totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Saturday, 25 May 2024

"నాగరికత అంటే ... ? "

..ఢిల్లీ నాగరీకానికి పెట్టింది
పేరు. ఢిల్లీ అనగానే ఒకగొప్పఫీలింగ్,తెలివిగలవాళ్ళు
విద్యాధికులు ఇలా మాoచి అభిప్రాయమే ఉండేది పూర్వo ...మరి ఈరోజుల్లో ఢిల్లీ పేరు మారుమ్రోగు తోoది. రాజకీయ నాయకులు... పొల్యూషన్... నేరాలు ఘోరాలు ... ఢిల్లీని సుందర మహానగరం గా
తీర్చిదిద్దుతాం... నిస్వార్ధం... నీతి.. కి మారుపేరుగా చేస్తూ,లoచగొండి తనాన్ని తుదముట్టిస్తాం అంటూ
చీపురు తీసుకుని ఒక పార్టీ బయలు దేరింది. ప్రజల అభిమానాన్ని చూరగొని, ఓట్లు దండుకుని,మ్మా కంటే పోటుగాళ్ళు లేరంటూ బహటమ్గాబిల్డప్ఇచ్చేసారు.
ఇదొక్క ప్పటి కధ. ఆపార్టీ తప్పితే మరో దారేది ? అన్నట్లు ...ఇతర పార్టీలు ...నాయకుల గౌరవం లేక
ఉండేవిధంగా ఢిల్లీ జనాల్ని తయారుచేసేసి,ఆనమ్మకం ముసుగులోకరిమింగినవెలగపండు"...చందాన,జేబులు, ఏకంగా సంచులు, గోతాలునిపుకోడం విచ్చలవిడి
తనానికి పరాకాష్ట .ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి ..కోట్లలో
మద్యపాన ముడుపులు, ఇతరరాష్ట్రాల ఎన్నికల కు
నేరుగా ఫండింగ్ ...దాకా చేరుకుంది"చీపురు"పార్టీ ...
ఇది ఇలా ఉంటే ...ఒక సాయంకాలం ..కేంద్ర ఆర్థిక శాఖ మాత్యులు శ్రీమతి. విమలా సీతారామన్ మందీ
మార్బలంతో ..లోకలు రైలు ఎక్కారు...ఎటువంటి హడావుడి లేకుండా ...సర్వ సాధారణ క్లాసులో ఎక్కేరు ... ఈక్రమంలో ఆవిడ రైలు ఆఫీషియల్ ను
ప్రభావితం చేయక ...మామూలు ప్రయాణికుల వలే
ప్రయాణిస్తున్న చిత్రం ఇక్కడ చూడొచ్చు. కనీస సావు
దానం చూపని ప్రయాణికులు ..ముఖ్యంగా,మగవారు
కనీసం ఆవిడకు ..అడమనిషిగా నైనా గౌరవంచూపక
నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని ఉండడం ఢిల్లీ వాళ్ళకే
చెల్లింది .కనీసం ఆమె వయసుకు, పెద్దతనానికి ఒక 
చిన్నపాటి గౌరవం చూపక పోవడం ముదావాహం .. ..ఇక్కడ ప్రజల్ని చీపురు పార్టీ నేతలువారిభావజాలం
తో ప్రభావితం చేసారన్నమాట ! 
           నాకు తెలిసిన ...పరకాల. విమలా సీతారామన్  మృదు స్వభావి ...అవసరమైతే, మూర్ఖుల్ని తిట్టకుండా ...చక్కని భాషా శైలి లో గడ్డి
చక్కగా పెట్టేస్తారు .మిత్రులు శ్రీ.పరకాల ప్రభాకర్ గారికంటే ధీటు గా మాట్లాడగలిగిన చైతన్యం శైలి ఆవిడ ది. ఒక దేశ కేంద్ర మంత్రి గా వుంటూ ...అపర భద్రకాళి లా .... కొమ్ములు తిరిగిన ప్రతిపక్షాల ను ఎదుర్కొనే పటిమ ఆవిడకు ఒక ఆభరణం అనడం లో అతిశయోక్తి లేదు సుమా !
 ఒకప్రక్క కుటుంబ బాధ్యతలు... మరోప్రక్క ముళ్ళకిరీటం .. లాంటి పదవి కే వన్నె తెస్తున్న మహిళ ఆవిడ ...తన నిరడంబర జీవన శైలికి మచ్చుతునక ఈ చిత్రం. ఆమె లోని స్వచ్ఛత...
రాజకీయ పటిమకు ...చంద్రునికి ఓ నూలు పోగు ...ఈ బ్లాగు .


రవిబాబు. మద్దూరి

No comments:

Post a Comment