totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Tuesday, 20 September 2016

"గణపతిబప్పా .. మోరయా ..! కాస్త ..ముందా ?..!! మందా ? ఐన వేళ "                                                                                            ప్రపంచానికి తెలిసిన ఆహ్లాదకరమైన హిందూవుల  పండుగలలో అతిముఖ్యమైన పండుగ . ఎంతపెద్దవాడైన అశ్రద్ధ చేయని పండుగ .. శ్రద్దా ..శుచి ..శుభ్రత .. దీక్షగా చేసే అతి ముఖ్యం అయిన రోజు . సంవత్సరమంతా పిల్లలు ఎదురుచూసే పండుగ .... కొంతమంది తమ వ్యాపారం ..వ్యవసాయం ... కర్మాగారం ... లో ఎటువంటి పొరబాట్లు ..నష్టాలు రాకుండా విఘ్నేశ్వరుడిని ముక్కే రోజు కూడా ఇదే .                                                                                    దేశం లో నాలుగు చెరగులా ..విగ్రహాలు చేసేవాళ్ళకి ...వేషాలు కట్టేవారికి ... పండ్లు పూలూ ..తినుబండారాలు  ...ఒకటేమిటి ...అన్నీ రంగలవాళ్ళకి సంవత్సరానికి దాదాపు ఆదాయాన్ని సంపాదించిపెట్టే ఒక శుభప్రదమైన పండుగరోజు . ఇంకో విధం గా చెప్పాలంటే ఏ రోజుకు ఆ రోజుకు కాస్తఅంత మందుబాబులు తడుకోకుండా 'మందు' పుష్కలం గా దొరికే భలే మంచి రోజు .                                                                                                                                                                               మైకుల హోరు ...పూజల జోరు ... ఎంత అయినా చాలా గొప్పగా ఉంటుంది . దాదాపు పండుగకు రెండు వారాల ముందునుంచే చందా బాబులు .. పెద్ద బొట్లు ,చేతికి రంగు దారాలు తో .. నమస్కారాలు పెట్టుకుంటూ ఇంటిముందు తయారు (వీళ్ళు చందాలు అడిగి మరీ విగ్రహం పెట్టపోతే  వినాయకుడు "గిల గిలా ",కొట్టుకుంటాడు అన్నట్లు ).. నమ్రతగా అడిగే వాళ్ళు ,డిమాండ్ చేసేవాళ్ళు ,ఇచ్చింది పట్టుకుపోయేవాళ్లు ... ఇవ్వి క్యాటగిరీలు ..... ఇహ దాదాగిరి తో పట్టుకు పోయేవాళ్లు అతికొద్దిమంది      .....                                                                                                                                                         ప్రతిరోజూ పూజలూ ..  ప్రసాదాలు రూలు లా గడిచి పోతాయి ... చివరిరోజు వినాయకుడిని నిమజ్జనం చేసేంతవరకూ బావుంటుంది హుషారుగా ఉంటుంది . ఇంటికివచ్చేక ..స్నానాలు ... అవ్వి అయిపోయాక లెక్కలు ... బాకీలు ... బకాయిలు ... మిగులు ... జేబులోంచి పెట్టాలా ... వచ్చేసంవత్సరం వరకూ మిగులు ధనం దాచుకోడం ... లడ్డూ  ది  ఓ  సెపరేట్  అధ్యాయం . డిస్కషన్స్ ... మెచ్చుకోళ్ళు ... విన్నపాలు .. కొద్దిలో తప్పింది   అంటే .. కాదు కాదు  ఫలానా వాడు ఏకం గా పెంచేసాడు .. లేపోతే నేనే తీసుకుందును ... ఇలా తర్జన భర్జనలు జరుగుతూ ఉంటాయి . ఈ ప్రహసనం నా చిన్నప్పటి నుండీ చూస్తున్నాను ...వింటున్నాను .  ఇటీవలే నిమమజ్జనం  రోజుకు నేను మా బంధూవుల ఇంట్లో ఉండం జరిగింది . ... నిమజ్జనం రాత్రి మా బంధువుల అబ్బాయిని అపార్ట్మెంట్ గణేష్  కమిటీ  వాళ్ళు రాత్రి   ... 8 గంటలకు తప్పనిసరిగా మీటింగ్ కి రావాలని పిలుపు  ....  ఇంటర్నెట్ లో బిజీ గా ఉన్న నేను ... కూడా ఇన్విటేషన్ పిలుపు విన్నాను . మావోడు రాత్రి 8 గంటలకు చేతులూపుకుంటూ వెళ్ళాడు కూడా . నేను దాదాపు 9 గంటల  ప్రాంతం లో వాళ్ళ ఆవిడ గారిని అడిగాను "ఎమ్మా ? మీ ఆయను గారు మీటింగులో పాయింట్ స్పీకరా "...." లేదండి !!...    ఈ రోజు నిమజ్జనం చేసి వచ్చారుకదా .... దే ఆర్ రిలాక్సింగ్ ".....    "సరేనమ్మా ఎవడింట్లో వారు రిలాక్స్ అవ్వోచ్చుకదా "....." అందరూ  .... ఒకే చోటు రిలాక్స్ అవడమేంటీ ... నాకు అర్ధం కాట్లేదు "......  "భలేటోరండీ మీరు .. ఆ రిలాక్సింగ్ కాదండీ  బాబూ ... మందు పార్టీ  అట " నేను ఏమివిన్నానో అర్ధం కాలేక, చేసుకోలేక  ... గొంతులో వెలగ పండు లా ఉంది నా పరిస్థితి  ..... నా మనసులో    తలపులతో సుళ్ళు తిరగడం మాత్రం గురుతు...  టైం చూస్తే 10. 50... ఈ మధ్యలో మనోడు ఎప్పుడొచ్చాడో ... నిదురపోతున్నాడని గమనించాను (తాను కోకే.. త్రాగి ఉండొచ్చు  అది వేరే విషయం )..... పోయి పోయి వినాయకచవితి నిమజ్జనం చేసినరోజు ఈ ఇంగిలీషు (ఎంగిలీషు ) .... దొరల సిస్టం ఏంటో ? కదా .. మరీ విచ్చలవిడి తనం కపోతేనూ ... ఈ మద్య లో హైదరాబాద్ విడిచిపెట్టి ఒక బయటి వ్యక్తిలా   ..... దూరమునుండి చూస్తూ చుట్టం చూపులా వెడుతూంటే.....  కంప్లీట్ టేక్ ఎంత మారిపోయిందో కదా . నిజంగా నేను జీవితంలో ప్రపంచాన్ని ఎంత ? ఆలస్యం గా తెలుసుకుంటున్నానో కదా ?  నిజంగా చెప్పాలంటే .. నేను చూసిన, విన్న, వినాయక నిమజ్జనాలు హైదరాబాద్ లో    ఎంతో  ఆహ్లాదకరంగా సాగినవే .. తలకు కాషాయ రిబ్బనులు కట్టుకోడం .. దారిలో  నిమజ్జనపు విగ్రహం కూడా వెడుతూ కావలిసిన వరకు ఇష్టమొచ్చిన ప్రసాదాలు అందుకుంటూ  ... కేరింతలు "గణపతి బప్పా మొరు యా .. మంగళ మూర్తి  ఆగలేసాల్ యా " ... మరెన్నో విగ్రహాల్ని చూస్తూ తన్మయత్వం చెందుతూ .. నేను హిందూ గా పుట్టడం పూర్వజన్మ సుకృతమే అనుకోడం ... అరుచుకోడం ... అప్పుడప్పుడు కొన్ని కోతి చేష్టలు చేసుకుంటూ నిమజ్జన వాటికకు చేరుకొని ...నిమజ్జనా నంతరం   బిక్కమొఖాలేసుకుని ఇంటికి చేరుకొని .. కనీసం ఏదయినా తినే అవకాశం చూసుకోకండా  గుర్రుపెట్టి నిదురోటం .... పుంఖాలు పుంఖాలు క్రింద గురుతొచ్చి  కళ్ళ వెంట నీరు జాలువారటం ఇప్పటికీ మరిచిపోలేదు .   మరో జుగుప్స క్రియ .. వినాయకుణ్ణి ... పాపం  తనని తన లానే ఉండనీయక  అతని రూపురేఖలను సినిమా హీరోల్లా రూపాంతరం చేయడం భక్తి ఎలా ? అవుతుంది ... ఆమంటపం లోని   సింహదాతల కుల గజ్జి .... హీరో తాలూకు ఆరాధన ...హీరోపై భక్తి లా పరిఢవిల్లుతుందే తప్ప ..... వినాయకరూపం నుంచి వారికీ వచ్చేది సున్నా . సూక్ష్మం గా చెప్పాలంటే వారి హీరోతాలూకు అభిమానం ... పిచ్చ వెర్రి .... లాంటి భావాలకు ప్రతీకగా ఉన్న రూపానికి, నిత్య నైవేద్యం ,ధూప దీపాలు , పూజలు, తప్ప వినాయకునికి చేసింది ఏమీ లేదు కాబట్టి . పైగా శాప గ్రస్తులవడం ఖాయం .... ఎందుకంటే ....అష్టోత్తరాలు .. సహస్ర నామాలు ,అర్చనలు భాష వరకు వినాయకునివే ..... విగ్రహారాధన జరుగుతుంది "బాహుబలిరూపాయ విగ్నేశ్వరః " కనుక .                                                                                                       నావరకు నాకు : మనం నాగరికం లో ఎంతో ముందున్నామనుకుంటున్నాం .. అది నిజమయిన "అవాస్తం "..... హిందువుల పండగలు అన్నీ చరిత్ర ఆధారాలూ .. ఆలంబనలే కదా ..!... ఎందుకంటే ఈ భూమి పుట్టినప్పటినుండీ అన్నీ యుగాలకు వాటి ప్రాశస్త్యం బట్టి .. చోటుచేసుకున్నవే .. కల్పితాలు కానేకావు ... అటువంటప్పుడు వాటి విధానాల్ని మార్చే హక్కు( ఉదా : షిరిడీ సాయి సేవా విధానం లో   అంటూ...ముట్టూ ... ఉపవాసం .. డ్రెస్ కోడు ... బొట్టు విధానం ... షిరిడీలో ఆయన తిరిగిన ప్రాంతాల్లో ఆశ్రమాలు కట్టి .. శిష్యులుగా ప్రకటించుకున్నట్లు .... ఫీజు విధానాలు... సమగ్రం గా ఆయన జీవితవిధానం తెలుసుకోక ... ఎగబడి మరీ ఆయన వొళ్ళో వాడిలా మాట్లాడడం లాంటివి  )  ఈ భూమ్మీద పుట్టినోళ్ల కెవరికీ లేదు  ...  సభ్య ప్రపంచంలో ఇంకా ఎన్ని ఇటువంటి  ఘోర ప్రక్షిప్తాలు చూడాలికదా ? అనుకుంటే మనసు కలతకు గురికాకమానదు . దయచేసి అలోచించి చూడండీ . మానవులు ఇలా వారి ఇష్టారాజ్యం గా ఉంటారనేమో ఆ పై వాడు కనిపించక వినిపించక  ... కేవలం మనో నేత్రంలోనే నిబిడీకృతమైనట్లు అనిపిస్తుంది నాకు ... ఇటువంటి పోకడలే బహుశా .. సంఘం లో ఏమి ఆశించక .. ప్రజా కళ్యాణం కోరి నాలుగు మంచి మాటలు చెప్పడానికి వస్తున్న గ్యానులకు  .... తాటిఆకులు కడుతున్నారు ... కదా ?....!!.. (ఈ మాట నేను పూజ్యులు .శ్రీ శ్రీ శ్రీ .చాగంటివారిని ఉద్దేశించి అన్నవే .... ఎందుకంటే ఆ మహానుభావుణ్ణి  చేసిన నిందారోపణలు ఇప్పటికీ నా గుండెను తొలుస్తున్నాయ్ )....... ఈ విధం గా మనం గణేష్ చవితి జరుపుకో పోయిన ఇంట్లో చేసుకోడం ... అవకాశం లేపోతే  మందిరం లో ఆయన పూజలో పాలుపంచుకుని నాలుగు అక్షింతలు నెత్తినెట్టుకుంటే .. ఆయన ఏమీ ? మనల్ని అనకపోచ్చు ...... కలియుగంలో .... కలకలం అంటే బహుశా వినాయక నవరాత్రులు అనే మిషతో  "మందు " పార్టీనే  అనిపిస్తుంది ....... దయచేసి ఆలోచించండి ...... విఘ్నేశ్వరుని నవరాత్రుల  నిమజ్జనం .... సందర్భంగా మందుకొట్టే   ... మహానుభావులకు నా ఈ వ్యాసం నమ్రతతో అంకితమిస్తూన్నాను                                                                                                                                                    నా కోరిక : స్వామీ విఘ్నేశ్వరా నా కంఠంలో ప్రాణమున్నంతవరకూ మీ నిమజ్జనాలు సందర్భంగా మరెప్పుడు ఇటువంటి "ఉభయ బ్రష్టుత్వపు వార్తలు " వినకండా నన్ను కాపాడమని తమకు మనవి చేసుకుంటూ న్నాను .                                                                                                                                                                                                                                                     గమనిక : పై ఫోటోలు లో ఉన్నవారు ఎవ్వరూ ఈ వ్యాసం లో క్యారెక్టర్ లు కారు . కేవలం బ్లాగ్ కోసం సమీకరించడం జరిగినదని మనవి                                                                                                                                                                                                                                            రవిబాబు . మద్దూరి 
                                                                                                               

No comments:

Post a Comment