totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Saturday, 7 June 2014

                         ''..... హత విధీ :   ''                                                                                                                  బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఓ స్నేహితుడిని చూద్దాం అని వెళ్ళా . ఒకటో నెంబర్ ప్లాట్ఫారం లోని ఆఫీసులో మిత్రుడ్ని కలవ బొయెన్తలొ ,చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ గారు పరుగెత్తుతూ వచ్చి ''అన్నా '' , మీ స్నేహితుడట చూపులేదు .పెరు రాఘవేంద్ర రావు అట vip లౌంజ్ లో ఉన్నాడు ''. నాకు చూపులేని వాళ్ళంటే (బెగ్గర్స్ కాదు సుమా )గతం కర్ణాటక లోని ఓ అనుభవం వల్ల భయం . పైగా చూపు లేని రాఘవేంద్ర రావు ఎవరూ లేరు . కాని అందగాడయిన రాగాహవేద్ర రావు మాత్రం తెలుసు . అంచేత ఇ క్కడ రవి అని దాదాపు 5 మంది ఉన్నారు వాళ్ళను కనుక్కోండి అని చెప్పాను . అతను వాకబు చేసి మరీ చెప్పాడు ,''అన్నా మీ పేరు చెబుతున్నాడు '' అని అందు కని లాంజ్  లో చూద్దును కదా !!.... నాకు పరిచయమున్న రాఘవేంద్ర రావు ను గుడ్డివాడిగా చూసి నిర్ఘాంత పోవడం నా వంతయింది . అంతలోనే సమ్భాళి0చు కుని, ''ఏంటీ ఈ పరిస్తితి '' అని అడిగాను . పొరబాటున నేను కన్నీళ్లు కారిస్తే,అతను గిల .. గిల తన్నుకునట్లు నాకు అనిపించింది . తను పొర్లుకొస్తున్న బాధ తో చెప్పడం మొదలెట్టాడు .పైగా చెప్పలేకపోతున్నాడు . తన సోదరి తనతో ఉండటం వల్ల, తను చెప్పింది ... కదా ! అతను ఆటో లో హైదరాబాద్ లో వెళుతుండగా మలుపు లో ఓ లారీ గుద్దిందనీ, తదుపరి క్రమేణా చూపు పూర్తి గా పోయిన్దనీను . నిజం గా జీవితం లో ఇటుంటి సన్నివేసం నా స్నేహితునికి తారస పడు తుందని .. కలలో నయినా ఊహించ లేదు . ఆ షాక్ నుండి రెండ్రోజులు తేరుకోలేదు .. మూడోరోజు ''బాల భాస్కర్ '' ప్లాట్ఫారం మీద తిరుపతి రైలు వద్ద కలిసినప్పడు గాని నేను మామూలు  స్థితి లో కి రాలేదు .  అంతవరకూ రాఘవేంద్ర రావు, పాత రూపం నుండి కొత్త రూపం నా కనుల ముందు కదలాడింది ...నిజ0 గా విధి యెంత బలీయ మయినదో కదా ...!!...??...ఈ  విషయం బాలభాస్కర్ కు చెప్పుకుని నేను ట్రాన్  నుండి బయట పడ్డాను... అంచేత బాలభాస్కర్ ఫోటో ఇక్కడ పెట్టాను . నా వద్ద రాఘవేంద్ర రావు ఫోటో లేదు . 


No comments:

Post a Comment