'' యదార్ధ దృష్టి -పదార్ధ సృష్టి . '' యదార్ధ దృ ష్టి నుండి పదార్ధ సృష్టికి'' అలవాటుపడ్డ మనకు ... ఉండీ ఉండీ ఏదో గురుతుకు రావడం సహజం . '' కలియుగము లో సాక్షాత్తు ఆ నిర్గుణు డయిన పరమాత్ముడు సగుణ రూపం ధరించి దుష్ట శిక్షణ-భక్త రక్షణ కు స్వయాన ఈ భూమి మీద అవతరిస్తాడని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి...'' అన్నది ఆర్యోక్తి . ఈ భరత భూమిలో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు . మన లాంటి సామాన్యులు , ఎంత ఘోషించినా అది అరణ్య రోదనే . కాని మహానుభావుల, ఇప్పటిమాట రేపటికి చరిత్ర . షిరిడీ సాయి చరిత్ర నిశితం గా పరిశీలన చేస్తే, మనకు ఎన్నో ఆణిముత్యాలు దొరుకుతాయి . మనజీవితాలను సంస్కరించుకుని ముందుకు సాగటానికి ఎంతో ఆస్కారం కనిపిస్తున్నది . ఇక్కడ ''ద్వాదశ భావాలు '' మీముందు ఉంచుతున్నాం 1) షిరిడీ సాయి తాను దేవుడనని ఎన్నడూ చెప్పలేదు . దేవుని సేవకుడ నని,బానిసనని మాత్రం చెప్పారు . 2)తనను సేవించమని,పూజలుచెయ్యమని,హారతులుతయారు చేసి పాడమని,ముట్టు.. కట్టు .. బొట్టు ... ప్రత్యేక మయిన వేషదారణను విధించలేదు . 3) తిండి విషయం : ఫలానా తినండి(లేక )తినకండి అని షరతులు విధించలేదు . 4) తను షిరిడీ ప్ర వేసించి.. మహా సమాధి చెందే వరకూ భౌతికముగా రైల్,బస్సు,కారు,వంటి..సహాయము తో గాని నడచి గాని షిరిడీ వదలి వెళ్లలేదు. 5)అత్యంత గొప్ప విషయము,ఏ మతమును,కులమును,జీవన విధానము ను కలలో నయినా ద్వేషించ లేదు , విమర్శనా చేయలేదు . మీ మీ ఆచారాలను,మత విధానాలను తూచా తప్పక పాటించడానికి షిరిడీ కూడా సహాయపడుతుంది అని ఒక్కాణిo చారు . 6)మత మార్పిడి అన్నదానికి ''బాబా '' బద్ధ వ్యతిరేకి . 7)బాబా ఒక ''అవధూత '',అనగా మనుష రూపేణ,వారి తపోనిష్ట వలన,ఘాడ మయిన బ్రమ్హచర్యము వలన,తీవ్ర తపస్సువలన,సాక్షాత్తు పంచభూతములు (గాలి ..నీరు .. నిప్పు .. భూమి ..ఆకాశాలు )తమను తాము,అవధూతల ఆదేశాలకు బానిసలు గా అర్పింప బడి ఉంటాయి . 8)బాబా కు చదువు అన్నది లేదు . భాష మాత్రం ''మరాటీ ''. కాని చు ట్టూ చేరిన వైదిక పండితులు,ఖోరాను -నిస్టగరిస్టులు, బైబిల్-మహాగ్రంధం లోని సంక్లిస్ట మయిన,మీమాంసలకు అతిచక్కని,సర్వ జన ఆకళింపు గా భాష్యం చెప్పిన సందర్భాలు.. కొన్ని సందర్భాలలో ఈ గ్రంధాలలో ఉన్న శ్లోకాలు,ఘట్టాలు పొల్లు పోకుండా చెప్పిన విషయాలు కోకొల్లలుగా గ్రంధస్తం, బాబా సమాధి అనంతరం కాబడ్డాయి . 9)గుడులూ,గోపురాలు కట్టడమే భక్తీ అన్న భావన ను, సంస్కరిచిన, ఆయన చరిత్ర లో మనం చూస్తాం(కట్టడానికి తను వ్యతిరేకి కాదు సుమా !! ). చందాలు,దర్శ నం ఫీజులు,ప్రసాదం ఫీజులు, కానుకలు,మాన్యాలు,పేద -గొప్ప ధనవంతులు-అధికారులు అన్న వ్యత్యాసం ఆయనకు తెలియని విషయాలు . 10) ఆశ్రమాలు,ఆశ్రమ ఆస్తులు,ఆశ్రమ నిధు లు అనేవి ఏమిటో తెలియని ఒక సాధారణ బిచ్చగాడు .తను సమాధి చెందే రోజు వరకూ ఐదు ఇళ్ళలో మిగలగా ఇచ్చిన అనవసర వ్యర్ధాలే, ఆయనకు మధుర పదార్ధాలు . ఆప్ప టి అమాయక జనం అతిబలవంతము మీద కప్పిన పట్టు శాలవాలు ఉన్నా, మురికి పట్టి నూనె జిగట తో ఓ మోస్తరి కంపుగా ఉన్న ''కఫినీ '' ఎన్నడూ ఒ ద లలేదు, మార్చనూ లేదు .అలంకారానికి ఇప్పటి musium లో ఉన్న అచ్చాదనలు అతనికి, భక్తులు సమర్పించినవి. వాటిని అలంకరించ దలచిన అప్పటి సహచరులు , భక్తులు ఎన్నో సార్లు బాబా ను గట్టిగా పట్టుకుని,తన్నులు తింటూ, శ్రీ బాబా చే తిట్లు తింటూ బలవతo గా అలంకరించినవి . ఎన్నోసార్లు బాబా గిరాటు వేసినవి . 11)ప్రపంచమే తన ఇల్లు,ప్రజలే బంధు వులు గ చెప్పే బాబా తల్లి -తండ్రి కులం -మతం ,ఊరు -పేరు తెలిసినవారు ఇప్పటి వరకూ ఎవ్వరూ లేరు . 12)సమాధిముందు నుండీ , అనంతరం ,ఇప్పటివరకూ తనను నమ్ముకుని జీవిస్తున్న వారికి ఏదో విధం గా సహాయకారిగా,సేవకునిగా , అనుభవము అవుతున్నారు షిరిడీ సాయి . కాని ''కాశీ - పీటాధి పతులు శ్రీ . శ్రీ .శ్రీ .స్వరూపానంద తన భక్తుల కలలో కూడా కనిపించిన దాఖలాలు లేవు !! ''. ఫై గా షిర్డీ బాబా ఫై చేసిన వాఖ్యాల వలన తను వెలుగులోనికి రావడం ముదావాహం గమనిక : సాయి భక్తులారా ! మహాత్ములను,భగ వత్ స్వరూపులను,తప్పుపట్టడం మన ఉద్దేశ్యం కాదు . కోట్లాది ప్రజల నమ్మకాల ఫై బురదచాల్లె ప్రయత్నం మాత్రం ''కలియుగ అవలక్షణం అని మాత్రం చెప్పగలను . బహుశా గత 20 వసంతాలనుండి శ్రీ షిర్డీ బాబా కు పెరుగుతున్న ఆదరణ,భక్తీ ఇందుకు కారణం కావచ్చు . కారణం కాశీ కి వెళ్ళే కోట్లాది భక్తుల్లో లక్షలాది భక్తులు షిరిడీ ని ఆశ్రఇంచిన వారే !!!! ఇన్ని మాటలెందుకు ..??..!! ఆనాటి,కుష్టువ్యాది గల భాగోజీ,గొప్ప సంసృత భాషాఘనాపా టీ ఉపాసనీ శాస్త్రి,కోటీశ్వరుడయిన బూటీ-సాటే లు అందరూ సమానులే . అంతే కాదు బాబా పాదప్రక్షాలనా తీర్ధ దాసులని మనం మారవ కూడదు ..!!!.

No comments:
Post a Comment