totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Thursday, 31 December 2015

                                             గతి తప్పి మతి పోయిన నాగరికత                                                                                   ఈ నాగరికత ఎవరిదో కాదు ప్రస్తుతం మన భారత జాతికి పట్టిన పీడ అంటే బావుంటుందేమో? కదా !భారత దేశానికీ పట్టిన అరిష్టాల్లో,జాడ్యాల్లో అతి ముఖ్యమైనది కుడా . దాదాపు పండిట్ నేహ్రూ కాలానికే ఇది పరిమితం కాకుండా ఇప్పటి వరకూ ఓ భూతంలా తీవ్రమైన ప్రయత్నం   తో మన భారత జాతి ని అంటిపెట్టుకుని ఉన్న పెద్ద అంటురోగం అవడం ఓ విశేషం . మన దౌర్భాగ్యం ఏంటి ? అంటే మనకు మన నాగరికత ఫై ఓ నిర్దిష్ట మైన అవగాహన కల్పించవలసిన నైతిక బాధ్యత కలిగి మన రాజకీయ నాయకులే మన నాగరికతను కాలరాయడం .                                                                 మీతో  భావాలను పంచుకోవలసిన ప్రేరణ కలిగించిన విషయం ఇక్కడ చెప్పక తప్పదు . దాదాపు పదేహేను సవత్సరాల క్రితం నా మిత్రుడు ఒకడు (సాంప్రదాయ కుటుంబం )తన విషయం చెబుతూ ఉంటె, నా మనస్సు వేదనకు గురి కాక తప్పలేదు అతనికి ఇద్దరు అమ్మాయిలు .వారిద్దరికీ చదివినంత చదువు చెప్పించాడు . తనకున్నంతలో ఎ విషయం లో,ఖర్చు లో రాజీ పడలేదు . ఎం సి ఎ. చదివిన తన కుమార్తెకు అమెరికా లో మంచి జీతం తో ఉద్యోగం దొరికింది . మేమoదరం ఎంతో సంతోషం తో ఆమెను అమెరికా పంపించాం కూడా . దాదాపు మూడు సవత్సరాలు ఆమె ఆదాయo  తల్లి తండ్రులను మంత్రముగ్దులను చేసిందంటే నమ్మాలి మీరు. ఉత్తరాలు తల్లితండ్రులకు వ్రాసే అవుసరం ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు ఎవ్వరికీ లేదు కారణం ? వీడియో చాటింగులు, ఫోను టాకులూనూ . ఒక రోజు అ అమ్మాయి తల్లి తండ్రులకు పంపిన సంక్షిప్త మెయిలు సమాచారం లోని సారంశం " అమ్మా నాన్నకు  మీ రజని వ్రాయుట, ఏమనగా? మీరు నన్ను ఎంతో,వ్యయ ప్రయాసలకు భరించి పెంచారు చదివించారు మీ ఈ ఋణం ఈ జన్మలో తీర్చు కోలేనిది . నాకు కావలిసిన బట్టలు కొన్నారు ,ఇష్టమయిన తిండి పెట్టారు, కంటి కి రెప్పలా కాపాడారు . కానీ గత మూడు సoవత్సరాలుగా, ఇక్కడ మా సీనియర్ కామేష్ తో పరిచయముంది . అతను నా మనసును సంపూర్ణం గా అర్ధం చేసుకున్న వ్యక్తి, ఫైగా, యు .స్ . కు నేను రావడానికి ప్రేరణ అతను . నాకు వీసా అప్పుడు ఎంతో సహాయం చేసాడు కూడా . మీకు ఈ విషయం గురించి ఒక సవత్సరం క్రితం ప్రస్తావవన తెచ్చాను ,నాన్నగారు నాకు  సంబంధాలు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు . కాని నా మనసు మీరు తెలుసుకోలేక మీ నిర్ణయాలు మీరు తీసుకోడం నన్ను కలతకు గురి చేసింది . మీ ఆశీర్వాదాలు కావాలిగనుక, నేను ఈ విషయం తెలియ పరుస్తున్నాము . మీ మనస్సు ను నొప్పిస్తున్నందుకు మన్నించండి . మా వివాహానికి మీ అంగీకారాన్ని తెలుప మని ప్రార్ధన .మీకు ఈ విషయం నచ్చదు, అటువంటి పరిస్థితుల్లో,నేను చేయగలిగింది ఏమి లేదు. ఈ పెల్లిచేసుకోడం తప్పించి .                                                                                     శెలవు.,                                                                                                                                                            క్షమించండి                                                                                                                                          ఇట్లు , మీ నీరజ   ''                                                       ఇది పరిస్థితి, నా మిత్రుడు ఏడవలేక ..నవ్వలేక సందిగ్ధావస్తలో కుమిలిపోడం చూడ్డం తప్పించి ,ఫరవా లేదు లే ! అనో ? మరోవిధం అయిన ఓదార్పు, చెప్పే ధైర్యం చాలక మూగ పోడం, నా వంతయింది . కానీ ఈ రోజుల్లో అటువంటి వివాహాలు వీలయినంత సంఖ్యా లో ,అతి వేగం గా  పోతున్నాయ్ ఈ రోజుల్లో . ఆఫ్కోర్స్ ! బహు కొద్దిమంది మాత్రం తల్లితండ్రుల నీడన ఉభయులకూ నచ్చి, మెచ్చిన సంబంధాలు చేసు కుంటున్నారు అనుకోండి . మరికొందరు తిరిగేది ఒకరితో, పెళ్ళి చేసుకునేది మరొకరిని .... మరికొందరు ఘనమైన కట్నం .. వీలైనంత త్వరగా కాపురం ...తదుపరి మరో వివాహానికి సన్నాహాలు ..ఈ కేటగరీలన్నీ, యు . ఎస్ మగవాళ్ళ నుద్దేసిo చినవే (అందరూ కాదు సుమా !,ప్రబుద్ధులు )ఇది ప్రస్తుత సంప్రదాయం . అక్కడికి వెళ్లి తల్లితండ్రులను, భార్య, ప్రసవించే  సమయానికి అతి గౌరవంగా ఫ్లైట్ లో తీసుకెడతారు . మాక్సిమం పిల్లలు అక్కడి నర్సింగ్, ఆయాల బాదుడు (జీతాల )భరించలేక, తల్లితండ్రులను దాదాపు మూడు నెలలు,  పెంటలు తుడిచి  స్నానాలు చేయించేందుకు , తదుపరి సైటు సీఇంగ్ మర్యాదలు చేసి వెనుకకు పంపిస్తారు . ఎక్కువ రోజులు వాళ్ళని ఉంచితే దగ్గిందానికి,తుమ్మిన  దానికి, యిచ్చీ  మందులకు తడిచిమోపెడు అవుతుంది కదా ? నిజం గా ఆ  దేశస్థులు తల్లితండ్రులను గౌరవించే విధానం అనన్యం . భారమనుకున్న సమయానికి, ఓల్డ్ ఏజ్ హొమ్ లో దాఖలు చేసే  మదర్స్ డే , ఫాదర్స్ డే, అనే పేర్లు పెట్టిన రోజుకు, చాటింపు కోసం, వాళ్లకు ఇష్టమైన తిండి పెట్టి కొంచెం సమయం వాళ్ళతో గడిపి ఎవడింటికి వాడు తిరిగోచ్చేస్తారు.      కొంతమంది పురిటికోసం ఏకంగా అక్కడే భార్యను ఉంచి మరీ పిల్లలను కనిస్తారు, ఈ విషయం లో భారత పౌరసత్వము అనే విషయం ఎందుకూ పనికిరాదు , పౌరసత్వం పొందితే గోమాంస భక్షణ చేసే దేశాల్లో హాయే వేరు, ఎన్నో హక్కులు .ఇది వాళ్ళ నాగరికత, కుక్కను చూసి, నక్క తోకను వంకర చేసుకొనే ప్రయత్నం (మన దేశం లో కొద్ది సవత్సరాల్లో లవర్స్ వాలెంటైన్ డేస్ లా,   ఈ సంకరజాతి నాగరికత విజ్రుమ్భిస్తుంది. మనం కంగారు పడవలసిన పని లేదు ). ఇలా నే ఉంటాయి ఈ, యు ఎస్, గొప్పలు.  ఆ దేశస్తులు గోమామంస భక్షణ వలన నాలుక మంద మయి ,నాలుక కొన్ని పదాలు, నోరు పూసిన వారు మాట్లేడే విధంగా ,ఇవతలివారికి ఆంగ్లం అర్ధం అయ్యి చావదు ఓ పట్టాన . ఆ ఉచ్చారణ ను ఫాషన్ అనుకొనే వారు అదే ఉచ్చారణ  మన తెలుగు మాటల్లో ప్రయోగం చేస్తుంటారు. ఉదాహరణకు: కొన్ని చానల్సు లలో మన తెలుగు సినిమా హీరో / విలనీ చేసే ఓ నటుడి కూతురు మాట్లాడినట్లు (అర్ధం అయ్యిందనుకుంటాను ). మీరు క్షమించాలి నన్ను: మరుగుదొడ్లలో అక్కడివారు మనలా నీళ్ళు ఉపయోగించరు .ఏమి? ఉపయోగిస్తారన్నది మనలో మనలో చాలామందికి తెలుసును !!... వెనుకటి రోజుల్లో ''తోళ్ళ సాయిబులు ",ఉండీ వారు వాళ్ళు వృత్తి రీత్యా కటికలు. జీవనాధారం, పాపం వాళ్ళ పేదతనం,ఉనికి బట్టి రోజుకో రకం దుస్తులు వాడే స్తోమత ఉండదు. అంచేత వాళ్ళు కనీసం ఓ పక్షం రోజుల ఫైనే, శరీరం ఫై నుండే ఆచ్చాదన మార్చక వాటితోనే తిండి, తిప్పలూ,విశ్రాంతి. అందువలన  దాదాపు ముప్పయ్ గజలనుండే, వారువస్తున్నట్లు,వాళ్ళ వాసన మనకు తెలిసిపోతుంది . బట్టలు ఉన్నంతలో కనీసం మార్చడానికి ప్రయత్నించని వాడిని మనం ''ఏంటి ? అవే బట్టలతో ఉన్నావ్ ! తోళ్ళ సాయిబులా ...!!! అని ఆటపట్టించడం పరిపాటి .అదుగో , అల్లాంటి డ్రెస్ ను ''జీన్స్ '' పేరిట రోజులు నెలలు వాడేస్తూ,గొప్ప గొప్ప స్టేటస్,ఉద్యోగాల్లో అమెరికా లో బ్రతికేయడం గొప్ప నాగరికత ...ఆ నాగరికతను ఒంటబట్టించుకుని బ్రతికేయడం మనసంగం లో చాలా మంది యువతకు ప్రాణం ఈ రోజుల్లో .... ఇటువంటి అనాగరికమైన గొప్ప నాగరికత ఇష్టపడి మరీ దిగుమతి చేసుకుంటున్న వారిని,అక్కడికి పోయి బ్రతికేయాలనే నూతన సంప్రదాయం మనకు తలమానికం . ఇవే అక్కడి అనాగరికుల,  నాగరీకమయిన కధలు . మరికొద్ది మంది కొన్నిప్రలోభాలకు లోబడి ఏకంగా వాళ్ళ మతాన్నే మార్చు కుంటున్నారు కూడా . మన తెలుగు చానెళ్ళ లో ఒక ఛానలు అక్కడి పనిచేస్తున్న వారిలోమతం మార్చుకుంటే ఏకం గా వేలల్లో జీతం పెరుగుదల అట ..!! . అన్నింటి కంటే ఎక్కువ జుగుప్స కు లోను చేసే విషయం . (అందరూ! కాక పోవచ్చు ) అక్కడికి వెళ్ళినవారు వీలయి నంత వరకు భారత స్త్రీ కి గౌరవ ప్రతిపత్తి కల్పించే )హైందవ ఫక్తు సాంప్రదాయ మైన ''ఫై ట " అనే పదార్ధాన్నిమరిచి పోడానికి ప్రయత్నిస్తున్నారు . మన సంప్రదాయం లో వేదకాలం నుండి చెప్పే ''శిఖ "(జుట్టు చివర ముడి వేయడం )అనే ప్రక్రియకు మన యువతులు సుదూరం గా, వెళ్ళిపోతున్నారు అనేది వాస్తవం !. కాదా ! జుట్టుకొన ముడివేయక పోడమనే ప్రక్రియ యావత్ స్త్రీ జాతికే ''చేటు '', అన్న విషయం తెలుసుకో లేకపోడం నిజం గా మన దౌర్భాగ్యం కదా ??...!!... పబ్బుల జలసాలు  సంప్రదాయం కార్పోరేట్ నుండి కసిగా మనం దిగుమతి చేసుకున్న అతి గౌరవ ప్రదమయిన నాగరికత కాదంటారా ? ... జట్లు జట్లు గా అతి విచ్చలవిడిగా మగువలు పలువల విలువలు విడిచి ... నృత్యం చేస్తూ .. మద్యం సెవించడం ... ఈవెంట్ల పేరు మీద లజ్జ విహీనం గా స్త్రీలను చొంగ కార్చు కుంటూ మగువల ఫై కి గుప్పు గుప్పు మంటూ హుక్కా ఫ్లేవర్స్ వదలడం మన మగ జాతిలో ఎందరికో ఓ సరదా ఐన మగతనం ..... ఈ కార్పోటిజం అనే సంప్రదాయం కొవ్విన,బలిసిన, రాజకీయ గద్దలు మన జాతి ఫై ఉసిగొలిపిన ''అస్టావక్ర'' అభ్యాసం కాదా ?? .. తగుదునమ్మ అన్న చానళ్ళు వికార , వికృత చేష్టల పాశ్చాత్య పోకడల సీరియళ్ళు రేటింగ్స్ కోసం మన దేశవాళి చానళ్లలో చొప్పించి పసిబిడ్డల నుండి, ముదసలి వారి వరకూ  కొండల్లో కోనల్లో వారి కోసం కూడా , ట్రాన్స్మిషన్  చేయడం బ్రోకరిజానికి నాందీ ప్రస్తావన .మనకు సూర్యోదయం నుండి నూతన దినం .వాళ్ళకు నిసి రాత్రి నుండి ఓ కొత్త ఉదయం . కొన్ని వందల సవత్సరాలు మనం బానిసల్లా బ్రతికామన్నది ఘన చరిత్ర . ఆ అడుగుజాడల్లో నడవడమే జనవరి ఆంగ్ల సవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఈవెంట్లకు తయారవ్వడం,ఆ నాగారికాన్ని అనుసరిస్తూ వాళ్ళ 31 డిసెంబర్/జనవరి అర్ధరాత్రి టపాసులు కాలుస్తూ ఒళ్ళు మరచి చిత్తుగా త్రాగి బట్టలూడ దీసుకుని జుట్టు పీక్కోవడం, పిచ్చి కేకలు పెడుతూ తినే కేకులు ముఖానికి పులుముకోడం .ఒక్కసారి ఆలోచిద్దాం ఈ చేష్టలు ఎంతవరకు ? సబబు . మన సంప్రదాయం ఇదేనా?  ఈ నాగరికత ఎవరిని ఉద్దరించడానికో ..!! .... ఇటువంటి అనాగరికం మన జాతి గుండెల్లో వేళ్ళూ నక ముందే సమూలంగా   కూకటి వేళ్ళ తో పెరికివేయడం. అటువంటి సంప్రదాయాన్ని మన దేశం లో నుండి తరిమి తరిమి కొట్టాలి . ఈ విషయం లో మన యువత ,పిల్లలూ ,పెద్దలూ ,వృద్దులూ ''తామర ఆకు ఫై నీటి బొట్టు '',చందాన పర సంప్రదాయం మన సంప్రదాయం లో సంకర మయం చేయక  ఈ దేశం లో ప్రతీ భారత తత్వాన్ని గుండెల్లో నిపుకోడమే మన పూర్వులకు ,మనమిచ్చే నివాళి , ఇది ప్రతీ పౌరుని నైతిక బాధ్యత అని గమనించాలి .                                                                                          రవిబాబు . మద్దూరి 

No comments:

Post a Comment