బాధ గురువులు అనగనగ ఒక ఊరు,ఆ ఊళ్ళో ఒక మునిసిపల్ హైస్కూల్ ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉండేవి . ఎందరో దేవతల్లా ఉండే టీచెరులు . ఉదాహరణకు ఆరవ తరగతి చదివేప్పుడు శ్రీ .దుర్గాచారి మాస్టారు తెలుగు పాటం చెబితూ ఉంటే మనస్సుకు మరల పాటం,చదవ వలసిన అవుసరం ఉండదు . అలానే మరో మాస్టారు తెలుగు చెబుతూ ఉంటే, ఎంత తొందరగా పీరియడ్ అవుతుందా అని బిక్క చచ్చేవాళ్ళం . పైగా ఆ మాస్టారు తన జేబు లోంచి ఒక పది పైసల నాణెం ఇచ్చి తనకు నచ్చిన వివిద్యార్ధి కి ఇచ్చి '' ఓ రేయ ! గొట్టం ..... పుల్లారావు కొట్లో బోషడాలు తీస్కురా ! అనే వారు .... ఆయన పరి భాషలో " బటానీలు " అని అర్ధం " అప్పుడప్పుడు పీరియడ్ కు క్లాస్ మాస్టర్ రానప్పుడు, ఒక తెలుగు మాస్టర్ వస్తూండే వారు . అతని పేరు చొప్పరం రామస్వామి . పాటం చెప్పడం అటుంచి, తెల్ల కాగితం లేక రూళ్ళ కాగితం గాని ఒక్కటి ఇస్తేలాస్ట్ పీరియడ్ గనుక ఏకంగా ఇంటికి వెళ్ళ మనీ సెలవిచ్చేవారు . మేం తక్కువతిన్నామా ? పోటీలు పడి నోట్ బుక్స్ లో చింపి ఇచ్చే వాళ్ళం ..
అలా తొమ్మిదో తరగతి వరకు వచ్చాం . ఇహ తొమ్మిదో తరగతి వరకు తిట్లు తినకుండా ఆడుతూ పాడుతూ చదివే వాళ్ళం , అసలు కష్టాలు ఆ తరగతి లో ,నేచవి చూశాను, ఒక బాధ గురువుగురువు గూర్చి చెప్పే ముందు .ఒక తమాషా మాస్టారు గురించి చెప్పాల్సిందే !..... అతని పేరు చెప్పను కాని అతని డయిలోగ్స్ చెబుతాను . ఆ మాస్టారు గారు ఎవడిని పడితే వాడిని "కూస్సోరై పషువా .... !" "తలకాయ్ లేనోడా !! ".... మరోప్పుడు "ఆడంగి రేకి మాటలు సేప్పోద్దురై " అంటూ ఘంటాపదం గా భయపెట్టే వారు . బోధ గురువులుగా ముసలయ్య హెచ్ ఎం గారు ,మస్తాన్ రావు గారు ,ఎన్ ఎస్ కే లాంటివారిని మరువలేము .వీరు అంతా ఆణి ముత్యాల్లాంటి వారు . ఆరోజుల్లో ఆటల గురించి పీరియడ్ లు ఉండేవి . ncc .. airwing ..navy లు ఉండేవి . ఎవ్వరికి ఇష్టమైన ట్రూప్ లో వాళ్ళు చేరొచ్చు . డ్రిల్ పీరియడ్ తప్పని సరి. ఇహ మాస్డ్రిల్ చేయించే వారు ప్రతీ శనివారం . అప్పుడు కొన్ని కోతి చేష్టలు చేసే వారిని పట్టుకో లేక డ్రిల్ మాస్టర్స్ తల ప్రాణం తోక్కొచ్చేది . అప్పటి సమకాలికులు అందరికి ఇప్పటికీ గురుతుండాలి బహుశా ...!! తొమ్మిదో తరగతి నా జీవితం లో ఎన్నో అవమానాల్ని ఇప్పటికీ గురుతు చేస్తుంది . మాకు సామాన్య శాస్త్రం క్లాసు కు "పానకాలు " అనే వచ్చేవారు . ఆరోజుల్లో మాస్టర్ల జీతాలు అరాకొరగా ఉండవి పైగా మినిమం ముగ్గురు పిల్లలనుండి ఐదుగురు పిల్లలు ఉండటం ఆనవాయితీ . కొన్ని టూషన్ చెబితే పిల్లల ఫీజులకు సరిపోయేవి . అంచేత కొంతమంది ఉపాధ్యాయులు ఆపని చేసే వారు స్కూల్ తదుపరి టైం లో . నాఖర్మకు సదరు "నకాలు" మాస్టర్ గారి కన్ను నా ఫై బడింది . వారు ప్రతీ రోజూ క్లాసు లో," సామాన్య శాస్త్రం రికార్డు కొన్నావా?"అని ఒక కార్యాక్రమం క్రింద పెట్టుకుని నన్ను అడగడం "కొనలేదని",చెప్పడం ఒక భాగమయి పోయింది . ఇంట్లో,అమ్మ నాన్న"అప్పుడు కొందాం" .... ..".తరువాత కొందాం".... అంటూ తాత్సారం చేయడం వలన ... మాస్టర్ గారి టూషన్ చేరనందుకు వెరసి ........ శిక్షగా, శ్రీ మాస్టర్ గారు నా పేరు విత్ హెల్డ్ లో పెట్టారు . రికార్డు వర్క్ చేయనిదానికి ..గాను మాస్టర్ గారు ప్రసాదించిన వరం . ఆ సవత్సరం పొడుగూన, తిట్టిన.... తిట్ల మంగళహారతులు మా అమ్మ పెడుతూ, ఉండే వారు ..... ఆసవత్సరం ప్రత్యక్ష నరకం చవి చూశాను . ఆరోజుల్లో తప్పిన వాళ్ళను అత్యంత హేయం గా చూసే వారు . (ఈయన్ని బాధ గురుగారు అనొచ్చా ?...!! ) కాలేజీ వెళ్ళాక, కొత్త డ్రేస్సులూ ..... కొత్త సైకిల్ ఎటుతిదిగి కొన్నారు (లేక పొతే జోరీగ లా ప్రాణం తింటాం కదా ?)... మనకి కొమ్ములు సహజం .... కొత్త స్నేహితులూ, గాళ్ క్లాసు మీట్స్ ... ఏందో సిగ్గు ... మరోప్రక్క ఏదో సాధించినంత .... ఆ ఏజ్ అటువంటిది ........... కాలేజీ లో బాధ గురువులే ఎక్కువ . మొదటి సవత్సరం ముగింపు హాయిగానే జరిగింది . కాని ఇంగ్లీష్ లెక్చరర్ ,m r. కక్కుర్తి గారుండే వారు స్పేస్ షేటిల్ లాంటి పొడవయిన లామ్బ్రెట్ట స్కూటర్ తో దర్శనం ఇస్తూ ఉండే వారు . తనవద్ద టూషన్ చేరమని నా స్నేహితుని ద్వారా కబురంపించాడు ...... తెలుగు ... ఇంగ్లీష్ ఎంతో ఇష్టమైన , కష్టం గాని సబ్జక్ట్స్ నాకు . పెద్దగా చదవాల్సిన అవుసరం ఉండే ది కాదు . వేరే సబ్జక్ట్స్ చదవడం తప్పనిసరి . నేను పెద్దగా పట్టించుకోలేదు ....తను నన్ను క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీలో నన్ను ఫెయిల్ చేయడానికి చేసిన ప్రయత్నం ఇప్పటికీ మరువలెం ....... కాని, అప్పట్లో టీచర్స్ కు విద్యార్ధి కి మధ్య ఎటువంటి విబెధాలు ఉండేవి కావు చాలావరకు ........... కాని ఇప్పటి విద్యా విధానం ఒక వ్యాపారం ...... బూతులు తిట్టే స్టూడెంట్స్ తో వీళ్ళు చాలా బావుంటారు, కాని సిన్సియర్ స్టూడెంట్ దగ్గర విన్యాసాలు చేస్తుంటారు .. అప్పటి అమ్మాయిలూ నమ్రత ..సమత .... మంచి నడవడి కలిగి ఉండే వారు, (ఇప్పటి వాళ్ళూ మంచివారే ). వేషధారణ కూడా ఎంతో గౌరవప్రదం గా ఉండేది .కాని ఇప్పటి సమకాలిన పరిస్థితులు ... అమెరికా కళలు ... కలలూనూ ...... ఇప్పటి బోధగురువులూ అలానే ఏడ్చారు .. విద్యార్ధుల పూజలందుకొనే వారు ఉన్నారంటే అది, వీధి బళ్ళూ .... పాత కాలేజీ లలో మాత్రమే .... కార్పొరేట్ కాలేజీ లలో వాళ్ళ జీతాలు,వాళ్ళ జీవనవిధానం మనమందరం చూస్తూనే ఉన్నాం ..ఎక0గా ఫై చూపులే ..... భారత దేశ బంగారు, భవితవ్యానికి నాందీ ఉపాధ్యాయులు, వాళ్ళ క్రమశిక్షణ, అని గమనించాలి ... పిల్లలతో గౌరవించ దగిన స్థాయిలో లేనంతకాలం, బోధ గురువులూ, బాధగురువుల్లా కనిపిస్తారు .. రవి బాబు. మద్దూరి

No comments:
Post a Comment