totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Saturday, 3 August 2024

" ది బెగ్గింగ్ బౌల్ "

       మనిషి అన్నీ అవకాశాలూ,సావకాశాలూ, ఆక్రోశాలూ,అభిమానాలూ కొల్పాయాక రెండు మార్గాల్ని చూస్తూ ఒకేఒక్క మార్గాన్ని ఎంచుకుంటారు. అందులో ఒకటి దౌర్జన్య తిరుగుబాటు, రెండోది యాచించడం.
         ఇక్కడ రెండో మార్గాన్ని ఎంచుకున్నారు మన ముఖ్యమంత్రి చేతలుడిగి. ఆంధ్ర విభజనలో ఒకరో, ఇద్దరో నైతికత కలిగిన వారు తప్పించి, మిగతాపార్టీలు, ప్రభుత్వం లో ఉన్నవారు విభజన భజనలో, ప్రత్యేక పాత్రలు పోషించిన మహానుభావులే. తెలుగు ప్రజలు వీరిని ఎన్నటికీ క్షమించరు.అంతేకాదు,వీరికి ప్రజల ఉసురు తప్పక తగిలి తీరుతుంది,తగులుతూనే ఉందికూడాను.
   విభజన జరగవలసిన రోజుల్లో  అధికార పార్టీ వాళ్ళు, అంటే ప్రజలు ఓట్లేసి పార్లమెంటుకు పంపిన ఈ నాయకులు "కట్టుబడి ఉన్నాం"అనే డైలాగు చెబుతూంటే,మరో పార్టీవారు ,విభజన చేయండి అన్నవారే.తదుపరి చెట్టు కొకరు పుట్టకొకరు పదవులకు నిన్నటివరకూ తిట్టిన పార్టీల్లో ఇష్టానుసారం వెళ్ళి పోయినవారే.
   ఇటువంటి పరిస్థితుల్లో  కోతుల పోరు పిల్లి తీర్చిందన్న చందాన తలుపులు బిడా యించి మరీ అర్ధరాత్రి రాజకీయం చేసింది కాంగ్రెస్. అప్పటినుండీ పవెర్ లోకి వచ్చిన పోటుగాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకు పోతున్నామని.... గాణoకాల డేటలతో సహా చెబుతూ వచ్చారు. తెలుగు ప్రజలపై  అమిత ప్రేమ చూపించిన మాటల మరాఠీ శ్రీ వెంకయ్యనాయుడు లోకసభలో నిల్చుని ప్రత్యేక హోదా ,పొట్లం లాంటివి ఐదు కాదు పది సంవత్సరాలు అని గట్టిగా అరిచిన సందర్భాన్ని పురస్కరించుకుని, రెండు రాష్ట్రాల్లో ఎడతెరిపి సన్మానాలు , చేయించుకున్నారు... కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న సదరు వెంకయ్యనాయుడు గారికి . ... తెలివి తేటలకు మెచ్చి  ఉపరాష్ట్ర పతి హోదాతో పార్లమెంటుకు పరిమితం చేసిన బీజేపీ ఎత్తుగడ ,తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై గొడ్డలిపెట్టు. ఇది ఇలా ఉంటే చంద్రబాబుగారు మితిమీరిన కార్యసూరత తెచ్చి పెట్టింది అసలు ముసలం.... నేను లేకపోతే హైద్రాబాద్ లేదు, అమరావతి లేదు అనే "తీస్మార్ ఖాన్"ఉడతఊపులు....అటు టీడీపీ ఎంపీలు పార్లమెంటు ముందు చిడతల భజనచేయిస్తూనే ఉంది.
         అసలు పరిపాలన నిమిత్తం ఒక  రాష్ట్ర రాజధాని ఉండి ఏడిస్తే, తదుపరి ఆదాయ వనరులు లాభాలు, నష్టాలు జాగ్రత్తగా బేరీజు వేసుకుని ఒక మహనగరాన్ని తీర్చి దిద్దవచ్చు. ఆలూ సూలూ లేకండానే మంత్రులు సింగపూర్, మలేషి యా చందాన రాజధాని కట్టాలనే తప్పుడు ఆలోచనలో పడి, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టూర్లు వేసుకున్నారు... ఇక్కడ మంత్రుల్లో చాలావరకు ఘనులే.... విశాఖలో భూ కబ్జా, బ్యాంకు రుణాల ఎగవేత దారు, విద్యార్థుల తల్లితండ్రుల రక్తం ఫీజుల రూపంలో పీల్చే కార్పొరేట్ విద్యాజలగ,కోడిపందెల ఇసుక కోడి ఎం ఎల్ ఏ...ఇలా చెప్పుకొచ్చు..... "వృద్ధ నారీ ప్రతివ్రతః ",అన్న చందాన తన కోడలిని అతి హేయంగా చూసే ఘనులే గొప్ప సలహా దారు,మార్గ నిర్దేశకులు మరి రాజకీయం కలికాలంలో ఇలా మూడు పూలు ఆరు కాయలు గా అత్యంత దారుణంగా తగలడింది.
    పెద్ద హస్యాస్పదమైన తీరు యూ టర్న్.... నిన్నటివరకూ ప్యాకేజీ ముద్దు స్పెషల్ స్టేటస్ వద్దు అన్న వారే విజృంభించి పార్లమెంటులో, ఇటు రాష్ట్రంలో .....ఇవి వొద్దు అవే ముద్దు అంటూ "కావు... కావు...." అంటూ అరుస్తూ ఉన్నారు. ప్రజలు చేష్టలుడిగి దిక్కు తోచని స్థితిలో.... ఉన్నారనేది నిజం. ఇహ పోలవరం ప్రతిష్టకు పోయి తీవ్ర భంగపాటుకు  గురయ్యారు. ఒక సాధారణ బీజేపీ  ఎం ల్ ఏ తీవ్రంగా ఏకంగా ముఖ్యమంత్రిని రచ్చకీడ్చడం ఆంధ్రప్రదేశ్లో ప్రతీ ఆటో రీక్షవాలా కీ తెలిసిన విషయమే.....
ఇదే క్రమంలో....  ఒక పెరచుట్ ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు ముఖ్యమంత్రి ని కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల  పద్దుల లిస్టు అడగడం నవ్వు ఆపుకోలేక పోతున్నారు ప్రజలు.... మరి సదరు నటులు పద్దుల కాగితాలతో ఏంచేస్తుంటారో వారైనా చెబుతారా...?...స్వామీ.....! ముఖ్యమంత్రి గారివద్ద సమాధానాలు లేవు అనే విషయం చానెల్స్ పుణ్యమా అని అందరికీ తెలిసిపోయింది. సింగపూర్ రాజధాని జపాన్ రాజధాని లాంటివి 16000 కోట్లలోటు  బడ్జెట్ తో కొత్తకాపురం పెట్టిన ఆంధ్రప్రదేశ్ కు అవసరమా. వేల ఎకరాలు సమీకరించి ఎం ఒరిగింది. చంద్ర బాబు గారు వయసు మీద పడింది, ఇదివరకటి జ్ఞాపకశక్తి, పటుత్వం కోల్పోయారనేది అతని ...వైవిధ్యమైన స్టేటుమెంట్స్ లో ఇట్టే తెలిసిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో "వర్ధంతి, జయంతి"కి తేడా తెలియని ఫారిన్ చదువులు చదివిన మేధావుల భవిష్య్ ప్రణాళిక రీత్యా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ను ఉత్తర భారత రాజకీయాలకు తాకట్టు పెడతారా ? మహాశయ..
పిడికిలి మట్టి ,సీసాడు నీళ్లు తెచ్చినపుడే నిగ్గు తేల్చాలనిపించ లేదా ఆనాడు.... ఈ నాడు మోడీని ఏకిపారేయడం ఎం ? లాభం ...అర్ధరాత్రి కుట్రతో  కాంగ్రెస్  సిరీస్ డామేజ్1 చేస్తే...... చంద్రబాబు గారు అదే తప్పిదాన్ని  డామేజ్ 2 గా కొనసాగించారు. ఇటువంటి సంక్లిష్టమైన తప్పు .ఇహ పోతే సర్వ నాసనమైన  తరువాత అఖిల పక్షం పిలుపులు..... చంద్రబాబు తాను దేశంలోనే సీనియర్ మోస్ట్ ముఖ్య మంత్రి అని బాహాటంగానే చెబుతుంటారు(ఉండవల్లి ని అడిగితే సీనియారిటీ లిస్టు తెలుస్తుంది)మరి అటువంటి తెలివి తేటలు ఉన్న చంద్రబాబుగారు  సరయిన  ప్రయత్నాలే ఇవి ఒక్కసారి ఆలోచించండి....  నువు కాళ్ళు పట్టుకున్నావ్ అని ysrcp అంటే నూవు మరోటి పట్టుకున్నావ్ ! అనే ఉబుసుపోని ఛానెల్లో డిబేట్స్  చంద్రబుగారి దృష్టికి రావా...? అటువంటి ఎంపీ లను కట్టడి చేయరా  అధ్యక్షా  ? ఒకప్రక్క పార్టీ ప్రతిష్ట దిగజారుతూ ఉంటే ?....ఈరోజు దిన పత్రికల్లో మరో పిడుగులాంటి వార్త ..!....!..."రాజధానిని ప్రజలే కట్టుకోవాల్ట.....?..."అందుకు భారీ విరాళాలు ఇవ్వాలంటూ వినతి. తనేమో (ప్రభుత్వం)బాండ్లు ఇస్తారట.... ఇటువంటి అభ్యర్ధనలో భారీ మ్యాప్ డిసైన్ అవుతుందనేది చెప్పక నే చెప్పుకొంటున్నారు.... ఈ వార్తకు ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి....బహుశా చంద్రబాబు మిషన్ 2050 అయిఉండొచ్చు...తీసుకున్న డెపోసిట్స్ కు మరో పార్టీ గారెంటర్గా ప్రభుత్వం లో కొనసాగడం కష్టం..... చచ్చినట్లు టీడీపీ మాత్రమే జవాబుదారీ చేయాల్సి ఉంటుంది.... అటువంటప్పుడు చంద్రబాబు పార్టీలో మరొకరెవరైన ముఖ్యమంత్రి గా కొనసాగవచ్చు. ఒకవేళ ఒప్పోసిషన్ లో ఉంటే రూ లింగ్  పార్టీని ప్రజల బాండ్ లు ఎంకేషమేంట్ కు ఏకంగా ఉద్యమాలే చేసి మళ్ళీ పవర్ లోకి రావచ్చు.
      మొత్తానికి చంద్రబాబు క్రియా శీల రాజకీయం లోంచి చర మాంకానికి చేరుకుంటున్నారనేది ప్రజలకు అర్థమైపోయింది.చంద్రబాబు ప్రత్యేక హోదా వీగిపోయి,అస్త్ర సన్యాసం అవుతారండీ ! అనేది మరో చర్చా వాదన, టీడీపీ లో చంద్రబాబుగారి తదుపరి ఆస్థాయి నాయకులు లేరనేది యదార్ధం.... పైగా పార్టీ వాళ్ళూ, nri లు డెపోసిట్స్ చేస్తారేమో గాని మిగతా ప్రజలు డెపోసిట్స్ చేస్తారనేది కల.....
అంచేత అసెంబ్లీ రద్దు చేసుకుని ....మరలా ఎన్నికలకి పోతే కొన్నాళ్లయిన టీడీపీ ప్రజా సేవ చేయొచ్చు.....ఎందుకంటే చంద్రబాబు డెపోసిట్స్ తీసుకుని ఎదో చేస్తారనే నమ్మకం ప్రజలకు లేదట.....పార్టీ లో ఉంటే సరిపోదు.... ఇతర ప్రజలు, పార్టీల సంగతి సరేసరి..... మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర భవితవ్యం .....బెగ్గింగ్ బౌల్తో  "వీరముష్టి" గా ప్రజలు అభిప్రాయం

R p. మద్దూరి



.







..

No comments:

Post a Comment