totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Thursday, 8 May 2014

                                    !!  నీ బాంచన్ దొరా !! ఎక్ష్టెన్షన్ ప్లీజ్ !!                                                                                                               *****************************                                                                  ఒక విధం గా    ఇ టువంటి దీ   నేను చెప్ప బోయేది . భావి తరాల,తలరాతలు తారు మారు అయ్యె ప్రమాదమున్న ఒకానోక్క విధానం ''ఎక్ష్ టెన్షన్ ''. ప్రజా వ్యతిరేక విధానాల్లో ఇదొకటి అని చెప్పవచ్చు . ఈ విధానాన్ని ఉపయోగించడానికి ''హక్కు'' మనోడు ప్రభుత్వం  అయి ఉండడం . ఆశ్రిత పక్ష పాతం  ఇందుకు కారణం, లేక ప్రభుత్వం చేస్తున్న దగుల్బాజీ పనులకు ఆమో ద ముద్ర తనకు తా నుగా వెసుకొవడము  గా చెప్ప  వచ్చు .                                              ప్రభుత్వ ఉద్యోగాల్లో ఫై  పదవులు వెలగ బెడుతున్న వారిలో,కొన్ని రాజ్యాంగ పరమైన ఆమోదాలతో ఈ విధానాన్ని అమలు పరచవచ్చు. కానీ కొన్ని నామినేటెడ్ పదవులకు, వ్యక్తిత్వo  కంటే ''జీ హుజూర్ '' క్యారెక్టర్ చాలా ముఖ్యం .  ఈ విధానాన్ని అనువుగా చేసుకొని కొన్నిపదవుల్లో ''తొట్టిగాంగ్ '' రాజకీయ నాయకుల్ని జొనుపుతున్నారు,ఢిల్లీ పెద్దలు .ఇటువంటి   ప్రవ్రిత్తి లో అన్జవేసిన చేయి ''కాంగ్రెస్స్ '' దని చెప్పవచ్చు . ఎక్కడయితే ఒక్క సంస్కర్త అయిన అడ్మినిస్ట్రెటోర్ ను మాత్రం తప్పని సరిగా విధులనుండి తేదీ ప్రకారం పదవీవిరమణ చేఇంచిన , నిబద్దత మన రాజకీయనాయకుల్లో వేళ్ళు  ఊ నుకొని ఉంది .                                                                                                 ఉదాహరణకు ''శేషన్ '', ఈ ప్రభుత్వ అధికారి ఎన్నికల రంగం లో తెచ్చినన్ని సంస్కరణలు ఇంతక ముందూ, అతని తరువాతా, తెచ్చిన దాఖలాలు బహుశా  లేవు.ఇటువంటి అధికారికి ఒక్క 5 సవత్సరాలు పదవి, పొడిగిస్తే ఎం కొంపలు మునిగేవో??...!!   ఈ దేశం లో ఎవ్వరికీ అర్ధం గా లేదు . అలానే  టి టి డి   ఈ మధ్య లో నామినేటెడ్ పోస్టులకు నిలయం అయ్యింది.చైర్మన్   పదవికి ఒక్క లిక్కెర్ డాన్ .... మాజీ నక్సల్ .... సోల్లుకబురులు చెప్పుకొనే డొక్కు నాయకుడు ఒక్కొక్కరి గా పదవులను ఏడ్చారు.....  ఏడుస్తున్నారు   . పరమత  దురాక్రమణ ఎదుర్కోలేని వారు , కనీసం ఉపనిషత్తులు ఎన్ని అన్న విషయాన్ని తురుపతి వచ్చాక నేర్చ్కున్న వారు మన ఖర్మకు చైర్మన్ అవుతున్నారు  సిగ్గు ...సిగ్గు . ఎంతో అపచార మేంటో తెలుసా అండి ! సాధారణ ముగా మూతిమీద మీసం తాలూకు వెంట్రుకలు నుండి పడిన చిన్న తుమ్పరకూడా దేవస్తానం లో వి శేష పూజలలో పడినా, దేశానికి అరిష్టం . అటువంటిది ఇప్పటి చైర్మన్ తగుదునమ్మా అన్నట్లు దేవస్తానం లోని పూజల్లో వేదపండితుల సాక్షిగా దర్పం ప్రదర్శిస్తూ దర్శనం ఇస్తుంటారు . ఇది ఎ పాటి సభ్యత?..!!... ఇతని  హయాం లో జరిగినన్ని కుంభకోణములు, తిరుపతి చరిత్ర లో జరుగ లేదు సుమా !! . ప్రతీ ఫంక్షన్ కు ఊర పొట్ట, కుండమసి లా అగుపించే నల్ల రంగు ను పులుముకొన్న జుట్టు ,వీరప్పను (పూర్వం ఏనుగుల్ని వేట చేసి న అడివి దొంగ )తలపించే విధం గా,బొర్రు మీసాలతో , కోలాటము చేస్తూ కెమెరా ల ముందు  ప్రత్యక్ష మవు తుంటారు . దేవుడు నోరులేదంటారు ఉపమానానికి, మరి నోరు ఉన్న ప్రజలు ,మేధావులు,సాంప్రదాయ వాదులు ,నిస్టా  గరిస్టులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారో మీకు అర్ధమైతే సెలవీయండి. ఏం ? తిరుమల కు వీళ్ళ నుండి విముక్తి లేదా అని ప్రస్నిస్తూన్నాను. వి . ఐ . పి ల,  హేల చెప్పనక్కరలేదు భారత దేశం లో అందరికీ తెలుసు . వాళ్లు దర్శనం చేయించడము తో బాటు ప్రెస్ కవర్.                                                               ఈ  విషయము ప్రక్క పెడితే ముందుగానే శ్రుంగభoగం, తెలుసుకున్న కాంగ్రెస్, వృద్ధ కిశోరాన్ని (ప్రణబ్ )రాష్ట్రపతి పదవి లో కూర్చోబెట్టింది. ఎందుకైనా భవిష్యత్తులో అక్కరకు రావచ్చోని . రెండవ తెగ నాయకుడుగా ఎదిగిన రోశయ్య గారిని ముఖ్యమంత్రి గా కూర్చోపెట్టారు. వయొభారమ్మ్ తో పదవి లో ని పదనిస నడకలను కాస్త గట్టిగా రుచి చూసిన తను ఎన్నో సార్లు అసహనానికి గురికావడం అక్కడక్కడ ప్రెస్ మీట్స్ లో మనం చూసాం. అటువంటి వృధా నేతను ''బాణలీ నుండి పొయి లోనికి '' అన్న చందాన తమిళనాడు గవర్న  రు గా ''కంచు '' లాంటి జయలలిత ముందు పడేసారు. ''అభయ '' రేప్ విషయం లో అత్యంత హేయముగా ప్రవర్తించిన ఆ నాటి శీలా దీక్షిత్ ను కేరళ గవర్ గా నియమించారు. దొడ్డి దారి లో చిదంబరం ఆశీస్సులతో గవర్నరు అయిన మన నరసింహన్ గారు ఎక్ష్టెన్షన్ ప్రతిభావంతులు .ఎమ్  ? మన ఆంద్ర-తెలంగాణా తెలుగోళ్ళు ఇంత ? ''పుం పుహారులా '' నాకు సందేహం వస్తున్నది . మరి ఇటువంటి  ''జీ హుజూరులు '' ఈ తెలుగు జాతిని ఎప్పుడు ?వదులు తారో  అర్ధం కావట్లేదు . అందుకని నా దొక మనవి :ఈ ఎక్ష్టెన్షన్ విధానాన్ని ఎత్తివేసే ప్రక్రియకు శ్రీ కారంచుట్టండి . రాష్ట్ర తెలుగు జనులారా ఏకం కండి !! ..                                                                                                                                                                                                                                           మద్దూరి. రవి .                                                                                                     

No comments:

Post a Comment