totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Saturday, 16 August 2014











                    ''ఎంటే ?హేయ్   .... తడికిజం !!!....''                                                                                                                                             వెనుక ఒక ప్రియుడు తన ప్రేయసి తో చెప్పాలనుకున్న ప్రియమయిన ''నీకు'',మాటలు నేరుగా చెప్పటానికి అభిమానం ... సిగ్గు .... అడ్డం వచ్చి వారిద్దరికీ మధ్యనున్న అడ్డుగోడ వంటి ''తడిక '' ను రాయభారానికి ఉపయోగించాడట . అంటే, తనుచె ప్పవలసిన ప్రతీమాట ...ప్రియురాలి నుండి వినవలసినది, సదరు ''తడిక ''ను మూడవ వ్యక్తి గా ఉపయోగించడం జరిగిందన్నమాట . ''ఆమె చాలా అందం గా ఉంది ............... నాకు చాలా ఇష్టం ''అని తడికకు చెబితే''నాకు  చెవిలో పువ్వు పెట్టొద్దు  !!....   '' అని ప్రేయసి తడికతో జవాబు చెబుతున్నది . ఇక్కడ ప్రశ్నలూ???..  ..సమాదానాలు   !!!  చెప్పేది .. వినేదీ కూడా .. మరెవరో కాదు . తడికకు ఇరు వైపులా ఉన్న వ్యక్తులే  సుమా !!... కానీ వారిరువురు మధ్యనున్న ''స్టార్టింగ్ -ట్రబుల్ '',అటువంటి దెయన్న విషయం వారిద్దరికీ  తెలిసిన ''రహస్యం ''.                                      ఇదుగోండి ! ఇటువంటిదే  మన కే సి య్యారు .. బాబు  ల మధ్య సయోధ్య . ఈ తరుణం లో సఖ్యత అనబడు తడిక ఎవరు ?  హ హ హ  .... !!  మీకు తెలిసిపోయందే ?... కరెక్ట్ గా ... అదే నండి ! మన ఆనరబుల్ గవర్నర్ గారే  మరి . తెలంగాణా ! ఆంధ్ర మధ్య సయోధ్య upa  గవర్నర్ గారే చేయాలి మరి . ఇరు కొత్త రాష్ట్రాలకూ  .. పాత  రాష్ట్రానికి, వెరసి  ''పురోహితులు '' తనే గనుక . విద్యార్ధుల ఫీజు రిఎమ్బరుసుమెంటు విషయం తోనే తల బొప్పి కట్టిన కేంద్ర సర్కారు,తోకముడిచి .. UPA తాంబూలాలు ఇచ్చేరు '' తన్నుకు  చావడం మీవంతు ''అంటూ, ఢిల్లీ నుండి ఇద్దరినీ తిరుగు  టపా లో పంపారు . ఈవిధం గా ఉన్న మన ఆంద్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఏడుస్తుందో? అ న్న బెంగ అందరిదీను . మధ్య లో సన్నాయి నొక్కులు మీడియా ద్వారా ఎన్నో ? ... ఇద్దరూ కలవక పోతే .. మీడియా కు బోలెడంత పని ... సఖ్యతగా ఉంటే పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఉండక పోవచ్చు . వీర వాగుడు, గా ఎంచిన మూడు చానల్స్ ను తెలంగాణా లో బహిష్కరించారు kcr, అనిజనం అంటున్నారు . ఇలాంటి ధృక్పధం '' ఎమర్జెన్సీ '' ని తలపి స్తున్నదన్న విషయం 1976 నాటికి, ఊహ తెలిసినవారు వివరం గా అనుకొంటున్నారు . ఈ చీఫ్ మినిస్టర్స్ ఇద్దరూ ఒకరికి ఒకరు సేవాభావం లో ప్రజల భవిష్యత్తు ను బలిచేసే విధం గా కనిపిస్తున్నది . ఎందుకనంటే ? మధ్యలో ని తడిక ఎప్పుడయినా అంతర్ధానం కావచ్చు . పాపం గవర్నోర్ గిరి భారతదేశం లో ''పడు చుపెళ్ళం-ముసలిమొగుడు '' సినిమా లాంటిది . సాధారణం గా పళ్ళు ఊడిపోయే,చూపుకనిపించని పరిస్థితుల్లో ఈ పదవి ఇస్తుండడం ''ఆనవాయతీ ''. దాదాపు రాజీవ్ గాంధీ కి ముందు రాజీవ్గాంధీ తరువాత ఉన్న ,వచ్చిన ప్రదానమంత్రులను మనవాళ్ళు చూసారు ... చూస్తున్నాం !..                                                                                                                    అంచేత శ్రీ బాబు ... శ్రీ kcr లు భేషజాలు ప్రజల భవిష్య దృష్ట్యా, ఒదిలి మీరు ప్రశాంతం గా లేకున్నా (ఉండరుకూడా )ప్రజలు అనబడే మమ్ములను ''బకరాలు '' చేయకుండా చూడండని, ఈ'' తడికోలుకీయం ''(ఆంగ్లం లో చెప్పాలంటే ...'' తదికిజమ్'' ) కు స్వస్తిచేప్పాలని తమ్ముళ్ళు కోరుకుంటున్నారట . ఎందుకంటే  ఈ డ్రామా లో '' కేతి గాళ్ళు '' ఎప్పుడో దూరి   చేతనయినంతవరకు సందకాడి నుండే   లక ....లక .. లక  అని ''గెలకడం  '' ఆదిలోనే జరిగిపోనాది .   ఈ తడికిజం  వలన  యెంత మేలు జరుగుతు0దో ? చెప్పడం చాలా కష్టం . ఎదుకంటే ? కే  సి  యారు  యెంత  సౌమ్యుడో ! అందరికీ తెలిసినవిషయం  . కడుపులో పెట్టుకుని చూస్తాం!   అంటూ... గుంటనక్క కబురులు చెప్పిన  తెలంగాణా     వారు(రాజకీయనాయకులు ),అంత  సౌమ్యమయిన వారయినట్లయితే ఈ విభజన జరిగిఉండేది  కాదు . మా నీళ్ళు ... మా భూములు అని ఎకరువుపెట్టిన తీరు యెంత ? జుగుపత్స కలిగించిందో   పసిబిడ్డలకూ  తెలుసు . చెప్పేది  ఏంటి ? అంటే    !  పిట్టా .. పిట్ట పోరూ పిల్లి తేల్చిన చందాన వెంకయ్య నాయుడు కాబినెట్ ఎక్కిండు ... కధల్ చెప్పుతుండు యాద్గిరి బయ్ ..... అరే   కాకా గయెదు సంసరాల్ గాటు సెంటర్ల గిటు హైదరాబాద్ లా దుమ్ము రేపుతాడ్   ఫొ ఓట్లు సీట్లు ఆలయ్యి ..... మనకేమో ! ఇన్కమ్ టాక్స్ ... ఉల్లిపాయల ఘాటు .... రైలు ...బస్సు ... గు0జుడూ   ...... పిల్లలఫీజ్లూ .... తొక్కలోది ... భాదకావ్ బాదుడు మనం పడాలే . మంచిగున్నది ఉస్తాద్ ..........!!!                                                                                                                                                                                                                                                                                                                                                                                                         రవి. మద్దూరి

No comments:

Post a Comment