మనిషి జీవితం విలువ ఓ "వెండి కంచం" ********************** *********** అది మాకు అతి దగ్గర బంధువుల ఇల్లు . చుట్టూ మొక్కల ఫెన్సింగు . కుక్క అరుపులు ... పనివారి విరుపులు . ఉద్యోగ రీత్యా అందిపుచుకున్న అహంకార మెరుపులు ..... కాలు ఫెన్సింగ్ ముందు పెట్టినప్పటి నుండి, వెనుదిరిగే వరకు తూచా తప్పక వినవలసిన వారి కుక్క సోది . అది మాంచి శీతాకాలం ... ఇలానే ఓ రోజు మాటల సందడి లో "శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ", సంభాషణలో చోటు చేసుకుంది . .. వచ్చే ఆదివారం అందరం ఇంట్లో ఉంటాం .వ్రతమ్ జరుపుకుంటే బావుంటుందనే ఆలోచన కలిగిన ఆ ఇంటిల్లాలు ప్రస్తావించారు, అందుకు వారి శ్రీవారూ ఒప్పేసుకున్నారు . సాధారణం గా మిడిల్ క్లాసు,అంతకంటే కొద్దిగా ఫై వాళ్ళు ఘనం గా చేయాలనుకుంటే ఇంటి చుట్టుపట్ల వారిని ముఖుల్ని పిలిచి చేసుకొంటే ఓ 10 నుండి 15 వేల రూపాయలు కవోచ్చునేమో . సదరు ఇంటి ఇల్లాలు దాదాపు 70 వేలు ఫై చిలుకు చేసిందంటే మీరు అర్ధం చేసుకొచ్చు . ఇందుకు బ్రాంహడ్ని మాట్లాడమని ఓ గుంత నక్క అయిన గంగి గోవు కు చెప్పారు ..... ఆవును పోలిన నక్క 7 మంది బ్రాహ్మల్ని పురమాయించింది . ఇది ఇలా ఉంటె నాకు ఆ ఇంటి ఇల్లాలు గారు పెట్టిన డ్యూటీ ఫలానా అని లేకపోయినా ! మరో గదిలో పెట్టిన పూజ వెండి సామాన్లు ఓ కన్ను పెట్టివుంచమని . పూజ మొదలయింది, సదరు బ్రామ్హలు, నవగ్రహపూజా, హోమం వంటివి ఎవరి కోరికమీద చేయాల్సి వచ్చిందో, కనీసం వారికి తెలి యక పోడం ముదావాహం . శ్రీ సత్యనారాయణ వారి పూజ అయ్యి, కధలు మొదలయినవి . వదరుబోతుగా ఉన్న కర్రపెత్తనం బ్రామ్హడు, సాక్షాత్తు కధలు చెప్పేప్పుడు గోడకి జారిగిలపడి,ఒక మోచేతిని భూమికి ఆన్చి చేతిలో చిన్న అగ్గిపుల్లలాంటివి విరుస్తూ మధ్య మధ్యలో రెండు కాళ్ళు గాల్లో ఊపుతూ కధలు చెపుతూంటే వైదిక0 గా పూజాపునస్కారా లకు అలవాటు పడినవారికి ఎంతగా ఒళ్ళు మండుతుందో అనుభావేస్తే గాని తెలియదు సుమా !...... ఈ తంతు గమనిస్తున్న నాకు మనసులో కీడు సంకితున్నది ఎందుకో ?... కారణం లేకపోలేదు ... వ్రతం చేసుకోండి అని ఉచితసలహా ఇచ్చింది నేను గనుక . ప్రతీసారి వెండి వస్తువులున్న గదిలోకి మా బంధువు గారే వెళ్లి కావలసిన , సామాను తెస్తూ పెడుతూ ఉంది . అంచేత ,నా పర్యవేక్షణ సన్నగిల్లింది.ఇంటి ఎజమానే కదా .. మాటికి వెళ్లి ఎం తెచ్చావ్ ఏమి పెట్టావ్ ? అంటూ అడిగితే ! వాళ్లకి ఎంతో చిరాకు రావచ్చు . నన్ను హరిచంద్ర నాటకం లో నక్షత్రకుని కంటే ఎక్కువ ... జీడి గింజ కంటే తక్కువగా అనుకునే ప్రమాదం ఉంది . అంచేత నేను ఆ సామానుల ఫై శీతకన్ను పెట్టాను . బయట ఆమె ఆఫీసు వాళ్ళు, స్నేహితులు ఆమె బదువులు, టౌన్షిప్ లోని వాళ్ళు షామియాన, క్రింద పూజ సమాప్తానికి ఎదురు చూస్తున్నారు . తదుపరి బుఫ్ఫే... ప్రారంభం . పూజ అయిపొయింది బ్రామ్హలు ... మూటాముల్లె సర్డుతూన్నారు . సంభావనలు ముట్ట చెప్పాక ఫలాయనమ్ చిత్తగించారు . మరోప్రక్క ఇంటికొచ్చిన పెద్దలు, ఇతరులు బుఫ్ఫే కి ఉపక్రమించారు . ఇంతలో ..."బావగారూ " పిలుపు .... జనంలో మరో బావేమో ?... !! . "బావగారూ "...... మ్... నన్నే " మిమ్మల్నే " " అమ్మ ఏంటి ? " .... ఒక వెండి ప్లేట్ కనిపించడం లేదండి " ....... " వెతుకు .. అక్కడే ఉంటుంది "ఆమె గారి భర్త సలహా .... " ఎవరు వెళ్ళారు " ఎవరూ వేల్లలేదే ?'" నేను ...... "అదికాదండీ ... ఎవరెవరు ? వెళ్ళారు సామాన్ల గదిలోకి ", "మీకు చెప్పాను చూడండని ".... " అదేనమ్మా.... నీవొక్కదానివే వెళ్లావు కదా ? " ఆమెకు కోపం వచ్చినట్లుంది "ఏమండోయ్ నాకు కోపం వస్తే బావుండదు " . " మీకు చెప్పాను కాపలా ఉండండని .. మీరేమో ఏంటో ? చెబుతున్నారు''. ...... "లేదమ్మా నీతప్పించి మరెవ్వరు వెళ్ళ లేదు కదా ?.. " అన్నాను . ఆమె రెట్టించి రూములన్నీ వెతుకుతుంది . నా సంచి తప్పించి . ఎందుకినా మంచిదని ఆ పని నేనే చేసాను . "హమ్మ " నా బాగ్ లో లేదు . ఊపిరి పీల్చుకున్నాను . ఆమె " ఏమో ? నాకు తెలియదు ... మీరే .... రెస్పొన్సిబుల్ ".... నా గుండెలు వేగం గా కొట్టుకోడం మొదలయింది .. సరికదా అని దాని రేట్ బట్టి మనీ కట్టడానికి మనస్సులో రెడీ .. కాని అది వెండి వస్తువు . దాదాపు 250 గ్రాముల కంచం .. 2013 లో వెండి కిలో రేట్ మీకు తెలియంది కాదు . ... మనస్సులో "దేవుడా ...దెవుదా దేవుడా " జపం స్టార్ట్ . ఇంతలో " ఎయ్ అడివి !(వాళ్ళా యన ముద్దు పిలుపు )హోమగుండం దగ్గర ఉంది ...ఇన్దా " తెచ్చి ఇచ్చాడు . నాకు సంతోషం కలగలేదు . కాని మనస్సులో దుఖం పొర్లు కొచ్చేసింది . మెల్లగా మనసు నెమ్మదించింది . కళ్ళు చెమ్మగిల్లాయి . ఎందుకంటే ?... అప్పటివరకు నా పెత్తనం , పెద్దతనం ... సలహాల పర్వం ... అనుభవం ఒక్క వెండి కంచం ముందు చేతులు కట్టుకోవాల్సి వచ్చిన0దుకు. మామూలుగానే పెళ్లిళ్లకు ,విందులకు .కులాసాగా వెళ్ళడం ఇష్టం ఉండదు ... ఒకవేళ వెళ్ళవలసి వస్తే వెళ్లి వచ్చాక ఇంటి భోజనం చేయడం ,నాకు అలవాటు ,. .. కారణం వేరే చోటు మెక్కడం నాకు చాల ఇబ్బంది . భోజనాలకెళ్ళి బ్రేవ్ మంటూ త్రేన్పు తుంటారు , నేను భోజనాలకు వెళ్లి నానా యాతనకు గురిఅయి ఇంటి ముఖం పడుతుంటాను .. నా జీవితం విలువ కనీసం ఒక్క వేదికంచం కి సరితూగ లేక పోయినదని ఇప్పటికీ గురుత్ చేసికొంటూ ఉంటాను ..... భోజనాల ఉభయ బ్రస్టు ...ఉప్పర సన్యాసం మరో సారి చెబుతాను .... మద్దూరి . రవిబాబు
No comments:
Post a Comment