totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Thursday, 9 May 2024

                                                                                                                                                                ఈదేశం కోసం మరోసారి పుట్టండి
            ************0**************
              

మన దేశ ప్రధానుల గురించి చెప్పుకు పోవాలంటే, ఎంత అయినా చెప్పుకు పోవచ్చు .... ప్రపంచ నాయకుల కు పోల్చాలంటే, స్వాతంత్ర్య సమర గాథల్లో  వెలుగు చూడని, నోచుకోని మహాను బావులు ఎందరో ?... ఇతరదేశస్తులు వారి లోని ప్రతిభ పాటవాలు ఉన్న మేధావుల జ్ఞాపకాలను పదిలపరుచుకోడంలో ఎటువంటి పొరబాటు చేయరు . మన  దేశ గ్రహపాటు ... అటువంటి వ్యవస్థ పెద్దగా లేకపోయినప్పటికీ .. కుల ,మత , రాజకీయాలకు బలయి వారి తాలూకు గొప్పదనాన్ని పదిలపరచలేని ,వ్యక్తిత్వం , తత్వం ముసుగులో భారత దేశం లో గొప్ప నాయకులు, వారి త్యాగాలు కనుమరుగయి పోయాయి . కనీసం వారి మరణానంతరం కూడా వారిని,  మన ముస్తిష్కపు పోరాల్లో దాచుకోలేని  పరిస్థితులను ఇప్పటి  రాజకీయ నాగరికత పరిఢ  విల్లుతుందంటే ఆశ్చర్యం లేదు                                                                                 భారత దేశం గర్వించ దగ్గ ప్రధానులలో అగ్రగణ్యులు మన "లాల్ బహదూర్ శాస్త్రీ " గారు అని చెప్పక తప్పదు .... ప్రధాని అవడానికి దేశవిభజన కారకుడయిన .ప్రధాని ఒకరైతే ... దేశములోని ప్రజల భావాలను, గాంధేయవాదులయిన నాయకుల పీచమణచడానికే :" అత్యవసర ", పరిస్థితి అవలంభించినవారు మారోరు .... ఇహపోతే .... తనవంతు ఉపన్యాస సమయం వచ్చేవరకు , ఉపన్యాస అనంతరం కునుకు తీసే ప్రధాని మరొకరు ... ఇలా ఎంతయినా చెప్పుకోవచ్చు .                                                                                                                                                             భారతభారత దేశం అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నపుడు , తనరాజకీయ చతురతతో కొదమ సింహంలా ... శత్రు దేశాల వెన్నులో చలిపుట్టించి, గుండెల్లో రయిళ్ళు పరుగెత్తించింది మాత్రం  శ్రీ. లాల్ బహుదూర్ శాస్త్రి గారు ఒక్కరే ... అతని కను సైగతోనే అత్యంత ప్రభావ శీలురైన వారు మన భారత జవానులు . పాకిస్తాను వారు మన సైనికులపై చేసిన మెరుపుదాడి దీటుగా, భారత సైన్య వ్యవస్థను  అత్యంత  ప్రభావితం చేసి ఒక్క ఉదుటున లాహోర్ వరకు మన నియంత్రణలోకి తెచ్చిన చైతన్య మూర్తి శ్రీ.లాల్ బహుదూర్ శాస్త్రి జి  భారతదేశం లో కాశ్మీర్ అంతర్భాగమని బల్ల గుద్ది వాదించిన మహా నాయకుడు ఆయన .                                                1960  దశకంలో మన దేశంలో కొద్దిమేర బలంగానే "గోధుమ " కొరత ఉండేది అని పెద్దవారు చెప్పేవారు .సాధారణంగా ఉత్తరభారత దేశం,పశ్చిమంలో అంతటా, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నిచోట్ల గోధుమలు ప్రధాన ఆహారం . ఆ రోజుల్లో no  : 480 నాసిరకమైన గోధుమలు మనం అమెరికా దేశం నుండి దిగుమతి చేసుకునేవారం . అమెరికా లో ని పశువులకు కూడా దాణాగా బహుశా పనికి వచ్చేవికావట ... అటువంటి గోధుమలు మన ప్రజలు తినేందుకు దిగుమతి ఒప్పందాలు శాస్త్రీ జి  ప్రధాని కాకముందే జరిగాయి .   వాటిని ఎలాగయినా నిషేధించాలని బహుశా శాస్త్రీజీ మనసులో ఉంది ఉండ వచ్చు . తగుసమయంకోసం వారు ఎదురు చూస్తూన్నారట . అమెరికా చైనాలు పాకిస్తానుకు కొమ్ము కాస్తూ ఉంటారనే విషయం అప్పట్లో పసిపిల్లలను అడిగినా చెప్పేవారట.                                                                                                                                                                                                    మనకు పాకిస్తానుకు  శాస్త్రీజీ ప్రధాని గ ఉన్నప్పుడు మొదలయింది . ప్రధాని చేసే ఉపన్యాసాలకు ఉత్తేజాతులైన ఆప్పటి   సైన్యం కరాచీని కూడా ఆక్రమించాయి . పాకిస్తాను చిత్తూ గ భరత్ చేతిలో ఓడింది . కాశ్మీర్ మాది అని వాదించే,  చెప్పుకునే పాకిస్తాన్,  కాశ్మీర్ అటుంచి బెలూచిస్తాన్ కరాచీవరకు ఓడిపోయింది . భారత్లో కలుపుకునేందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి . పాకిస్తాన్ కాళ్లావేళ్లా పడుతుంది  అయినా , శాస్త్రీజిలో ఎటువంటి దయ ,మార్పులేదు "జైజవాన్..జైకిసాన్ " అన్న నినాదం భారత్ లో   ఘంటారవంలా ప్రతీ మారు మూల గ్రామాల్లో సుప్రభాతంలా చెప్పుకునేవారు . పాకిస్తాన్ అమెరికా కళ్ళు పెట్టుకోడం చేత .... అమెరికా కొన్ని కుయుక్తులు పన్నింది . మనకు దిగుమతి చేసే 480 రకపు గోధుమలు దిగుమతి   ఆపివేయడానికి  గాను మన ప్రధానిని "వార్నింగ్ " ఇచ్చింది అమెరికా .... తక్షణమే ఆపివేయండి అని , అవి తినేందుకు భారత ప్రజలు పశువులుకారు  అని మరీ చెప్పారు శాస్త్రీజీ . అమెరికా నుండి గతం లో చేసుకున్నద్వ్యపాక్షిక  ఆర్ధిక ఒప్పందాలు  .... అమెరికా రద్దుచేయడం వలన ... కొన్ని ఇబ్బందులు భారత్కు ఎదురైనాయి . శాస్త్రీజీ మన ప్రజల నుద్దేశించి అత్యవసర  ఆర్ధిక నిబంధనలమేర ..... మన గృహాల్లో పొదుపు చేసుకోవాలని సూచించారు.... ఆ పొదుపు ఉద్యమం తనతోటె ప్రారంభించిన... నిరాడంబరుడు ఆయన . తన ఇంటిలో లో పాచిపని చేయడానికొచ్చే .. పనిమనిషిని ఆపుచేయించి .. తన పిల్లలకు .. ఎవెర్య్ పని వారే చేసుకునేట్లు మార్గం నిర్దేసించారు ... తన ఆఫీసు గది  తానే ఊడ్చుకునేవారు .చెప్పకూడని విషయం మీ దృష్ఠికితేక తప్పదు . ఎందుకంటే ఆటను ఎంత కార్యద్రష్ట , నిరాడంబరుడు , పట్టుదల కలిగిన వ్యక్తి అనేందుకు చెప్పవలసి వస్తున్నది . శ్రీమతి . లలితా శాస్త్రి గారు , తీవ్ర అనారోగ్యం తో బాధపడుతూ .. కొన్ని పనులు తనవి తాను చేసుకోలేని స్థితి లో ఉండేవారు . చివరకు  ఆమె మైల దుస్తులను , ఉతికే మనిషిని , తాను తీసినందుకు , భార్యకు ఇబ్బందికలగకుండటానికి  వారే శ్రీమతి దుస్తులు ఉతికిన .... నైతికత మనం ఏదేశంలోనూ, ముఖ్యంగా మనదేశం లోనూ చూశామా ? విన్నామా ? .. ఇంతటి పట్టుదల గలిగినవారు శాస్త్రీజీ ....                                                                                                                                                            ఆర్ధిక మాంద్యం , ఆహార ధాన్యాల కొరత వల్ల యావత్ భారతావని  వారానికి  "ఒకరోజు ఉపవాసం ",  కొరకు తాను పిలుపునిచ్చారు . ప్రతీ భారత పౌరుడు ఆ పిలుపును శిరోధార్యం చేసిన విధానమే యావత్ భారత జాతి చేసిన సోమవారం ఉపవాసం . ఆ ప్రక్రియవల్ల  ఎన్నో ఆహారధాన్యాలు కుప్పలు తెప్పలుగా పెరగసాగాయి . ఇంతటి పట్టుదల , బుద్ధికుశలత గల    వ్యక్తిని అణచడం  'గగనం " గ కన్పించింది అమెరికాకు . ఓప్రక్క పాకిస్తాను అమెరికా కాళ్ళు పట్టుకుని విడవనంటుంది.  అమెరికా పెద్దన్న పాత్ర వలన ఒడంబడికను "తాష్ కంట్ " వేదికగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది అమెరికా . ఒక ప్రక్క రష్యా మన మిత్ర దేశం అయినప్పటికినీ  ,అమెరికా ,వాటి మిత్ర దేశాలు ఒక్క ఉమ్మడిగా శాస్త్రీజీ ని .... భారత్ ఆక్రమించిన పాకిస్తాన్ భూభాగం వెనుకకు ఇచ్చేట్లు సంతకం చేయించాయి .  తాను తిరుగు ప్రయాణం కు సంసిద్ధుడవుతున్నట్లు వార్తలు వచ్చాయి  .. ఇంతలోనే శాస్త్రీజీ గుండెపోటుతో మరణించినట్లు మనకు పిడుగు లాంటి వార్త . ....                                                                                     శవమై తిరిగొచ్చారు ఆయన . అతని ఫామిలీ డాక్టర్  , శవాన్ని  పరీక్ష చేయనీయలేదు .  పోస్టుమొర్టం చేయలేదు . చివరిగా శ్రీమతి . లలితా శాస్త్రీజీ ని చూడనిచ్చారు , ఆమె శరీరాన్ని చూసి నిర్ఘాంత పోయారట. శరీరం మొత్తం నీలి రంగులో ఉన్నదట .                                                                                                                                                 ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నలు :                                                1. శాస్త్రీజీ పెర్సొనెల్ డాక్టర్ను ...శవాన్ని ఎందుకు ? పరీక్షకు అనుమతించలేదు                                      2. శాస్త్రీజీ కి  రక్త చాపము గాని ,కెలొస్త్రోల్ గానీ లేవు .... హృద్రోగ పరీక్షల్లో ముందెన్నడూ ఎటువంటి  రిమార్కులు లేవు , సంపూర్ణ ఆరోగ్యి .... 3. శరీరం నీలి రంగు కు మారడానికి కారణం  ? 4. శాస్త్రీజీ( సాధారణంగా తనవంట తాను చేసుకునేవారట , ఇల్లు వదలి టూర్ వేయాల్సి వచ్చినప్పుడు ఏదేశమెళ్లినా , తన వంటవాని వట మాత్రమే తినేవారట ).. తన వంట వానిని తాష్కంట్ లో 

No comments:

Post a Comment