totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Friday, 24 October 2014


                                          ''మోడీ భారతీయం
...... !!''                                                                                       ఉదయాన్నే లేచి కళ్ళు నులుముకుంటూ  టీవీ పెట్టాను . ఒక్క సారిగా తత్తరపాటు కు గురి అయ్యాను . టీవీ లో ఒక అనూహ్యమైన న్యూస్ వస్తుంది . అదో ఛానల్ గోడమీద పిల్లివాటం దాని వాటం . ఈ మధ్యలో టీవీ చానెళ్ళ ఫై ముఖ్య మంత్రులు విరుచుకుపడడం పరిపాటి . ఆ భయం లో బెంబేలు ఎత్తిన సదరుచానేల్ కొన్ని ఊకదంపుడు కదంబ కార్యాక్రమాలు పెడుతున్నది . ఉదాహరణకు తప్పిపోయిన వాళ్ళను వెతకడం ... తల్లిబిడ్డలను కలపడం వంటివి . ఆ కోవకు చెందినదే నేను చూసిన ప్రోగ్రాం . కొంతమంది పదవులు ఊడినవారు .. పదవుల్లో ఉన్నవారు .. కూసింత ''లెన్సు '' ముందు కళా పోషణ చేసేవారు ... భూకబ్జా ఆద్యాత్మిక పండితులు ... ఇటు రాజకీయం లోను.. అటు ఇతర విషయాల్లో ఉభయ బ్రస్టుత్వం ... ఉప్పర సన్యాసం పొందినవాళ్ళు ను .... అందరూ . పొడవాటి చీపుళ్ళు పట్టి ఊడుస్తున్నారు . ప్రోగ్రాం పేరు ''స్వచ్ఛ భారత్  ''. అంతవరకూ బాగున్నది . కానీ ఊడుస్తున్న విధం చూస్తె చాలా గమ్మత్తుగా ఉంది . అందరూ సుబ్బరం గా మిల మిల లాడే బట్టలతో తళతళ లాడుతూ . ఊడ్చిన చోటు ఊడుస్తూ ... చాల ఆహ్లాదకరం గా కనిపించారు . '' స్వచ్చ భారత్ '' అనబడు కార్యాక్రమమం ఛానల్ షూట్ చేసి అ సమయం వరకే పరిమితం . తదుపరి  జనగణమణ . ఎందుకంటే ఇక్కడ .. ఊడ్వడానికి ఏమి ఉండదు గనుక ... మహాత్మా గాంధీ చెప్పింది ఎవ్వడి బెడ్ రూమ్ వాడు ఊడుచు కొడం కాదు .. ఎవ్వడి టాయిలెట్ వాడు ఊడ్చ్కుని  వీలుంటే ఊడవలేని  .. వాడికి సహాయపడమని . తమాషా ఏంటంటే ? దాదాపు 50 మంది ఉన్నానాయకుల  జూబిలీ హిల్స్ మొత్తం ఊడ్చ గలిఉ0డాలి . కాని నీడ పట్టున మంచి సిమెంట్ రోడ్ ను ఊడ్చారు . వాళ్ళని ఉడవనీయక , ఆ ఛానల్ p 2... రెచ్చిపోయి మరి ఛానల్ వైభవం చెప్పించడం కనబడింది, ఎందుకంటే ఆ చానెల్ స్పోన్సుర్ చేసి o దిగనుక .ఈ విధం గా దేశం లో ప్రతీ వాడు ఒక్క సంఘీక .. సామాజిక విషయాన్ని , తమ పరిధిలో తీసుకుని ,తమ స్వలాభానికి వాడుకుంటే ఈ దేశం గతి ఏంటి ? నిజం గా చిత్తశు ద్ది  ఉంటె వీళ్ళంతా యాకుత్పురా ... దబిల్పుర ...ఉసుఫ్ఫ్ గూడా .... చాదర్ఘాట్ వెరసి పాతబస్తీ కి వెడితే .... అసలు అక్కడి ప్రజలు యెంత దుర్భరం ఐన మురికి వాతావరణం లో ఈ మహానగరం లో ఉన్నారో బోధపడుతుంది . జూబ్లి హిల్స్ ... బo జారాహిల్ల్స్ ...   రాజభవన్ ముందు .... మహేంద్ర హిల్ల్స్   లో కాదు సుమా ! ఈ వన్నీ ధనికులకు   ఉండే ప్రాంతాలు ... ఈ దేశo .. ఒకడి చెత్త వేరే  వాడి స్థలం లో వెయ్యడ మనే కార్యక్రమము చెయ్యక పోవడం అనేదే పెద్ద      ''స్వచ్చభారత్ '' '' కు '' నాందీ ... అదే అన్నారు గాంధీ ... మదర్ దేరేసా .... భారత దేశం మొత్తాన్ని ఈ విధం గా పరిశుబ్రం చేయడం ... గంగ ను పరిశుబ్రం  చేయడమనే మహా ప్రణాలికలు వలన ఉన్న 5 సవత్సరాల మోడీ పుణ్యకాలం ఇలా గడిచిపోతుంది . ఇక పొతే దేశ  సరిహద్దు భద్రతా ప్రణా ళిక ... ఆర్ధిక పరిపుస్టత ... వ్యాపార ... వాణి జ్య... ఎగుమతులు .... దిగుమతులూ .... విద్యారంగం .... పరిశ్రమలూ ... ప్రశ్నార్ధకం ? గా మిగిలే ప్రమాదం పొంచివుంది .... ఈ విధం గా '' స్వచ్ఛ భారతో    లేక ... శ్రేమే వజయెతె '' లాంటి ఉబుసుపోని రంగాలకంటే ...... దేశ అవసరాలు ...ఉద్యొగితా .. ఫై మోడీ ద్రుష్టి సారించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు .ఉదాహరణకు ఐ టి  రంగం లో కనిపించే ఆశుబ్రత వికృతం గా నాల్కలు చాచి '' స్వచ్చ భారత్ '' ను సవాల్ చేస్తుంది . కనిపించిన వాడికి చీపురు  ఇవ్వడం వలన ఆ రంగం లో జీవనాధారం గా ఉన్నవారు కొంత అభద్రత కు , సోమరితనానికి ఉపక్రమించే ప్ర మాదం ఉంది ...ఇ  లాంటివి, కొన్ని శ్రీ బాపూజి  గారు చెప్పినవి స్వీయ బాధ్యతల లోనివి .ప్రస్తుత ప్రపంచ గమనం లో , జనాకర్షణ తప్పించి ఒరి గేదేమిలేదు .నాకు అపుడపుడూ ఐ టి  వాళ్ళు బజార్లు శుబ్రం చేయడం చూసి ... నాలో నేను నవ్వుకుంటాను . కొంతమంది జీన్ పాంట్లు షర్ట్లు మురికి పట్టి క్రింద దేకుతూ .... సుందరముదరస్టం గా తగలడుతూ ఉంటాయి . ఎవరి ఇల్లు వారు శుబ్రం గా ఉంచుకొంటు ప్రక్కవాడి కి సహాయ పడడం బాపు ఉద్దేశ్యం .  అంతే  గాని చానెళ్ళ కెమెరాల ముందు రాజకీయ నాయకులు జాగింగ్ డ్రెస్ .... కద్దరు బట్టలు  కట్టుకుని,నడుమువ0చాల్సిన అవసరం లేని పెద్ద పెద్ద చీపుళ్ళు తో ఫోజులు .. భాషణలు కాదు . బాపు చెప్పిన వన్నీ తూచా తప్పక ఏ రాజకీయ నాయకుడు చేసాడు ఈ భారత దేశం లో ఇంతవరకు . అలా చేస్తే .... చేయాలనీ మనసు ఉంటె .. ఈ రోజు స్విస్ ఖజానా లో నల్లధనం , ప్రజలు అడగాల్సిన గత్యంతరం లేదు కదా ?? .... !!! మోడీ అన్నాడు కదా !అనే భావం తప్పించి ... మరి ఈ నాయకులకు స్వీయ స్వచ్ఛత, ఇంతవరకు గురుతుకురాకపోడం ముదావాహం . భారతదేశం లో ఇటువంటివి .. ఎప్పుడూ ఓ ''తంతు ''లా జరగడంపరిపాటి  . నిజం గా మనమందరం మోడీ కి ఋణ పడి ఉన్నాం  . ఎందుకోతెలుసా .. ??? ... !!! స్వఛ భారత్ .. ''మోడీస్వచ్ఛ భారతం '' కానందుకు .                                                                                                                                                             రవి బాబు . మద్దూరి

No comments:

Post a Comment