totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Wednesday, 8 May 2024

            "నేర"శ్రమా!ఓ పరిశ్రమే.        ................            

కొద్దిగ కన్ఫ్యూషన్ లో ఉంది కదూ ?...! మన టైటిల్. అందుకు వివరణా ఉందనుకోండి. నేరం చేసే మహానుభావులు..."చీమా చీమా !ఎందుకు కుట్టావ్" అంటే...ఇచ్చిన సమాధానంలా ఉంటుంది ఇచ్చే సూటబుల్ జవాబు. ఇక్కడ నేరంచేసేవాళ్ళను
నేరగాళ్లు అంటాం... అలాగే... వాళ్ళను సంఘం తయారుచేస్తే, ....వాళ్లకు శిక్షలు వేగవo తంగా పడతాయి.... కానీ సాక్షాత్తు ప్రభుత్వo చే చేయబడిన నేరగాళ్లకు...శ్రీరామరక్షలా ఎప్పటికప్పుడు తప్పించుకునే మార్గాలు కో కొల్లలు. పైగా సవత్సరాలు తరబడి విషయాలు బయటికే రావు.
ఉదాహరణకు : హర్షద్ మెహతా... మాల్యా... జయలలిత, శశికళ...100ల సంఖ్యలో ప్రభుత్వాధికారులూ... గట్రా గట్రా..... ఇలా బహుకొద్ది మంది.... అక్రమ ఆర్జన ఒక ఎత్తయితే, ఏకంగా దేశ ఆర్థిక పరిస్థితినే శాసించే వ్యాపార లావాదేవీల తాలూకు లొసుగులు.
నా చిన్నతనంలో... ఒక వ్యక్తిని... చెట్టుకు కట్టి చితకబాదడం చూసాను. కారణం ఆదొంగ... వాడి భార్య ప్రసవిస్తే దాన్ని బిడ్డనూ ఏవో ఇంజుక్షన్లకు డాక్టర్ రుసముకు ఓ 20 రూపాయల మోయనం వాడి దగ్గర లేపోడం, వృత్తి దొంగతనం కావడం.... అలాగే అదే ఊరిలో ఓ పేద్ద డాక్టర్... కడుపులో అల్సర్ ఆపరేషన్ చేసి సదరు పేషెంట్ గారి కుడి ప్రక్క మూత్రపిండం కాజేసి లక్షల్లో మరొరికి వేరేదేశం లో అమ్మేశాడు. అల్సర్ రోగి కడుపునొప్పి తగ్గటం అటుంచి, పాపం అతనికి ఉచిత కిడ్నీ ఆపరేషన్ సదరు డాక్టర్ ..చేసినట్లు తెలుసుకోడానికి 6 నెలలు పట్టింది.
ఇదిగో విద్యావంతులు అధిక  తెలివితేటలు కలిగిన మేధావులు
అప్పుడప్పుడూ ఇలాదొరకుతూంటారు... మరి వాళ్ళకి శిక్షలు పడవుకదా!.ఇక్కడ ప్రభుత్వం నెరగాళ్లను తయారుచేసే ఒక కర్మాగారంగా చెప్పుకోక తప్పదు. వెనుక మాకు తెలిసిన కమిషన్డ్ ఆఫీసరు గారు ఒకతను ఉండేవాడు. అతను తన డిపార్ట్మెంట్ లో చేరే సమయానికి...4 జతల బట్టలూ, ఒక పెంకుటిల్లు కొద్దిగా పొలంలో పెద్ద ఫ్యామిలీ తో వచ్చాడు. అతని మామ సేల్ టాక్స్ డేపర్ట్మెంట్లో పెద్ద స్టేటస్.(చెప్పేదేముంది)...ఘనంగానే కట్Nఆకానుకలు ఇచ్చేరు. మనోడు తన ప్రతిభను చూవించిన తీరు బట్టి15 సంవత్సరాల్లో హీనపక్షంగా 4 కోట్లు      సునాయాసంగా వెనుకేశాడు. అతను రిటైర్మెంట్ టైం కు సుమారు50 కోట్లు చేరుకుంటాడు. ఒకప్రక్క విజిలెన్స్, ఆంటీ కరప్షన్, ఇత్యాది డేపర్ట్మెంట్ల మధ్యలోనే... ఉంటూ మరీ సంపా
దీస్తే ప్రభుత్వం కారణం గాక మరొటుం దా...?అక్కడ చిన్న తప్పుకు, సవత్సరాలు ఇంక్రిమెంట్లు పోగొట్టుకుని బ్రతుకుబండిని కష్టంగా లాక్కెళ్లే వాళ్ళ గురించి ఎవరాలోచిస్తారు?
ఒక gm ట్రాన్స్ఫర్ అవుతూ మరో విభా గానికి పదోన్నతిలో వేడుతూంటే... ఛోటామోటా అధికారులు ఓ. మోస్తరు ఇనుప పెట్టెలు అన్నీ తాళం వేసినవి కనీసం...25 రైల్లో ఎక్కించారు(సూటికేసులూ, మిగతా సామానులు వేరే ఉండగా)
మరోడు పదవీ విరమణ అనంతరం... ఏకంగా అదే బంగాళాను 2 నెలలు వాడుకుని పూవులూ చెట్ల కాయలూ తో సహా ఏరోజుకారోజు డ్రైవర్లతో తెంపుకుని... అదే ఊర్లో వాడుకట్టు కుంటున్న సొంత బంగాలకి మోయించుకునే వాడు... ఈ ఇదిగో ఇటువంటివాళ్ళు ప్రభుత్వపు తయారీ దారులయిన నేరగాళ్లు కారా?.....!
ఇహ బ్యాంకులకొస్తే అక్కడ అప్పు దొంగలకు... లోను తరువాత పెర్సెంటే జి ...ఈ పెర్సెంటే జ్ ఎప్పుడు నాశనం అవుతుందో ? కానీ.... మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థ బడాబాబుల లోగిళ్ళలో నగ్నంగా బందీ ఎప్పుడో అయ్యింది. పేదోడి బర్రెనో ?గొర్రెనో? కొనుక్కోవలంటే అప్పు పుట్ట దు. కానీ బడాబాబుల 10 లక్షల వికువచేసే భూమి ఏకంగా 5 కోట్లు పుడుతుంది.... ఇదిగో ఇటువంటివి.... కోకొల్లలు బ్యాంకింగ్ రంగంలో. కొన్ని కేసుల్లో అసలు తప్పుడు లేక ఫేక్ దస్తావేజులతో కోట్ల ప్రజాధనం గయ్ !
వీటిమీద క్షుణ్ణంగా అధ్యయనం చేయలేని ప్రభుత్వాలు పౌరుల జీవితాలతో భవిష్యత్తు తో చేలాగాటమాడుతున్నాయ్..... అందుకే ఈదేశంలో విప్లవం ఎప్పుడయినా రావొచ్చు చెప్పలేం.... జనం ప్రభత్వ విధానాలు క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు.... మరి ప్రభుత్వాలు ఇలా తగలడితే దేశమే ఓ దొంగల కర్మాగారంలా తయారవుతుంది. మొన్నటికిమొన్నా గోరఖ్పూర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సప్లై లేక ఆపరేషన్ బెడ్డుమీద ఇద్దరి చిన్నారుల జవాలు... హరీ మని గాల్లో కలిసాయి. కారణం నోడల్ ఆఫీసర్ అయిన చీఫ్ ....సిలెండరులను ఎప్పటికప్పుడు ...తన ప్రైవేట్ హాస్పటలి రోగుకులకు వా డడమే కారణం.....
 ఒక ప్రక్క దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో కొత్తిమిట్టాడుతూఉంటే, ఇటీవల రైళ్ల ప్రమాదాలు తీవ్రమైనవి.... కారణం ఆ శాఖల్లో క్రిందితరగతి ఉద్యోగులు కుక్కల్లా ఎద్దు చాకిరీ చేస్తూంటే ....పెద్దనుండి మరీ హై పోషన్ వరకూ, ఆ మినిస్టర్ వరకూ ట్వీట్లు కొడుతూ ఉండే డ్యూటీలు ఎక్కువ ిినవి..... సాఫ్ట్.... సేఫ్టీ సన్నగిల్లింది.... ప్రతీఒడూ ఆఫీసుల్లో చలువ గదుల్లో కూర్చుని ట్వీట్లు వాట్సాప్ లు కొడుతూ కనిపిస్తూన్నారు....
మరో గొప్ప సంప్రదాయం వేళ్లూనుకుంది మన భారతావనిలో... అదెట్లా ?అంటే....పార్టీలకు భజనచేసే పత్రిక లెలాగో అదే తంతులో భజన ఛానళ్లు.... ప్రతీ క్యాబినెట్లల్లో ఇటు రాష్ట్రం అటు పార్లమెంట్లో.... స్వంత ఛానెల్లూ, స్వంత ప్రెస్సులు.... ఒకదినోకడు దుయ్యబట్టుకోడం... అదే పంథా పార్టీ పరంగా జనాలు బలయ్యేట్లు ఎప్పటికప్పుడు చూసుకోడం, తరించడం.... మీకుతెలుసా? మనదేశంలో ఓ అధికార పార్టీ ఉపఎన్నికల్లో ఒడిపోయిందా..... వెళ్ళమీద లెక్కెట్టొచ్చు....

ఈ పంధాలు మార్పులేకపోతే... ఘనమైన భారతదేశం.... అనతికాలంలోనే నేరుగా నేర మయం అయి తీరుతుంది....
రవిబాబు. మద్దూరి



No comments:

Post a Comment