆంగ్లేయుల హస్తగతం ............. .... ఎందుకంటే ? అమ్మా నానా పోయే మమ్మీ డాడీ వచ్చే ! తెలుగు మాట్లాడితే దంచుడే ! దంచుడు గా ఉంది విద్యాబోధనం, వలువలు విడిపించే నూతన విద్యావిధానం . *అన్నా ఓ చిన్నా * కాసులు మాని, డాలర్ల కోసం పరగులు తీయిస్తుంది నేటి విద్యా విధానం గాడి తప్పే నాగరికతను ఉగ్గుపాలతో సింగారిస్తుంది ఐటి కర్పోరిటిజం ఉలవలు తినే పలువ లు లేని జాతిగా పరిడవిల్లుతుంది నూతన యువజనం పట్టు పరికిణీలు,కట్టు బొట్లు ఇక మిగిలాయి కేవలం వినోదం *అన్నా ఓ చిన్నా * పల్లె ప్రశాంతతకు పాడి కట్టి, ఇంటర్నెట్లు,చాటింగ్ బ్రౌజులకు రెండు దశాబ్దాల నుండే సుప్రభాతం పల్లెజీవిత మూలల్లో పరిడ విల్లుతుంది పెట్టుబడి విధానం !ఏనాడో మట్టివాసనకు పాడాము చరమగీతం నాటకాలు,హరికథ,బుర్రకధలకు మంగళం పాడి,రంకు.. బొంకులకు చేయూతనిచ్చి , పాపు గీతాలకు .. యు ఎస్ కెళ్ళి మరీ త్రిబ్యుట్లూ ఇస్తున్నారు సంగీతమేధవులు *అన్నా ఓ చిన్నా * కడివెడు నీళ్ళకోసం మైళ్ళు వెళ్ళే కొన్ని పల్లెల్లో,సీలు మందు భారీగా లభ్యం కోకోలు .. ఫాన్టాలు ... స్ప్రయట్లు కో కొల్లలుగా లభ్యం, ఇదెక్కడి విచిత్రం చల్లని మజ్జిగ, పుల్లని పున్నీళ్ళు మొరటు బారి పోయి .. మొఖం వాచేట్టు కల్లు ... గంజాయీ భేషుగ్గా ..... ఆరుబయటే త్రాగి ఆవిరౌతుంది జనం ఆయుషు *అన్నా ఓ చిన్నా * పెట్టుబడి విధానం పేదా గొప్ప తేడా లేక, ముంగిళ్ళ లో తాండవం చేస్తూ ,చనుకట్టు,బొట్టు విడిచి,విరబోసుకున్నజుట్టు,అలంకరణ మిషతో మగువలు అందాలను పదిలపరుచుకొనక,భాహ్య ప్రపంచానికి కనువిందు చేస్తుంది . అందాల పోటీలూ మోడలింగ్. పైగా విశేషం ఎమిటంటే ? ఇక్కడ,కన్ను కు ఓ మార్కూ..చన్ను కూ మార్కులట *అన్నా ఓ చిన్నా * పర్యవసానం !..? .. మహానగరం లో ఫైసల్ దయయానీ లు సర్పహారాల్తో తిరుగుతూ రోజుకోక్కమగువను చెరబడుతూ,సెట్టిల్మెంట్ దందాలకు తెగపడుతుంటే ! రక్షక భటులకే రక్షణ కరువాయె ! ... నాలుగొందల దండలు తెంపిన ''శివ''గజ దొంగ ''కుక్కచావు, నేర్పుతుందా? సమాజానికి నీతి ! ఉచిత సెక్సు,జలసాలకు అలవాటు పడి, బీడీలు త్రాగని, కేడీలకు ... *అన్నా ఓ చిన్నా '' పాతబస్తీ లో వెనుకకొకడు, పరాయి జెండా ఎగురవేస్తే !పట్టని అప్పటి, ఇప్పటి ప్రభుత, చర్యలు సూన్యంలో కి చూవించి,అలఎన్సు పేరు తో, మూతులు నాకుతూ, తగుదునమ్మ అని శిధిలాలవెనుకటి చరిత్ర మరచి, జాతీయ జెండాను రెపరెప లాడించే ! ఇదిఎక్కడి రాజనీతి ?...!! హవ్వ ! క్రాన్తికారులు , దేశభక్తులు నవ్విపోదురు గాక .... నవ్విపోదురు .... *అన్నా ఓ చిన్నా * మంగలి కత్తి మొ ద్దుబారే !సాలె మగ్గం కొనఓపిరి తో ఊగిసలాడే ! చాకిరేవులోని చాకలికి పట్టెడన్నం కడుపారా పెట్టలేని రైతు అప్పుల ఊబిలో ఉ సురు తీసే .. డ్వాక్రా లకు ఖాళీ కంచం.. ఖాళీ లోటా !.... ఆంధ్రా నుండి మరలా అప్పులకు చిప్పలు చాచి ....'' సింగపూరు కల'' జిలుగు లో ఉన్న బాబులు రాజధాని గురించి చేసిన రభసకు ''శివరాముడు ''చన్నీళ్ళు చల్లి ..... నిదురలేపే *అన్నా ఓ చిన్నా * విద్యావేత్తలు , బడాబాబులు ఆంధ్ర లో కొత్తగా జొరబడి రాజధాని అవాకు చెవాకులు వాగి వాగి నిరుపేద,సామాన్యులకు ''సొంత ఇంటి ''ని కలగా, శాయ శ క్తులా , మిగిల్చి,అందన0తఎత్త కు రియల్టర్ భూతాలను ఉసిగొలిపే ! అసెంబ్లీ లో ప్రజల లబ్ధి మరిచి,ఒకని ఫై ,మరోడు బురద జల్లుకుని ప్రజాధనాన్ని కర్పూరహారతి చేసే !సదరు అధ్యక్షలు ''అడ్జోయిన్ఇంగ్ '' పద్యం,పరిపాటిగా పాడే *అన్నా.. * రోజుకొక్క రోడ్డు వేసిన చీనా,రోజూ పదిమంది జవాన్లనుపొట్టను బెడుతున్న పాక్ లను దండించక ! శాంతి గీతాలను ఆలపిస్తున్నా ప్రభుత లోని పెద్దల, మెదళ్ళు మోకాలికి జా రిన్ట్లున్నదే ఈ చోద్యం ?.. !! మరో ఆజాద్ ,గాంధీ, సుభాసు,సర్దారు, భగత్ లు ఈ దేశానికి తప్పక అవసరం ! మరి ! మోడీ పొడుస్తాడ ను కొంటే ... అసలు తను చేస్తున్నది ఏమిటో ? అంతు బట్టదాయె.... !! భారతదేశాన్ని రక్షించండి !!!!!*అన్నఓ చిన్న* రవిబాబు. మద్దూరి
Wednesday, 20 August 2014
'' గా డిదవె నుక వెనుక వెడితే ..!!..??'' దైవ స్వరూపులారా మీకు విన్నవించేది ఏంటి ?అంటే .... రైల్వే లో అధికారులు ఐదు రకాలు 1. తమ స్వీయ కార్య నిమిత్తం స్టాఫ్ ను వాడేవాళ్ళు 2. కలుపుకుని పోసుకుని ..కలిపి కొంత మనకు అంటి0చేవారు ... 3. రైల్వే పనికోసం, మాటపడ కూడదని కష్టించి, నస్టించి పనిచేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని ఆవిరి చేసుకొనే మహానుభావులూ .. 4. కేవలం క్రింది తరగతి చెమట .. రక్తాన్ని తమ గొప్ప గా చెప్పుకొని షీల్డ్స్ .. అవార్డులూ దొబ్బి .. స్టాఫ్ శా పనార్దాలకు గురి అయి సర్వనాశనమయె కీచకులు 5. మనజీతం మనకొస్తున్నది ''నో ప్రోబ్లెంగాళ్ళు ''. ఇంకా ఎన్నో వెరైటీస్ ఉన్నారు . అవసరం వచిన్నప్పుడు ఉదాహరిద్దాం . నేను తెలుసుకున్న ఒకటో అనుభవం చెబుతాను . ఒకసారి రెగ్యులర్ ఇన్స్పెక్షన్ గురించి ఓ పే .... ద్ద స్టేషన్ కు వెళ్ళవలసివచ్చింది సాధారణం గా నేను సేఫ్టీ క్యాడర్ కనుక వీలయినంత పరిశీలనాత్మక ద్రుష్టి తో ట్రాఫిక్ యంత్రాంగాన్ని గమనిస్తూ, నిబంధనల తాలూకు విషయాలను తమ తమ పరిధులలో కార్మికులు తూచా తప్పక పాటిస్తున్నారా ? లేకుంటే వారికీ తగిన సలహాలూ సహాకారాలు అందిస్తూ రైల్వే ట్రాఫిక్ యంత్రాంగం నిర్విరామంగా ముందుకు పోయేట్లు చూడడం . ఆ క్రమం లో అప్పటి నిబంధనలను ఉద్దేశించి మాస్టర్ కేబిన్ లో పడి ఉన్న (ఎవ్వరూ క్లెయిమ్ చేయని )ఒక్క ని0డు గోతం సంచి ఫై పడింది . పరిశీలించగా కొబ్బరిబొండాల సంచి (మా డిపార్టుమెంటు లో చేమంతి పూలను విజయవాడ నుండి ''బెవర్సాగా ''తెప్పించుకుని పూజలు చేసే అధికార భక్తులూ ఉన్నారనుకోండి !!!). స్టాఫ్ కు దాని ఫై లిపి అర్ధంకాని పరిస్తితుల్లో హెల్ప్లెస్స్ గా ఓది లేసారు . దాని ఫై బ్రమ్హరాత బట్టి, సదరు ఆఫీసర్ గారికి ఫోన్ చేసాను ( మా డిపార్టుమెంటు లో జి హుజూర్ ! సిస్టం వలన చేయకతప్పదు ). వేరే మాట మాట్లాడనీయక డ్రైవర్ ను పంపిస్తున్నాన్ని ,దయచేసి లోడ్ చెయెంచమని అర్ధించాడు . డ్రైవర్ వచ్చాడు,లోడ్ చేయించాం, ఆ అధికా రిఇంటికి, కి తీసుపోయాడు . అన్నీ చక చక జరిగిపోయాయి . తమాషా ఏంటంటే ? నాల్గు రోజుల తరువాత, దాదాపు ముగ్గురు స్టాఫ్ ఇటు, ఫోన్ అటు, సంక్షిప్త సమాచారాలతో నా కోసం జల్లెడ పడుతున్నారు .నెను సెలవలో ఐదు రోజులు చెన్నై వెళ్ళవలసివచ్చింది . నేను వచేప్పటికి దాదాపు కొబ్బరిబొండాల గోతం నేను మా యంచేసినట్లుగా నిర్ణయించ బడింది . ఆ దిక్కుమాలిన ఆఫీసరు ఒక HOD PS గనుక,నేను వచ్చాక నాకు గుదిబండ తయారుచేసారు departmental పరం గా (ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ... బండ్లను ప్రమాదాలకు గురిచేసిన కొంతమంది మేధావులు ''జీహుజూర్ !.. కాల్ మొక్కుతా దొరా ! నీ బాన్ చెన్.... మీడియం ఉద్యోగులు ఆఫీసర్ గొ డుగుకింద చాలా నైపుణ్యం ప్రదర్శిస్తూ ఉంటే ... నిబంధనలను తూచా ! తప్పక ఆచరించిన దౌర్భాగ్య ఉద్యోగులు ఎంతమందో !!) ఆఫీసర్ తో సంభాషణ : ఆఫి : ఔను ! ఆ కొబ్బరిబొండాల బాగ్ ఏం ? చేసావ్ ! ? నేను : మీ డ్రైవర్ తెచ్చిన కార్ లో లోడ్ చేయించా నండి .... ఆఫ్ : నీవు లోడ్ చేయిస్తే నాకు అందాలికదా ! అందలేదు .... నేను : తల్లితోడు ! లోడ్ చేయించాను సర్ ! పేరు గుర్తు లేదు .. కాని మీరు పంపిన వాడే సర్ . ఆఫీ : నాకు తెలియదు , రెండ్రోజులు టైం ఇస్తున్నా .... ఎక్కడుందో వెతికిపెట్టు ... లేదంటే నీవే తెచ్చిపెట్టు .... ఫెయిల్ అయ్యావో '' ఐ విల్ టేక్ ఏక్షన్ అగినేస్ట్ యు .. గో ... !! (ఓరి నాయనో ఫుల్ గోనె కొబ్బరి బొండాలు ఇతనికి ఎక్కడ నుండి తెచ్చెది, ఫై గా పాలకొల్లు సైజు మీకు చెప్పనక్కర లేదు .. ఎవడి చెట్టు ఎక్కి తెచ్చేది .. కొనడం మృగ్యం ! )................................... ''కిం కర్తవ్యం !!...?? ''అనుకొంటూ దేవుళ్ళకు మొక్కుతూ, నా అదృష్టానికి నన్ను నేను మెచ్చు కుంటూ .. కొబ్బరిబొండాల సైజు లు వెతుక్కుంటూ పొలో మంటూ సదరు డ్రైవర్స్ రెస్టు రూం లోనికి వెళ్లాను .. నా అదృష్టం కొద్దీ ఆ రోజు డ్రైవర్ జ్ఞాపకం తో పాటూ అతనూ అచ్చట వున్నాడు .......... నేను : బాబూ ! కొబ్బరి బొండాల బాగ్ ఎక్కడ పెట్టావ్ ? ఎవరికిచ్చావ్ ? డ్రైవర్ : కొబ్బరిబొండాలు ! ఏంటి ? అసలుకధ ఏంటి సార్ ? ( ఒక్క దెబ్బ తో నాకళ్ళకు బైర్లు ఆవరించినట్లు అనిపించింది ) నేను : అదే ఆఆ న్నాఆఆఅ ఆఆ రోజు ! మీకు స్టేషన్ లో ... సెగెట్రీ సార్ బొండాలు ..గోఓఓఓఓఓఓ నే సాఆఆఆఆఅ ఓ ఛి ఇచాకదా ! ఆ విషయం . ( వాడు అర్ధం చేసుకున్నట్లు ముఖం పెడితే .. నాకు, ఎండాకాలం వలన షర్టు చెమటల పర్యంతం ) డ్రైవర్ : అరె ! సర్ ఆఫీసర్ ఇంట్లో లేదు ఇంట్లో లేడు ... బంగ్లా నౌకరూ లేరూ ... నేను : అందుకని ఎమ్చేసావ్ ? ( ఆత్రుత ) డ్రైవర్ : ఆఫీసర్ గారి ఓల్డ్ గ్యారేజ్ లో ఓ మూల పడేసా ! అక్కడే పడివుంటాయి! చూస్కోమని జెప్పు సర్ ....... (తాఫీగా చెప్పాడు ) నేను ( కోపంగా ) : అంత బాధ్యత లేదా నీకూ !! డ్రైవర్ : ఏం సార్ ? దమక్ గిట్ల ఖరాబయ్యిందా నీకు ... నన్ను బట్కోని తిడుతున్నావ్ !! కించపరుస్తోన్నావ్ ... నీకు ... వాన్కి నే నోక ర్నా ?... సీదా మాట్లాడు ..... అందరూ రుబాబే !! (తన్నేట్లు ఉన్నాడని గబగబా స్టేషన్ పోయాను .....................) ఆసాయంకాలం నేను ఫోన్లో : సర్ ! సర్ కొబ్బరి ......................( ముగించే లోపు సదరు ) ఆఫీసర్ : థంక్కు .... నెక్స్ట్ టైం సరిగా ఉండు .. ( బ్రతుకుజీవుడా ! దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆఫీస్ దారి పట్టాను ) సేఫ్టీ కేడర్ లో పనిచేసిన వారికి ఈబా ధలు తెలుసు ... అంచేత ''గాడిదల వెనుక వెళ్ళకూడ దనేది వాస్తవం .. రవి బాబు . మద్దూరి
చేసే . Saturday, 16 August 2014
''ఎంటే ?హేయ్ .... తడికిజం !!!....'' వెనుక ఒక ప్రియుడు తన ప్రేయసి తో చెప్పాలనుకున్న ప్రియమయిన ''నీకు'',మాటలు నేరుగా చెప్పటానికి అభిమానం ... సిగ్గు .... అడ్డం వచ్చి వారిద్దరికీ మధ్యనున్న అడ్డుగోడ వంటి ''తడిక '' ను రాయభారానికి ఉపయోగించాడట . అంటే, తనుచె ప్పవలసిన ప్రతీమాట ...ప్రియురాలి నుండి వినవలసినది, సదరు ''తడిక ''ను మూడవ వ్యక్తి గా ఉపయోగించడం జరిగిందన్నమాట . ''ఆమె చాలా అందం గా ఉంది ............... నాకు చాలా ఇష్టం ''అని తడికకు చెబితే''నాకు చెవిలో పువ్వు పెట్టొద్దు !!.... '' అని ప్రేయసి తడికతో జవాబు చెబుతున్నది . ఇక్కడ ప్రశ్నలూ???.. ..సమాదానాలు !!! చెప్పేది .. వినేదీ కూడా .. మరెవరో కాదు . తడికకు ఇరు వైపులా ఉన్న వ్యక్తులే సుమా !!... కానీ వారిరువురు మధ్యనున్న ''స్టార్టింగ్ -ట్రబుల్ '',అటువంటి దెయన్న విషయం వారిద్దరికీ తెలిసిన ''రహస్యం ''. ఇదుగోండి ! ఇటువంటిదే మన కే సి య్యారు .. బాబు ల మధ్య సయోధ్య . ఈ తరుణం లో సఖ్యత అనబడు తడిక ఎవరు ? హ హ హ .... !! మీకు తెలిసిపోయందే ?... కరెక్ట్ గా ... అదే నండి ! మన ఆనరబుల్ గవర్నర్ గారే మరి . తెలంగాణా ! ఆంధ్ర మధ్య సయోధ్య upa గవర్నర్ గారే చేయాలి మరి . ఇరు కొత్త రాష్ట్రాలకూ .. పాత రాష్ట్రానికి, వెరసి ''పురోహితులు '' తనే గనుక . విద్యార్ధుల ఫీజు రిఎమ్బరుసుమెంటు విషయం తోనే తల బొప్పి కట్టిన కేంద్ర సర్కారు,తోకముడిచి .. UPA తాంబూలాలు ఇచ్చేరు '' తన్నుకు చావడం మీవంతు ''అంటూ, ఢిల్లీ నుండి ఇద్దరినీ తిరుగు టపా లో పంపారు . ఈవిధం గా ఉన్న మన ఆంద్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఏడుస్తుందో? అ న్న బెంగ అందరిదీను . మధ్య లో సన్నాయి నొక్కులు మీడియా ద్వారా ఎన్నో ? ... ఇద్దరూ కలవక పోతే .. మీడియా కు బోలెడంత పని ... సఖ్యతగా ఉంటే పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఉండక పోవచ్చు . వీర వాగుడు, గా ఎంచిన మూడు చానల్స్ ను తెలంగాణా లో బహిష్కరించారు kcr, అనిజనం అంటున్నారు . ఇలాంటి ధృక్పధం '' ఎమర్జెన్సీ '' ని తలపి స్తున్నదన్న విషయం 1976 నాటికి, ఊహ తెలిసినవారు వివరం గా అనుకొంటున్నారు . ఈ చీఫ్ మినిస్టర్స్ ఇద్దరూ ఒకరికి ఒకరు సేవాభావం లో ప్రజల భవిష్యత్తు ను బలిచేసే విధం గా కనిపిస్తున్నది . ఎందుకనంటే ? మధ్యలో ని తడిక ఎప్పుడయినా అంతర్ధానం కావచ్చు . పాపం గవర్నోర్ గిరి భారతదేశం లో ''పడు చుపెళ్ళం-ముసలిమొగుడు '' సినిమా లాంటిది . సాధారణం గా పళ్ళు ఊడిపోయే,చూపుకనిపించని పరిస్థితుల్లో ఈ పదవి ఇస్తుండడం ''ఆనవాయతీ ''. దాదాపు రాజీవ్ గాంధీ కి ముందు రాజీవ్గాంధీ తరువాత ఉన్న ,వచ్చిన ప్రదానమంత్రులను మనవాళ్ళు చూసారు ... చూస్తున్నాం !.. అంచేత శ్రీ బాబు ... శ్రీ kcr లు భేషజాలు ప్రజల భవిష్య దృష్ట్యా, ఒదిలి మీరు ప్రశాంతం గా లేకున్నా (ఉండరుకూడా )ప్రజలు అనబడే మమ్ములను ''బకరాలు '' చేయకుండా చూడండని, ఈ'' తడికోలుకీయం ''(ఆంగ్లం లో చెప్పాలంటే ...'' తదికిజమ్'' ) కు స్వస్తిచేప్పాలని తమ్ముళ్ళు కోరుకుంటున్నారట . ఎందుకంటే ఈ డ్రామా లో '' కేతి గాళ్ళు '' ఎప్పుడో దూరి చేతనయినంతవరకు సందకాడి నుండే లక ....లక .. లక అని ''గెలకడం '' ఆదిలోనే జరిగిపోనాది . ఈ తడికిజం వలన యెంత మేలు జరుగుతు0దో ? చెప్పడం చాలా కష్టం . ఎదుకంటే ? కే సి యారు యెంత సౌమ్యుడో ! అందరికీ తెలిసినవిషయం . కడుపులో పెట్టుకుని చూస్తాం! అంటూ... గుంటనక్క కబురులు చెప్పిన తెలంగాణా వారు(రాజకీయనాయకులు ),అంత సౌమ్యమయిన వారయినట్లయితే ఈ విభజన జరిగిఉండేది కాదు . మా నీళ్ళు ... మా భూములు అని ఎకరువుపెట్టిన తీరు యెంత ? జుగుపత్స కలిగించిందో పసిబిడ్డలకూ తెలుసు . చెప్పేది ఏంటి ? అంటే ! పిట్టా .. పిట్ట పోరూ పిల్లి తేల్చిన చందాన వెంకయ్య నాయుడు కాబినెట్ ఎక్కిండు ... కధల్ చెప్పుతుండు యాద్గిరి బయ్ ..... అరే కాకా గయెదు సంసరాల్ గాటు సెంటర్ల గిటు హైదరాబాద్ లా దుమ్ము రేపుతాడ్ ఫొ ఓట్లు సీట్లు ఆలయ్యి ..... మనకేమో ! ఇన్కమ్ టాక్స్ ... ఉల్లిపాయల ఘాటు .... రైలు ...బస్సు ... గు0జుడూ ...... పిల్లలఫీజ్లూ .... తొక్కలోది ... భాదకావ్ బాదుడు మనం పడాలే . మంచిగున్నది ఉస్తాద్ ..........!!! రవి. మద్దూరి
Friday, 15 August 2014
బెం! బాబు బెంబేలు పడుతున్న బాబు ..అంటే ! బావుంటుందేమో ? ఎందుకంటే .... నక్కను తొక్కిన తెలంగాణా జనాలు అభివృద్ది లో ముందుకు వెళుతున్నా మనుకుంటున్న వారే . ఇది ఇలా ఉంచితే . తాటాకు చప్పుళ్ళు ..డబ్బా మోతలకు (కే సి యారు )బాబు గారు తుళ్ళి ! తుళ్ళి ! పడుతున్నారు . పాపం ఈమధ్య లో ప్రతీ మీటింగు లో '' సింగపూరు .. ప్రపంచ దేశాలు ఆశ్చర్య పడేట్లు '' అనే మాట చాలా చాలా వినిపిస్తున్నది . కాని ఇంతవరకు ఆంధ్ర కు ఒక్క రాజధాని నిర్మి 0చ లేని దుస్తితి మన బాబు కే చెల్లింది . ముఖ్య మంత్రి హోదా లో రాష్ట్ర రాజధాని బయట పెట్టలేక ''పిసుక్కుంటూ '',విజయవాడ తాత్కాలిక రాజధాని గా చెప్పడం సిగ్గు ...సిగ్గు .. . దూసుకుం టూ పోతాము .. ము0దు కుపోతామూ అన్న బాబు, ''గొంగళి '' లా అక్కడే ఉన్నారు . ఈ లెక్కన , అభివృద్ధి అటుంచితే,ఈత డిక తగాదాలు హానరబుల్ కోర్ట్ లు ఎన్నాళ్ళు తీరుస్తాయో అంతుబట్టని విషయం , ఫై గా ప్రతీ విషయం కోర్ట్ పోవలసిందేనా ?వాళ్లకు ఎన్నో పనులు ఉంటాయి . కొందరు టి డి పి మహానుభావులు రాజధాని గురించి సొల్లు కక్కడం వలన ,ఈ దశలో ఆ ప్రాంతం లో స్థిరపడాల్సి న వాళ్ళ నెత్తిన నిప్పులు పోశా రు అన్నది నిర్ వివాదాంశం !. ఇంకా స్టడీ చేస్తున్నాం అన్నది చాలా హాశ్యాస్ప దం . ఇన్ని స0వత్సరాలు సి ఏం గా వెలగబెట్టిన అను భ వం ఏమి ? చేసుకోనో ??... !! ఆంధ్ర ప్రదేశ్ వనరులు ... నైసర్గికస్వరూపం తెలిసినవారే ఇ లా జాగు చేస్తే .ఈ కమిటీ లు ఏమి వెలగబెడుతయో ? అన్న శంఖ ప్రతి పౌరుడు లో తొలుస్తున్న ప్రశ్న ?. అర్ధరాత్రి అంకమ్మ సివాలు లా చేసిన ''విభజన'' జనం లో మానసికమయిన ''భజన '' ను మాత్రం మిగిల్చింది అన్నది వాస్తవం !.. ఈ భారీ దెబ్బకు మానసిక క్షోభ కు గురయిన ప్రజలు మతుల గతులు తప్పి,రాజధాని కర్నూల్ .... కడప .... విశాఖ ... నెల్లూరు . అంటూ పలువరిస్తూన్నారు . ఈ దెబ్బ తో మన బాబు గారి మెదడూ మోకాళ్ళ వరకు జారింది . అంచేత చెప్పింది చెప్పి ..చెప్పి ... చెప్పి విసుగు కు గురి చేస్తున్నారు . బాబు ను ఎలాగయినా దెబ్బ తీయాలని చూస్తున్న రాజకీయరాబందులు ... పలువలు ఊడిన సదరు కాంగిరేసు వాళ్ళు ''ప్రత్యెక '' రాయలసీమ గానాన్ని జనం మధ్యలో చొప్పిస్తున్నారు . ఈ తరుణం లో ప్రసవానికి గూడు దొరకని తల్లిలా పాపం బాబు ''బెంబేలు '' పడడం సహజమా ?... కాదా ?...!! పాపం అతనూ మనిషే కదా ...!!!... అందువలన శ్రీ బాబుగారూ పనిమొదలు పెట్టండి .సమస్యలు వాటి జవాబులు అవ్వే చూవిస్తాయి రవి . మద్దూరి
Thursday, 3 July 2014
'' రసపురాణం ''
మొన్న ఒక రోజు ఉండబట్టలేక ఓ టి వి ఛానల్ తెరిచాను టైటిలు వస్తున్నది కదా !!... ''సౌందర్యలహరి'' . ఒక తెలుగు డైరెక్టర్ తాలూకు జ్ఞ్యా పకాల చిట్టా . అంటే తను దర్సకత్వం చేసిన హీరోయిన్ ల తాలూకు సందర్భ వివరణ సీరియల్ అన్నమాట . ఆరోజు నటిమణి ''రమ్య కృష్ణ ''. మొదలుపెట్టిన డైరెక్టర్ ఆమెను ఆహ్వానించారు . ఆమతో పాటు మోగా-ఆడా కాని ఆచ్చాదన తో చింపిరి జుట్టు తో ఉన్న ఒక వ్యక్తి కూడా ఆసీను లయినారు . ప్రోగ్రాం మొదలయింది . '' ఈ సృష్టి లో అందమయినవి మూడు 1. ఆడది 2. పూవులు 3. పండ్లు '' అని మొదలెట్టారు సదరు డైరెక్టర్ శిఖామణి . ఓ ప్రక్క సినీమా విసువల్ చూవిస్తున్నారు కూడా . అంతలో పొడవాటి పళ్ళు, కనీసం కొచెం చెంపల అందం లేని ప్రయోక్త అడిగింది కదా ? (ప్రతీసారీ తను నవ్వినపుడు దాదాపు ఈ మూల నుండి ఆ మూలకు పళ్ళు బయట పడుతూ వెడల్పయిన నోరు కన్పిస్తూ )'' సర్ ! మీకు పండ్లు సింబాలిక్ లా ఉంది , అంత అద్భుతం గా ఆ పాట ఎలా ? చిత్రీకరించారు ? '' విసువల్ లో రమ్యకృష్ణ బొడ్డు ఫై ''ఆపిల్ '' పడుతూ ఉంటుంది . ఇక డైరెక్టర్ గారు అందుకున్నారు . ''అవును ఈ హీరోయిన్,బొడ్డు ప్రాంతం చూస్తుంటే ! ఆపిల్ లో ని చొట్ట గురుతుకు వచ్చింది, బాగా హిట్ అయింది ఆ పాట '' . ఇంతలో జోకర్ ఆకారం లో కనిపిస్తున్న రమ్యకృష్ణ సహచరురాలు ''ఆ హా ... ఓ .... హో .. గొప్ప ఐడియా .. '' అంటూ ఎగతోయడం ... చాలా జుగుప్సత గా తోచింది ... వినిపించిందే ? అలా సాగిపోతున్న తరుణం లో తలభారం తో చానెల్ కట్టివేసాను . మరి ఈ ప్రోగ్రాం ఎన్ని ఎపిసోడ్స్ ?మరి మన ఖర్మ . బంచిక్ ... బంచిక్ ... చెయ్యి బాగా .. అని మరో పాట దానిలో రమ్యకృష్ణ శరీరం లోని పాటలు ''లేగ్గి '' తో చూవించారు లెండి . ... ఇటువంటి ప్రోగ్రాం కు సౌందర్యలహరి కంటే ''రాఘవేంద్రుని-బిళ్ళహరి '' అని పేరు చాలా బావుండేది . ఛానల్ పరిస్తితి ఇలా ఏడ్చింది అన్నా !!ఏం జేయలే నిజ్జం జేప్పాలే ... ''రాఘవేంద్రుని-బిళ్ళహరి '' , అని ఎందుకు ? చెపుతున్నామంటే ... ఎపిసోడ్స్ అనగా పుంఖాల్లా వస్తాయట ప్రతీ వారం . మరి ...... రవి బాబు . మద్దూరి
మొన్న ఒక రోజు ఉండబట్టలేక ఓ టి వి ఛానల్ తెరిచాను టైటిలు వస్తున్నది కదా !!... ''సౌందర్యలహరి'' . ఒక తెలుగు డైరెక్టర్ తాలూకు జ్ఞ్యా పకాల చిట్టా . అంటే తను దర్సకత్వం చేసిన హీరోయిన్ ల తాలూకు సందర్భ వివరణ సీరియల్ అన్నమాట . ఆరోజు నటిమణి ''రమ్య కృష్ణ ''. మొదలుపెట్టిన డైరెక్టర్ ఆమెను ఆహ్వానించారు . ఆమతో పాటు మోగా-ఆడా కాని ఆచ్చాదన తో చింపిరి జుట్టు తో ఉన్న ఒక వ్యక్తి కూడా ఆసీను లయినారు . ప్రోగ్రాం మొదలయింది . '' ఈ సృష్టి లో అందమయినవి మూడు 1. ఆడది 2. పూవులు 3. పండ్లు '' అని మొదలెట్టారు సదరు డైరెక్టర్ శిఖామణి . ఓ ప్రక్క సినీమా విసువల్ చూవిస్తున్నారు కూడా . అంతలో పొడవాటి పళ్ళు, కనీసం కొచెం చెంపల అందం లేని ప్రయోక్త అడిగింది కదా ? (ప్రతీసారీ తను నవ్వినపుడు దాదాపు ఈ మూల నుండి ఆ మూలకు పళ్ళు బయట పడుతూ వెడల్పయిన నోరు కన్పిస్తూ )'' సర్ ! మీకు పండ్లు సింబాలిక్ లా ఉంది , అంత అద్భుతం గా ఆ పాట ఎలా ? చిత్రీకరించారు ? '' విసువల్ లో రమ్యకృష్ణ బొడ్డు ఫై ''ఆపిల్ '' పడుతూ ఉంటుంది . ఇక డైరెక్టర్ గారు అందుకున్నారు . ''అవును ఈ హీరోయిన్,బొడ్డు ప్రాంతం చూస్తుంటే ! ఆపిల్ లో ని చొట్ట గురుతుకు వచ్చింది, బాగా హిట్ అయింది ఆ పాట '' . ఇంతలో జోకర్ ఆకారం లో కనిపిస్తున్న రమ్యకృష్ణ సహచరురాలు ''ఆ హా ... ఓ .... హో .. గొప్ప ఐడియా .. '' అంటూ ఎగతోయడం ... చాలా జుగుప్సత గా తోచింది ... వినిపించిందే ? అలా సాగిపోతున్న తరుణం లో తలభారం తో చానెల్ కట్టివేసాను . మరి ఈ ప్రోగ్రాం ఎన్ని ఎపిసోడ్స్ ?మరి మన ఖర్మ . బంచిక్ ... బంచిక్ ... చెయ్యి బాగా .. అని మరో పాట దానిలో రమ్యకృష్ణ శరీరం లోని పాటలు ''లేగ్గి '' తో చూవించారు లెండి . ... ఇటువంటి ప్రోగ్రాం కు సౌందర్యలహరి కంటే ''రాఘవేంద్రుని-బిళ్ళహరి '' అని పేరు చాలా బావుండేది . ఛానల్ పరిస్తితి ఇలా ఏడ్చింది అన్నా !!ఏం జేయలే నిజ్జం జేప్పాలే ... ''రాఘవేంద్రుని-బిళ్ళహరి '' , అని ఎందుకు ? చెపుతున్నామంటే ... ఎపిసోడ్స్ అనగా పుంఖాల్లా వస్తాయట ప్రతీ వారం . మరి ...... రవి బాబు . మద్దూరి
Thursday, 26 June 2014
'' యదార్ధ దృష్టి -పదార్ధ సృష్టి . '' యదార్ధ దృ ష్టి నుండి పదార్ధ సృష్టికి'' అలవాటుపడ్డ మనకు ... ఉండీ ఉండీ ఏదో గురుతుకు రావడం సహజం . '' కలియుగము లో సాక్షాత్తు ఆ నిర్గుణు డయిన పరమాత్ముడు సగుణ రూపం ధరించి దుష్ట శిక్షణ-భక్త రక్షణ కు స్వయాన ఈ భూమి మీద అవతరిస్తాడని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి...'' అన్నది ఆర్యోక్తి . ఈ భరత భూమిలో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు . మన లాంటి సామాన్యులు , ఎంత ఘోషించినా అది అరణ్య రోదనే . కాని మహానుభావుల, ఇప్పటిమాట రేపటికి చరిత్ర . షిరిడీ సాయి చరిత్ర నిశితం గా పరిశీలన చేస్తే, మనకు ఎన్నో ఆణిముత్యాలు దొరుకుతాయి . మనజీవితాలను సంస్కరించుకుని ముందుకు సాగటానికి ఎంతో ఆస్కారం కనిపిస్తున్నది . ఇక్కడ ''ద్వాదశ భావాలు '' మీముందు ఉంచుతున్నాం 1) షిరిడీ సాయి తాను దేవుడనని ఎన్నడూ చెప్పలేదు . దేవుని సేవకుడ నని,బానిసనని మాత్రం చెప్పారు . 2)తనను సేవించమని,పూజలుచెయ్యమని,హారతులుతయారు చేసి పాడమని,ముట్టు.. కట్టు .. బొట్టు ... ప్రత్యేక మయిన వేషదారణను విధించలేదు . 3) తిండి విషయం : ఫలానా తినండి(లేక )తినకండి అని షరతులు విధించలేదు . 4) తను షిరిడీ ప్ర వేసించి.. మహా సమాధి చెందే వరకూ భౌతికముగా రైల్,బస్సు,కారు,వంటి..సహాయము తో గాని నడచి గాని షిరిడీ వదలి వెళ్లలేదు. 5)అత్యంత గొప్ప విషయము,ఏ మతమును,కులమును,జీవన విధానము ను కలలో నయినా ద్వేషించ లేదు , విమర్శనా చేయలేదు . మీ మీ ఆచారాలను,మత విధానాలను తూచా తప్పక పాటించడానికి షిరిడీ కూడా సహాయపడుతుంది అని ఒక్కాణిo చారు . 6)మత మార్పిడి అన్నదానికి ''బాబా '' బద్ధ వ్యతిరేకి . 7)బాబా ఒక ''అవధూత '',అనగా మనుష రూపేణ,వారి తపోనిష్ట వలన,ఘాడ మయిన బ్రమ్హచర్యము వలన,తీవ్ర తపస్సువలన,సాక్షాత్తు పంచభూతములు (గాలి ..నీరు .. నిప్పు .. భూమి ..ఆకాశాలు )తమను తాము,అవధూతల ఆదేశాలకు బానిసలు గా అర్పింప బడి ఉంటాయి . 8)బాబా కు చదువు అన్నది లేదు . భాష మాత్రం ''మరాటీ ''. కాని చు ట్టూ చేరిన వైదిక పండితులు,ఖోరాను -నిస్టగరిస్టులు, బైబిల్-మహాగ్రంధం లోని సంక్లిస్ట మయిన,మీమాంసలకు అతిచక్కని,సర్వ జన ఆకళింపు గా భాష్యం చెప్పిన సందర్భాలు.. కొన్ని సందర్భాలలో ఈ గ్రంధాలలో ఉన్న శ్లోకాలు,ఘట్టాలు పొల్లు పోకుండా చెప్పిన విషయాలు కోకొల్లలుగా గ్రంధస్తం, బాబా సమాధి అనంతరం కాబడ్డాయి . 9)గుడులూ,గోపురాలు కట్టడమే భక్తీ అన్న భావన ను, సంస్కరిచిన, ఆయన చరిత్ర లో మనం చూస్తాం(కట్టడానికి తను వ్యతిరేకి కాదు సుమా !! ). చందాలు,దర్శ నం ఫీజులు,ప్రసాదం ఫీజులు, కానుకలు,మాన్యాలు,పేద -గొప్ప ధనవంతులు-అధికారులు అన్న వ్యత్యాసం ఆయనకు తెలియని విషయాలు . 10) ఆశ్రమాలు,ఆశ్రమ ఆస్తులు,ఆశ్రమ నిధు లు అనేవి ఏమిటో తెలియని ఒక సాధారణ బిచ్చగాడు .తను సమాధి చెందే రోజు వరకూ ఐదు ఇళ్ళలో మిగలగా ఇచ్చిన అనవసర వ్యర్ధాలే, ఆయనకు మధుర పదార్ధాలు . ఆప్ప టి అమాయక జనం అతిబలవంతము మీద కప్పిన పట్టు శాలవాలు ఉన్నా, మురికి పట్టి నూనె జిగట తో ఓ మోస్తరి కంపుగా ఉన్న ''కఫినీ '' ఎన్నడూ ఒ ద లలేదు, మార్చనూ లేదు .అలంకారానికి ఇప్పటి musium లో ఉన్న అచ్చాదనలు అతనికి, భక్తులు సమర్పించినవి. వాటిని అలంకరించ దలచిన అప్పటి సహచరులు , భక్తులు ఎన్నో సార్లు బాబా ను గట్టిగా పట్టుకుని,తన్నులు తింటూ, శ్రీ బాబా చే తిట్లు తింటూ బలవతo గా అలంకరించినవి . ఎన్నోసార్లు బాబా గిరాటు వేసినవి . 11)ప్రపంచమే తన ఇల్లు,ప్రజలే బంధు వులు గ చెప్పే బాబా తల్లి -తండ్రి కులం -మతం ,ఊరు -పేరు తెలిసినవారు ఇప్పటి వరకూ ఎవ్వరూ లేరు . 12)సమాధిముందు నుండీ , అనంతరం ,ఇప్పటివరకూ తనను నమ్ముకుని జీవిస్తున్న వారికి ఏదో విధం గా సహాయకారిగా,సేవకునిగా , అనుభవము అవుతున్నారు షిరిడీ సాయి . కాని ''కాశీ - పీటాధి పతులు శ్రీ . శ్రీ .శ్రీ .స్వరూపానంద తన భక్తుల కలలో కూడా కనిపించిన దాఖలాలు లేవు !! ''. ఫై గా షిర్డీ బాబా ఫై చేసిన వాఖ్యాల వలన తను వెలుగులోనికి రావడం ముదావాహం గమనిక : సాయి భక్తులారా ! మహాత్ములను,భగ వత్ స్వరూపులను,తప్పుపట్టడం మన ఉద్దేశ్యం కాదు . కోట్లాది ప్రజల నమ్మకాల ఫై బురదచాల్లె ప్రయత్నం మాత్రం ''కలియుగ అవలక్షణం అని మాత్రం చెప్పగలను . బహుశా గత 20 వసంతాలనుండి శ్రీ షిర్డీ బాబా కు పెరుగుతున్న ఆదరణ,భక్తీ ఇందుకు కారణం కావచ్చు . కారణం కాశీ కి వెళ్ళే కోట్లాది భక్తుల్లో లక్షలాది భక్తులు షిరిడీ ని ఆశ్రఇంచిన వారే !!!! ఇన్ని మాటలెందుకు ..??..!! ఆనాటి,కుష్టువ్యాది గల భాగోజీ,గొప్ప సంసృత భాషాఘనాపా టీ ఉపాసనీ శాస్త్రి,కోటీశ్వరుడయిన బూటీ-సాటే లు అందరూ సమానులే . అంతే కాదు బాబా పాదప్రక్షాలనా తీర్ధ దాసులని మనం మారవ కూడదు ..!!!.
Subscribe to:
Posts (Atom)











.jpg)




















