totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Monday, 18 May 2026

" బిళ్ళ-హరి రాగాలు"

ఈ రోజుల్లో  మనం చూస్తున్నాం, వింటున్నాం మనవాసంబందాలు. ముఖ్యం గా అడా-మగ సంబంధించిన కధలు ! 
      సజావుగా పెళ్లి అయినోళ్ళ గొడవలు... విడాకులు ...హత్యలూ ...గట్రా! ఇదే తీరు లేని సెటిల్ అయిన అక్రమ సంబంధాలూ ...లొసుగులతో సాగిపోయే కాపురాలు.
          సోషల్ మీడియా పుణ్యమా అని కట్టు బొట్టు, మట్టు జనాలకు చూపించుకోడం ఒక 'సెలబ్రెటీ కళ".
ఎంత చూపించుకుంటే అన్ని లైకులూ పొగడ్తలూ ...కొన్నిసార్లు ...టిక్ టాక్ దుర్గారావు, జూనియర్ కృష్ణ
లకు ...వేసిన శాప నార్ధాలు... బూతులు ల్ల ! తప్పని పరిస్థితి. అయినా వినరుగా .
         ఈమధ్య ఆంధ్రప్రదేశం లో తీసేసిన తసీల్దారు ఒకడు, వాడికి తోడుగా ...అపర ఊర్వశి.పిల్లలకోడి నాట్యమయూరి తయారయ్యారు. వాళ్ళు భార్య భర్తలు కారు. ఆమె అతను ...విడకులూ లేవు. ఈమెమో భర్తని బలిచక్రవర్తి చేస్తే,తీ. తా గారేమో ఏకంగా పచ్చని సంసారంకు ఆశాస్త్రీయంగా తిలోదకలిచ్చి,ముచ్చటైన కుమార్తెలను కాదని, ఈ
"కంప్యూజంట" ...బిగ్బాస్ ...చీరల దుకాణం... బంగారు నగల దుకాణం... విందులు... వినోదాలు... రీల్స్... ఫోటో షూట్లూ... ఓహ్! సోషల్ మీడియాలో 
బొంగరాల్లాగిరా... గిరా... తిరుగుతూనే వున్నారు. తమాషా ఏంటంటే... ఇక్కడ తెలంగాణాలో కొందరు సోంబేరులు"అన్నా ఇక్కడికి రండి మేముమున్నాం" 
ఇలా అక్రమ కూడికని, సక్రమ సంబంధంలా పొగుడుతూ కామెంట్లూ!☺️.
            అన్నింట్లో వెలుపెడుతున్న వీళ్ళకి అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది, లేక తెలిసిన బ్యూరోక్రాట్స్ వెనకనుండి వీళ్ళద్వారా ...అక్రమ ధనాన్ని పెట్టుబడి పెడుతూ, దొడ్డిదార్లలో బినామీలా? కొచ్చెన్ చేసిన నా కొడుకు ఎవడూ లేరు .ఎందుకంటే ఈ తీసేసిన తసీల్దారు గాడు .పోయిన టర్మ్ లో ఎమ్. ఎల్. ఏ   అన్నమాట .పాత పరిచయాలు, పెత్తందారీ, కొమ్ముకాసే కొజ్జాలూ వుంటారుగా!
             వీళ్లు సమాజానికి, ముఖ్యంగా యువతకి, సంసారులకు ఇచ్చే మెసేజ్ ఏంటి?తగుదు నమ్మా , అని ఈ మధ్యలో ఒక సినిమా కూడా తీసినట్లు, ప్రమోషన్ ఫంక్షన్ ! గతమ్ లో ఈ అభినవ నాట్యమయూరి వేల మందికి ... 'భోగం మేళం'నేర్పిందట 'టెక్కలి' ప్రాంతం లో .... వీళ్ళ మధ్య ఓ సినీ  పెద్ద
ఈ మధ్యలో ...ఫంక్షన్లో కనిపించాడు... అతన్ని చూస్తుంటే ఏంటి? ఈ దేశం ఏటు వేడుతుంది? అనిపించింది .
            సుందరాంగి ...వాడిని పొగుడుతుంటే, వాడు దీన్ని పొగుడుతూ ...జనాలు తప్పట్లు. జనాలేంటి, వ్యభిచారాన్ని సంసారంగా ...ఒక పద్ధతి గా ప్రచారం చేసుకుంటున్న జంటకి వత్తాసు? అనిపించింది.
           వాళ్ళు చేస్తున్న బాహాట వ్యభిచారం.. ను సంసారంగా కలరింగ్ ఇస్తున్న వైనం. వాళ్లకు లేకపోతే 
...మనకు వుండాలిగా సిగ్గు-లజ్జ,కాదంటారా ఫ్రెండ్స్ ?

RP. మద్దూరి.

No comments:

Post a Comment