దేశం లో దొంగలు పడ బోతున్నారట !!! ఇదో వింత లా ఉంది కదూ !! ఔ నండి మరి ఎన్నికలు కదా ! ఎన్నెన్నో పార్టీలు ఊకదంపుడు ఉపన్యాసాలు . బోలెడంత ''కుక్కసోది'' ఐదు సవత్సరాలు బానిసలను తయారు చేసు కోవాలి మరి . బానిసలు ఎవరు ? మీరే ! మరి . ఎలా ? అంటారా ??..... !! . చెబుతామరి,తొందరెందుకు ... ఓపిక పట్టి ఈ వివరం చదవండి మిత్రమా .ఐ ఏదో శివక్షవరం దుకాణం,ఆల్ఫా హోటల్ పంచల్లో మాట్లాడు కోవాలి అంటే ''ట్రాఫిక్ '' వాళ్ల గొడవ . అంచేత శీను గాడిని కలిశాను,అన్నట్లు పిట్ల రవి గారు కూడా ఉన్నారు . అంతలో పే దలబస్తి పెద్దన్న , జైలు సత్తి ,పుసులూరి, ఆకలి దాసు ,తత్తర బిత్తర శర్మ, గొట్టం ఉమేషు ,భోజనాల చౌరాసియా ,మలయలపోడు,కక్కుర్తి కిషన్రావు ,లోభి రవి,పులికంటి, భల్లూకం అందరు ఉన్నారు . అందరూ చాయ్ త్రాగుతూ మాట్లాడుకున్న సారాంశం ఏంటంటే ... యెమ్ . పి . డి . సి , కి 30 లక్షలు అడుగుతున్నారట . యెమ్ . ల్ . ఏ , కు 5కోట్లు , యెమ్ . పి, కి 10కోట్లు , పార్టీ ఫండు పార్టీ ల లో అడుగు తున్నారట . కాని ఓటు కు 1000 రూ లు . ఇస్తున్నారనే విషయం అందరికీ తెలిసిన విషయం . ఈ పరిస్తి తుల లో మనం ఒక్క విషయం గురుతుంచుకో వాలి, ఉదాహరణకు ఓటుకు 1000 రూ .లు తీసుకుంటే ? సగటున 5 సవత్సరాలకు రోజు ఒక్కింటికి 55 పైసలు మనం కూలి కి ఒప్పుకున్నట్లు అని మరువద్దు . వాడు ఇచ్చిన 1000 విలువ అంట అని తెలుసుకోవాలి . అంతకంటే ఘనం గా ఇచ్చినా ,మనం మొత్తానికి 5 సవత్సరాలు, వాళ్లు మన ఫై చేసే రాజకీయ మానభంగాలకు,దేశాన్ని చేసే దో పిడికి, ఒత్తాసు పలుకుతున్నట్లు మరవోద్దని మనవి . అంచేత మీ విలువైన '' ఓటు'' జాగ్రత్తగా వెయ్యండి. మీ వోటుకు మీరే బాధ్యులు . మద్దూరి ర వి .

No comments:
Post a Comment