''
డా ల ర్ '' మూలం మిదమ్ ! జగత్ ధనమే ఈ జగత్తు లో అన్నింటికీ మూలం అన్న నా నుడి కొన్నిసార్లు నిజం అనిపించక తప్పదు . సభ్య సమాజం లో డబ్బు కోసం జరిగే అకృత్యాలు,అరాచకాలు చూస్తూ ఉంటె ! మనం ఇంకా రాతి యుగం మానవత్వం తో కలియుగమ్ లో ఉన్నా మనిపించక తప్పదు . తల్లి తండ్రులు దేవతలన్న భావన నశించి ఒక దశాబ్ద కాలం కావస్తున్నది . అన్నదమ్ములు ... అక్కచెల్లెళ్ళు ... అన్న జంట పదాల్ని మన తెలుగు భాషలో .... తల్లి.. తండ్రి ..... అక్క ....... చెల్లెలు .................... అన్న .... తమ్ముడు అనే ఏక పదాలుగా మార్చుకోవడం అత్యవసరం అన్నట్లు కనిపిస్తున్నది . ఉదాహరణకు న్యాయ స్థానాల్లో వాయిదాల కేసుల్ని చూస్తే ఇహ వివాహం .. హై ...టెక్ పుణ్యామా అని .... అర్ధమే మారిపోయింది . అందుకు కారణం లేక పోలేదు . ఇక్కడ చదువులు పనికొస్తాయి గాని, ఇక్కడి ఉద్యోగాలు పనికి రావు . ఇక్కడి రూపాయి ఏకంగా తన పాపాయిల్ని ఇతరదేశాల్లో ప్రసవిస్తుంది . చుట్టం చూపుగా రెండు సవత్సరాల కో సారి ఇండియా వచ్చి పలకరించే,పిలుపు కు పులకరిస్తున్న బంధు గణం ... తాలూకు ఆశ్చర్యానికి, డాలెర్ల ఎంగిలి చేయి విదిలిస్తూ ... ఎంచక్కా తిరుగు టపాలో యూ ఎస్ పయనమయి పోతున్నది యువతరం . మరి నాగరి కతో ?.... మెలితిరిగిన కుక్క తోకలా మొరాయించిన సంకరజాతి భాష తో, వీడియొ చాట్లు చేస్తుంటే, తాజా వంట చేసుకునే టైం లేక సద్దికూర్ల పెట్టె లోంచి తీసిన సాంబారు ... రసం ... పులుసు ...'' ఓవను'' అనబడే కరెంటు డబ్బాలో మరిన్ని సార్లు వేడిచేసి మరీ తింటున్నది పెద్దతనం . యూయ స్ నుండి యెమ అర్జెంటు పిలుపు ... తీరికలేని సమయం లోనే ఫ్లైట్ టికెట్ తో సహా పెద్దవారికి పిలుపు . జీవితం లో రైల్లో ఏ సి కూడా ఎక్కాలని ప్రయత్ని0 చి .. అభాసు పాలయిన పెద్దవారికి ఫ్లైట్ టికెట్ ఓ జాక్ పాట్ ..... మురిసిపోయి మరీ ...పిండి వంటలూ ...పచ్చళ్ళతో ... మూటా ముల్లి సర్దుకొని .... కక్కుర్తి రాబందు జనం తో క్యాబ్లో శంషాబాదు కు క్రిక్కిర్సి ప్రయాణం . తీరా అమెరికా వెళ్ళిన ఐదు నెలలకు గాని అర్ధం కాదు .... మనం అక్కడి కి వెళ్ళింది .... క్రొత్తగా ప్రపంచం లో పడ్డ తమ రక్తపు, చిరు "బ్రెడ్లు " కడగ డానికి అని .ఎందుకంటె అక్కడ నర్సింగ్ జీతం ఇక్కడి కల్లెక్టర్ల జీతానికి సమం , ఇది హై టెక్కు వరస ...... కాని వివాహబంధం మన భారత దేశం లో ఉన్నంత బలం మరే దేశం లోలేదట . కాని అక్కడి పార్టనర్ ... మరో పార్టనర్ కోసం ..... వెతకడం తప్పుకాదు . దుస్తులు చంకల్లోని వెంట్రుకలు కనిపి స్తే మోడరన్ లుక్ . మోకాళ్ళ పైకి గౌను ఉంటె భేష్ . కొద్దిగా ఇబ్బంది పడే ఆడ ... జీన్స్ తో కవర్ . అదీ కల్చర్,ఇక్కడ కు దిగుమతి అయ్యింది ..... కాలేజీ లలో ... యూనివర్సిటీ లో గ్రూపులు ఈ అవతారాలతో చూడొచ్చు .... అంటే యూ ఎస్ కు ముందునుండే ఇక్కడ నుండే ...ప్రేపరషన్ అన్న మాట ... కాదు ఉన్న మాట .... పైగా చీరకట్టు కోవాలంటే విద్యాలయాల్లో ఫాషన్ పెరేడ్ ఉంది తీరాలి . ఇటువంటి సమాజం లో మనం ఉన్నాం ... ఈ నాగరికత ఇంకెన్ని సవత్సరాలు మానభంగం అవుతుందో కదా . ... ??....!!! మన నాగరి కాన్ని పూర్తి స్థాయి లో వస్త్రాపహరణం చెయ్య క ముందే మన హైందవ జాతి మేల్కొడం ఎంతయినా అవుసరం .... లేకపోతే ఒక గోచి ముక్క అందివ్వడానికి ప్రక్క వాడి దగ్గర ఏమి ఉండదు గనుక . మద్దూరి. రవి బాబు . 
No comments:
Post a Comment