totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Thursday, 24 December 2015

                ''    బుద్ధి లేనోడు కడితే ! తెలివిగలోడు జీవిస్తాడట ''                                                                                           ఇల్లు కట్టుకోడం ఎంత ? తెలివిగల పనో .... దాన్ని అద్దెకీయడం అంత  బుద్ధి తక్కువ . మన  హైదరాబాదు లో ఇల్లు అద్దె కిచ్చి ''కిరాయి '' మీద కాలరెత్తుకొని బ్రతికేయడం ఒక కళ ... ఆ  దొక కుటీరపరిశ్రమ . కుటీర పరిశ్రమ మనలో  కొందరు ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం అని చెప్పుకొంటే,ఫలానా వాడికి ఇంత కిరాయి (అద్దె )అని చెప్పడం ఒక అర్హత కూడా . నల్లని రంగు దట్టం గా మీసాలకు పట్టించి భూత వైద్యుడి లా కుంకుమ ముక్కు ఫై నుండి నుదిటి లో జుట్టు వరకు పూసుకు తిరగడం, చేతికి ఒక కడియం (ఒక్కో సారి బంగారం కూడా కావచ్చు )ఐదు  కు తగ్గని రంగు దారాలు కట్టుకుని,ఊర పొట్ట, జారుడు బుగ్గలతో నిండయిన మొఖం తో తిరుగుతూ ఊరికే ఊస్తూ ఉంటారు వీలయినంత మంది ఓనర్లు                                                                                                                                                         నేను తెలివి లేనోడిని కావచ్చు,కాని గతిలేని పరిస్థితుల్లో 180 రూపాయలకు రెండు గదులకు చెల్లించి ఉండీ వాడిని . ఆదాయం బట్టి తప్పదుకదా ?.. !! ... బెడ్ రూమ్ కం విజిటర్స్ మొదటి గద యితే , కిచ్చెన్ కం రూం  స్టోర్ రూం కం బ్యాక్   రూం కం డ్రెస్సింగ్ రూం రెండో గది . ఇహ టాయిలెట్,బాతు రూంలు గురించి చెప్పనవసరం లేదు ..... ఒక్కడు లోపల వాడి పని చేసుకుంటుంటే రెండోడు బయట బక్కెట్ నీళ్ళ తో రెడీ గా ఉండాలి . దిక్కులుచూ శామంటే,  నాలుగో వాడు లోపలి పరిగెత్తి పిచికారి చేస్తాడు . ఇక చెప్పేది ఏముంది ? మనం బలయి ''శ్రుంగ భంగం '' కాక తప్పదు .                                                                                                                                                  ఇంటి ఓనరు గురుంచి వేరే చెప్పాలా ?,కరెక్ట్ గా పొద్దున్నే తయ్యార్ !నెల మొదట్లో .... టీ కంపల్సరీ .. వీలయితే కాస్తంత టిఫిను . ఇక్కడ తమాషా ! ఏంటంటే ?మనం లెక్క చూసుకొని టిఫిను తెచ్చు కుంటాం లేక ధర్మ తల్లి బొంబాయి రవ్వ ఆదుకుంటుంది . దాంట్లో కొంత సమర్పించాల్సి ఉంటుంది . టిఫిన్ తింటూ సదరు ఓనర్ గారు చట్నికోసం చూసే జాలిచూపులు    మన గుండెలను పిండే స్తాయి  సుమా !.... తదుపరి ఓనరు గారి కొడుకు యాదగిరి గొప్పతనం వినవలసిందే ... వా డి ఫై పోలీసు కేసులు , చిలిపి ముచ్చట్లూ వినిచావాలి . ఒనరుగారు వెడుతూ, ''మీ ఆఫీసు లో ఒక కళాసి  ఉద్యోగం '' చూడమంటూ సదరు సిఫారసు  ఇప్పటికీ గుండె ను తోలిచేస్తాయి  ..                                     
                   ఇంతలో మన ఆఫీసు టైం అయిపోయి, టిఫిను కంపల్సరి గా ఆఫీసు లో భోజనం గా మారిపోతుంది . ఇటువంటి    పరిస్తితుల్లో మనమూ ఒక ఇల్లు కట్టుకుని,కిరాయి నరసింగ్ లా మారాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటాం ! అటువంటి కల ముందు మన ఉద్యోగం బలాదూర్ లా అనిపించవచ్చు కూడా ... ఆఫ్కోర్స్ ! అలా మారిపోయిన! వాళ్ళ సంఖ్యే   ! ఇప్పటి సిటీ లో ఉంది ..... వాళ్ళ నే కిరాయి జయ ... బిల్డింగ్ జయప్రద ... కిరాయి సుబ్బారావు .... అద్దెల ఆదెమ్మ .... మరికొంత మంది మెస్సు మాలక్ష్మి.... చిట్టిల సరోజ .... ఇలా ఎన్నో అవతారాలు . అక్కడ అన్నీ అమ్మి ఇక్కడ పెట్టుబడి పెట్టడం .... అన్నింటి కంటే  కొంతమంది  భీభత్స మయిన బద్దకస్తులు  కొన్ని రంగులు,కుర్చీలు సోఫాలూ ,పరదాలు ,సుగంద ద్రవ్యాలు పెట్టుకున ... మగ ఆడ జుట్టు ను చిత్ర విచిత్రం కత్తిరిస్తూ ..... చివరికి మంగాలివారి నోటి నుండి తిండి లా క్కుంటారు, బ్యూటీ పార్లోర్ అనే పేరుతొ . కొంతమంది అయితే ! ఏకంగా మాసాజ్ సెంటర్లూ .... ఇటువంటి పరిస్థితుల్లో మనకూ ఓ స్వంత ఇల్లు లేక మేస్సూ లేక మసాజు సెంటరు లేక మంగలి షా పో అవసరమా ??....!!                                                  రవిబాబు.మద్దూరి

No comments:

Post a Comment