'' ఎండమావులు '' నిజం గ చెప్పుకోవాలంటే జీవితం లో ఎన్నో విషయాల్లో దెబ్బతిన్నాకకాని మనకు తెలియదు తెలివితక్కువ పని చేసామని . ముఖ్యం గా రాజకీయనాయకుల్లో ఈ విషయం మనకు ప్రస్పుటం గా కనిపిస్తుంది . రాజకీయం చేసినవాడికి మిగిలేది '' బూడిద ''. రాజకీయనికొచ్చి సంపా ఇంచినవాడు కనబడదు . కాని రాజకీయం లో ప్రజలను మున్చినవాడు కనిపిస్తూనే ఉంటారు . పేర్లు ఎందుకులెండి .దినపత్రికల్లొ చానల్స్ లో డిబేట్స్ అవే కదా మరి . అసలు విషయానికొద్దాం . ఆంధ్ర విభజన తదుపరి పుట్టగొడుగుల్లా ఎన్నో పార్టీలు నమ్మబలుకుతూ రాయలాంధ్ర లో తగుదునమ్మా అని 2014 యెన్నికల్లో పోటీ చేసి,ఫలితాలతో కండ్లు బైర్లు కమ్మి ''మూసుక్కూర్చోన్నాయి ''. కాని తెలుగు దేశం అనూహ్యం గా పుంజుకొని ముందుకు దూకుతుంది . కాంగి మాత్రం లుంగీ ఊడినంత చందాన ఏడ్చింది . ఈ ప్రహసనం లో ప్రతిపక్ష హోదా వరకూ ఎదిగిన ysrcp మాత్రం కనుమరుగయ్యే ప్రమాదం గా అగుపిస్తుంది . ఇందుకు కారణం ''జగన్ '' అని చెప్పక తప్పదు . ఒక్కసారిగా చిల్లు పడిన పడవ గా మిగిలింది . నది సముద్రం లో చిల్లుపడినప్పుడు ఏ విధం గా చిల్లును భర్తీ చేసి తీరాన్ని చేరాలన్నది ఆలోచన చేయాల్సింది పోయి ... స్మశాన వైరాగ్యం లో జగన్ పడినట్లుగా ఉందని గుస గుస లు వినిపిస్తున్నాయ్ . ఇనుమడించిన ఉత్సాహం తో lectures దంచిన అనుయాయులూ,వీరమాత,అడుగుజాడల చెల్లెమ్మ లు కనుపించడం కారు వయ్యింది . ఎ నోట విన్నా జగన్ రాబోతున్నాడనే వార్తలే !. కనీ ఫలితాలు తారుమారు అయినవి . మీటింగులకు హాజరయిన జనాన్ని వోట్లుగా లేక్కిన్చ్కున్న జగన్ కు నిరాశే మిగిలింది . ఇటువంటి సమయము లో జగను తన పార్టీ కార్య కర్తలకు దైర్యం చెబుతూ వెన్ను తట్టాల్సింది పోయి ముఖం చాటు చేసుకున్నారు . విజయమ్మ , షర్మిలా దీ ఇదే తంతు . తమ పార్టీ కి వోట్లు వేసి వడదెబ్బ తిన్న ప్రజలకు,పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలి . లేకుంటే గెలిసిన పార్టీలు మా అంతటి పోటుగాళ్ళు లేరని విర్రవీగే ప్రమాదము పొంచి ఉంది . ఈ తరుణం లో జగన్ తనను నమ్మినవారికి చేదోడు-వాదోడుగా ఉంటూ ముందుకెళ్లాలి . ఇక నయినా ముసుగు తొలగించి అసెంబ్లీ లో నిర్దిష్ట మయిన పాత్ర పోషించాలి . గెలుపు -ఓటమి రాజకీయమనే బండికి రెండు చేట్రా లు . రాజకీయానుభవం లేకండా ఒక్క ఉదుటన ''ముఖ్యమంత్రి '' అవుదామన్న నీటి మడుగు కేవలం ''ఎండమావి '' గా మిగిలిందన్న భావన నుండి ముందుకు వెళ్ళితే ఎప్పటికయినా నీటి మడుగు నిజమయిన నీటి-నిల్వ అని తెలుసుకోవాలి . ముఖ్య మంత్రి పదవి ఉంటేనా ప్రజాసేవ ??... లేకుంటే లేనట్లా ??... ఒక్కసారి చరిత్ర పుటల్లో చూస్తే తెలుస్తుంది . YSR ఎన్నిసార్లు opposition కూర్చ్న్నారో !!. స్వపక్షం లో విపక్షం గా పని చేసిన పేరు అతనికే దక్కుతుంది . మద్దూరి. రవి
No comments:
Post a Comment