''మా దిక్కు నీవెరా !!! సింహాద్రి అప్పన్నా !!! ''
'''''' . ఆ రోజులు ఎన్నో సార్లు గురుతుకోచ్చేవి .. నేను రెండో తరగతి ... అమ్మ మీద అలక తో నాన్న నన్నూ .. బుజ్జిని తీసుకుని అప్పట్లో నానమ్మ దగ్గరకు తీసుకు పోయారు . బుజ్జి పాలు త్రాగే పిల్ల . నానమ్మను చూస్తె అప్పటి కన్నాంబ గురుతు రావలసిందే . పొడవాటి ముక్కు,నిమ్మ పండు రంగు,పెద్దకళ్ళు . నుదుట జిల్లెళ్ల మూడి అమ్మ లా పెద్ద కుంకుమ బొట్టు,నాన్నఎత్తు . ఆమెని చూస్తె మరోరు గురుతుకు రారు . ఉప్పాడ బీచ్ కు దగ్గరలో నానమ్మ నివాసం . చుట్టూ దట్టమైన అడవి చీకటి పడితే నక్కల ఊళలు . యెర్రని చండ్ర నిప్పుల్లాంటి కళ్ళు రాత్రిలో మెరిసేవి . చుట్టూ చీకటి . కరంటు ఆ రోజుల్లో ఎన్నో ఊళ్లకు లేవు . రాత్రి బయటకు పోలేని భయం . నేను చెల్లి బుజ్జి నానమ్మ దగ్గర వెచ్చగా ... కధలు చెబుతూంటే ఊ కొట్టేవాళ్ళం . నాకు అమ్మ గురుతుకు వచ్చినా,బుజ్జి కి మరెవ్వరూ గురుతుకు వచ్చీవారు కాదు . దగ్గరలో చేతికి అందినట్లు గా ఉండే సముద్రం . సముద్ర హోరు రాత్రి సంగీతం మాకు . ఉదయం లేవడం ఏంటో ఉత్సాహం . నాన్న ఆ ఊర్లో మనుషులకు వైద్యం చేసేవారు . ఒక్క విషయం చెబుతాను, నాన్న ఇంజక్షన్ చేస్తే ... తెలిసేది కాదు . హస్తవాసి అటువంటిది . చుట్టూ పట్ల ఉన్న చిన్న పల్లెలు సహితం నాన్న వద్దకు వైద్యం కోసం వచ్చేవారు . నా జీవితం లో విశాఖ నగరం .. బోయపాలెం ... చేపల ఉప్పాడ చూడడం .. అడవి లో ప్రయాణించడం అదే మొదలు . నాయనమ్మ ను కలవాలంటే విశాఖ దిగి .. బోయపాలెం చేరి అక్కడనుండి 6 మైళ్ళు కాలి నడకన చేరాలి . ఎడ్ల బండ్లు లో కూడా ప్రయాణం చేయొచ్చు . కాని అన్ని వేళల్లో బండ్లు కట్టారు కదా !.. ఆ ప్రాంతాల్లో మనుషులు కొద్దిగా కూల్ గానే మాట్లాడతారు .. సహాయం చేసే నయజుం . గుంటూరు ...ప్రకాశం లా సెల్ఫిష్ మాత్రం కారు . ఎక్కువ పేదలే .. నాగరికత కొంచెం మొరటు .. మనసు మెత్తన . తీరం అంతా ఎప్పుడూ ప్రశాంత మే . వారాని కి ఒక్క రోజు సంత, అదీనూ బోయపాలెం లో . నేను మొదటచూసిన సంత (ఇప్పటి రైతు బజారు )కూడా కావడం విశేషం . ఒక్క చిన్న గమ్మత్తు విషయం చెబుతాను . నాన్న ఉన్న రంగుకు నప్పే కెంపు రంగు చొక్కా అమ్మ గతం లో కొన్నారు . అదంటే తనకు ఇష్టం ... ఊరు వస్తున్నా సందర్భం లో చాకలి కి వేసారు . అదుగో ఆచోక్కా లో సదరు చాకలి సంతలో ప్రత్యక్షం అయ్యారు . మొహుం వచేట్లు నాన్న దగ్గర దొబ్బులు తిన్నారనుకోండి ! .... ఆ సంతలో దొరకని వస్తువంటూ లేదు . 6 మైళ్ళ అడవిలో ప్రయాణం మరిచిపోలేనిది, అదీనూ బండి కట్టనప్పుడు . ఆ ఊర్లో నాతొ తిరిగే స్నేహితుడు ''పామోడు '' ఉండేవాడు వాడి బాబు ''అప్పడు '' . తను నన్ను చెల్లెలు బుజ్జిని కావడి బుట్టలతో చెరో పక్క కూర్చుండ బెట్టి కావడి బద్ద భుజన్నేసుకుని తీసుకు పోయాడు . తను మమ్మల్ని ఎక్కడా దించిన గురుతు లేదే ... !!!! దట్టమైన అడవి లో జింకలూ ... వెతకుక్కలో పక్షులు ... ఎన్నో వింతలూ ప్రత్యక్షం గా చూసాం . ఫ్రెష్ కూరగాయలు .. మంచి గాలి ... చిక్కని పాలు .. తియ్యటి నీళ్ళు ... మంచి పండ్లూ .. దొరికేవి . పైగా సౌమ్య మయిన ప్రశాంతత ... ఒక్క విధం గా రేట్లు చాలా తక్కువ . కల్తి లేని సరుకులు దొరికేవి . భూతలం లో ఉన్న స్వర్గం లా అనిపిచేది '' విశాఖ '' నగరమే కాక చుట్టూ ప్రాంతాలన్నీ . నాన్న గారికి వైద్యం నిమిత్తం కావాల్సిన మందులు .. భీముని పట్నం (భీమిలి ) వరకూ సముద్రతీరం లో సైకిల్ ఫై వెళ్లి తెచ్చీవారు . మోసం అన్నది ఆ ఊర్లల్లో జరిగేవి కావు . ఆరోజులు తీపి గ్యపకాల్లా మిగిలాయి న జీవితం లో . తదుపరి నాయనమ్మ కాలం చేయడం తాత గారేప్పుడో పోయారు . ముఖ్యం గా నాయనమ్మ లాలించే తీరు అనన్యం .. ఎక్కడ చూసినా ఆకుపచ్చదనం తో నిండి ఉండేది .విశాఖ లో దిగితే నే ఓ చల్లదనం .. ఓ ఆత్మీయత ... ఓ ఆత్మానందం . .. మరి ''హుద్హుద్ '' పుణ్యాన అంతా నాశనం ఐ పోయింది ... ఒకప్రక్క ఇన్సాట్ చిత్రాలతో .. ఎప్పెటికప్పుడు దాని గమనాన్ని చెబుతున్నది వాతావరణం శాఖ . ఆంధ్ర రాష్ట్ర సర్కార్ ! ఈ తుఫాన్ ను ఎదుర్కున్నాం అని కారు కోతలు కోస్తూ .. డబ్బా కొట్టుకుంటుంది . జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడo తో బాధ్యత ఐ నట్లు అనుకొంది . ఇంతవరకు విజయనగరం తో సహా చీకట్లో మ్రగ్గుతున్నవి . 4 రోజులు ముందు నుంచి భవిష్య స్థితి తెలుసుకున్న ప్రభుత్వం, ప్రణాళికలు అరాకొ రగా అమర్చింది . రహదార్ల లో ముందుగానే ప్రోక్లైనర్ లను పెట్టడం మరిచింది .. నీటి చప్టాల వద్ద బొల్దెర్లను పెట్టలేదు . రక్షిత త్రాగునీరు టాంకర్ల ద్వారా తరలించి బఫర్ స్టాక్ చేయలేకపోయింది . గాలి వేగం సుమారు 150 km అని ముందు నుంచే చెబుతున్న విషయం మనదరికి తెలుసు . రొట్టెలు బిస్కట్లు .. మందులూ ముందుగానే సమీకరించి పెట్టలేదు ... పైగా మోడీ అందించిన సహాయం ను పెద్ద 70 mm లో ఇటు చంద్ర బాబు అటు వెంకయ్య ''ముత్యాలముగ్గు '' లో ని జోకర్లలా''మద్దెల '' అవిశ్రాంతం గా వాయించారు . అంచనా కట్టలేని నష్టమట . కేంద్రం ఆదు కుంటూo దట . ఎప్పటికి .. ఎవర్ని ..? ... ఐ టి రంగానికి సుమారు 3000 కోట్లు భారీ నష్టం . ఈ తుఫాన్ దెబ్బకు ఐ టి వాళ్ళు విశాఖ లో మరో ''పయలిన్ '', చవి చూడ్డానికి , హుదుద్ రుచి చూ డ్డాంకి , సిద్ధం గా లేరు . ఖాయం గా మరో స్తలం వెతుక్కుంటూ ఉండొచ్చు . సింగపూర్ చేస్తాం లాంటి సోది మాటలూ .. డబ్బాలు కొట్టడం తెలుగు దేశం మానాలి . తుఫాన్ కరాళ నృత్యం ... మిగిల్చి ఆనవాలు ఫై, చిల్లర ఏరుకునే పశు వులకు తగినగుణ పాఠం చెప్పాలి.విశాఖ రైల్వే ను విజయవాడ దివిజన్ లో విలీనం చేసే ప్రతిపాదన, కొన్ని దశాబ్దాల అవిశ్రాంత పోరాటం . అటువంటి ప్రయత్నం లో ఉత్తీర్ణులు కాలేని రాజకీయ రాబందులు ఏకం గా విశాఖను , పారిస్ లానో .. సింగపూర్ లానో చేయడం ఎంతవరకు సాధ్యం . ... ??? .. !!! ఈ మాటలు నీటి మీద రాతలేనా .. ??? !!! .. ఒక్క చంద్ర బాబు హరిచంద్రుడు గా మారితే కలిగే లాభం ఏంటి ...??? !!! ... 
No comments:
Post a Comment