totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Wednesday, 23 April 2014

            ''    తస్మాత్ ... జాగ్రత్తా .. !!!   మళ్ళీ దొంగలు ..దొంగలు ""                                                                                     .                   *****************************                                                                                       .                                                                                                                    .                         ఇచ్చే దేంటి ?తీసుకొనే దేంటి   ?      మీకు తెలియదా ?ఇదో వ్యాపారం చాలా లాభసాటి వ్యాపారం !!  ''మూడు పూవులకు ఆరు కాయలు ''   ఇంకా అర్ధం కాలేదంటే ,తప్పిని సరిగా చెప్పాల్సిందే మరి . రాజకీయ వ్యాపారం . తీసుకొనేప్పుడు ఇచ్చే ప్పుడు ఎటువంటి లెక్కలు ఉండవ్ !పొరబాటున బయటబడితే తప్పుకోవచ్చు, కాకపొతే   శ్రీ కృష్ణ జన్మ స్థానం లో విశ్రాంతి తీసుకొని,కొన్ని లొసుగులు,కొన్ని అవకాశాలు చేజిక్కిన్చుకొని మరలా బయట పడవచ్చు . అంతే  కాదు కొంత  మంది మొరిగే కుక్కల్లో   మధ్య నక్కి దాదాపు cm లేకపోతే, ఏకం గా cm  అవ్వొచ్చు .                                                                                       నా మిత్రుడొకడు చెప్పినట్లు mla tkt 40 కోట్లు mp కి 100 కోట్లు ఇస్తే,  గెలుపు గుఱ్ఱాల పార్టీ ల లో దూరోచ్చు mp ..mla అవ్వొచ్చట !  .... దేశాన్ని .. రాష్ట్రాలని ,రాత్రి కి రాత్రి దోచుకున్న దగుల్బాజీలు ఇప్పుడు 2014 elections లో పెద్ద ప్రజాదారణ ఉన్న్న నాయకులు . సాధారణంగా కోర్ట్ నుండి ఫైన్ పడినవాడు .. జైలు చేసి వచ్చినవాడు ..ప్రభుత్వ ఉద్యోగి ఐతే తన ఉదోగం కోల్పోతాడు .కాని చట్టాల్లో ఈ రాజకీయ నాయకులకు ఎందుకు ఉండదో నాకు చిన్నప్పటినుండి అర్ధం గాని విషయం . నా మిత్రు డొకడు రైల్వే లో తెలంగాణలో ఓ రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ ఉద్యోగం చేసేప్పుడు లంచం తీసుకోన్నాడని అభియోగం మీద (fibricated )కొన్ని సవంత్స  రాలు అనేక రకాలుగా వేధించి వేధించి ఇటీవల వాడిని ఉద్యోగం లోంచి తొలగించారట  వాడు నిర్దోషి . రాజకీయరంగం లో రేపులు ,మైనింగ్ దొంగతనాలు, భూ కబ్జాలు,గొలుసు ప్రజా ఆస్తుల దోపిడి,ప్రఛ నంగా హత్యలు చేసిన,చేయించిన వారు పడవల్లాంటి కార్లలో,బోడి స్ప్రే లు కొట్టుకుని,ఇటు సినిమాఫంక్షన్ ల్లో,రిబ్బన్ కటింగుల్లో మెరిసిపోతున్నారు. మరి వీరి సంగతేంటి ?....                                                                                                   .                                              ఒక్క విషయం చెప్పదలిచాను . మరి ఇటువంటి నాయకులు మనజీవితాలను 5.. 10.... వీలుంటే 50 సవత్సరాలు శాసిస్తున్నారు . మొసలి నోట్లో కోతి లా గిలగిల్లాడుతూ మనం కాలగర్భం లో క్రమేపి కరిగి పోవల్సిందేనా ? ఆలోచించండి . ఒక్కడు రాష్ట్రవిభజన చేస్తే అభ్యంతరం లేదు అని ''మొరిగినవాడు ''అభివృద్ధి మేమే చేస్తునాం అని వోట్ల భిక్షకు బయలుదేరాడు,మరొకడు పగటివేషగాడు .. తన  రంగుల జీవితం ప్రక్క పెట్టి (cm పిచ్చి లో )వోట్లు ముష్టి  లో తలామునకలయె,మరోడు ఎప్పుడు డిల్లీ  లో సెంటర్ నాయకులకు మడు గులొత్తి చేతులు తిప్పుతూ మాట్లాడి,విభజన లో అన్యాయాన్ని ఎదుర్కున్నాన్ని, రెండు రాష్ట్రాల ప్రజలను మభ్యపెట్టి, పబ్బం గడుపుకుంటున్నాడు,మారో డు సెంటర్ కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు పట్టకుని,''కాల్ మొక్తా ..!!'' అని ఇప్పుడు వేటగాడి కి బలికాబోతున్న పెద్దపులి లా వెంగళా యి ల మధ్య పెద్ద డైలోగ్స్ చెప్పి తప్పట్లు కొట్టి o చుకుoటున్నాడు. ఇది ఇలావుంటే మరో తెలివిగల మూర్కుడు మల్కాజ్గిరి నియోజకవర్గం లో దిగ్గజాల మధ్య పోటి కి దిగాడు (అన్నట్లు వాపును చూచి బలం అనుకోన్న  రకం )ఇక సుత్తి కొడవలి,వరి కంకు అవి చేయాల్సిన పని మాని సైకిల్ దొరుకుతుందా?... కారేక్కాలా ?.. ఫాను క్రింద చల్లగా ఉంటదా  ..??చేయి కలుపుకుందామా ??.. తోలు చెప్పులు ఒక్క జతయినా దొరుకుతాయా  ..??.. అని చూస్తున్న రోజులు ఇవి . పైగా మేమున్నామని చీపురు కట్ట బయలుదేరింది,ఇదేమో ?ఊడవడం వరకే గాని ఇచ్చిన అవకాశాన్ని మట్టి పాలు చేసికొంది.చీపురు    కదండీ ఇక ఎప్పుడూ తనపని తానూ చేసుకు పోతుంది ,కారణం చీపురు  ఇంట్లో ఓ మూల దాని స్థా నం . బెడ్ రూమ్ కు ఎప్పుడూ చేరుకోలేదు (రాజాకీయ భావ దరిద్రం )ఎంతయినా ? చీపురు కదా !దాని తెలివితేటలు తెల్లారే వరకే                                                                                                               మరి ఇటువంటి సమయం లో మన భవిష్యత్తుకు బంగారం కాక పోయిన కనీసం ముళ్ళు లేని బాట ను వేసుకోవాల్సిన అవుసరం మనకే ఉంది ''ఎవరో    !!   వస్తారని ...     !!'',ఎదురు తెన్నులు మాని, ఒక్క మంచి పని చేయాల్సి ఉంటుంది . అదేమిటి ? మన వోటు ... ఎటువంటి వారికివేయ్యాలో, ఇప్పటి   పరిస్తితుల దృష్ట్యా    ఒళ్ళు .. కళ్ళు, .చెప్పాలంటే పంచప్రాణాలు దగ్గర బెట్టుకొని '' ''వెయ్యాలి ..... ఇందుకు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ballet బాక్స్ లో వెయ్యాలి . ఈ మార్గాన్ని మరిచిపోతే .... దేశం లో మళ్లీ దొంగలు పడతారు ... మనల్ని నిలువుదోపిడీ చేస్తారు '' తస్మాత్ .. జాగ్రత్తా ... !!  ''  .                                                                                        .                                                                                   మద్దూరి . రవి .

No comments:

Post a Comment