అభినవ ''శా రదా '' పు. నా. చార్యః
*****************
ఎందరో కవులు మరెన్నో భావాలు,వారి భావావేశపు తిలకాన్ని దిద్దుకొని మనం ఉన్మత్తావేశం లో ఒలలాడు తుం టాం . కానీ కవితా గగనం లో మిణుక్కు-మిణుక్కు , మంటూ అజరామముగా నిలిచే వారు బహుకొద్ది ,అందులో కవితా చక్రవర్తి అగ్రగణ్యులు మన ''శ్రీ . పుట్టపర్తి . నారాయణా చార్యులు . సాంప్రదాయ ఆరాధనా ద్రష్ట . ముడాచార ఖండనా పతి . చాతుర్ భాషా నిఘంటువుల నిఘంటువు . దాదాపు ఓ అర్ధ శతాబ్దం క్రితం ఓ తెలుగు పత్రిక ఆయన వ్యక్తిత్వానికి అతిచక్కని భాష్యం చెప్పిందట . తెంపు లేని భాషా ఆవేశ కవేశా లతో చల్లగాలికి సడలి పోయేది,ఆయన మనసు అనే దినుసు . తన పాండిత్యా నికి గుర్తింపు రాలేదని ఓ ప్రక్క మనసు మండినా,ఆ ! నాది కూడా ఓ కవిత్వమేనా ? అనుకునంత ''కవితానిరాడంబరి ''. నిర్లిప్తత లేక నియమ బద్దత అనుకోవచ్చు . వారు అష్టభాషా విశారదులు .కేవలమ్ పదునాలుగు పసితనం లోనే ''పెనుగొండలక్ష్మి '', కావ్యం చెప్పగలిగిన భావ పటిమ వారిసొంతం . విద్వాన్ పరీక్ష నిమిత్తం, తన కావ్యాన్ని తానూ చదువుకొన్న నిగర్వి . తన జీవితమే ఓ సాహితీ జైత్రయాత్ర !. కాని ఓ గమ్మత్తు ఏమిటి అంటే ! తనకుతాను, గురుశిష్య తాదాత్మ్యం లో ఆంగ్లం నేర్చి, వ్రాసిన ''లీవ్స్ ఇంద విండ్ ''ఓ అద్భుత స్వీయ పరభాషా పటిమ . వారి ఏకాగ్రతకు ఆంగ్ల రచన ఓ మచ్చుతునక . కవితా సముద్రం లో ఒక్కొక్కరిది ఓ అల లాంటి శైలి, కవితా ఉరవడి .కాని ''శివతాండవం'' రచన ఓ ఉవ్వెత్తున నింగికి ఇప్పటికీ ఎగచే కెరటం . శివతాండవం అంటే తెలుగు జాతికి గురుతుకోచ్చేది మాత్రం పుట్టపర్తి నారాయణా చార్యులు మాత్రమే !. అదో సంగీత ..సాహిత్య .. గేయ కావ్యం . ఈ చరా చెర సృష్టిలో చైతన్యానికి ప్రతీక అయిన పరమ శివుడు చేసిన తాండవాన్ని రాగ ..తా ళ .. భావ ... లయ... సమ్మేళనాన్ని, అక్షర రూపం లో సాక్షా త్కరించిన ఆయన పాండిత్యం శ్లాఘనీయం ... దానిని మనో నేత్రం తో దరిసించిన వారు ధన్యులు .. ! పుట్టపర్తి నా . చా. వారు డమరుకం చేత పట్టి '' ఆడె నమ్మ శివుడు - పాడే నమ్మ భవుడు '' అంటూ లయబద్దం గా నాట్యం చేస్తూ ఉంటే ప్రటన మయ్యె శివ సులభం మరిచిపోలే నిది అంటారు అప్పటి వారు . ఆయన '' ద్విపదరగడ'' లో ప్రతీ గణం లో అయిదు మాత్రలు ఉంటాయి . వీని లోని భాగాలే ఆయన డమరుక నాట్య భంగిమలు . వాల్మీకి , వ్యాసులు ,తిక్కన ,పోతన , లను విమర్శాఅస్త్రం తాకుతూ, వారితో పాటు రామకృష్ణ, క్రిష్ణ రాయలు తో సహా విశ్లేషణా యుత పరామర్శ వారి ప్రతిభా పాట వాలకు పరాకాష్ట .వారి దృక్కోణాలు ..విభిన్న తత్వాలు .. కార్ల్ మార్క్ కమ్యూనిస్ట్ పూర్వో త్తరాలు ... సమకాలీన సామాజిక దృక్పదం ... మానవతా వాదం తో ''మేఘదూతం '' ఆవిష్కరింప బడింది . ఈ వైవిధ్య భరిత రచనలు వారి సొంతం . ఆయన ప్రాచీన .. ఆధునిక సాంప్రదాయాలకు వారధి . చరిత్ర ఎంతో మందిని సృష్టిస్తే .. ఆయన తనకో చరిత్రను సృష్టి చేసారనుకో వచ్చు . చతుర్ భాషా గగనం లో మనకి అందని ఓ గగన కుసుమ శ్రీ.పుట్టపర్తి . నారాయణా చార్యులు వారు . ప్రతి సంవత్సరం మార్చి మాసం లో 28 వ రోజు ఆయన, జయంతి . కాని 2014 ఆయన ''శతజయంతి '' , అందు చేత వారి ఘనమయిన పాదాలకు భువి నుండి దివికి చూస్తూ నమస్కరించ దలి చాను . అటివంటి కవితా పిపాసి .. కవితా చక్రవర్తి పాదాలకు న ఈ చిన్న వ్యాసం సమర్పించుకుంటున్నాను . ఇటువంటి సమస్త శక్తి .. కవితాశం ఖారావం మన తెలుగు గడ్డ ఫై వినిపిస్తున్నందుకు ఓ తెలుగు వాడిగా గర్విస్తున్నాను . సశేషం భగవదీయుడు , మద్దూరి.రవి .
No comments:
Post a Comment