'' మంత్రులే కంచె మేస్తే ...!!..??..''

పరిస్థితి తీవ్రం గా ఉంటుంది మరి . ఈ మధ్యలో రాజకీయ నాయకుల్లో విచిత్ర వేషాలు .. కుహనా రాజకీయులు .. సంసృతి అర్ధ గ్యానులూ .... రక ,రకా లయిన వారు మ 0త్రులుగానూ చేరుతున్నారు .వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ హైందవ సంస్కారం లో పెను మార్పులకు శ్రీకారమా ? అన్న భావన కలగక మానదు . ముఖ్యం గా సంస్కార సాంప్రదాయవాదులు ముక్కు మీద వేలేసుకోనక తప్పదంటున్నారు . మొన్న ఆ మధ్యలో కేరళ రాష్ట్రం లో ఒక గాయకుడు ''జీన్ '' ప్యాంటు ఎ సంసృతి ?అన్న ప్రశ్నకు ..... దాదాపు అభ్యుదయవాదు ల్లా ఆడవారు విరుచుకుపడడం మనం చూసాం . ఆ గాయకుడు మరో మతానికి సంబంధించి నప్పటికీ హైందవ గురువును మెప్పించి సo గీత విద్య ను అభ్యసించిన ''తాత్వికుడు '' . కనీసం అతని విద్యకు ... అనుభవానికి ... వయస్సుకూ కొద్దిపాటి గౌరవం కూడా ఇవ్వక .. నా నావిధాల కామెంట్ చేసారు ఈ లోకం లో . మన హైందవ సంస్కృతి ... కట్టుబాట్లు .... ఎటు పోయాయి ? . కర్పోరిటిజo ... అంటే మన సహజ నాగరికత ను నిందించడమే నా ? ఇప్పటి పుంతలు తొక్కుతున్న నూతన విద్యావిధానం ... చీ రా కుర్తా ... ఫై జామా ... కుర్తి .... జాకెట్ ..... పమిటా వంటి వాటి నుంచి జీన్ ప్యాంటు ... టి-షర్టు మధ్య తేడా ! ఒక అమెరికా ....ఒక భారత నారి మధ్య లో ఉన్నంత తేడా ఉంది . అమెరికన్ ఫాషన్ డ్రెస్ లో స్త్రీ అంగాలు ప్రస్పుటం గా బజార్లలో వినో దాన్ని ... విపరీతార్ధాల్ని పంచుతాయి . కాని భారతీయ నాగరికత లో దుస్తులు స్త్రీ శరీరాన్ని సౌష్టవాన్ని మరుగుపరచి, ధరించినవారికి నిండుదనాన్ని ... గౌరవాన్ని, తెస్తాయి అన్న విషయం లో, ఎటువంటి సందేహం లేదు . కార్పోరెట్లో నూ సాంప్రదాయ బద్ధం గా కట్టూ బొట్టూ ధరించేవారు లేరా ? . మహాత్మా అన్నట్లు ''అర్ధరాత్రి '' స్వతంత్రం వచినప్పుడే స్త్రీ జీ వితానికి ముక్తి ... విముక్తి . అప్పుడు ఈ భూమి ఫై ఎటువంటి ''నిర్భయ '' చట్టాలు అవసరం లేదు . పాశ్చాత్య దేశాల్లో తుపాకులు ''గుట్కా '' పొట్లం లా జేబులో వుంటుంది . కావలిసిన అమ్మాయితో ఇష్టం వచినట్లు కలియ తిరిగే నాగరికత వాళ్ళది .ఈ డేటింగ్ సంస్కృతి ఎక్కడిది ? భారత దేశం లో స్త్రీ కి జాగ్రత్త ఎంత అవసరమో ... పురుషుడికీ అంటే అవసరం . కానీ చట్టాల్లో పెనుమార్పులు అవసరం . అలానే ఎవ్వరి కి చట్టాలు చుట్టాలు కాకూడదు . మొన్న ఒక కాబినెట్ హోదా గల మంత్రిగారు ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటనప్పుడు ''జీన్ వేస్తె ? తప్పేంటి ..!! రేపులు చేయబడ్డ వారెవరూ, జీన్స్ వేసినవారు కాదు '' అన్నట్లు ... దాదాపు అన్ని వార్తా పత్రికల్లో మనం చూసాం . అదే మీటింగులో ఉన్న మరెవరూ .. ఆ స్టేట్మెంట్ కు, అభ్యంతరం చెప్పలేదు సరికదా ... గొప్పగా తప్పట్లు కొట్టారు .... అంటే జీన్స్ వేసుకున్నా, రేపు లు కావు ... లేక అందరూ జీన్స్ వేస్కోండి ! అన్నది మంత్రి గారి భాష్యమా ?... బహుశా ! ఆ మంత్రి గతం లో విదేశాల్లో చదువుకున్న తాలూకు పండిత్యమా, లేక లేక మంత్రి పదవి చందామ ? జనం అర్ధం చేస్కో క ముక్కుమీద వేలేసుకున్నారు.సదరు మంత్రి గారు దూకుడు మీద ఉన్నట్లున్నారు . మరి మంత్రులు, నాల్గు మంచి మాటలు చెప్పాల్సింది పోయి .... జనా న్న్ని రెచ్చగొ డుతూ ... తాము చాలా ఉన్నత భావాలు గల వారి లా ఫోజులు పెట్టడం కాదా ? . లేక యువతలో మయిలేజీ కోసామా . ...?? .. సదరు మంత్రి తమ కాబినెట్ లో ఉన్న సుష్మా స్వరాజ్ గారి ని చూడలేదా ?? .. సుష్మా స్వరాజ్ ను చూస్తే ఫక్తు ''హైందవ '' నారి కళ ఉట్టిపడుతూ ... రవివర్మ చిత్రం లా ఉంటారు . సదరు మినిస్టర్ గారు, ''హిందూత్వ '' అని కేకలు పెట్టే ''భారతీయ జనతా పార్టీ'' లో ఉన్నారన్న సంగతి .. ఇటువంటి స్టేట్మెంట్స్ బహిరంగ సభల్లో ఇస్తే ... పార్టీ కి నష్టం అని మరిచిపోయినట్లున్నారు . ఇటీవల ఒక నట సామ్రాట్ మనువడి క్రొత్త సినిమా ప్రమోషన్ స్టేజి ఫంక్షన్ లో ఒక యాంకర్.... వేసు కొచ్చిన దుస్తులు చూస్తే.... మనకి అర్ధమవుతుంది సినిమాలు ... స్టేజి పెర్ఫార్మెన్స్లు ఎంత విచ్చల విడి తనాన్ని యువతకు నూరిపోస్తున్నాయో ...!!...?? ఏకంగా అక్కడి ప్రేక్షకులు ... అదీనూ ఆడవాళ్ళు ఎంత ఆనదోత్సాహాలు పొందుతున్నారో !!!! ..... అందుకే,ఈ భావాలున్న మంత్రులూ ! మీ పైత్యం మీవరకూ, ఫారన్ పోవాలనుకుంటున్న మీ పిల్లలవరకే పరిమితం చేస్కొండి అని ప్రజల మనవి .......................... '' విదేశాల్లో చదివిన సరోజినీ దేవినాయుడు ... శ్రీమతి ఇందిరా గాంధి ... నేటి బృందా కారత్ .... వంటి వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్ ..... ఇచ్చివుంటే .? ఈ దేశం ఇప్పటికి .. సర్వనాశ నం ... అయ్యివుండేది .... సోనియా ! ప్రియాంక వాద్రా లను మీరు చూడలేదా ..వారి కట్టు ఇప్పటికీ ఆదర్సమే ...!!! "" రవిబాబు . మద్దూరి ......
No comments:
Post a Comment