totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Thursday, 28 May 2026

"ఓ సగటు మనిషీ చచ్చిపో .. .. .. ! "

               అదొక నందన వనం ...ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతికేయోచ్చు .తప్పులు,దోపిడీ చేసోటోళ్లు, భూ కబ్జా రాజకీయ, కళాకారులు, నాయకులు ,విస్తృతమైన వీరవిహారం చేయొచ్చు. ఆడిగేవాడు కి బాక్గ్రౌండ్ ...ఆడిగించుకునే వాడికి... సాక్షాత్తు ప్రభుత్వాల ..ఆమోద ముద్రలు, వాటిలో కులాలు... మతాలూ గట్రా బరితెగింపులు.
          మొదటితరం లో వాళ్ల స్వీయ ఆస్తులే పేదలకు ఆసరా,రెండో తరంలో కొంత దాచుకో, కొంత తినిపించు ...మూడోతరం సంపాయించడానికే రాజకీయాలు ...సిగ్గు.. లజ్జ వదిలేయడం. నాల్గో తరంలో రాజకీయాలు కొచ్చింది ఓట్లతో అప్పోయింట్ మెంటు...సంపాయించుకోడానికి అని బాహాటంగా,ఐదోతరం: జీతాలు.. అలవెన్సులూ, క్రమశిక్షణ లేకపోడం, ప్రజలే ప్రభువులు అని మరిచి పొడమే నేటి రాజకీయాలు. ...అప్పటినుండి ఇప్పటివరకు ...వీళ్ళేదో చేస్తారన దానికే అన్నట్లు నోరు తెరుచుకుని చూసేవాడే పేదోడు/సామాన్యుడు/సగటుగాడు  .

ప్రధాని ఉవాచః

         1  పెట్రోల్ వాడకం  తగ్గించoడి.                                2 కులా సా ప్రయాణాలు మానేయండి ...
          3 బంగారం కొనకండి
          4  కులాసాలు,విలాసం ...తగ్గించండి.  
          5 ఇంటినుండి పని 

ఒక రోడ్ ప్రక్కన ఐస్ అమ్మకునే వాడు గవర్నర్ అయి, మళ్లీ ఐస్ వ్యాపారిగా మారిపోతే... పెద్ద గా కుష్మoడం బ్రద్దలు కాకపోవచ్చు. కానీ ఒక చిన్న పల్లెటూరిలో పుట్టి పెరిగి, నగరాల్లో చాలీ చాలని మనీ యార్డర్ తో టెక్నోక్రాట్,గా మారిపోయి ...భాష... వేషం... పిజ్జా గా మారిపోయి, విచ్చలవిడిగా డబ్బు చూస్తూ, సాయంకాలం సరదాలు, మిడ్ నైట్ తిళ్ళు.. రంగురంగుల పరిసరాలతో .'.లోల్' ...'డ్యూడ్' అనుకుంటూ తిరుగుతూ ...ముడ్డి చుట్టూ  తేనేపట్టులా కరుచుకుని వుండే 'ఈ  ఏమ్  ఐ " పక్షుల  గొంతులకు ఉచ్చులే సుమా!
   
                 ఇప్పటి దేశ ఆర్థిక పరిస్థితి మన్ మోహన్
లాంటోడు వచ్చి కలిబెడితే సరిపోయేది కాదు. అక్కడ జరుగుతున్న దొకటి ...మోదీ చెబుతున్న దొకటి. సమస్య గల్ఫ్...అమెరికా... ఇరాను యుద్ధం కాదు.
     రూపాయివిలువ పడిపోటo ...ఖజానా లో సంపద ...విదేశీ మారకపు విలువలతో బయటికి వెళ్ళిపోడం .మారకపు ధనాన్ని కట్టుదిట్టం చేయడం
ఒక 'పద్మవ్యూహం' అయిపోయింది.
    పూర్వము ఇక్కడ భారత్ లో సంస్థలు స్థాపించాలoటే..ఉత్సాహం చూపించేవారు ఇతర దేశస్థులు... ఇప్పటి పరిస్థితి డోలాయమనం లో పడిపోయింది .భారత్ దేశంలో తిండిగింజలు ఇంకా రెండున్నర సంవత్సరాల నిల్వలు ఉన్నాయి అటుంన్నాడు మోదీ .అలానే పెట్రో అయిల నిల్వలు, ఉన్నాయంటూ ఊకదంపుడు, అటువంటి పరిస్థితు ల్లో ...నిల్వ బెట్టిన రేటుకే ...ఇవ్వాలికదా ! అలజరగడం లేదు. కారణం అక్కడ అర్మోజ్ జలసo ధి దగ్గర ..పరిస్థితి కొరకరని కొయ్యలా ఉంది .అంటే వారంలో  ఇక్కడ రెండు  సార్లు రేట్లు పెంచుతూ ..పోతున్నారు. అసలు పెట్రోల్... బంగారం రేట్లు... మోదీ... అమిత్ షా లు కూర్చుని నిర్ణయం చేస్తారనుకోడం .. మన. తెలివి లేని తనం.అసలు వాళ్ళ పరిధిలో ఉండవు. ఈ విషయం మనం గ్రహించాలి .
          ఇంక వచ్చే కంపెనీలు... ఉన్న కంపెనీలు తమ సిబ్బందిని ...భారీగా తప్పించే ..విధానాలు, తగ్గించడం జరుగుతుంది. ఇటువంటి సంక్లిస్టమైన పరిస్థితుల్లో. ఆర్ధికవేత్తల ...పరిశీలన... సహాయం... సలహాలు అవుసరం ఎoతేనా ఉంది. ఇవ్వి వదిలేసి... మోదీ, మోదీ అనుయాయులు కేవలం పార్టీ జెండా రెపరేపలు చూస్తున్నారు కానీ ...అసలు జండా పెట్టెలో పెట్టాల్సిన పరిస్థితులకు దగ్గర్లో ఉన్నామనేది ఎవరూ ...ఆలోచిo చడం లేదు.

            ఇది ఎలా ఉంటుందంటే ...మాపార్టీ ఇంకో పది సoవత్సరాలు వుంటుందన్నట్లు రేవంత్రెడ్డి... చంద్రబాబు లాంటోళ్లు చెప్పుకున్నట్లు ఉంటుంది.
చంద్రబాబు  లేతవి కొస్తుంటాడు. సంపద సృష్టిస్తాను.
ఇలా ...☺️! అసలు సెంట్రల్ నుండి ... పొదుపు చర్యల్లో భాగంగా...కొంత కాలం, తట్ట బుట్ట సర్దుకొండి,ఆటకి చూసుకోండి చందం అంటున్నారు. ఇలా ఉంటాయి రాజకీయ నాయకుల మాటలు ...
           హైదరాబాద్ వరకు చూసుకుంటే ..ఎక్కువ మంది. అద్దెల ఇళ్లల్లో వుండేవారే. రోజుకి దాదాపు లక్ష ఇరవై ఐదువేల  ట్యాంకర్ల సప్లై వుండాలి. వాటి సప్లై ఇళ్ళ యజమానులు సప్లై చేయాలి కొరతబట్టి. ...కృష్ణ నీరు చెయ్యిచ్చారు .కానీ అద్దెదారుల నుంచి వసూల్ చేస్తున్నారు. మెల్లగా జనాలూ ...పవర్... నీళ్లు లాంటి కనీసా ల ఇబ్బoధిపడెకన్న...తట్టా బుట్టా  సర్దుకుంటున్నారు .హైద్రాబాద్ ఖాళీ ఖాయం. ఇటువo టి తరుణంలో హైదరాబాద్ చిరునామా గల్లంతయ్యే పరిస్థితి.
         ఒకపక్క  ఓవరాల్ .... ప్యాకేజీల్లో  కంపెనీలు
డిప్పకటింగ్కోకొడుతున్నాయి. ఒకపక్క EMI లు రెండోపక్క ...అంతులేని రెట్లూ, బడాయి జీవితం.. డిప్ప కటింగ్ ...వెరసి మోదీ భవిష్య వాణి వెరసి ఒకనాటి ఉద్యానవనం ...చివరికి నవాబుల సమాధులతో ...జీవితాలు ఛిద్రమా ? అన్నట్లు ! ...టెక్నాలజీ ఎక్కువయి.వెనుకటి పెన్ను పేపర్ నయం రా .మన ...ఇంటితొక్కు..చారు . మజ్జిగనీళ్లు,యాప చెట్టు క్రింద నవారు మంచం ...చేతిలో'ఈనాడు'. ఉదయం సాంబారు ఇడ్లి ..సాయంకాలం పునుగులు .. కాఫీ.. అనిపిస్తుంది.
కొంచెం కులసా అనిపిస్తే  ఊళ్ళో డబ్బా  థియేటర్లో ...పాత సినిమా రైట్ కదా! 

       ఇటువంటి పరిస్థిల్లో 'పేద/బిక్కి' ఎలా బ్రతకడం ? అందుకే 'చచ్చి పోండిరా ! " అంటున్నాడా? మోడీ 

No comments:

Post a Comment