totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Tuesday, 12 April 2016

 చేసిన తప్పుకు "దండం " తో సరి                                                                                                                   ************************                                                                                                 అదో చిన్న టౌన్  నేను టీన్స్ లో ఉండగా అన్నమాట .    నాకున్న మంఛి  మిత్రుల్లో, ఓ  మరీ  మంచి మిత్రుడు  ఉండీవాడు.  వాడికి నేను పెట్టిన మారు పేరు "రఘు'. సాధారణంగా  వాళ్ళు భాగ్యవంతులు .వాడి  దగ్గర ఎప్పుడూ డబ్బులు పుష్కలంగా ఉండేవి . నాకు కుషామత్ (జల్సా) చేయడం వాడికి ఓ సరదా . ఇద్దరం బాగానే చదివేవాళ్ళం . టూష న్  కూడా ఓకే చోటు ఇళ్ళు  ఎదురెదురు .వాళ్లకి  పెద్ద గార్డెన్ప్ర,ప్రహరీ ఉండేవి.           మా  ఇల్లు సర్వసాధారణంగా,సామాన్యం గా ఉండేది .                                                                                                                                                             మేమిద్దరం అల్లరి మాత్రం అతి చెత్తగా చేసే వాళ్ళం . ఉదాహరణకు :1.  ప్రైవేటు క్లాసు రాత్రుల్లో ఉన్నప్పుడు,అందరికంటే ముందు ,ఇంటికి పోయేప్పుడు క్లాసు మేట్స్ చెప్పులు ఎడమ   లేక      కుడి చెప్పు  దాచేయడం ... వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాకో సరదా. 2. ఒకరి పుస్తకాలూ వేరే వారి సంచిలో పెట్టడం ... ఇలా  చాల చాల  అల్లరి కనిపించకుండా వినిపించకుండా చేయగల  సిద్దహస్తులం ..                                                                                       రఘు, వెనుకుండి  నాతొ చేయించే  వాడు . వాడు ఏమి చెబితే అదిచేయడం నా వంతు . మేమిద్దరం పైకి చూడ్డానికి,నోట్లో వెలుబెడితే ఏమి? చేయాలో కూడా తెలియని అమాయకుల్లా కటింగ్ ఇచ్చేవాళ్ళం . ఒకరోజు చెప్పులు దాయటం పెద్ద సమస్యగా మారడం,రాలుగాయి, ని పట్టుకోలేక పోడం సమస్యగా మారడం వల్ల, మా టూషన్ మాస్టారు (చెప్పులు వద్ద ఒక మనిషి +లైట్ తో కాపలా పెట్టారనుకోండి ....!! )... కొంచెం కటి నంగానే తిట్టాడు (పరోక్షం గా) .సరే చెప్పేదేముంది రఘు కనుసైగ ..... అర్ధమయింది  విషయం . మాస్టారు గార్కి ముహూర్తం పెట్టాలి . విశ్రాంతి సమయం లో ప్లాన్ చేసి రెడీ అయ్యాం  .  ప్రైవేటు క్లాసు అయిన  తరువాత ,అందరికంటే ముందు బయటకు వచ్చేది మేమిద్దరమే .  ఆరోజు ప్లాన్ ప్రకారం మాస్టర్ గారి సైకిల్  రెండు టైరు గాలి తీసి వాల్ పిన్ తో సహా  ప్రక్క బావిలో పడేసాము . పాపం మాస్టారు రాత్రి ఇంటికి పోవాల్సిన ప్పుడు, పడిన ఇబ్బంది వర్ణనాతీతం  . ఆ టైం లో చిలిపి ఆనందం పొంది ఉండవచ్చు . మేమిద్దరం  చేసినపనులు ఎంత ఘోరంఅయినవో ఇప్పటికీ మమ్మల్ని మేము క్షమించుకోలేనివి .                                                                                               మంచి తల్లితండ్రులు,  తెలివైన తోబుట్టువులు ఉన్నప్పటికీ,తెలుసుకోవాలన్న ఆలోచన స్వీయ స్పందన లేకపోడం , సంఘం లో ..... తోటివారి పట్ల ఎలా మెలగాలో క్షుణ్ణంగా తెలియకపోడం , అంతా మాకూ తెలుసు , మేమే పండితులం, మాకు ఎదురే0టి? లాంటి  కుహనా ఆలోచనలు బహుశా, కారణం అయిఉండొచ్చు !... ఇప్పటికీ మా మాస్టర్ గారికి క్షమాపణలు చెప్పుకుంటూన్నాం . ఇప్పటి మాధ్యమాలు అప్పుడు లేవు ..... అన్నీ విషయాలు విడమరిచి చెప్పడానికి ,తెలుసుకోడానికి . బాధాకరమైన విషయం ఏంటంటే ? .... చీకట్లో చేతికి దొరికిన కాలి  జోడులో ఒకటి ప్రక్కనే ఉన్న కారు చీకటి  మైదానం లోకి  ,బలం కొద్ది విసిరేవాళ్ళం . పాపం అవి ఎవరి జోడో వాళ్ళు దేవుడో అంటూ రాత్రంతా  క్లాసు రూం లో వెతుక్కొని ,కుక్కలు ఎత్తుకు పోయాయి అని నిర్ధారణ జరిగాక ,మరో క్రొత్త జత కొనుక్కునేవారు . క్రొత్త జతవారిని ఒదిలేవారం . ఆ పిచ్చి పనులు జ్ఞాపకం వచచ్చినప్పుడు,  కొద్దిగా నవ్వొచ్చినా, వెంటనే వాటి తాలూకు శాపనార్ధాలు, తిట్లు , మంగళహారతులు ... మనస్సుకు ఏంతో   వేదన కల్గిస్తూంటాయి . మిత్రులందరూ క్షమిస్తారని ఎప్పుడూ అనుకుంటూ...                                                                            శలవు ...                                                                        రవిబాబు . మద్దూరి                                                                                                                                       

No comments:

Post a Comment